Social life
-
సాంకేతికతే సర్వస్వం కాదు.. మోదీ హితవు
గాంధీనగర్: సాంకేతిక పరిజ్ఞానం నుంచి ప్రేరణ పొందాలే తప్ప, విద్యార్థులకు అదే జీవితం కాకూడదని ప్రధాని మోదీ హితవు పలికారు. క్రీడలు, సామాజిక జీవితం నుంచి మమేకం కావాలనే విషయం మర్చిపోరాదన్నారు. ప్రస్తుతం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని సోమవారం అహ్మదాబాద్‌లోని విద్యాసమీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘సాంకేతికతతో కలిగే లాభాలను మీరు ప్రత్యక్షంగా చూశారు. టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంటే, ప్రపంచమే మీ ముందు సాక్షాత్కరిస్తుంది. అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అదే సర్వస్వం అనుకోవద్దు. క్రీడలు, సామాజిక జీవితం వంటి వాటిని మర్చిపోకూడదు’అని పేర్కొన్నారు. 21న ఎర్రకోట నుంచి ప్రసంగం న్యూఢిల్లీ: సిక్కుల గురువు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీతో సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో గురు తేజ్ బహదూర్ స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ కూడా ఆయన విడుదల చేస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా చేపడుతున్న ఈ ఉత్సవంలో దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన వివరించారు. -
'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’
పావని (పేరుమార్చడమైనది) సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాత్రమే కాదు వెస్ట్రన్ డ్యాన్సర్‌గానూ మంచి పేరుంది. తనకున్న ప్రతిభను చూపుతూ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది. సామాజికంగా నలుగురిలో ఉన్నతంగా ఉండాలంటే సోషల్‌మీడియా సరైన ఎంపిక అనేది పావని ఆలోచన. ఓ రోజు ‘ఎవరితోనో నీకు ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో రాసి, ఫొటోలు కూడా అప్లోడ్ చేశారు చూడు. ఇవి నీ దాకా రాలేదా?’ అని కూతురుని నిలదీసింది తల్లి. తనకేమీ తెలియదంటూ, ఎంత చెప్పినా ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదు. తన మీద చెడుగా ప్రచారం చేసినవారి గురించి, స్నేహితుల ద్వారా విషయం రాబట్టింది పావని. తనపై శత్రుత్వం పెంచుకున్న సహచర ఉద్యోగులు చేసిన పని ఇదని తెలిసి, కుమిలిపోయింది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! రోజూ కొత్తగా అందరితో ‘సూపర్బ్..’ అనిపించుకోవాలని, నలుగురిలో ఫేమస్ అవ్వాలని.. ఇలా రకరకాల కారణాలతో సామాజిక మాధ్యమాల్లో ఉండేవారి సంఖ్య పెరిగింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ ఉండటమూ చూస్తుంటాం. అది ఇతరుల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించనంత వరకు ఏ సమస్యా లేదు. కానీ, సోషల్ మీడియా లేదా మెసేజింగ్ లేదా ఇ–మెయిల్ సహాయంతో మరొక వ్యక్తికి పరువు నష్టం కలిగించే విషయాలు విస్తృతం అవుతున్నాయి. ఆ సమాచారం ఆ వ్యక్తి జీవితాన్ని అల్లకల్లోలం చేయచ్చు. ఇది చిన్న నేరం కాదు. న్యాయాన్ని, చట్టాన్నీ అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! పరువు నష్టం చేసేది ఎవరు? ►సోషల్ మీడియా వార్తా ఛానెల్‌లు క్లిక్‌లపై డబ్బును సంపాదిస్తుంటాయి. ఎక్కువ క్లిక్‌లకు ప్రకటనలు కూడా ఎక్కువ రావడంతో నిజనిర్ధారణ లేని వార్తలను రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ►అసంతృప్తి చెందిన ఉద్యోగి కంపెనీ ఉన్నతాధికారులకు లేదా మేనేజ్మెంట్కు అవమానకరమైన, పరువు నష్టం కలిగించే, అసభ్యకరమైన ఇ–మెయిళ్లను పంపుతుంటారు. ►మాజీ స్నేహితుడు / మాజీ జీవిత భాగస్వామి అశ్లీల సందేశాలు స్నేహితులు/ కుటుంబ సభ్యులకు లేదా పోర్న్ సైట్లకు పంపడం. ►రాజకీయ ప్రత్యర్థి తప్పుడు కథనాలతో ప్రత్యర్థి పార్టీని పరువు తీయాలనుకోవచ్చు. ►మతపరమైన శత్రుత్వంతో సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాన్ని సృష్టించవచ్చు. పరిమితులు అవసరం ►రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) కింద అందించిన భావప్రకటన, వాక్ స్వాతంత్య్రపు హక్కు పౌరులందరికీ ఉంటుంది. అయితే, అలాంటి స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. మరొక వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏవ్యాఖ్య అయినా, అది చట్టం పరిధిలోకి వస్తుంది. ►ఇటీవల కాలంలో నిశ్చితార్థాలు, విడాకులు, ప్రెగ్నెన్సీ విషయాలు... వ్యక్తిగతమైనవి కూడా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. మనలో చాలామంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్షిప్ స్టేటస్‌లను ప్రకటిస్తూ, అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తప్పులను ఒప్పుకుంటూ, లైంగిక గుర్తింపులను ప్రకటిస్తూ అధికారికంగా వెళ్తున్నారు. ►పై వ్యక్తీకరణలతో, ఆన్లైన్ పరువు నష్టం, ట్రోలింగ్, భావ ప్రకటన స్వేచ్ఛపై స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్లైన్ పరువు నష్టం మానసిక, శారీరక ఒత్తిడులకు దారితీస్తుంది. అదే విశ్వసనీయతగా మారి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. కాబట్టి తమ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అనే స్వీయ విచక్షణ కలిగి ఉండటం అవసరం. అలాగే అవతలివారు పెట్టిన పోస్టులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, తప్పుడు కథనాలు అల్లడం సైబర్ నేరం కిందికి వస్తుందన్న అవగాహన అవసరం. చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! సోషల్ మీడియా వినియోగ చిట్కాలు ►మీ ప్రతి సోషల్ మీడియా ఖాతాకూ ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని తరచూ మార్చుకుంటూ ఉండాలి. ►సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గోప్యత, సెట్టింగ్‌లను సరిచేసుకోవాలి. ►సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ►తెలియని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలి. ►మీకు తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వడం శ్రేయస్కరం. ►ఆఫ్‌లైన్‌లో ఎలా హుందాగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే హుందాతనాన్ని చూపాలి. అంటే, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేసేముందు వాటి వెనక గల ఉద్దేశ్యమేంటో తెలుసుండాలి. ►సోషల్‌మీడియా కారణంగా అనుకోని సంఘటనలు ఎదురైతే ఎదుర్కోవడానికి సన్నద్ధులై ఉండాలి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
అందుకు కారణం హర్మోన్లు కాదట....
యుక్తవయస్సుకు రాగానే పిల్లల్లో ఎన్నో మార్పులు. అన్ని రోజులు తల్లిదండ్రుల మాటే వేదంగా భావించే అంతర్ముఖుల్లో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. మంచి చేదుగా అనిపిస్తుంది, చెడు త్వరగా ఆకర్షిస్తుంది. స్నేహితులే ప్రపంచమవుతారు. అంతకుముందు చూడని కొత్త లోకం కనిపిస్తుంది. మొత్తనికి ప్రపంచమే చాలా కొత్తగా కనిపిస్తుంది. కొత్త అలవాట్లు వచ్చి చేరతాయి. రాముడు మంచి బాలుడు అని అనిపించుకున్న వారిని సైతం చెడ్డవారిని చేస్తుంది కౌమార దశ. ఇన్నిరోజులు ఈ మార్పులకు కారణం హర్మోన్ల ప్రభావం అనుకున్నాం. కానీ ఇది నిజం కాదట. కౌమార దశలో పిల్లల సామాజిక ప్రవర్తనలో మార్పుకు కారణం పునరుత్పిత్తి హర్మోన్ల ప్రభావం కాదట. ఈ విషయాన్ని బఫెలో యూనివర్శీటీకి చెందిన ప్రముఖ రచయిత మాథ్యూ పాల్ వెల్లడించారు. యుక్తవయసులో శరీరంలో వచ్చే అన్నిమార్పులకు కారణం పునరుత్పత్తి హర్మోన్లే. అయితే ఇంతకాలం కౌమార దశలో వచ్చే సామాజిక ప్రవర్తనలో మార్పుకు కూడా ఈ హర్మోన్లే కారణం అనుకున్నాం. కానీ పాల్, అతని సహచరులు కలిసి చేసిన నూతన పరిశోధన ఇది అబద్దమని నిరూపించింది. ఇంతకు ముందు ప్రయోగాలు నిరూపించలేని అనేక విషయాలను వీరు రుజువు చేశారు. అందుకోసం వీరు నూతన విధానాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరిలో యుక్తవయస్సులో వచ్చే మార్పులును వీరు పరిశీలించారు. ‘ఈ దశలో సంక్లిష్ట ఆలోచన విధానం అభివృద్ధి చెందుతుంది. అనేక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదకర ప్రవర్తన విధానం ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం వంటి అంశాలు ప్రారంభదశలో ఉంటాయి. సామాజిక ప్రవర్తన అంశానికి వచ్చినట్లయితే, అన్ని రోజులు తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉన్నవారు పూర్తిగా వేరే ప్రపంచం వైపు ఆకర్షితులౌతారు. అక్కడ వారు కలుసుకునే వ్యక్తులను బట్టి వారి సామాజిక ప్రవర్తన ఉంటుంది. పునరుత్పత్తి హర్మోన్ల ప్రధాన విధి ప్రత్యుత్పత్తి సామర్ధ్యం, రెండో దశ లైంగిక లక్షణాలను పెంపొందించడం, గోనడల్ హర్మోన్స్ పెరుగుదల వంటివి మాత్రమే’ అని తమ పరిశోధనలో తేల్చారు. ప్రస్తుతం పాల్ రూపొందించిన విధానం వల్ల పునరుత్పత్తి హర్మోన్లు కలిగించే మార్పులేంటో సులభంగా గుర్తించవచ్చు. యవ్వనము విశాలమైనదని, దీనిలోనే కౌమార దశ కూడా ఉంటుందని దాంతో పాటు యుక్తవయసులో జరిగే మేథోవికాసం, సామాజిక, భావోద్వేగ మార్పులను కూడా కలిగి ఉంటాయని పాల్ చెప్పారు. ఈ మార్పులను గుర్తించడం వల్ల కౌమార దశ అభివృద్ధికి బాధ్యత వహించే అంతర్లీన యంత్రాంగాలను అర్థం చేసుకోవడంతో పాటు జీవితంలో మున్ముందు వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలకు కారణాలను కూడా విశ్లేషించవచ్చన్నారు. -
డబ్బుతోపాటొచ్చే దరిద్రం ఏమిటో తెలుసా?
న్యూయార్క్: డబ్బూ, డబ్బూ, డబ్బూ....డబ్బుతోటిదే లోకం. డబ్బుంటే సకల సౌకర్యాలు కనుసన్నల్లోకి వస్తాయని భావించేవాళ్లు, పాపిష్టిది డబ్బు, ప్రపంచాన్ని పాపపంకిలం చేస్తుందని ఈసడించేవాళ్లూ ఉంటారు. సమస్యలను తీర్చే, సమస్యలను తెచ్చే డబ్బు గురించి ఎవరి అనుభవాలనుబట్టి వారు నిర్వచనాలు ఇస్తుంటారు. డబ్బుతోబాటు డాబు, దర్పం వస్తుందని, దాన్ని వెన్నంటే స్వార్థం, పిసినారి తనాన్ని కూడా మూటగట్టుకొస్తుందని ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపించింది. డబ్బున్న మారాజులు విందు, వినోదాల్లో తేలిపోవచ్చుగానీ వారికి సామాజిక జీవితం తక్కువని, ఎక్కువ శాతం వారు ఒంటరిగానే గడుపుతారని, అదే డబ్బులేని పేదవాళ్లు ఎక్కువగా సామాజిక జీవితం గడుపుతారని, అంటే బంధు, మిత్రులతో సుఖ సంతోషాలు పంచుకుంటారని ఈ అధ్యయనాల్లో తేలింది. తోటివారు ఏమైనా చెబుతుంటే దండిగా డబ్బున్న వాళ్లు వారి మాటలు వినిపించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంటారు. అదే మధ్యతరగతి వాళ్లు తోటి వాళ్లు తమ కష్ట సుఖాల గురించి వివరిస్తుంటే అసహనంగా కదులుతూ మొబైల్ ఫోన్ లేదా పేపరు చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే తలాడిస్తూ ఉంటారు. ఇక తక్కువ ఆదాయం కలిగిన కష్ట జీవులు తమ కష్టాల గురించి ఏకరువు పెడుతుంటే రెప్ప వాల్చకుండా చెప్పేవారి కళ్లలోకి చూస్తూ తలాడిస్తుంటారు. దయతో వారి మాటలను అర్థం చేసుకుంటారు. మొత్తంగా డబ్బున్న వారిలో ఔదార్యం మరీ తక్కువగాను, మధ్య తరగతి కుటుంబాల్లో కాస్త ఎక్కువగాను, దిగువ తరగతి పేదల్లో మరీ ఎక్కువగాను ఉంటుందని సామాజిక ప్రయోగాల ద్వారా తేల్చారు. కాయకష్టం చేసుకొని బతికే పేదవాళ్లలోనే తొటివారికి సేవచేయాలనే పెద్ద మనసు ఉంటుందని, వారు ఎక్కువ సామాజిక జీవితాన్ని గడపడం ద్వారానే వారికి ఈ గుణం అబ్బిందని అధ్యయనంలో వెల్లడైంది. పాత, చౌక కారును నడిపే యజమానులు బాటుసారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎక్కువసార్లు ఆగి, వారు దాటాకనే కారు నడుపుతారని, ఖరీదైన కార్లలో వెళ్లేవాళ్లు బాటసారుల కోసం కారును ఆపకుండా వీలైనంత వరకు దూసుకెళ్లేందుకే ప్రయత్నిస్తారని మరో అధ్యయనంలో రుజువైంది. దీన్నిబట్టి ఎక్కువ డబ్బున్నవారి, తక్కువ డబ్బున్న వారి మనస్తత్వం తీరును అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారే ఎక్కువ మోసాలకు పాల్పడతారని, వారిలో చోర గుణం (స్టడీస్ ఆఫ్ షాప్లిఫ్టింగ్లో పేర్కొన్న అంశాల ప్రకారం)కూడా ఎక్కువగానే ఉంటుందట. డబ్బుకు సంబంధించిన ఓ వీడియో గేమ్‌ను డబ్బున్న వాళ్లతో, డబ్బులేని వాళ్లతో ఆడించగా డబ్బున్న వాళ్లు ఆ గేమ్‌లో మోసానికి పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది పన్ను ఎగవేసేవారు ఉన్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా తక్కువ డబ్బున్న వారే తమ డబ్బులో ఎక్కువ శాతం సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నట్లు, ఎక్కువ డబ్బున్న వాళ్లు సామాజిక కార్యక్రమాలకు అతి తక్కువ విరాళాలు ఇస్తున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ప్రజల మధ్య ఎక్కువ ఆర్థిక అసమానతలున్న దేశాల్లో ధనవంతుల్లో దుర్మార్గం ఎక్కువ, ఔదార్యం తక్కువగా ఉందని, తక్కువ ఆర్థిక అసమానతులున్న దేశాల్లో ధనవంతుల్లో ఔదార్యం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనకారులు సూత్రీకరించారు. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో సామాజిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు, జీవించే ప్రామాణిక కాలం, ఆరోగ్య వసతులు తక్కువ. శిశు మరణాలు ఎక్కువ. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం పాళ్లు, సంతోషం పాళ్లు తక్కువే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల మాట్లాడుతూ సమకాలీన సమాజంలో ఆర్థిక అసమానతులను అధిగమించడమే అసలైన సవాల్ అని అన్నారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పన్నుల వ్యవస్థను సరళీకరిస్తుందని ఆయన చెప్పారు. -
అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి
చెరువు ఒక సామాజిక జీవన విధానం. అది దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించే పనికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నా యి. ‘‘మన ఊరు - మన చెరువు’’ ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యం. చెరువుల పునర్నిర్మా ణం అన్నది మహాసం కల్పం. దీన్ని కేవలం ప్రభుత్వ పనిగా చూడ రాదు. చెరువుకు తిరి గి ప్రాణం పోయట మంటే అది ఊరికి ప్రాణం పోసినట్లే.. ఊరికి జవసత్త్వాలను అందించిన చెరువుకు ఇప్పు డు సమాజమంతా సత్తువనిచ్చి మళ్లీ నిండా నీళ్లతో కలువపూలతో, మత్తడికాడ నీళ్ల అలుగుల దుము కులతో కళకళలాడే టట్లు చేయాలి. ప్రజలందరూ కలసి పనిచేసే మహాద్భుత ఆవిష్కరణ ఇది. ప్రభు త్వ పని అంటే ప్రజల పనే అయినప్పటికీ అది ప్రభుత్వమే చేసుకుపోతుందనే భావనను పాలకు లే కల్పించారు. మార్కెట్ సమాజంలో వ్యక్తిత్వ వికాసాలు హైబ్రీడ్ పంటగా మహా ఏపుగా పెరిగి పోయి సామాజిక వికాసం బాగా పలుచబడేటట్లు చేసింది. మార్కెట్ సమాజం కానరాని శత్రువు. అది సామాజిక చింతనను, సామాజిక జీవనాన్ని చిద్రం చేస్తుంది. విశేషమేమిటంటే మార్కెట్ సమా జాన్ని మన పాలకులే పెంచి పోషించారు. అందుకే అది చివరకు పాలకులకు కూడా శాపంగా మారిం ది. మార్కెట్ సమాజ మత్తు నుంచి ప్రజలను బైట పడేసే ప్రజాప్రభుత్వాలే విజయం సాధిస్తాయి. చెరువుల పునర్నిర్మాణం చేయటం అంటే మ న ఊరిని మనం బాగు చేసుకోవటమే అవుతుంది. మన ఊరి చెరువును బతికించి తిరిగి దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సమాజమంతా కదలివెళ్లి పనికి శ్రీకారం చుట్టడాన్ని రాజకీయాలకు అతీత మైన మంచి పనిగా ప్రజలు భావిస్తున్నారు. చెరు వుల పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క మనిషి తన శక్తికొద్దీ సాయం చేసే దిశగా ఆలోచనలు సాగిం చటం, గడపగడప ఇందులో పాలు పంచుకునేం దుకు ముందుకు రావటంతో ఇది ప్రజలందరి ఉమ్మడి పనిగా మారింది. సకల పనులు కలిసి సామూహిక గీతంగా మారటం కంటే ఉన్నతమై నది మరేముంటుంది. కన్నతల్లి లాగా ఊరును పెంచి పెద్ద చేసిన చెరువుకు ఇప్పుడు తన బిడ్డలే సేవ చేసే మహత్తర అవకాశం అపురూపమైనది. చెరువు సర్వసమగ్రంగా రూపుదిద్దుకునే విధంగా అన్ని పనులూ చేపట్టాలి. విద్యార్థులం దరికీ చెరువు పునర్నిర్మాణం అన్నది సిలబస్‌లోని పాఠ్యాంశం చేయాలి. తెలంగాణలోని విద్యాలయా లు చెరువుల పునర్నిర్మాణంలో సంపూర్ణంగా భాగ స్వామ్యం అయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తా యి. చెరువుకు సంబంధించిన చరిత్రనంతా విద్యా ర్థులకు ఉపాధ్యాయ లోకం బోధించి ప్రేరకులుగా నిలవాలి. విద్యార్థుల ఒంటికి మట్టి రాసుకోకపోతే నవ నిర్మాణం జరగదు. అందుకే తొలి మెట్టుగా చెరువుల నిర్మాణంలో యువత పాల్గొనాలి. తెలంగాణలో ఉన్న ప్రతి విద్యాసంస్థ తమకున్న స్థోమ తను బట్టి ఈ పునర్నిర్మాణంలో పాలు పంచుకుం టామని ప్రమాణం చేయటంతో పాటుగా, చెరువు లను దత్తత తీసుకునేందుకు ముందుకురావాలి. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందు కు వస్తే చాలా చెరువులకు పునర్జన్మను కలిగించి నట్లవుతుంది. ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే దానికి తిరుగుండదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తట్టమోసి, మట్టి ఎత్తి ఈ పనికి శ్రీకారం చుట్టేందు కు సిద్ధమవుతున్నారు. చెరువుల పునర్నిర్మాణంలో ప్రజా ప్రతినిధులే స్వచ్ఛందంగా పాల్గొంటే ప్రజలు తప్పకుండా వాళ్ల కు అండగా నిలుస్తారు. ఒకపూట తట్టమోసి రావ టం కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పని పూర్తయ్యే వరకు అందులో పూర్తిగా భాగస్వాము లు కావాలి. చెరువు పునర్నిర్మాణం జరిగి చెరువు నిండా నీళ్లు వస్తే ఎండిన ఊరు పచ్చగా మారుతుం ది. హరిత తెలంగాణకు చెరువే పునాది. గ్రామ స్వ రాజ్యం విలసిల్లాలంటే చెరువే పునాది. మన చెరు వుల్ని సచ్చుపడేటట్లు చేశాకే ఊరికి జవ సత్వాలు పోయాయి. తెలంగాణ గ్రామీణ జీవనం మళ్లీ కళకళలాడాలంటే చెరువు సజీవంగా నిలబడాలి. చెరువు ఒక సామాజిక జీవన విధానం. ఆ సామాజిక జీవన విధానం దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. చెరువు నిండా నీళ్లు ఉన్న ప్పుడు ఊరు ఆర్థికంగా శక్తివంతంగా ఉండేది. మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా జీవనా ధానం చెరువు నిలబడింది. చెరువు వర్షాకాలం పంటలకు నీళ్లనందించి, భూముల్లో జలాలను సంరక్షించేది. చెరువుల ద్వారా పంటలు మాత్రమే గాక ఊరిని హరిత వనంగా మార్చేది. చెరువుల్లో తీరొక్క చేపలతో జలసంపదగా తులతూగేది. ఎ న్నో పక్షులకు నివాస కేంద్రమిది. ఎండాకాలం ఎండిపోయిన తర్వాత కూడా చెరువు మట్టిగా తిరి గి పొలానికి ఉపయోగపడేది. మళ్లీ వర్షాకాలంలో సంపూర్ణంగా నీళ్లతో నిండి గ్రామ నిర్వహణ దారుడుగా నిలబడేది. అలాంటి చెరువులు, ఊర్లను కలిపే గొలుసు కట్టు చెరువులు పూడిపోయాక దానిపై ఆధారపడ్డ వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతిని ఊరు కళ తప్పింది. కాకతీయుల కాలం నాటి 13వ శతాబ్దపు చెరువులను పునరుద్ధరించే పనికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం చెరువుల పునర్నిర్మాణం. అమ్మలాంటి చెరువును కాపాడు కోవటం ప్రతిపౌరుని విధి. ఇప్పుడు మన చెరువుల్ని తిరిగి గంగాళాలుగా మార్చుకుందాం. ప్రతి పౌరుణ్ణి, పౌరురాలిని ఇందులో భాగస్వామి ని చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, విద్యార్థి సంఘాలు, ప్రచార ప్రసార సాధనాలు నడుం బిగించాలి. ‘‘మన ఊరు - మన చెరువు’’ అన్నది కేవలం ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యంగా మారాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)