జూలూరు గౌరీశంకర్
చెరువులు, మంచినీటి వ్యవస్థ, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల వంటి సామూహిక ప్రయోజనాలను పాలకులు నిర్లక్ష్యం చేయటం వల్లనే పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ఇంతకాలం నీళ్లొదులుకున్న మంచినీళ్ల అంశాన్ని జలమార్గం పట్టిస్తానని కేసీఆర్ ప్రకటించడం కోట్లాది మంది హర్షించే అంశం.
ఎక్కడైనా నదులు లేని చోట కూడా వంతెనలు నిర్మిస్తామని రాజకీయ నేతలు హామీ ఇస్తార న్నది జనసామెతగా మా రింది. కానీ రాజకీయ నేతలు ఎలా ఉండాలో ఆచరణాత్మకంగా చూపిన దార్శనిక నాయ కులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించిన రాజులు కూడా మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. కాకతీయుల కాలంలో, నిజాం పాలనలో నీటి వనరుల విని యోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులే ఇప్ప టికీ తెలంగాణలో ప్రజల దప్పిక తీర్చు తున్నాయి. వరంగల్‌లో పాకాల చెరువు, రామప్ప చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు వంటి అనేక పెద్ద చెరువులకు లింకు చెరువుల వ్యవ స్థను నెలకొల్పి, చెరువులను తవ్వించి సాగు తాగునీటి వసతులు తీర్చారు.
తెలంగాణకు గుండెకాయగా ఉన్న చెరువు ల వ్యవస్థ క్రమంగా ధ్వంసమయ్యింది. ఇప్పు డు తెలంగాణ సాగు, తాగునీటి విషయంలో కటకటలాడుతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరి పంట ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు తెలంగాణ అన్నపూర్ణ కరీంనగర్ జిల్లాలో కూడా మంచినీటి సమస్య ఉంది. మొత్తం 10 జిల్లాల్లో మంచినీటి దాహార్తిని తీర్చటం అతి ముఖ్య తక్షణ కర్తవ్యం గా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కిలోమీటర్ల దూరం పైపులైన్‌లు వేసి గడప గడపకూ మంచి నీటి సౌకర్యం కల్పిస్తాననే పనిని భుజం మీద వేసుకున్నారు.
హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీర్చటానికి నిజాం ప్రభుత్వంలో నాటి ఇంజ నీర్ అలీనవాబ్‌జంగ్ బహుదూర్ ఎంతో కృషి చేశారు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచేసినప్పుడు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నీటి వసతిపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాడు. అలీన వాబ్ జంగ్ కృషితో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, జలాశ యాలను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించారు. ఇప్పటికీ హైదరాబాద్ దాహార్తిని ఆ రెండు సాగరాలే తీరుస్తున్నాయి. నిజాం పాలన తర్వాత మొత్తం తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి దాహార్తి తీర్చేందుకు కేసీఆర్ మంచినీటిని అందించే వాటర్‌గ్రిడ్ పథకానికి రచన చేశారు.
విప్లవ పోరాటాలకు, కమ్యూనిస్టు ఉద్య మాలకు ఎర్రగడ్డగా చరిత్రకెక్కిన పోరాటాల పోతుగడ్డ నల్లగొండ ఇప్పుడు ఫ్లోరోసిస్ పెను భూతం వల్ల వంకర్లు కొంకర్లు తిరిగింది. ఫ్లోరోసిస్‌తో మరుగుజ్జుగా మారింది. అంగ వైకల్యానికి గురైంది. లక్షలాది మంది ప్రజలు దీనావస్థ పాలయ్యారు. ఈ సమస్యపై నాటి ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ తన జీవితాన్నే అంకితం చేసి పోరాడాడు. అయినా పాలకుల మనసు కరుగలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన కేసీఆర్ నల్లగొండ పర్యటనల్లో ఫ్లోరో సిస్ బాధితులను చూసి చలించిపోయాడు. కలం బట్టి పాట రాశాడు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 2014 ఎన్నికల పర్యటనల్లో గర్జించాడు. అందులో భాగంగానే తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలకు నీటి సరఫరా విభాగం ద్వారా కోట్ల మందికి నీళ్లందిస్తున్నారు. 9 జిల్లాల్లో 146 సమగ్ర నీటి పథకాలు, 15,040 రక్షిత మంచి నీటి పథకాలు, 9019 మినీవాటర్ సప్లయ్ స్కీములు 6,506 నేరుగా నీటి పంపిణీ పథకం స్కీములు, 1,59,312 చేతి పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వేలాది గ్రామాల్లో లక్షలాది మం ది ప్రజలకు ఈ నీటి సరఫరాను నిత్యం చేస్తున్నారు. అయినా అందరికీ తాగునీరు అందటంలేదని ప్రభుత్వ లెక్కలే తేల్చి చెబుతున్నాయి. అందుకే మొత్తం తెలం గాణ రాష్ట్రానికి నీటిని అందించేందుకు 1 లక్ష కిలోమీటర్ల మేరకు వాటర్ సప్లయ్ గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టబోతున్నారు. తెలం గాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించి తీరు తామన్న దానికి సిద్ధిపేటలో నీటి పారుదల ప్రాజెక్టును కేసీఆర్ 16 నెలల్లో పూర్తి చేయటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. 20 ఏళ్ల క్రితమే ఆనాటి సిద్ధిపేట శాసనసభ్యుడు కేసీఆర్, సిద్ధిపేటకు చెందిన ఇంజనీర్లు కలసి శ్రమించి 185 గ్రామాలకు దాహార్తి తీర్చగలిగారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో గడపగడపకూ నీరందించే భగీరథ యత్నానికి నేడు శ్రీకారం చుట్టారు. గతంలో తాను పూర్తి చేసిన సిద్ధిపేట నీటి పారు దల ప్రాజెక్టు విషయాన్ని గుర్తు చేసి అధికార యంత్రాంగంలో స్ఫూర్తి కలిగించారు.
కేసీఆర్ దార్శనికత నుంచి పుట్టుకొచ్చిన వాటర్ గ్రిడ్ పథకం నాలుగేళ్లలో రూపుదాల్చి దోసిళ్లలోకి మంచినీళ్లు రావటాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో పాలు పంచుకునే ఇంజనీర్లకు, మొత్తం పాలనా యం త్రాంగానికి, తోటి శాసనసభ్యులకు తన ఆచర ణాత్మక అనుభవాన్ని సీఎం చెబుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా ఏ నాయకుడూ చేయని ప్రకటనను కూడా కేసీఆర్ ప్రకటిం చారు. రాబోయే నాలుగేళ్లలో గడపగడపకూ మంచినీళ్లు అందించలేకపోతే మాకు ఓట్లెయ్య కండి అని ధైర్యంగా ప్రకటన చేశారు. ఇది సామాన్యమైన ప్రకటన కాదు. పని చేయకపోతే ఓట్లు వెయ్యకండని చెప్పిన నాయకుడిగా కూడా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతాడు. ఈ సంకల్పం నెరవేరితే ఫ్లోరోసిస్ పెనుభూతాన్ని పారదోల వచ్చును. బంగారు తెలంగాణకు ఈ వాటర్ గ్రిడ్ పథకమే తొలిబాటలు వేయాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల విద్య కేసీఆర్ దగ్గరుంది. వాటర్‌గ్రిడ్ పథకం విజయవం తమైతే ప్రజల దోసిళ్లలోకి మంచినీళ్లు వస్తాయి. పథకాలు ప్రజల గొంతులో మంచినీళ్లు కావటం కంటే మించినది మరొకటి లేదు.
(వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు)