
కోదాడలో సూది సైకోగాళ్లు
నల్లగొండ: కొద్ది రోజులుగా సూది సైకో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సూదిగాళ్ల కలకలం నల్లగొండ జిల్లాకు వ్యాపించింది. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కోదాడ మండల కాపుగల్లులో బైకుపై వెళ్తున్న వీరయ్య (55) గ్రామ శివారుకు రాగానే ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై సూది విసరడంతో అది చెంపపై గుచ్చుకుంది. ఆయన వెంటనే కోదాడలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వీరయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.