injection psycho
-
చంద్రబాబువి పచ్చి అబద్ధాలు
* 15 శాతం వృద్ధిరేటు సాధిస్తామనడం కోతలే: ఎమ్మెల్యే రోజా ధ్వజం * దేశ వృద్ధిరేటే ఏడు శాతం.. ఏపీలో మాత్రం 15 శాతం ఎలా సాధ్యం? * 15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ.. * బాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయింది సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన మాటలు వింటూంటే ప్రజలు భయపడిపోతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చేఏడాది కల్లా రాష్ట్రంలో 15% వృద్ధిరేటు(జీడీపీ) సాధించాలని ఊహకందని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ వృద్ధిరేటు ఉండే చైనాలోనే 7.40%, భారత్‌లో 7% ఉంటే ఏపీలో మాత్రం 15% లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడంచూస్తే.. సీఎంగా మాట్లాడుతున్నారా? లేదా పోలిగాడి మాదిరి బొంకుతున్నారా? అనిపిస్తోందన్నారు. ‘బొంకరా...బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత..’ అన్నట్లుగా చంద్రబాబు మాటలున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కరువు, వరదలతో కుదేలైందని, విభజన తరువాత పరిశ్రమల్లో 70 %, ఐటీ రంగంలో 95% హైదరాబాద్‌లోనే ఉండిపోతే ఏపీలో వృద్ధిరేటు రెండింతలెలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. వాస్తవికం గా సాధించగలిగేవి, గతంలో ఎవరైనా సాధిం చినవే లక్ష్యాలుగా నిర్ణయించుకోవాలిగానీ ఇలాంటి అబద్ధాలు చెప్పరాదన్నారు. ఆయన గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా చేసినపుడూ రెండంకెల వృద్ధిరేటు(డబుల్ డిజిట్) సాధిం చిన దాఖలాల్లేవని, అలాంటిది ఇపుడెలా సాధ్యమని రోజా ఆశ్చర్యం వెలిబుచ్చారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తాను నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఇలాగే అబద్ధాలు చెబుతూపోయారని, ఆయన మాటలు వింటున్న స్వీడన్ ఆర్థికమంత్రి జోక్యం చేసుకుని తమ దేశంలో రాజకీయవేత్తలు ఇలాంటి మాటలు మాట్లాడితే జైలుకు పంపుతాం.. లేదంటే పిచ్చాసుపత్రికి పంపుతామన్నారని ఆమె గుర్తుచేశారు. సాధ్యంగాని, అసంబద్ధమైన మాటలు చెబుతున్న చంద్రబాబును ఎక్కడికి పంపాలో ఆయనే నిర్ణయించుకోవాలని, ‘ఆప్షన్ ఏ జైలు.. ఆప్షన్ బి పిచ్చాసుపత్రి...’ అని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ రికార్డులు చాలా ఉన్నాయి.. పద్దెనిమిది నెలల టీడీపీ పాలనలో సాధించిన రికార్డులు, అభివృద్ధి చాలానే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థుల ఆత్మహత్యల్లో అరుదైన రికార్డులు నెలకొల్పారన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చేయడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా టీడీపీ పాలనలో గణుతికెక్కారన్నారు. చింతమనేనిలాంటి ఎమ్మెల్యేలు మహిళలను దూషించడాన్ని బాబు వెనకేసుకొస్తున్నారని ఆమె తప్పుపట్టారు. బాబుకు ఆడపిల్లల్లేరు కనుక వారి బాధలు తెలియవని, అందుకే తనచుట్టూ ఉన్న బొండా ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల లాంటివారు మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా ప్రోత్సహిస్తున్నారని రోజా విమర్శిం చారు. రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు సాధించడం మాటేమోగానీ.. చంద్రబాబు, ఆయన కుమారుడి వృద్ధిరేటు ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డంగా దోచేసుకుంటున్నారని, టీడీపీ వారి దోపిడీలో వృద్ధిరేటు 15 శాతం కాదు.. 150 శాతం ఉందనడంలో అతిశయోక్తి లేదన్నారు. టీడీపీవాళ్లు సైకో సూదిగాళ్లు టీడీపీలో ఉన్నవాళ్లంతా సైకో సూదిగాళ్లలా తయారయ్యారని, తమ న్యాయమైన కోర్కెల సాధనకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీ మహిళలను సూదులతో గుచ్చడం, వారికి రక్తం వచ్చేలాగా కొట్టడం వంటివి చేయిస్తున్నారని రోజా విమర్శించారు. అంగన్వాడీ టీచర్లనుద్దేశించి చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. మహిళలనుద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడుతున్న టీడీపీ నేతల్ని వారి భార్యలు, కుమార్తెలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. -
టీడీపీలో సైకో సూదిగాళ్లు: రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా దోచేస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. 15 శాతం వృద్ధి నమోదు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశ వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఏపీలో 15 శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వృద్ధి రేటు లెక్కగట్టడం చంద్రబాబుకు తెలుసా అని నిలదీశారు. టీడీపీ పాలనలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగం కుదేలయ్యాయని తెలిపారు. చంద్రబాబు గత పాలనలో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ దాటలేదని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యలు, అత్యాచారాలు, మహిళలను కించపరచడంలో టీడీపీ సర్కారు నంబర్ వన్ గా నిలిచిందని ఎద్దేవా చేశారు. జీతాలు పెంచమని అడుగుతున్న అంగన్ వాడీ వర్కర్లను పోలీసులతో కొట్టించారని, సూదులతో గుచ్చారని ఆమె ఆరోపించారు. టీడీపీ నాయకులు సైకో సూదిగాళ్ల మాదిరిగా తయారయ్యారని దుయ్యబట్టారు. అంగన్ వాడీ వర్కర్లంటే ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మార్వోను నోటికి వచ్చినట్టు తిట్టిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు వెనకేసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే మహిళల బాధలు పట్టడం లేదని రోజా ధ్వజమెత్తారు. -
నల్లగొండలో సూది సైకో కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నాలుగు రోజులుగా సూది సైకో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న ఓ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేశాడు. వివరాలు..స్థానిక సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే నందిని నడిచి వెళ్తుండగా బైక్‌పై వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆమె చేతిపై సూదితో పొడిచి వెళ్లిపోయాడు. దీంతో బాలిక గట్టిక కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
'సైకో అని ఒప్పుకో'
ఉండి: తనను పోలీసులు అదుపులోకి తీసుకుని సైకోగా ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారంటూ ఓ వ్యక్తి ఆరోపించాడు. బాధితుడి కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరకువాడకు చెందిన గాలి లాజర్ (30)ను నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వరుస సూది దాడులతో సైకో కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. అయితే, 'సైకో అని ఒప్పుకో' అంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని లాజర్ ఆరోపించాడు. తనను వేధించిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు శనివారం మీడియాకు తెలిపారు. కాగా, దీనిపై డీఎస్పీ సౌమ్యలతను ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా... సైకో కోసం గాలిస్తున్న క్రమంలో పోడూరు నుంచి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా లాజర్‌ను తాము అదుపులోకి తీసుకుని విచారించిన మాట నిజమేనన్నారు. సూది దాడులకు అతడికి సంబంధం లేదని నిర్ధారించుకుని విడిచిపెట్టామని చెప్పారు. అంతేకానీ, అతడిని వేధించలేదని, కొట్టలేదని స్పష్టం చేశారు -
మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!
-
సూది సైకోలజీ
-
తెలంగాణకు పాకిన సూది సైకో దాడులు
-
మళ్లీ గుచ్చాడు!
నగరంలో, నల్లగొండలో సైకో సూదిగాళ్ల హల్చల్ హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సైకో సూదిగాళ్ల కలకలం చెలరేగింది. ఇటీవలే మల్కాజిగిరిలో ఓ చిన్నారిపై సిరంజి దాడి జరుగగా... ఇప్పుడు ఎల్బీనగర్లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఎల్ఐసీ ఉద్యోగిపై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లబైల్లి తం డాకు చెందిన స్వామినాయక్ (27) బీఎన్‌రెడ్డి నగర్లో నివాసవుుంటూ ఎల్ఐసీ వూర్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు.సోమవారం దిల్సుఖ్నగర్ నుంచి ఎన్జీవోస్ కాలనీ వైపు వెళుతున్న ఓ బస్సు ఎక్కాడు. ఆ బస్సు దిల్సుఖ్నగర్-చైతన్యపురి వుధ్య ఉన్న సమయంలో తెల్లషర్టు, తెల్లప్యాం టు ధరించిన వ్యక్తి స్వామినాయుక్ మోకాలి వెనుక భాగంలో సూది (ఇంజెక్షన్ సిరంజి)తో గుచ్చాడు. బస్సు నడుస్తుండగానే, బస్సులోనే చెప్పులు వదిలేసి దిగి పరారయ్యూడు. స్వామినాయుక్ పక్కనే ఉన్న ప్రయూణికులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. కొద్దిసేపటికే నొప్పి భరించలేక స్వామినాయక్ బస్సులో పడిపోయూడు. బాధితుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇంజెక్షన్ గుచ్చి ఆటోలో పరారీ కోదాడ రూరల్: నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లు శివారులో సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి సూదిగుచ్చి.. ముగ్గురు యువకులు ఆటోలో పరారయ్యారు. కాపుగల్లుకు చెందిన కోపూరి వీరయ్య కోదాడకు వచ్చి పనిముగించుకుని సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. గ్రామశివారులోని మామిడితోటల వద్దకు రాగానే కాపుగల్లు నుంచి కోదాడ రోడ్డు వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చింది. వీరయ్య బైక్‌ను రోడ్డుకిందికి దించగా.. ఆటో కూడా అతనివైపే మలిపి ఒక్కసారిగా ఆపారు. వెంటనే ఆటోలో నుంచి ఓ వ్యక్తి దిగి వీరయ్య కుడి చెంపపై సూది గుచ్చాడు. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే దుండగులు అదే ఆటోలో పరారయ్యారు. బాధితుడు కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, వీరయ్య బ్యాంక్‌లో పంట రుణం తీసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో డబ్బు కోసం దొంగలు ఈ పనిచేశారా..లేదా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోదాడలో సూది సైకోగాళ్లు
-
కోదాడలో సూది సైకోగాళ్లు
నల్లగొండ: కొద్ది రోజులుగా సూది సైకో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సూదిగాళ్ల కలకలం నల్లగొండ జిల్లాకు వ్యాపించింది. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కోదాడ మండల కాపుగల్లులో బైకుపై వెళ్తున్న వీరయ్య (55) గ్రామ శివారుకు రాగానే ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై సూది విసరడంతో అది చెంపపై గుచ్చుకుంది. ఆయన వెంటనే కోదాడలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వీరయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సూది సైకో మరో దాడి.
-
సూది సైకో మరో దాడి
-
సూది సైకో మరో దాడి
పశ్చిమ గోదావరి: గోదావరి జిల్లాల ప్రజలు సూది సైకో భయంతో వణికిపోతున్నారు. తాజాగా జిల్లాలోని తణుకు మండలం ఇరగవరంలో ఓ మహిళపై సైకో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. బైక్ పై వచ్చిన సూది సైకో మహిళకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. దీంతో సదరు మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సైకో కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంకా దొరకని సైకో సూదిగాడు!
-
ఈసారి మహిళ చేతికి సిరంజీ..!
సామర్లకోట(తూర్పుగోదావరి): పది రోజులుగా గోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతున్న ఇంజక్షన్ ఇప్పుడు సామర్లకోటకు చేరుకుంది. బుధవారం రాత్రి సామర్లకోట పట్టణంలోని ఇద్దరికి సూది గుచ్చుకుంది. వివరాలు.. పట్టణంలోని సంగీతరావుపేటలో అడపా దుర్గాప్రసాద్ అనే యువకుడు తన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా.. మోటారుసైకిల్‌పై ఓ పురుషుడు, మహిళ అక్కడికి వచ్చి ఆగారు. పిఠాపురం ఎలా వెళ్లాలంటూ దుర్గాప్రసాద్‌ను ఆరా తీశారు. ఇంతలోనే బైక్‌పై కూర్చున్న మహిళ దుర్గాప్రసాద్ నడుముకు ఇంజక్షన్ చేసింది. అతడు తేరుకునేలోగానే వారు అక్కడి నుంచి మాయమయ్యారు. ఇంజక్షన్ ప్రభావంతో దుర్గాప్రసాద్ అస్వస్థతకు గురయ్యాడు. చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'సూది సైకో' కోసం పల్లెల జల్లెడ
అత్తిలి (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రజలపై ఇంజక్షన్‌తో దాడికి పాల్పడుతూ దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న సూది సైకో కోసం వేట ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని కొమ్మెర, ఈదూరు, లక్ష్మీనారాయణపురం, చలెంద్రచెరువు తదితర గ్రామాల్లో అత్తిలి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇల్లిల్లూ తిరుగుతూ పల్సర్ బైక్ ఉన్న వారినందరినీ విచారిస్తున్నారు. 25-30 వయసుగలవారి ఫోటోలు తీసుకుని సైకో బాధితులందరికీ ఆ ఫోటోలను వాట్సప్‌లో పంపిస్తున్నారు. దాంతో పల్లెల్లోని పల్సర్ బండ్లు ఉన్న యువకులు భయాందోళనకు గురవుతున్నారు. -
దొరికిన యువకుడు సూది సైకో కాదు!
-
దొరికిన యువకుడు సూది సైకో కాదు!
తమకు దొరికిన వ్యక్తి 'సూది సైకో' కాదని పోలీసులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'సూది సైకో' అనే అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారించగా, అతడు ఈ నిందితుడు కాడని తేలింది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో ఓ యువకుడు ఇంజక్షన్‌తో పట్టుబడటంతో.. అనుమానించిన ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్.. రావులపాలెం సీఐ రమణ ముందు హాజరుపరిచారు. కడియం మండలానికి చెందిన అతడు నర్సాపురం - రాజమండ్రి మధ్య ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా నర్సాపురం డిపోలో పనిచేస్తున్నాడు. గతంలో తన బంధువులకు వైద్యం నిమిత్తం ఇంజక్షన్ తీసుకువచ్చానని, అది మరచిపోయి వాహనంలోనే ఉంచానని ఆ యువకుడు చెప్పినట్టు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైకో మరొకరిపై సూదిపోటు ప్రయోగించినట్లు తెలిసింది. దీంతో విచారణ అనంతరం అతడిని విడిచిపెట్టినట్టు సీఐ పీవీ రమణ తెలిపారు. సైకో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించవచ్చన్న అనుమానంతో ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. -
సూది సైకో దొరికినట్లేనా?
-
సూది సైకో దొరికినట్లేనా?
పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న 'సూది సైకో' దొరికాడా.. లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈనెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. పొడిచిన ఇంజెక్షన్లలో ఎలాంటి మత్తుపదార్థం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గ్రామాల్లో తాము రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకుంటామని, ఇప్పటివరకు సూది సైకో దాడులకు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ప్రజలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన 'సూది సైకో'ను పోలీసులు ఇంతకీ అదుపులోకి తీసుకున్నారా.. లేదా అనేది తెలియడంలేదు. 26 తర్వాతి కేసులన్నీ అబద్ధాలేనని ఎస్పీ అంటున్నారంటే, ఆరోజే సూది సైకో పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు అర్థం చేసుకోవాలి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించడం లేదు. రాజమండ్రిలో ట్రావెల్స్‌లో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి సైకో అని, అతడిని పట్టుకున్నారని కొందరు పోలీసులు అన్నారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో సైకోను అదుపులోకి తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఇలా.. భిన్న కథనాలు వస్తున్నాయే తప్ప, అసలు సూది సైకో పోలీసులకు పట్టుబడ్డాడా లేదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కావడంలేదు. -
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
-
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఇంజక్షన్ సైకో' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఘటన భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం చోటు చేసుకుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లు...లిప్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు. జిల్లాలో ప్రజల కంటిపై కునుకు లేకుండా పోలీసులకు సవాల్‌గా మారిన సూదిగాడు ఇప్పటికీ దొరక్కుండా మిస్టరీగా మారాడు. సిరంజితో పొడిచి మహిళలను బెంబేలెత్తిస్తున్న ఇతగాడు తాజాగా పురుషులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆదివారం రాత్రి పెంటపాడు గేటు సెంటర్ వద్ద...ఇంటికి వెళుతున్న వడ్రంగి మేస్త్రిని.. బైక్ వచ్చిన యువకులు సూదులతో రెండుచోట్ల గుచ్చి పోరిపోయిన విషయం తెలిసిందే. -
'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం
-
పోలీసుల అదుపులో ఇంజక్షన్ సైకో?
నల్లజర్ల: గత కొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను సిరంజీ సైకో హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం నల్లజర్ల మండలం పోతవరంలో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఇంజక్షన్ సైకోగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు, యువతులకు ఇంజెక్షన్లతో పొడుస్తూ ఓ సైకో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో శనివారం నుంచి బుధవారం వరకు 13 మంది మహిళలు, విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లతో సైకో దాడి చేశాడు. ఈనెల 22న యండగండి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులను గాయపర్చిన సైకో వరుసగా ఇంజక్షన్లతో దాడులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ప్రస్తుతం అదుపులో ఉన్న వ్యక్తి ఇంజక్షన్ సైకోనా?కాదా?అనేది తేలాల్సి ఉంది.