అత్తిలి (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రజలపై ఇంజక్షన్తో దాడికి పాల్పడుతూ దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న సూది సైకో కోసం వేట ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని కొమ్మెర, ఈదూరు, లక్ష్మీనారాయణపురం, చలెంద్రచెరువు తదితర గ్రామాల్లో అత్తిలి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇల్లిల్లూ తిరుగుతూ పల్సర్ బైక్ ఉన్న వారినందరినీ విచారిస్తున్నారు. 25-30 వయసుగలవారి ఫోటోలు తీసుకుని సైకో బాధితులందరికీ ఆ ఫోటోలను వాట్సప్‌లో పంపిస్తున్నారు. దాంతో పల్లెల్లోని పల్సర్ బండ్లు ఉన్న యువకులు భయాందోళనకు గురవుతున్నారు.
'సూది సైకో' కోసం పల్లెల జల్లెడ
Published Tue, Sep 1 2015 3:07 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement