
సూది సైకో మరో దాడి
పశ్చిమ గోదావరి: గోదావరి జిల్లాల ప్రజలు సూది సైకో భయంతో వణికిపోతున్నారు. తాజాగా జిల్లాలోని తణుకు మండలం ఇరగవరంలో ఓ మహిళపై సైకో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. బైక్ పై వచ్చిన సూది సైకో మహిళకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. దీంతో సదరు మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సైకో కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.