![Young Woman Elected As Panchayat Sarpanch Very Young Age - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/11/Panchayat-Sarpanch.jpg.webp?itok=q3PV_hbw)
చుట్టుగుళ్ల పూర్ణిమ
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు.
చదవండి:
వీరికి లక్కుంది..!
టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన
Comments
Please login to add a commentAdd a comment