First Phase Panchayat Polls
-
కవిటం గ్రామం: 24 ఏళ్లకే సర్పంచ్..
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. చదవండి: వీరికి లక్కుంది..! టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన -
గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు
సాక్షి, అమరావతి: మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసిందని, దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై బుధవారం ఎస్ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, కడియపుసావరంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారన్నారు. బుచ్చయ్యచౌదరిని ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించాలని కోరారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో టీడీపీ జెండాలతో, వందలాది మందితో కలిసి ప్రచారం చేస్తున్నారన్నారు. వారు బలపరిచిన, పోటీలో ఉన్న సర్పంచి అభ్యర్థిని, వార్డు మెంబర్లను అనర్హులుగా ప్రకటించాలన్నారు. ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్ప నామినేషన్ వేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి, వై.రామాపురం గ్రామాల్లోని వార్డు సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు సిద్ధారెడ్డి, మల్లకేష్, భీమలింగ, మహేశ్, ఖాశీం తదితరులకు తగిన రక్షణ కల్పించాలన్నారు. -
పంచాయతీ ఫలితాలు మాకే అనుకూలం
సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. 38.74 శాతం పంచాయతీలను తమ పార్టీ గెలుచుకున్నట్టు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ పతనానికి నాంది అని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. దుర్మార్గాలను ఎదుర్కొని ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు పణంగా పెట్టి దుర్మార్గాలను అడ్డుకున్నారని, ఇది టీడీపీ సత్తా అని చెప్పారు. 2,723 గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ 1,023 గెలుచుకుందని, ఇతరుల మద్దతుతో మరో 32 పంచాయతీలలో గెలిచామని, మొత్తంగా 38.74 శాతం స్థానాలలో తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఒక మంత్రి 94 శాతం పంచాయతీలను గెలిచినట్టు గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు ఒకవైపు షర్మిల పార్టీ పెడుతున్నామని తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెబుతుంటే.. ఏ2 మాత్రం ఆమె అలా ఎక్కడ మాట్లాడిందని గాలి మాటలు చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ చెల్లెలికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. సీఎం జగన్ సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలాడుతున్నాడని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో 85 పంచాయతీల్లో 82 పంచాయతీలను బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతిఒక్కరిని కోర్టులకు లాగుతామని, రాత్రి ఒంటిగంట వరకు వందల పంచాయతీల్లో టీడీపీ గెలిస్తే అధికారులు వాటన్నింటిని వైఎస్సార్సీపీకి డిక్లేర్ చేశారని ఆరోపించారు. -
టీడీపీ కంచు కోటలకు తూట్లు
సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో.. తమకు కంచుకోటలుగా భావించే గ్రామాల్లో సైతం టీడీపీ మద్దతుదారులు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో సైతం గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఇప్పుడు మట్టికరిచింది. యనమల చతికిల టీడీపీ అపర మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు తమ్ముడు ఇన్ఛార్జిగా ఉన్న తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరంలో స్వయాన యనమల అన్న కొడుకు యనమల శ్రీను టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసి ఓడిపోయారు. తుని నియోజకవర్గంలో 58 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. 54 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ చేతిలో ఉన్న కోదాడ, పెరుమాళ్లపురం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 40 ఏళ్ల నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో ఈసారి వైఎస్సార్సీపీ అభిమాని పాగా వేశారు. అలాగే 37 సంవత్సరాలుగా టీడీపీ చేతిలో ఉన్న సంతబొమ్మాళి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని కళింగపట్నం లక్ష్మి గెలవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 41 పంచాయతీలకు 34 పంచాయతీలను వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకోగా కేవలం ఐదు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు అతికష్టం మీద గెలవగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న జె తిమ్మాపురం, కట్టమూరు, వేట్లపాలెం, మేడపాడు, ఆర్వీపట్నం, ఆర్వి కొత్తూరు మేజర్ పంచాయతీలను ఈసారి వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు పంచాయతీలకే టీడీపీ మద్దతుదారులు పరిమితమయ్యారు. 39 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారు. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలో 44 పంచాయతీల్లో 39 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవగా, జనసేన మద్దతుదారులు కేవలం మూడు పంచాయతీల్లో టీడీపీ మద్దతుతో అతి కష్టం మీద గెలిచారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్న మైలవరం మేజర్ పంచాయతీని తొలిసారిగా వైఎస్సార్సీపీ మద్దతుదారు చేజిక్కించుకున్నారు. లోకేష్‌కు మళ్లీ భంగపాటు ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ గెలవలేక కేవలం ట్వీట్లతో కాలక్షేపం చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ తాను ఇన్ఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి కూడా భంగపాటుకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆ నియోజకవర్గంలోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 14 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ మరో ముఖ్య నేత ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు రామరాజు, బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులు కూడా తమ నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న విజయవాడ రూరల్ మండలంలో 9 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారు. ఇక్కడ టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గెలుపొంది ఆ తర్వాత ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. -
ఈ దఫా 24 మాత్రమే..
దేవరకద్ర : గ్రామపంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ముగియగా.. రెండో దశ గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించి బుధవారంతో ప్రచారానికి తెర పడనుంది. ఇక మూడో విడత జీపీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియగా పోటీలో ఉన్న వారెవరో తేలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. బరిలో మిగిలిన వారికి అధికారులు గుర్తులను కేటాయించారు. ఇక ఆయా గ్రామాల్లో బుధవారం నుంచి ప్రచారం హోరెత్తనుంది. అయితే, తొలి, రెండో దశలతో పోలిస్తే అతి తక్కువ గ్రామపంచాయతీలు ఈ విడతలో ఏకగ్రీవం కావడం గమనార్హం. మొత్తం 126.. ఇప్పుడు 24 జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెండింటి పాలకవర్గాలకు ఇంకా గడువు ఉండడంతో 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 249 జీపీలు, రెండో దశలో 243, చివరి దశలో 227 జీపీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో ఇప్పటికే మొదటి దశ గ్రామపంచాయతీల్లో పోలింగ్ ముగియగా.. రెండో దశలో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొదటి దశ గ్రామపంచాయతీల్లో 46 పంచాయతీలు ఏకగ్రీవం కా>గా, రెండో దశకు సంబంధించి 56 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ రెండు దశలతో పోలిస్తే మూడో దశలో ఈ సంఖ్య మరింత పడిపోవడం గమనార్హం. ఈ దశలో నామినేషన్ల ఉపసం హరణ గడువు మంగళవారం ముగియగా.. కేవలం 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమైనట్లే లెక్క తేలింది. దీంతో మొత్తంగా జిల్లాలో 126 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లే. అత్యధికం మద్దూరు మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ జీపీల్లో 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా మద్దూర్ మండలంలోని 11 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇక భూత్పూర్ మండలంలోని ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. కానీ ఈ మండలంలోని పలు పంచాయతీల్లో 36 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా, గండీడ్ మండలంలో 4, చిన్నచింతకుంట మండలంలో మూడు, అడ్డాకుల, కోస్గిల్లో రెండు చొప్పున, దేవరకద్ర, మూసాపేట మండలాలోఒక్కటి చొప్పున ఏకగ్రీవమైనట్లు మంగళవారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరుసగా రెండోసారి ఏకగ్రీవం అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని పెద్దమునుగల్‌ఛేడ్‌లో వరుసగా రెండోసారి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 2013లో గ్రామపంచాయతీని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయగా గ్రామస్తులంతా కలిసి నర్సమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్ చేయడంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సన్నిహితుడైన రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, ఉప సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఎంపికయ్యారు. వరుసగా రెండో సారి గ్రామంలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గ్రామస్తుల ఐక్యతను చాటుతోంది. ఇదిలా ఉండగా సర్పంచ్‌గా ఎంపికైన విజయలక్ష్మి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు మేఘారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములుసాగర్, యుగేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకట్రాములుసాగర్ తదితరులు మంగళవారం సన్మానించారు. -
తొలి విడత ప్రశాంతం
చెదురుమదురు ఘటనలతో ముగిసిన ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తు తారుమారు ఓటరు జాబితాలో పేరు గల్లంతు కావడంతో ఓటర్ల ఆక్రోశం సాక్షి, బెంగళూరు : తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చెదురు మదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు ..................... శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మండ్యా, బెళగావి, హావేరి, ఉత్తర కర్ణాటక, ధార్వాడ, గదగ్, చామరాజనగర, ఉడిపి, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లోని 3,156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 43,579 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగగా, 1,20,663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి విడత ఎన్నికల కోసం మొత్తం 19,269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో చిక్కమగళూరు, ఉడుపి, దక్షిణ కన్నడ ప్రాంతాల్లోని 176 పోలింగ్ కేం ద్రాలు నక్సల్స్ ప్ర భావిత ప్రాంతాలు గా గుర్తించబడా ్డయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు ఓటు హక్కును విని యోగించుకోవడానికి ఉత్సాహం చూపారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొడగు, బెళగావి ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతు కావడంతో ఓటర్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇక శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 24 మంది ఎస్పీ స్థాయి అధికారులతోపాటు 91 మంది డీవైఎస్పీలు, 256 మంది ఇన్స్పెక్టర్లు, 2,267 మంది ఎస్‌లను, 17,573 మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇక వీరితో పాటు 9,763 మంది హోంగార్డులను సైతం ఎన్నికల విధులకు నియమించారు.