చెదురుమదురు ఘటనలతో ముగిసిన ఎన్నికలు
కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తు తారుమారు
ఓటరు జాబితాలో పేరు గల్లంతు కావడంతో ఓటర్ల ఆక్రోశం
సాక్షి, బెంగళూరు : తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చెదురు మదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు ..................... శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మండ్యా, బెళగావి, హావేరి, ఉత్తర కర్ణాటక, ధార్వాడ, గదగ్, చామరాజనగర, ఉడిపి, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లోని 3,156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి.
మొత్తం 43,579 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగగా, 1,20,663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొదటి విడత ఎన్నికల కోసం మొత్తం 19,269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో చిక్కమగళూరు, ఉడుపి, దక్షిణ కన్నడ ప్రాంతాల్లోని 176 పోలింగ్ కేం ద్రాలు నక్సల్స్ ప్ర భావిత ప్రాంతాలు గా గుర్తించబడా ్డయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు ఓటు హక్కును విని యోగించుకోవడానికి ఉత్సాహం చూపారు.
మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొడగు, బెళగావి ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతు కావడంతో ఓటర్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇక శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 24 మంది ఎస్పీ స్థాయి అధికారులతోపాటు 91 మంది డీవైఎస్పీలు, 256 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 2,267 మంది ఎస్‌లను, 17,573 మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇక వీరితో పాటు 9,763 మంది హోంగార్డులను సైతం ఎన్నికల విధులకు నియమించారు.
తొలి విడత ప్రశాంతం
Published Sat, May 30 2015 5:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement