పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులు, మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసుల గాలింపు తీవ్ర తరం చేశారు. అందులోభాగంగా మెడికల్ రిప్రజెంటేటీవ్స్తో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏలూరులో సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పని చేసి మానివేసిన కాంపౌండర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు.