needle
-
తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..
కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది. రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్‌కి సీటీ స్కాన్ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్‌ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయత్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు. పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్ ప్రాంతంలో సఖాలిన్లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు. విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్‌కి ఎడమ ప్యారిటల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు. (చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!) -
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
సూది, నొప్పి లేకుండా వ్యాక్సిన్.. మనదేశంలోనే!
సూది, నొప్పి.. రెండూ లేకుండా కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వడం సాధ్యమేనా?. అవును.. మన దేశంలోనూ ఈ తరహా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం పాట్నా(బిహార్)లో మూడు వ్యాక్సిన్ సెంటర్లలో ఈ తరహా ప్రయోగాన్ని అమలు చేశారు. సూది, నొప్పికి భయపడి చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేకించి రూరల్ ఏరియాల్లో సూది మందు మంచిది కాదంటూ అపోహలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఆ భయం పొగొట్టేందుకు జైకోవ్-డి నీడిల్‌లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. రేజర్ తరహాలో ఉండే టూల్‌తో జస్ట్ షాట్‌ను ఇస్తారు అంతే. పైగా వ్యాక్సిన్ తీసుకున్నాక నొప్పులు కూడా రావని చెప్తోంది కంపెనీ. జైకోవ్-డి.. దేశీయంగా వచ్చిన రెండో వ్యాక్సిన్(మొదటిది కోవాగ్జిన్). జైడస్ క్యాడిల్లా రూపొందించిన మూడు డోసుల వ్యాక్సిన్. 28 నుంచి 56 రోజుల గడువుల వ్యవధితో రెండు భుజాలకు రెండేసి షాట్స్ చొప్పున(మొత్తం ఆరు షాట్స్) ఇస్తారు. ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్‌తో డెవలప్ చేయడం వల్ల ఈ సూదిరహిత వ్యాక్సిన్‌ను ప్రత్యేకంగా భావిస్తున్నారు. ముందుగా పెద్దలకు, ఆపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ ఇచ్చేందుకు కూడా అనుమతి ఉంది. Bihar | Painless and Needleless ZYCOV-D Covid Vaccine launched in Patna Three doses will be given at intervals of 28 days and 56 days. This program has been started at 3 vaccination centers. It is good for people who are afraid of needles: Civil surgeon Dr Vibha Singh (04.03) pic.twitter.com/bJ9JlidrZh — ANI (@ANI) February 4, 2022 -
కుట్లు వేశారు.. కడుపులో సూది మరిచారు!
సిరిసిల్లక్రైం: కడుపు నొప్పితో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన లచ్చవ్వ కడుపునొప్పితో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు గర్భసంచి ఆపరేషన్ చేశాడు. కొన్నాళ్లకు కడుపులో మళ్లీ నొప్పి రావడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె టాబ్లెట్స్ వాడింది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించుకోగా కడుపులో సూది, దారం ఉన్నట్లు నిర్ధారించారు. గర్భసంచి ఆపరేషన్ సమయంలో కుట్లు వేయడానికి ఉపయోగించిన సూది, దారం కడుపులోనే మరచిపోవడంతో తరచూ ఈ కడుపు నొప్పి వస్తున్నట్లు స్కానింగ్ చేసిన వైద్యుడు తెలిపారు. అయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఆస్పత్రి వివిధ కారణాలతో మూతపడింది. ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న అప్పటి వైద్యుడిని సంప్రదిస్తే తనకు సంబంధం లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని అనడంతో బాధితురాలు కన్నీరుమున్నీరు అవుతోంది. తనకు న్యాయం చేయాలని లచ్చవ్వ వేడుకుంటోంది. -
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది: విజయవంతంగా శస్త్రచికిత్స
కర్నూలు (హాస్పిటల్): పొరపాటున మింగిన నీడిల్ (సూది) ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ఆధునిక పరికరాలతో ఆ సూదిని తొలగించి ఆయువు పోశారు. వివరాలను గురువారం ఎన్ఆర్ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ బి.జయప్రకాశ్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు పశువులకు వేసే సూదిమందు ఇచ్చే నీడిల్ (సూదిని) నోటిలో పెట్టుకుని పరధ్యానంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ సూది పొరపాటున గొంతులోకి వెళ్లింది. దీంతో అతను ఉక్కిరిబికిరి అయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అత్యాధునిక వైద్యపరికరాలైన టెలిస్కోపిక్ బ్రాంకోస్కోప్ ద్వారా చాకచక్యంగా ఆ సూదిని బయటకు తీశారు. ఇప్పటివరకు తాను నిర్వహించిన చికిత్సల్లో ఇది ఎంతో క్లిష్టమైందని డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
సూది మింగిన చిన్నారి
సాక్షి, గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ వైద్యురాలు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్ట నుంచి సూది బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్కర్ బాబూలాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పొత్తూరు వారి తోటకు చెందిన మహ్మద్ అబెదుల్లా, సాజియా దంపతుల నాలుగేళ్ల కుమార్తె షీమా సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ చేతికి అందిన సూదిని మింగేసింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. కడుపులో నుంచి తీసిన సూది పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు వార్డులో అడ్మిట్ చేసుకుని ఎక్స్‌రే తీసి మింగిన సూది కడుపులో పేగులకు అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ కవితకు తెలియజేశారు. డాక్టర్ కవిత మంగళవారం షీమాకు కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ చేసి కడుపులో నుంచి సూదిని బయటకు తీశారు. చిన్నారి కడుపులో ఉన్న సూది నాలుగు సెంటీమీటర్ల పొడవుందని, ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా సూదిని బయటకు తీసినట్లు డాక్టర్ కవిత వెల్లడించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, ఇతర అధికారులు, వైద్యులు డాక్టర్ కవితకు అభినందనలు తెలిపారు. -
డాక్టర్ తప్పిదం.. శిశువుకు శాపం
తమిళనాడు, సేలం: ఒకటిన్నర సంవత్సరాల శిశువు మక్కీలో సూది చిక్కుకున్నా పట్టించుకోని డాక్టరుపై తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఎట్టిమడైపుదూర్ గ్రామానికి చెందిన రమీలా (26). ఈమె భర్త కార్తికేయన్‌తో గొడవ కారణంగా పుట్టింటిలో ఉంటోంది. ఈమెకు ఒకటిన్నర సంవత్సరం వయస్సు కలిగిన సర్వేశ్వరన్ కుమారుడు ఉన్నాడు. గత నెల నవంబర్ 15వ తేదీ బిడ్డను తామరై కన్నన్ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా అక్కడ ఆ బిడ్డకు సరళ, హిందుమతి అనే ఇద్దరు నర్సులు సూది వేసినట్లు తెలుస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆ సూది బిడ్డ మక్కీలో ఉండి పోయినట్లు తెలుస్తోంది. విషయం సంబంధిత డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. ఇదిలాఉండగా నవంబర్ 29వ తేదీ కూడా రమీలా బిడ్డను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. అప్పుడు కూడా నర్సులు, డాక్టరు నోరు మెదపలేదు. సర్వేశ్వరన్ మక్కి వద్ద బొబ్బ ఏర్పడింది. దాన్ని రమీలా మంగళవారం ఉదయం పగులగొట్టగా అందులో నుంచి సూది వెలుపలి వచ్చింది. రమీలా, బంధువులు మంగళవారం ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. డాక్టర్ ఆమెను సముదాయించడానికి చూసినట్లు సమాచారం. ఈ విషయంగా రమీలా తిరుచెంగోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ప్రసవం చేసి.. గర్భసంచిలో సూదిని పెట్టి
సాక్షి, చెన్నై: ప్రసవ సమయంలో వైద్యులు చేసిన తప్పిదం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్స చేసిన వైద్యులు కడుపులో సూదిని వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లికి చెందిన కార్తిక్ కట్టడ నిర్మాణ కార్మికుడు. అతని భార్య రమ్య (21). గర్భిణిగా ఉన్న ఆమెకు గత 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం అయ్యింది. తరువాత రమ్యకు కడుపు నొప్పి, రక్త స్రావం ఏర్పడడంతో బంధువులు ఆమెను బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రమ్యకు స్కాన్ చేసి చూడగా కడుపులో సూది ఉన్నట్టు గుర్తించారు. ప్రసవం సమయంలో సూదిని లోపలే ఉంచి కుట్లువేసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆపరేషన్ కోసం ఆమెను మదురై ఆసుపత్రికి తీసుకెళ్లారు. రమ్యకు శస్త్రచికిత్స మూలంగా సూదిని తొలగించనున్నారు. ప్రసవ సమయంలో మహిళ కడుపులో సూదిని పెట్టి కుట్లు వేయడాన్ని ఖండిస్తూ ఆమె బంధువులు ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిని ముట్టడించారు. ప్రసవం చేసిన సమయంలో కుట్లు వేసిన నర్సులు సూదిని లోపల పెట్టడం ఏమిటని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వీరరాఘవరావు మదురై ఆసుపత్రి డీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వైద్యులను, నర్సులను విధుల్లోనుంచి తొలగించారు. -
బాలింత రక్తనాళంలో విరిగిన సూది
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగులకు ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు అమర్చే సెంట్రల్ వీనస్ కేథటర్లు రక్తనాళంలోనే విరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా బయటపడిన విషయం మరిచిపోక ముందే ఈ ఘటన వెలుగు చూడటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న మందులు, సెలైన్ బాటిళ్లతోపాటు సెంట్రల్ వీనస్ కేథటర్ల, ఇంట్రా కేథటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి మత్తుమందు, యాంటిబయాటిక్ ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు ప్రధాన రక్తనాళానికి వీటిని అమర్చుతారు. కొంతమందికి చేతి నరానికి అమర్చితే.. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొంత మందికి గొంతు దగ్గర ఉన్న ప్రధాన రక్తనాళానికి అమర్చుతుంటారు. సాధారణంగా ఇవి విరిగిపోవడం అనేది జరగదు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్న ఈ కేథటర్లు తొలగించే సమయంలో రక్తనాళంలోనే విరిగి పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తనాళంలో విరిగిపోయిన సూది.. మహబూబ్‌నగర్‌కు చెందిన గర్భిణి (21) ప్రసవం కోసం గత నెల 27న పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఒక్కసారిగా హైబీపీ రావడంతో ఈ నెల 3న ఆమెకు ఆస్పత్రి వైద్యులు మెడ వద్ద సెంట్రల్ వీనస్ కేథటర్‌ను అమర్చారు. దీని ద్వారా మత్తుమందు ఇచ్చి ఆమెకు సిజేరియన్ డెలివరీ చేశారు. అయితే కేథటర్‌ను తొలగించే సమయంలో సూది మధ్యకు విరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు బాలింతను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాకు తరలించారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేశారు. విరిగిపోయిన నీడిల్ ఏ వైపు వెళ్లిందో గుర్తించారు. సర్జరీ చేస్తే బాలింత ప్రాణాలకే ప్రమాదమని భావించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో కార్డియోథొరాసిక్ వైద్య బృందం శుక్రవారం ఉదయం ఆమెకు సర్జరీ చేసి, దవడ కింది భాగంలోని ప్రధాన రక్తనాళానికి అడ్డుగా ఉన్న నీడిల్‌ను విజయవంతంగా తొలగించింది. నాణ్యతపై అనుమానాలు: ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల పరిధిలో పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ), సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, చాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 300పైగా సర్జరీలు అవుతుంటాయి. నగరంలోని వివిధ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు అవుతుంటాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులతోపాటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు రోజుకు నాలుగైదు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఎక్కించాల్సి వస్తుంది. ఇంజక్షన్ల కోసం పదేపదే నీడిల్‌తో గుచ్చడం వల్ల రోగికి నొప్పితో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఐవీ కేథటర్లను అమర్చుతుంటారు. ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేసే సమయంలో చేతికి, మెడ భాగంలో ఉన్న కేథటర్లను తొలగిస్తుంటారు. అయితే నాణ్యతా లోపం వల్ల కేథటర్‌ను తొలగించే సమయంలో రక్తనాళంలో నీడిల్ మధ్యకు విరిగి రక్తంతోపాటే ఇతర భాగాలకు చేరుతుంది. రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. నాసిరకం కేథటర్లను సరఫరా చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కాలుతున్న ఇనుప సూదితో గొంతు, తలపై..
జైపూర్ : మూడనమ్మకాలకు తలఒగ్గి 10నెలల పసిబిడ్డ తలపై, గొంతుపై ఎర్రగా కాలిన ఇనుప సూదితో కాల్చారు కసాయి తల్లిదండ్రులు. పిల్లాడు నొప్పితో కేకలు పెడుతున్నా వదిలిపెట్టకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. ఈ సంఘటన గురువారం రాజస్థాన్‌లోని బాన్స్వారా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. బాన్స్వారా జిల్లాలోని తేజ్‌పుర్ గ్రామానికి చెందిన నందలాల్‌కు దేవ్లా(10నెలలు)అనే కుమారుడు ఉన్నాడు. దేవ్లా గత పదిరోజులుగా అస్వస్థతకు గురై బాధపడుతున్నాడు. ఎవరికి చూపించినా ఆరోగ్యం కుదుట పడకపోవటంతో మూడనమ్మకాల వలలో చిక్కుకున్నారు. భూపేంద్ర బజార్‌లోని ఓ వీధిలో చెత్తతో మంట వేసి అందులో ఇనుప సూదిని బాగా కాల్చారు. ఎర్రగా కాలుతున్న సూదితో దేవ్లా గొంతు, తలపై విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. పసి పిల్లాడు నొప్పితో విలవిల్లాడుతున్నా వదిలి పెట్టలేదు. వాతలు పెట్టినప్పటికి రోగం నయం కాకపోగా.. పిల్లాడి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో చేసేదేమి లేక దగ్గరలోని ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు, గొంతుకు బలమైన గాయాలు కావటంతో పిల్లాడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి ఎస్ఎల్ నినమ స్పందిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం ఏటా పెద్ద మొత్తంలో ప్రజల ఆరోగ్యంపై ఖర్చు చేస్తోందన్నారు. కానీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో మూడనమ్మకాలు ఇంకా మనుగడలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రజలు తెలిసితెలియక మూడనమ్మకాల భారిన పడి పిల్లల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులేక పోవటం కారణంగా చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. -
వెంట్రుక మందం సూది...
మెదడులోని వేర్వేరు భాగాలకు అతి కచ్చితత్వంతో మందులు చేర్చేందుకు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన సూదిని అభివద్ధి చేశారు. మనిషి వెంట్రుక మందం మాత్రమే ఉండే ఈ సూదితో కేవలం ఒకే ఒక ఘనపు మిల్లీలీటర్ మోతాదు మందులను కూడా పంపవచ్చు. ఎలుకలపై పరిశోధనలు జరపడం ద్వారా తాము వాటిలోని కదలిక సమస్యలను పరిష్కరించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కానన్ డాగ్డేవీరెన్ తెలిపారు. ఈ సూదిలో కొన్ని అతిసూక్ష్మమైన గొట్టాలు ఉండటం.. వాటిద్వారా వేర్వేరు మందులను ఏకకాలంలో మెదడులోకి పంపగలగడం దీని ప్రత్యేకతలని వివరించారు. పది సెంటీమీటర్ల పొడవు, 30 మైక్రోమీటర్ల వెడల్పు ఉండే గొట్టాలను ఉక్కుతో తయారైన సూదిలోపల ఉంటాయని ప్రత్యేకమైన పంపులు, వ్యవస్థ ద్వారా మందుల మోతాదులను నియంత్రించవచ్చునని వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏ మందైనా మెదడు మొత్తం వ్యాపించిన తరువాతే పనిచేస్తుందని.. ఫలితంగా కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని.. కొత్త సూదితో ఈ సమస్యలు ఉండవని చెప్పారు. సమస్యకు అనుగుణంగా మెదడులోని ఏ భాగానికి మందు చేరాలో నిర్ణయించుకోగలగడం ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చునని తెలిపారు. -
సూది ఎప్పుడో దిగింది!
మన దేశంలో శతాబ్దం కిందట సూదిమందు అత్యాధునిక వైద్యానికి ప్రతీకగా ఉండేది. సూదిమందు వేసే డాక్టర్లే గొప్ప డాక్టర్లుగా చలామణీ అయ్యేవాళ్లు. సూదిమందు వేయించుకోవడానికి భయపడేవాళ్లు ఎందరు ఉండేవారో, సూదిమందు తీసుకోవడానికి ఉబలాట పడేవాళ్లూ ఉండేవాళ్లు. సూదిమందు వేస్తే ఎలాంటి జబ్బయినా మటుమాయం కాక తప్పదని బలంగా నమ్మేవాళ్లు. అయితే, సూదిమందు మరీ అంత ఆధునికమైన వైద్య సాధనమేమీ కాదు. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికే ఇంజెక్షన్ సిరంజీలు వాడుకలో ఉండేవి. నాటి కాలానికి చెందిన ‘డి మెడిసినా’ గ్రంథంలో ఆలస్ కార్నేలియస్ నెల్సస్... సిరంజీల ద్వారా శరీరంలోకి ఔషధాలను పంపి చికిత్స చేసే విధానం గురించి రాశాడు. అప్పటి సిరంజి రూపు రేఖలు, పనితీరు ఎలా ఉండేవో పెద్దగా ఆధారాలు లేవు. అయితే, ఫ్రెంచి వైద్యుడు చార్లెస్ ప్రవాజ్, స్కాటిష్ వైద్యుడు అలెగ్జాండర్ వుడ్ 1853లో తొలిసారిగా గాజు గొట్టానికి సూది, పిస్టన్ జతచేసిన ఆధునిక సిరంజి నమూనాకు రూపకల్పన చేశారు. దీనికి కొద్ది మార్పులతో న్యూయార్క్‌కు చెందిన వైద్యుడు లెటీషియా మర్న్ఫోర్డ్ గీర్ అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో సిరంజిని తయారు చేసి, దానికి పేటెంట్ పొందాడు. అర్ధశతాబ్ద కాలం పాటు గాజుతో తయారు చేసిన సిరంజీలే వాడుకలో ఉండేవి. న్యూజిలాండ్‌కు చెందిన ఫార్మసిస్టు కోలిన్ మర్దోక్ 1956లో డిస్పోజబుల్ సిరంజీని రూపొందించాడు. కొద్ది దశాబ్దాల్లోనే గాజు సిరంజీలు దాదాపుగా అంత రించి, వాటి స్థానాన్ని ఈ డిస్పోజ బుల్ సిరంజీలు ఆక్రమించాయి. -
'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం
-
సూదితో మెదడకు చికిత్స
చెన్నై: మెదడులోని వ్యాధిని గుర్తించడంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కనుగొనే అవకాశం ఉన్న మెదడులోని గడ్డను కేవలం సూది సహాయంతో నిర్ధారించారు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రి (జీహెచ్)లోని మెదడు వ్యాధి నివారణ విభాగంలో కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధులకు ఆధునిక చికిత్సను అందిస్తున్నారు. తాజాగా ఈ విభాగానికి రూ.55 లక్షలతో అత్యాధునిక యంత్రం మంజూరైంది. స్ట్రియోటాక్సీ అనే పేరుగల ఈ యంత్రం సహాయంతో మెదడులో అతి సున్నితమైన ప్రాంతంలో, ఇతర పరీక్షలకు అందని క్లిష్టతరమైన వ్యాధులను సులభంగా కనుగొని చికిత్స చేయవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు. స్ట్రియోటాక్సీ యంత్రం పనితీరును వివరించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి డీన్ విమల, డిప్యూటీ డీన్ రంగరాజన్ జోతి మాట్లాడుతూ, మెదడులో గడ్డలు ఏర్పడితే వాటిని గుర్తించేందుకు రోగికి అనస్తీషియా (మత్తుమందు) ఇవ్వకుండా, శస్త్రచికిత్స చేయకుండానే గుర్తించవచ్చని తెలిపారు. రోగి స్పృహలో ఉండగానే తలలోకి సూదిని ప్రవేశింపజేసి మెదడులోని గడ్డలను తొలగించవచ్చని చెప్పారు. ఈ విధానం వల్ల తలకు అతిపెద్ద శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం తప్పుతుందని అన్నారు. అంతేగాక రోగి కొన్ని రోజుల్లో వ్యాధినయమై డిశ్చార్జి కావచ్చని తెలిపారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా ఇప్పటి వరకు 9 మందికి విజయవంతంగా చికిత్సలు జరిపినట్లు చెప్పారు. ఈరకమైన చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుండగా తాము పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు.