
చిన్నారి నక్షత్రతో తల్లిదండ్రులు, డాక్టర్ రాజేంద్రప్రసాద్
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు.
చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం
దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment