needle psycho
-
సూది 'ఎఫెక్ట్'.. భయంతో ఆస్పత్రిలోచేరిన వ్యక్తి
సూది సైకో గురించిన పుకార్లు పెరిగి పోతుండటంతో జనం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏమూల నుంచి సూది సైకో తమ మీద దాడి చేస్తాడో అని వణికి పోతున్నారు. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సూదితో తనపై దాడి చేశారంటూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి కధనం మేరకు.. వట్లూరు గ్రామానికి చెందిన దుక్కిపాటి కృష్ణ(30) ఆదివారం ఏలూరు పట్టణానికి వచ్చి తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలు దేరాడు. ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తన చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడని తెలిపాడు. సదరు వ్యక్తి వస్త్రంతో ముఖం కప్పుకున్నాడు. అయితే చేతిపై గాయం సూదిదా.. కాదా.. అనే విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. -
సూదిగాడు పట్టివేత!
హైదరాబాద్ : హైదరాబాద్ ఇందిరానగర్‌లోని హోటల్ సమీపంలో సూదీతో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడికి స్థానికులు దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు సూదిగాడిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో సూదిగాడిని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం
-
'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులు, మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసుల గాలింపు తీవ్ర తరం చేశారు. అందులోభాగంగా మెడికల్ రిప్రజెంటేటీవ్స్తో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏలూరులో సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పని చేసి మానివేసిన కాంపౌండర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజక్షన్లు విక్రయించవద్దని ఈ సందర్భంగా మెడికల్ షాపులకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సైకో కోసం జిల్లావ్యాప్తంగా 15 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అలాగే 40కి పైగా ప్రత్యేక పోలీసులు బృందాలు సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి ఊహాచిత్రం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల్లో పోలీసులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.