
ఈసారి మహిళ చేతికి సిరంజీ..!
సామర్లకోట(తూర్పుగోదావరి): పది రోజులుగా గోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతున్న ఇంజక్షన్ ఇప్పుడు సామర్లకోటకు చేరుకుంది. బుధవారం రాత్రి సామర్లకోట పట్టణంలోని ఇద్దరికి సూది గుచ్చుకుంది. వివరాలు.. పట్టణంలోని సంగీతరావుపేటలో అడపా దుర్గాప్రసాద్ అనే యువకుడు తన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా.. మోటారుసైకిల్‌పై ఓ పురుషుడు, మహిళ అక్కడికి వచ్చి ఆగారు. పిఠాపురం ఎలా వెళ్లాలంటూ దుర్గాప్రసాద్‌ను ఆరా తీశారు.
ఇంతలోనే బైక్‌పై కూర్చున్న మహిళ దుర్గాప్రసాద్ నడుముకు ఇంజక్షన్ చేసింది. అతడు తేరుకునేలోగానే వారు అక్కడి నుంచి మాయమయ్యారు. ఇంజక్షన్ ప్రభావంతో దుర్గాప్రసాద్ అస్వస్థతకు గురయ్యాడు. చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.