Durga Prasad
-
చంద్రయాన్‌లో మనోళ్లు..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)/ఒంటిమిట్ట/విజయనగరం అర్బన్/రాజంపేట టౌన్ : పున్నమి చంద్రుడి సొగసు చూస్తూ మురిసిపోయిన భారతావని.. ఇప్పుడా నెలరాజుపై పరిశోధనలకు ల్యాండర్ విక్రమ్‌ను దింపి విజయగర్వంతో ఉప్పొంగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా చేసింది. ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీరిలో చిత్తూరుకు చెందిన కె. కల్పన, వైఎస్సార్ కడప జిల్లా యువతి అవ్వారు చందన.. విజయనగరానికి చెందిన డా. కరణం దుర్గాప్రసాద్.. రాజంపేటకు చెందిన ఎర్రబాలు రాజేంద్ర ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే.. చిత్తూరుకు చెందిన కె. కల్పన ప్రముఖ పాత్ర పోషించడం తెలుగు వారికి గర్వకారణం. ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన వెంటనే బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టులో ఆమె అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాండర్‌ను సేఫ్‌గా దించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. మధురమైన జ్ఞాపకమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌తో కల్పనకు ప్రత్యేకమైన గౌరవం లభించడమే కాక తెలుగుజాతి మొత్తం ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది. మిగిలిన ముగ్గురూ చంద్రయాన్–3లో తమ అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. థర్మోఫిజికల్ లీడ్స్‌లో ఒకడిని.. అహ్మదాబాద్‌లోని అంతరిక్షం ఇస్రో విభాగమైన ఫిజికల్ రీసెర్చ్ లా»ొరేటర్ (పీఆర్ఎల్)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చంద్రయాన్–1 నుంచి ప్రస్తుత చంద్రయాన్–3 వరకు పనిచేసిన అనుభవం ఉంది. చంద్రుని ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం (సీహెచ్ఏఎస్టీఈ) అనే పరికరం లీడ్స్‌లో నేను ఒకడిని. ఇదొక థర్మామీటర్‌లా పనిచేస్తుంది. చంద్రుని మొదటి ఉపరితలం సీటు థర్మల్ ప్రొఫైల్‌ను అందించేందుకు చంద్రుని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. చంద్రునిపై నీటి ఉనికి, స్థిరత్వం, చలనశీలతను నిర్దేశించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో ముఖ్యమైన అంశం అయిన నీరు–మంచు, ఇతర వనరుల స్థిరత్వ మండలాల గురించి చెప్పే ముఖ్యమైన ప్రయోగం చంద్రయాన్–3. – డాక్టర్ కరణం దుర్గాప్రసాద్, విజయనగరం మాటల్లో వర్ణించలేని ఆనందమిది.. చంద్రయాన్–3 ప్రయో గం జరుగుతున్న తరుణంలోనే నేనూ సైంటిస్ట్ అయ్యి ఈ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం, అలాగే చంద్రయాన్–3 విజయవంతం కావ డం మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఇస్తోంది. విక్రమ్ ల్యాండర్ చందమామకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను గడిపాం. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అయిన క్షణం నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ ప్రయోగం నా జీవితంలో మరచిపోలేని ఓ తీపిగుర్తు. నేను ఎంటెక్ పూర్తిచేశాక హైదరాబాద్‌లోని క్వాల్కం కంపెనీ తమ సంస్థలో ఉద్యోగం ఇ చ్చేందుకు రూ.43 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చింది. అయితే, తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించా. ఆ తరువాత తన అడుగులు శా స్త్రవేత్తగా ఈ రంగంపై పడ్డాయి. అన్నమ య్య జిల్లా రాజంపేట మండలం దిగువ బసినా యుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వై.సుబ్రమణ్యంరెడ్డి, చ ంద్రకళ.. రాజేంద్రప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు. – ఎర్రబాలు రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఇది చిన్నప్పటి కల.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్తమాధవరం మా స్వగ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్ వారు నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో ప్రతిభ చూపడంతో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్లో ఉపకార వేతనం లభించింది. కడపలోని అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ డీఏఐడీ పూర్తిచేశాను. విజయవాడలో డీఎస్సీ శిక్షణ తీసుకున్న అనంతరం ఇస్రో పరీక్షలకు సిద్ధమై ఎంపికయ్యాను. మూడో స్థానం దక్కింది. తల్లి ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మల ప్రోత్సాహం మరువలేనిది. ఇస్రోకు ఎంపికైన తర్వాత బెంగళూరు యుఆర్.రావు శాటిలైట్ సెంటర్లో పనిచేస్తున్నాను. అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాకెట్ లాంచ్ అంశంపై అవగాహన పెంచుకున్నా. చంద్రయాన్–3 డిజైనర్‌గా నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మరిన్ని విజయాల్లో నేనూ భాగస్వామి కావాలని ఉంది. – చందన, కొత్త మాధవవరం, ఒంటిమిట్ట మండలం -
మంచి మాట: మౌనం మంచి భాషణం
మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా, ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం. మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు. అయితే ఇలా కనులు మూసుకున్నపుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు. మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్ మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం. ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. మూడవది కాష్ఠమౌనం. ఇది మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
బిపిన్ రావత్ ఓ బ్రాండ్ .. మాజీ కల్నల్ ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మాజీ కల్నల్ పీవీ దుర్గా ప్రసాద్ కొన్నేళ్ల పాటు బిపిన్ రావత్‌తో కలిసి పని చేశారు. ఇద్దరూ కలిసి అనేక కీలక ఆపరేషన్లు కూడా చేశారు. 1978 నుంచి ఇద్దరూ కలిసి ఒకే బెటాలియన్‌లో దాదాపు 18 ఏళ్లు విధులు నిర్వర్తించారు. లెఫ్ట్‌నెంట్ నుంచి కల్నల్ వరకు కలిసే ఎదిగారు. ఆపై దుర్గా ప్రసాద్ పదవీ విమరణ పొందారు. రావత్ సీడీఎస్ వరకు ఎదిగారు. ఈ ద్వయం అమృత్సర్, యూరిల్లో అత్యంత సన్నిహితంగా పని చేసి, అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. బిపిన్ హఠాన్మరణం నేపథ్యంలో దుర్గా ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. నిబద్ధతకు నిదర్శనం.. ► బిపిన్ రావత్‌తో కలిసి 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆల్ఫా కంపెనీలో పని చేశా. ఓ రోజు ఇద్దరం కలిసి యూరి క్యాంప్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గార్డ్ చేస్తూ మధ్యాహ్న భోజనానికి వచ్చాం. అది పూర్తయిన తర్వాత ఎవరో మేజర్ జనరల్ వస్తే ఆయన బ్రీఫింగ్ చేస్తూ నేను ఆగిపోగా... బిపిన్ ఆర్మీ వాహనంలో తన విధులకు వెనక్కు వెళ్తున్నారు. నేను చూస్తుండగానే బాంబు పేలింది. ఆ ప్రమాదంలో ఆయన గాయాలతో బయటపడ్డారు. నాటి దసరా సందర్భంలో గాయాలతో ఉన్నారు. అలాంటి వారికి క్యాంప్ నుంచి వెనక్కు వచ్చే అవకాశం ఉన్నా... ఆయన ఒప్పుకోలేదు. అంతటి నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారాయన. ► దసరా రోజు సాయంత్రం 5.30 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన ఛగోతీ పోస్టు వద్ద ఉన్నాం. ‘నేను నా ట్రూప్స్‌తో వెళ్లి దసరా బోర్డర్ లైన్ వద్ద సెలబ్రేట్ చేస్తా’ అని వెళ్లారు. దాదాపు రెండుమూడు గంటలు అక్కడ గడిపి వెనక్కు వచ్చారు. ఆయన నడిచే పరిస్థితి లేకపోవడంతో గూర్ఖా ట్రూప్స్ మోసుకు వెళ్లాయి. ఆ రోజు ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా ఇలా చేశాం. అలాంటివి మళ్లీ జరిగి ఉంటాయని అనుకోను. పాకిస్థాన్‌కు చెందిన ఆయుధాలు రికవరీ చేయడం, ఆ బలగాల కదలికల్ని కనిపెట్టడంలో బిపిన్ రావత్‌కు మంచి నెట్వర్క్ ఉండేది. సెకండ్ లెఫ్ట్‌నెంట్ నుంచే ముందుండి ట్రూప్‌ను నడిపే వారు. అందుకే అనేక మెడల్స్ ఆయన సొంతమయ్యాయి. 18 గంటల పాటు పనిచేసేవారు ► రావత్‌కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్ ఇన్సెర్జెన్సీ ఏరియాలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్ రావత్ మాత్రం అలా చేయలేదు. మరో హెలికాప్టర్ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది. ఒక్కోసారి నిర్విరామంగా 18 గంటలూ ఆయన పని చేసే వారు. ఆయన భార్యను మేం మధు అని పిలిచేవాళ్లం. ఆమెది మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకుటుంబం. అయినా ఆ దర్పం గాని, సీనియర్ అధికారి భార్య అనే భావన గాని ఏనాడూ ఆమెలో కనిపించలేదు. లక్నోలో మేమంతా కలిసి ఒకేచోట ఉండేవాళ్లం. నా భార్య అరుణకు ఆమె స్కూటర్ నడపడం నేర్పారు. ► రావత్ ఆర్మీ వైస్ చీఫ్, చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వెళ్లి కలిసేవాడిని. రావత్ సీడీఎస్ అయిన తర్వాత ఒకేసారి కలిశాను. ఏడాది క్రితం ఆయన సీడీఎంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు దాదాపు గంటకు పైగా ఆయనతో గడిపా. బిపిన్ ఆర్మీ ఆపరేషన్స్‌లో దిట్ట. ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఆయన కాంగోలో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పని చేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరూ అభినందించారు. ► బలగాల నైతిక ధైర్యం దెబ్బతీయడానికి యూఎన్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన కాంగో మిలిటెంట్స్‌ను సమర్థంగా తిప్పికొట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ దేశాల ఆర్మీలని ఆయన అధ్యయనం చేశారు బిపిన్. ఈ నేపథ్యంలోనే ఆయన సీడీఎస్ అయిన తర్వాత థియేటర్ కమాండ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న సైన్యానికైనా ఆయుధ, మౌలిక వసతుల కల్పన తేలికైంది. యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అది పూర్తిగా అమలులోకి వచ్చే సందర్భంలోనే విషాదం చోటుచేసుకోవడం దారుణం. చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు -
'సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో బిపిన్ రావత్ పాత్ర మరువలేం'
సాక్షి, హైదరాబాద్: బిపిన్ రావత్‌లోని కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని రావత్ స్నేహితుడు కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బిపిన్‌రావత్‌తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. ఆయన అందరితో కలసిపోయే స్వభావం కలవాడు. మూడు రక్షణ విభాగాలను ఒకే తాటిపై తీసుకురావడంలో బిపిన్ రావత్ పాత్ర మరువలేనిది. రావత్ కుటుంబం మొత్తం దేశానికి సేవ చేసిన వారే. ఇద్దరం కలిసి ఒకే రెజిమెంట్‌లో పనిచేశాం. దేశ సరిహద్దుల సమస్యలను ఎదుర్కొనడంలో వ్యూహాలు రచించేవారు. అనేక కీలకమైన ఆపరేషన్లలో రావత్ ముందుండి నడిపించేవాడు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో రావత్ పాత్ర మరవలేము. రావత్ కుటుంబంతో మాకు మంచి పరిచయం ఉంది. రావత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుందిగల్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశాము. రావత్ మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుపుతారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉంటాయి' అని కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు చదవండి: (Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు) -
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన యువతి (18)కి ఆమె అద్దెకుంటున్న ఇంటి కింది పోర్షన్లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అతడు అక్కడి టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి లోనైన దుర్గాప్రసాద్ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ నిలదీశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో మెడపై పొడిచాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని కిందకి పరుగు తీసింది. దీనిని గుర్తించిన టైలర్‌షాపు యజమాని యూసుఫ్ ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. స్థానికులు దుర్గాప్రసాద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గా ప్రసాద్ దొరికాడు!
సాక్షి, సిటీబ్యూరో: రైల్వేలో ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు వంద మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకున్న ఘరానా మోసగాడు పమ్మిడి దుర్గా ప్రసాద్ రావు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు చిక్కాడు. భార్యతో కలిసి మోసాలు చేస్తున్న ఇతడిపై ఐదు కేసులు నమోదై ఉండగా... మరో ఏడు కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు స్పెషల్ టీమ్–2 అధికారులు గుర్తించారు. డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. తన భార్య పద్మినితో కలిసే పథకం రచించిన అతను రైల్వేలో తనకు ఉన్న పరిచయాలు వినియోగించుకుని దొడ్డిదారిన గ్రూప్ సీ,డీతో పాటు స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. మోసం చేస్తూ ‘మోసగాళ్లని’... ఈ అభ్యర్థుల్లో కొందరితో బోగస్ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు రైల్వే ఉద్యోగాలకు వైద్య పరీక్షలు తప్పనిసరని చెప్పిన అతను కొందరు అభ్యర్థులను లాలగూడలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి వీరికి రక్త, మూత్ర పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇంకా ఎందుకు రాలేదంటూ ప్రశ్నించడంతో దీంతో తన భార్య సహకారంతో వీరిని సొంత కారులోనే సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి పంపాడు. అక్కడి ఓ చోట వీరిని కూర్చోబెట్టిన పద్మిని ఈ కార్యాలయం నుంచే అపాయింట్మెంట్ ఆర్డర్లు వస్తాయంటూ నమ్మబలికింది. అయితే ఇటీవల కొందరు మోసగాళ్లు రైల్వేలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేశారని, దీంతో రైల్ నిలయం అధికారులు వారిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని, అందుకే నియామక పత్రాల జారీని తాత్కాలికంగా నిలిపేశారని, నెల రోజుల తర్వాత ప్రారంభిస్తారంటూ చెప్పి వారిని నమ్మించి పంపింది. కారు ఇచ్చి మళ్లీ కేసు పెట్టాడు... దుర్గా ప్రసాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. పూర్తిగా తన వల్లో పడ్డాడని నిర్ధారించుకున్న తర్వాత వివిధ పేర్లు చెప్పి అతడి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో సదరు యువకుడు దుర్గాప్రసాద్‌ను నిలదీయడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో తన కారును ఇచ్చిన దుర్గాప్రసాద్ ఆపై సదరు యువకుడు తన కారు ఎత్తుకెళ్లాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇతడిపై సీసీఎస్‌లో నమోదైన కేసును ఇన్స్పెక్టర్ ఆర్జీ శివమారుతి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ముమ్మరంగా గాలింపు చేపట్టి మంగళవారం బంజారాహిల్స్‌లో దుర్గా ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనేక మందిని మోసం చేసిన ఇతను తన ఇంటి చుట్టూ దాదాపు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. బాధితులు, పోలీసులు తన కోసం వస్తే వాటి ద్వారా తెలుసుకుని ఉడాయించేవాడు. అయితే కొన్ని రోజులుగా ఆ సీసీ కెమెరాలు పని చేయట్లేదని తెలిసింది. మరికొన్ని కేసులూ వెలుగులోకి... ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు దుర్గా ప్రసాద్‌పై మరికొన్ని కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని బంజారాహిల్స్, సైఫాబాద్లతో పాటు విజయవాడలోనూ కేసులు ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు మరో ఏడు కేసుల్లో పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నట్లు తెలిపారు. రేషన్ షాపులకు బియ్యం తదితరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని, బంగారం వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసిన నేరగాళ్లతో ఇతడికి ప్రమేయం ఉన్నట్లు, ఈ తరహాకు చెందిన ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు కేసుల్లో ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులు నిందితుడు ఎవరనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సీసీఎస్ పోలీసులు దుర్గారావును అరెస్టు చేయడంతో వారికి మార్గం సుగమమైంది. ఇంతటి ఘరానా చరిత్ర ఉన్న దుర్గా ప్రసాద్‌కు ఓ కాలు లేకపోవడం, ప్రతి రెండు రోజుకోసారిడయాలసిస్ తప్పనిసరి కావడం గమనార్హం. -
20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్
గంభీరావుపేట(సిరిసిల్ల): జాతీయ, రాష్ట్రస్థాయి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. గంభీరావుపేట మండలం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం బంద్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పరిమిట్ విధానం అమలు చేయాలని కోరారు. యాక్సిడెంట్, ఓవర్‌లోడ్ కేసులలో డ్రైవర్ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని, లారీలపై ఓవర్‌లోడ్ నిషేధించాలని, జిల్లాకొక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్హతతో సంబంధం లేకుండా సామర్థ్యం పరీక్షించి డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు పిట్ల వెంకటి, నాయకులు నర్సింలు, శేఖర్, ఓనర్లు చంద్రారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు. -
నానిగాడి ప్రేమకథ
దుర్గాప్రసాద్ కథానాయకుడిగా నటిస్తూ మెట్రో ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘నానిగాడు’. సీపీరెడ్డి దర్శకుడు. సరిత కథానాయిక. యస్. లక్ష్మి, చింతా చాతుర్య సహ నిర్మాతలు. ‘‘లవ్, కామెడీ, యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అంతా కొత్తవారే నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి చింతా శివకుమార్ రెడ్డి, చింతా మహేశ్‌రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. -
భారత బాక్సింగ్ జట్టు కోచ్‌గా దుర్గాప్రసాద్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జి. దుర్గాప్రసాద్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఆయన కోచ్‌గా ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఈనెల 23 వరకు జరిగే సిమోన్ ట్రెస్టిన్ స్మారక బాక్సింగ్ టోర్నీలో ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టు పాల్గొంటుంది. నీరజ్, లాల్ దిన్ మావియా, థామస్ మేతీ, ఆశిష్ కుమార్, రేయాల్ పూరీ ఈ టోర్నీలో తలపడనున్నారు. -
పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య
- ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని సూసైడ్ నోట్ - ఆపై ఆరో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం - మృతుడు దుర్గాప్రసాద్‌ది కృష్ణా జిల్లా.. మూడ్రోజుల కిందటే జాబ్‌లో చేరిక పుణె: ‘‘ఐటీలో ఉద్యోగానికి భద్రత లేదు.. భవిష్యత్తు గురించి భయపడ్డా.. నా కుటుం బం గురించి ఆందోళన చెందుతున్నా. వారిని బాగా చూసుకోండి.. క్షమించండి. లవ్యూ ఆల్. గుడ్‌బై..’’అని సూసైడ్ నోట్లో రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు. పుణెలో జాబ్‌లో చేరిన మూడోరోజులకే హోటల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనను కృష్ణా జిల్లాకు చెంది న గోపీకృష్ణ దుర్గాప్రసాద్(25)గా గుర్తిం చారు. గతంలో హైదరాబాద్, ఢిల్లీలోని సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేసిన ఆయన.. ఈ నెల 9న పుణెలోని ఓ ఐటీ కంపెనీలో విధుల్లో చేరాడు. విమాన్‌నగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆయనకు ఆ కంపెనీ వసతి ఏర్పాటు చేసింది. అయితే ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని ఆవేదన చెందిన దుర్గాప్రసాద్ బుధవారం రాత్రి చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అది విఫలమ వడంతో గురువారం తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో హోటల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే హోటల్ మేనేజర్‌కు సమాచారమిచ్చారు. అతడు పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దుర్గాప్రసాద్ చాలా మంచివాడని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని పుణెలో పనిచేస్తున్న ఆయన బంధువులు పేర్కొన్నారు. (చదవండి: సాఫ్ట్వేర్ కొలువులపై మెత్తని కత్తి) -
ప్రపంచ సెయిలింగ్ టోర్నీకి దుర్గా ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన యువ సెయిలర్ దుర్గాప్రసాద్ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. పట్టాయాలో జరిగే ప్రపంచ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో దుర్గా ప్రసాద్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. పట్టాయాలోని రాయల్ వరుణ యాట్ క్లబ్లో జరిగే ఈ టోర్నమెంట్లో 62 దేశాలకు చెందిన 280 మంది సెయిలర్లు పాల్గొంటున్నారు. ఇందులో అండర్–16 ఆప్టిమిస్టిక్ క్లాస్ విభాగంలో దుర్గాప్రసాద్ తలపడనున్నాడు. తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా హైదరాబాద్ యాట్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న శిక్షణా శిబిరంలో దుర్గాప్రసాద్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. -
చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు...
-
చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు...
విజయవాడ : విజయవాడ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్డుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. వివరాల్లోకి వేళ్తే విజయవాడలోని వాంబేకాలనీలో నివాసం వుంటున్న దుర్గా ప్రసాద్‌కు, పదేళ్ళ కిందట ఇదే ప్రాంతంకు చెందిన మరియమ్మ అలియాస్ బుజ్జితో పదేళ్ళ కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. అయితే కొంతకాలంగా మరియమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోంది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచుగా ఘర్షణలు జరిగేవని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల కిందట మరియమ్మను ఇదే విషయంలో నిలదీయడంతో ఇరువురి మధ్య తిరిగి వివాదం జరిగింది. ఆగ్రహంతో మరియమ్మను హతమార్చిన దుర్గాప్రసాద్ తరువాత తాను వుండే అపార్ట్మెంట్ల మధ్యలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. డ్రైనేజీ పనులకోసం గొయ్యి తీసినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. తరువాత తన భార్య ఎటో వెళ్ళిపోయిందని అందరికీ చెప్పి నమ్మించాడు. నెలరోజులు గడిచినా తమ కుమార్తె జాడ తెలియకపోవడంతో మరియమ్మ తల్లిదండ్రులు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. సిఐ సహేరాబేగం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికితీశారు. -
సీఆర్పీఎఫ్ తాత్కాలిక డీజీగా సుదీప్ లక్డాకియా
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లక్డాకియాకు డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన బుధవారం(నేడు) బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన లక్డాకియా, ప్రస్తుతం సెంట్రల్ జోన్ లోని పారామిలటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)లో లక్డాకియా పనిచేశారు. హోంమంత్రిత్వ శాఖ, ప్రధాని నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ(ఏసీసీ) తదుపరి డీజీని నియమించేవరకు లక్డాకియా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. గతేడాది డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన దుర్గాప్రసాద్ (1981 బ్యాచ్, తెలంగాణ కేడర్) సోమవారం పదవీ విరమణ చేశారు. -
వెండి,బంగారు వస్తువుల తనిఖీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దుర్గమ్మ వెండి, బంగారు వస్తువులను దేవాదాయ శాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ బుధవారం పరిశీలించారు. అమ్మవారికి అలంకరించే వెండి, బంగారు వస్తువులతో పాటు వివిధ సేవల్లో ఉపయోగించే వెండి వస్తువులను రికార్డు ప్రకారం సరిచూశారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించే వస్తువులకు బంగారు తాపడం చేయించిన వాటితో పాటు నిత్యం అలంకరించే వస్తువులను తనిఖీ చేశారు. మల్లేశ్వరాలయం, ఉపాలయాలతో పాటు ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి, వీరాంజనేయస్వామి వారి ఆలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. రికార్డు ప్రకారం అన్ని వస్తువులూ వినియోగంలో ఉన్నాయా, లేదా అనే వివరాలను తనిఖీ చేస్తున్నామని దుర్గాప్రసాద్ చెప్పారు. -
బడుగులందరికీ దివ్య దర్శనం
– దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ దెందులూరు : బడుగు, బలహీనవర్గాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రీవారి సన్నిధి సులభతరమయ్యేలా రాష్ట్రప్రభుత్వం, దేవాదాయశాఖ చర్యలు తీసుకుందని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్.దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివ్యదర్శనం పథకాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకంలో రామాలయాల ఆధునికీకరణ, నిర్మాణం, భజన మండళ్లకు శిక్షణ తరగతులు ప్రతి దేవాలయంలో దూప, దీప నైవేథ్యాల పర్యవేక్షణతో పాటు పేద బడుగు, బలహీనవర్గాల వారందరికీ కుటుంబంలో ఐదుగురికి వారానికి ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుపతి, కాణిపాకం, రాయచోటి, అహోబిలం పుణ్యక్షేత్రాలకు దేవాదాయశాఖ నిధులతో తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలోని దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆధ్యాత్మిక సేవలను అందుకోవాలని ఆయన కోరారు. -
పంచాయతీరాజ్ ఈఈ ఇంట్లో సోదాలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈఈ దుర్గాప్రసాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. శనివారం విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఐదు బృందాలు విశాఖ, రాజమండ్రిలో దుర్గా ప్రసాద్‌కు చెందిన నివాసాలతో పాటు పనిచేస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఐదు ఖరీదైన స్థలాలు, రెండు డూప్లెక్స్ ఇళ్లు, పావు కిలో బంగారం, మూడు కిలోల వెండి వస్తువులు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.లక్ష నగదు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. -
ముక్కలైన భవిష్యత్తు
జీవనోపాధి లేక రోడ్డున పడిన యువకుడి విషాదగాధ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల బాధితుడి దుస్థితి ఉద్యోగం ఇప్పిస్తామని మొండిచేయి చూపిన ప్రజాప్రతినిధులు అంగవైకల్యంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వైనం పాపం ఒకరిదైతే.. శిక్ష అనుభవిస్తోంది మరొకరు. ఉన్నత చదువు చదివి.. తల్లిదండ్రులను ఏలోటూ లేకుండా చూసుకోవాలని తాపత్రయపడిన ఆ యువకుడి భవిష్యత్తుపై ఉగ్రపంజా కోలుకోలేని దెబ్బతీసింది. మృత్యుముఖం వరకు వెళ్లొచ్చిన అతడిని అంగవైకల్యం వెక్కిరించగా, ప్రభుత్వ కొలువుతో జీవితానికి భరోసా కల్పిస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ నీటిరాతగానే మిగిలింది. చిన్న ఉద్యోగం ఇవ్వండంటూ అతడు మూడేళ్లుగా ప్రాధేయపడుతున్నా.. పాలకుల మనస్సు కరగడం లేదు. చింతూరుకు చెందిన పురాలశెట్టి దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండగా, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుపేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి, చేతులకు తీవ్ర గాయాలయ్యా యి. ప్రాణాపాయం నుంచి బయటపడిన అతడు మధ్యలోనే చదువు నిలిపేశాడు. ఆరు నెలల పాటు వైద్యసేవలు పొందిన అనంతరం పట్టుదలతో ఎంబీఏ పూర్తిచేశాడు. అతడిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీ నేటికీ నెరవేరకపోవడంతో దుర్గాప్రసాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎంబీఏ పూర్తిచేసిన అతను ఉద్యోగ వేటలో అలసిపోయి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత అతడిపైనే ఉండడంతో కంటబడిన నేతలందరినీ ఉద్యోగం కోసం ప్రాధేయపడుతున్నాడు. అప్పట్లో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యేను కలిశాడు. హైదరాబాద్‌లో ఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఉద్యోగం ఇస్తుందేమోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ను కలసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. పోనీ ఆంధ్రాలో ఉంటున్నందున ఇక్కడి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందన్న ఆశతో విలీన మండలాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలసి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అంగవైకల్యంతో ఉన్న తనకు ఇప్పటికైనా ప్రభుత్వం దయతలచి ఉద్యోగం ఇవ్వాలని దుర్గాప్రసాద్ కోరుతున్నాడు. -
సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ : బెజవాడ నగరంలోని సబ్ రిజిస్ట్రార్ దుర్గా ప్రసాద్ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. శ్రీనివాస బ్యాంక్ కాలనీలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దుర్గా ప్రసాద్ బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దుర్గా ప్రసాద్‌తోపాటు ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
పెద్దపాడు మండలం పూనుకొల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రేమల్లి గ్రామంలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో బడుగు సాయి దుర్గా ప్రసాద్(20), కొనకళ్ల రామకృష్ణ (24) మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మురికి కాలువలో పడి బాలుడి మృతి
-
మురికి కాలువలో పడి బాలుడి మృతి
మురికి కాలువలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని దుమ్ములపేట వద్ద ఆదివారం జరిగింది. స్థానిక కాలనీ సమీపంలోని డ్రైన్లో బాలుడి చేతులు కనిపిస్తుండటంతో.. స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం స్థానిక కాలనీకి చెందిన దుర్గాప్రసాద్(9)దిగా గుర్తించారు. బాలుడు రాత్రి నుంచి కనిపించడం లేదని కంగారు పడుతున్న తల్లిదండ్రులకు మృతదేహం అయి కనిపంచడంతో..కన్నీరుమున్నీరయ్యారు. -
హోదా కోసం మరో బలిదానం
-
హోదా కోసం మరో బలిదానం
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్(50) ఆగస్టు 25వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వేలమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన నినదించారు. కాగా అప్పటినుంచి మెరుగైన వైద్యం కోసం పలు ఆసుపత్రుల్లో దుర్గాప్రసాద్ చికిత్స పొందారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య జ్యోతి, కూతుళ్లు శ్రావణి, నిఖిల ఉన్నారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. దుర్గాప్రసాద్‌ది ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. ''హోదా విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడంతో ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ఇక తమ పిల్లలకు ఉద్యోగాలు రావని బాధపడుతున్నారు. అందుకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పంటలు పండుతున్న చెరుకుతోటలను తగలబెడుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంతం గురించి కమిటీలు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా తమకు నచ్చినచోట, నచ్చినట్లు రాజధాని నిర్మాణం చేపడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు'' అని ఆయన అన్నారు. -
ఈసారి మహిళ చేతికి సిరంజీ..!
సామర్లకోట(తూర్పుగోదావరి): పది రోజులుగా గోదావరి జిల్లాల ప్రజలను భయపెడుతున్న ఇంజక్షన్ ఇప్పుడు సామర్లకోటకు చేరుకుంది. బుధవారం రాత్రి సామర్లకోట పట్టణంలోని ఇద్దరికి సూది గుచ్చుకుంది. వివరాలు.. పట్టణంలోని సంగీతరావుపేటలో అడపా దుర్గాప్రసాద్ అనే యువకుడు తన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా.. మోటారుసైకిల్‌పై ఓ పురుషుడు, మహిళ అక్కడికి వచ్చి ఆగారు. పిఠాపురం ఎలా వెళ్లాలంటూ దుర్గాప్రసాద్‌ను ఆరా తీశారు. ఇంతలోనే బైక్‌పై కూర్చున్న మహిళ దుర్గాప్రసాద్ నడుముకు ఇంజక్షన్ చేసింది. అతడు తేరుకునేలోగానే వారు అక్కడి నుంచి మాయమయ్యారు. ఇంజక్షన్ ప్రభావంతో దుర్గాప్రసాద్ అస్వస్థతకు గురయ్యాడు. చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రత్యేక హోదా’ కోసం.. ఆత్మాహుతి యత్నం
హోదా రాదన్న పాలకుల మాటలకు మనస్తాపం... ‘పశ్చిమ’లో ఒంటికి నిప్పంటించుకున్న చిరు వ్యాపారి దుర్గాప్రసాద్ 40% కాలిన గాయాలతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స ఏలూరు: ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం, ఆ తర్వాత జరిగిన చావలి సుబ్బారావు ఉదంతం మరువకముందే... బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజేనన్న పాలకుల మాటలకు మనస్తాపానికిలోనై పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 శాతం కాలిన గాయాలతోనూ ప్రత్యేకహోదా నినాదాలు చేస్తున్న ఆయన్ని కుటుంబ సభ్యులు వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి, అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. హోదా డిమాండ్‌పై నేతలకు విన్నపాలు.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి తిరిగొచ్చేసిన దుర్గాప్రసాద్ కైకరంలో చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్‌పై ఇటీవల నేతలకు వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. సీఎం చంద్రబాబు కైకరం వచ్చిన సందర్భంలోనూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో నిరసన దీక్ష చేపట్టినప్పుడు, వినతిపత్రాలు సమర్పించారు. ఇదే విషయమై మంగళవారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా సాధించుకుని వస్తారని దుర్గాప్రసాద్ ఆశించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను మంగళవారం రాత్రి 12 గంటల వరకు టీవీలో చూస్తూ కూర్చున్నారు. ప్రత్యేకహోదా రాదని, ప్యాకేజీకి ముఖ్యమంత్రి ఒప్పుకుని వస్తున్నారన్న విషయం విని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కంటిమీద కునుకు లేకుండా అదే ఆలోచిస్తూ బుధవారం తెల్లవారు జామున 5.30గంటల సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆయన రెండు కాళ్లు, ఎడమ చేయి కాలిపోయాయి. ఒక్కసారిగా శరీరాన్ని మంటలు చుట్టుముట్టినా భరిస్తూ దుర్గాప్రసాద్ చేసిన ప్రత్యేకహోదా నినాదాలకు నిద్రలో ఉన్న అతని భార్య జ్యోతి, కుమార్తెలు నీరజ, నిఖిల ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా మంటల్లో దుర్గాప్రసాద్ ఉండటాన్ని చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే తేరుకుని మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. కూతురు భవిష్యత్‌పై ఆందోళనతోనే.. ఉపాధి కోసం 2002లో కుటుంబంతో హైదరాబాద్ వెళ్లిన దుర్గాప్రసాద్ జగద్గిరిగుట్ట సమీపంలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉండేవారు. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. దుర్గాప్రసాద్‌కు ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో రెండో కుమార్తె నిఖిల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివింది. దీంతో ఆమె తెలంగాణ స్థానికురాలైంది. ప్రత్యేక వాదం ఊపందుకున్న 2007లోనే దుర్గాప్రసాద్ కుటుంబం స్వస్థలమైన ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి తిరిగొచ్చేసింది. కాగా, నిఖిల డీఎస్సీ పరీక్ష రాసే విషయంలో స్థానికత సమస్య ఎదురైంది. ఐదేళ్లపాటు తెలంగాణలో చదవడంతో అవుట్ ఆఫ్ స్టేట్‌గా ఆమెను పరిగణించారు. దీంతో ఆంధ్రాలో పరీక్ష రాసే అవకాశం రాలేదు. అటు తెలంగాణలోనూ ఆంధ్రా అభ్యర్థిగా పరీక్ష రాసే అవకాశాన్ని నిఖిలకు కల్పించలేదు. ఈ క్రమంలో బిడ్డ భవిష్యత్ కోసం దుర్గాప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ డీఎస్సీ రాసేందుకు అనుమతి వచ్చింది. డీఎస్సీ పరీక్ష రాసినా ఫలితాలు వెల్లడించకుండా విత్‌హెల్డ్(నిలిపివేయడం)లో ఉంచారు. ఇలాంటి వారు సుమారు 900మంది ఉండటంతో వీరంతా కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేకహోదా వస్తే వారితోపాటు తనబిడ్డ భవిష్యత్, తద్వారా రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని దుర్గాప్రసాద్ ఆశించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోప్రత్యేకహోదా రాదని స్పష్టమైన సంకేతాలు రావడంతో తన బిడ్డకు ఉద్యోగం రాదనే నిరాశ, నిస్పృహలకు దుర్గాప్రసాద్ లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే తన ఆత్మహత్య ద్వారా కొందరికైనా ప్రయోజనం కలుగుతుందని భావించి ఒంటికి నిప్పంటించుకున్నానని చెబుతున్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్రతిరోజూ తెల్లకాగితాలపై నినాదాలు రాసే అలవాటు దుర్గాప్రసాద్‌కు ఉంది. అదే క్రమంలో ఆత్మహత్యాయత్నానికి ముందు కూడా నినాదాలను కాగితాలపై రాశారు. జగన్ వల్లే హోదా సాధ్యం:రాష్ట్రానికి ప్రత్యేకహోదా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమని దుర్గాప్రసాద్ అన్నారు. తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను చూడాలని ఉందని, ఆయన ద్వారానే తనకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. తనకు బతకాలని ఉందని. ప్రత్యేకహోదా కోసం ఉద్యమించాలని ఉందని కన్నీళ్లపర్యంతమయ్యారు. మెరుగైన చికిత్స కోసం.. గుంటూరు ఆస్పత్రికి పంపిన వైసీపీ నేతలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్‌తో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉంగుటూరు పార్టీ ఇన్చార్జ్ పుప్పాల వాసుబాబు మాట్లాడారు. గుంటూరు జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందుతుందని డాక్టర్ మోహన్ చెప్పడంతో వైసీపీ నేతలు దగ్గరుండి పంపించే ఏర్పాట్లు చేశారు. కాగా, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఫోన్లో దుర్గాప్రసాద్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున రూ.25 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అసెంబ్లీలో చర్చిస్తా... ధైర్యంగా ఉండండి ఫోన్లో జగన్ పరామర్శ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుందరపు ప్రసాద్‌ను రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రసాద్‌కు పార్టీ అండగా ఉంటుందనీ, ప్రత్యేకహోదాపై అందరూ కలిసి పోరాడాలే తప్ప ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని వైఎస్ జగన్ సూచించారు. ప్రత్యేకహోదా విషయమై అసెంబ్లీలో లేవనెత్తుతానని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని దుర్గాప్రసాద్‌కు భరోసా ఇచ్చారు. -
'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చేబ్రోలు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం సుందరపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశాడు. స్థానికులు మంటలను ఆర్పి అతడ్ని చికిత్స కోసం తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్ధాపంతో ఆత్మహత్మకు పాల్పడినట్టు దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
బరితెగింపు!
♦ అత్యాచారం నిందితుల ఆగడాలు ♦ పోలీసుల పేరిట బెదిరింపులు విజయవాడ సిటీ : ముక్కు పచ్చలారని పదిహేనేళ్ల బాలికను గదిలో నిర్భంధించి సామూహిక అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన ఆమెను కర్రలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. మద్యం మత్తులో ఆమెకు మత్తు మందిచ్చి తమ కామవాంఛను తీర్చుకున్నారు. ఆపై అపస్మారక స్థితిలోని బాలికను ఇంటి వద్ద దించేసి వెళ్లారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి తాము పోలీసుల మంటూ బెదిరింపులకు దిగారు. తప్పు చేశామనే పశ్చాత్తాపం లేకుండా నేరుగా ఆమెను ఇంటి వద్దనే వదిలేసి వెళ్లిన వారి బరితెగింపును చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నక్కలపాలెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పృధ్వీ, జాన్, వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ గుణదల బెత్లెహేంనగర్లో గదులు అద్దెకు తీసుకొని ఉంటూ ప్రసాదంపాడులోని చాక్లెట్ల తయారీ కంపెనీలో పని చేస్తుంటారు. సెలవు రోజులు, ఆదివారాల్లో గుణదల మేరీమాత ఆలయం సమీపంలో ఆవారాగా తిరుగుతూ మహిళలు, బాలికలను వేధింపులకు గురి చేస్తుంటారు. కొందరిని మాయ మాటలతో మభ్యపెట్టి వలలో వేసుకొని కామవాంఛను తీర్చుకుంటున్నట్టు స్థానికుల సమాచారం. ఇదీ జరిగింది మాచవరం కార్మికపురానికి చెందిన పదిహేనేళ్ల బాలిక చర్చికి రాకపోకలు సాగించే సమయంలో వీరిలో ఓ యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు. ఐదో తరగతి వరకు చదివిన బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి ఆమెను ఇంటి వద్దనే ఉంచుతోంది. తల్లి ఇళ్లలో దుస్తులు ఉతుకుతుండగా, ఆమె సోదరులు రోజువారీ పనులకు వెళుతుంటారు. ఈ నెల 14న తల్లి పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆమె గుణదలలోని చర్చికి వెళ్లింది. ఇదే సమయంలో నిందితుల్లో ఒకరైన దుర్గాప్రసాద్ ఆమెను తన రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ సాయంత్రం వరకు ఉంచి తిరిగి ఇంటికి పంపేశాడు. మరుసటి రోజు అతను చెప్పినట్టుగా వచ్చిన ఆమెను ముందస్తు పథకంలో భాగంగా స్నేహితులతో కలిసి జక్కంపూడిలోని జెఎన్‌యూఆర్‌ఎం గృహాలకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీ ప్లాట్లలో ఆమెపై అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన బాలికను కర్రలతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఆపై ఆమెను రూమ్‌కి తీసుకొచ్చి మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు. మూడు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడి చేశారు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను శుక్రవారం మోటారు సైకిల్‌పై తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. ఇది గమనించిన స్థానికులు వారిని నిలదీయగా తాము పోలీసులమని చెప్పారు. పైగా ఫోన్ చేసి ‘మా ఎస్ఐ గారు’ అంటూ మరో యువకుడితో మాట్లాడించారు. తనకు తాను ఎస్ఐగా చెప్పుకున్న ఆ యువకుడు ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్నానని చెప్పాడు. బాలికకు ఏమైందంటే తెలియదని ఆగ్రహించాడు. విషయం తెలిసి పని నుంచి వచ్చిన ఆమె తల్లి కుమార్తెకు సపర్యలు చేయగా స్పృహలోకి వచ్చి జరిగిన విషయం చెప్పింది. ఆపై వారి రూమ్ చూపించగా ఇరుగు పొరుగు, బంధువులు నిందితుల్లో ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులతో దోస్తీ పనికి వెళ్లి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకు వీరు రోడ్లపైనే ఉంటారని స్థానికులు తెలిపారు. ఈ సమయంలో గస్తీ తిరిగే పోలీసులతో వీరు మాట్లాడుతుంటారని తెలిసింది. ఆదివారం, ఇతర రద్దీ సమయాల్లో గుడి వద్దకు వచ్చే పోలీసులతో మాటలు కలిపి గడుపుతుంటారు. పోలీసులతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నేరం చేసిన తర్వాత స్థానికులను పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడినట్టు చెపుతున్నారు. పోలీసు తరహా విచారణతో వీరి గత దురాగతాలను వెలుగులోకి తీయాలనేది స్థానికులు కోరుతున్నారు. అమాయకత్వం కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా లేని ఆ మహిళ ఊళ్లలోని బంధువుల ఇళ్లకు వెళ్లి వెదికింది. అప్పటికీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరవుతూ తెలిసిన వాళ్లద్వారా వాకబ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కుమార్తె సామూహిక అత్యాచారానికి గురికావడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. -
జీతం సరిపోవటం లేదంటూ హోంగార్డు ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి(రాజమండ్రి): జీతం సరిపోవటం లేదంటూ దుర్గా ప్రసాద్ అనే హోంగార్డు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. సూసైడ్ నోట్ రాసి మహిళలు నెత్తికి రాసుకొనే వ్యాజ్‌మోలా తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు, గోదావరి పుష్కరాలకు డ్యూటీ వేశారు కానీ తగిన ప్రయాణభత్యము చెల్లించటం లేదు. రెండు పూటలా తినక అయిదు రోజులయ్యింది అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. దుర్గా ప్రసాద్ ఇదేవిధంగా గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. -
తెలుగు కళాకారులకు అవార్డులు
రాధేశ్యామ్, దుర్గాప్రసాద్‌లకు ‘సంగీత నాటక’ పురస్కారాలు న్యూఢిల్లీ/కూచిపూడి/విజయనగరం టౌన్: సంగీత నాటక అకాడమీ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఇద్దరు తెలుగు వారు ఎంపికయ్యారు. 2014 ఏడాదికి సంబంధించి సంగీతం, నాట్యం, నాటకం తదితర రంగాల్లో మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్యకళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాద్ రావు ఉన్నారు. వీరిని కూచిపూడి, వయొలిన్ విభాగాల్లో ఎంపిక చేశారు. విజేతల వివరాలను శుక్రవారం ఢిల్లీలో అకాడమీ కార్యదర్శి హెలెన్ ఆచార్య వెల్లడించారు. విజేతలకు రూ. లక్ష చొప్పున నగదు, తామ్రపత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. అయితే, అవార్డు ప్రదాన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కాగా, అకాడమీ ఫెలోషిప్‌లకు 40 మంది కళాకారులను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ కళాప్రతిభ... రాధేశ్యామ్‌కు సంగీత నాటక అవార్డు ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఏపీలోని కృష్ణాజిల్లా కూచిపూడి వాసులు సంబరాలు చేసుకున్నారు. రాధేశ్యామ్.. సత్యనారాయణ, సత్యవతమ్మలకు 1954లో జన్మించారు. ఐదో ఏట నుంచే అన్నగారైన సీతారామశాస్త్రి, పినతండ్రి పార్వతీశం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. సత్యభామగా, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో మైసూర్‌లోని అవధూత దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమితులయ్యారు. కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు. దుర్గాప్రసాద్ ప్రస్థానం... ద్వారం దుర్గాప్రసాద్ రావు కుటుంబమంతా సంగీతానికే అంకితమైంది. తండ్రి నరసింగరావు సంగీత కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు. ఆకాశవాణి నిర్వహించిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో దుర్గాప్రసాద్ చిన్నతనంలోనే విజేతగా నిలిచి నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా అవార్డు అందుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో అధ్యక్షులుగా పనిచేసి పదవీ విర మణ చేశారు. -
ఈ పోలీస్ చాలా మెంటల్!
అతను ఓ మంచి పోలీస్. అన్యాయాలను, అక్రమాలను సహించలేడు. వాటిపై తిరగబడతాడు. అతని నిజాయతీని ‘మెంటల్’ అని కొందరు అంటారు. ఈ పోలీస్ చుట్టూ తిరిగే కథతో సాగే చిత్రం ‘మెంటల్ పోలీస్’. అనగాని ఫిలిమ్స్, సుబ్రమణ్యేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏవీవీ దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం పి. బాబ్జీ నిర్మాత. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ కథకు టైటిల్ బాగా యాప్ట్ అయింది. ‘ఆపరేషన్ దుర్యోధన’ కన్నా ఈ చిత్రంలో నాది మంచి పాత్ర’’ అని చెప్పారు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందనీ, అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనీ దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుతున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. సత్యనారాయణ. -
తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య
నల్లజర్ల రూరల్, తిరుపతి క్రైం: పెళ్లైన యువకుడు, పెళ్లికాని యువతి మధ్య ప్రేమ వారి ప్రాణాలు బలిగొన్న ఘటన గురువారం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంకు చెందిన తురాయి దుర్గాప్రసాద్ (25) అలియాస్ పండుకు పెళ్లయింది. పెళ్లికి ముందు నుంచే నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ఏలూరి దేవిశ్రీ (17)తో ప్రేమ వ్యవహారం సాగుతోంది. దుర్గారావుకు ఇష్టం లేకుండా అతని తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం గోపాలపురానికి చెందిన శిరీష అనే అమ్మాయితో వివాహం చేశారు. ఇది నచ్చని దుర్గారావు తన ప్రియురాలితో నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పరారయ్యాడు. వారు తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి సమీపంలోనున్న ఓ లాడ్జిలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. లాడ్జిలో ఇద్దరు మృతి చెందారని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరిశీలించగా ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్‌ఫోన ్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా అతని పేరు దుర్గారావు, ఆమె పేరు దేవిశ్రీ అని తెలిసింది. దేవీశ్రీ కనిపిం చలేదని నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఈనెల 11న ఫిర్యాదు చేశారు. యువతి రెండు చేతులు కోసుకుని రక్తపు మడుగులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. యువకుడు కూడా రెండు చేతులు కోసుకుని బాత్రూమ్లో వున్న షవర్‌కు ఉరివేసుకుని మృతి చెం దాడు. ఘటనా స్థలంలో పండూ ఐ లవ్యూ.. పండూ ఐలవ్యూ అని రాసి ఉన్న నోట్‌బుక్ దొరికింది. అనంతపల్లికి చెందిన బ్యాండ్ మాస్టర్ ఏలూరు శ్రీను కుమార్తె దేవిశ్రీ (17) ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. శ్రీను బ్యాండులో దుర్గాప్రసాద్ నాలుగేళ్లుగా కీబోర్డు వాయి స్తున్నాడు. శ్రీను కుమార్తె దేవిశ్రీ పాటలు పాడుతూ ఉండేది నల్లజర్ల ఎస్.ఆర్.కె. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవిశ్రీ మంగళవారం చదువుకోవడానికి తన అమ్మమ్మ గుంటుపల్లి అప్పలమ్మ ఇంటికి వెళ్లింది. బుధవారం తల్లి తండ్రులు ఫోన్ చేస్తే వారు రాలేదని చెప్పారు. దీంతో తండ్రి ఏలూరు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏం జరిగింది?
అదొక అందమైన స్వర్ణ మహల్. అందులో ఏం జరిగింది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో సౌమిత్రి (దుర్గాప్రసాద్ .వై) రూపొందించిన చిత్రం ‘స్వర్ణ మహల్’. ఉమ సమర్పణలో మనోజ్, అలీషా జంటగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ, ‘‘ఇదొక హారర్ ఎంటర్టైనర్. ఇందులోని సస్పెన్స్ థ్రిల్‌కు గురి చేస్తుంది. 40 నిమిషాల గ్రాఫిక్స్ చిత్రానికి ప్రధానాకర్షణ. పూర్తిగా విజయవాడలోనే చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. -
కారు కొనుక్కొనేందుకు ప్లాన్ వేసి...
హైదరాబాద్ : ఎలాగైనా కారులో తిరగాలనే కోరిక ఓ యువకుడిని కటకటాలపాలు చేసింది. కారు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు కోసం తన తల్లి పనిచేస్తున్న ఇంట్లోనే ఆ యువకుడు చోరికి యత్నించి దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్ఐసీ కాలనీలో నివసించే సినీ డిస్ట్రిబ్యూటర్, బిల్డర్ సుధాకర్ ఇంట్లో పద్మ అనే మహిళ గత నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5.30కి పద్మ పని ముగించుకొని ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికే పద్మ కొడుకు దుర్గా ప్రసాద్ (20) ఆ ఇంట్లోకి ప్రవేశించి యజమానురాలిపై కత్తితో దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ సందర్భంగా యజమానురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులు విని అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు వెంటనే వచ్చి దుర్గాప్రసాద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. యజమానురాలిని కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న సొత్తు కాజేయాలని పథకం వేసుకొని అక్కడకి వచ్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. -
అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా
మోరంపూడి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు జగన్ భరోసా ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ కన్నీరుమున్నీరైన బాధితులు.. తమ ఆవేదనను జగన్‌తో పంచుకున్న ఆయా కుటుంబాలవారు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘అధైర్యపడొద్దు.. నేను అండగా ఉంటాను.. ఏ అవసరమొచ్చినా మీకు అందుబాటులో ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇనపకోళ్ల దుర్గాప్రసాద్, శివనేని మహాలక్ష్మి, ర్యాలి వెంకన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనను తెలుసుకుని చలించిపోయిన జగన్ ఆ కుటుంబాల వారిని పరామర్శించేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ రాజమండ్రి, కరప మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మోరంపూడి రోడ్డు ప్రమాదంలో ఏడోతరగతి చదువుతున్న దుర్గాప్రసాద్ మృతిచెందగా, బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించారు. తామంతా అండగా ఉన్నామంటూ భరోసానిచ్చారు. వైద్యులనడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విజయలక్ష్మి చేయి, తల, కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుసుకుని చలించిపోయారు. జగన్‌ను చూడగానే విజయలక్ష్మికి దుఃఖం కట్టలుతెగింది. ఆమెను అనునయిస్తూ ‘మీకు వెన్నంటి ఉంటామమ్మా’ అని జగన్ ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి త్వరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స విషయంలో ఎలాంటి లోపం రాకుండా చూడాలని వైద్యులను కోరారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక దెబ్బతిన్న విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావును మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలపగా.. అక్కడ ఏ ఆసుపత్రిలో చేర్పించేది తనకు సమాచారమందిస్తే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యమందేలా చూస్తానని జగన్ చెప్పారు. వెంకన్న కుటుంబానికి పరామర్శ.. అనంతరం రాజమండ్రి గోరక్షణపేటలో ర్యాలి వెంకన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వెంకన్న తల్లి నాగరత్నం, భార్య వరలక్ష్మి, కుమారుడు మహేష్, కుమార్తె హేమలత తదితర కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించగా వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. వడ్రంగం పనిచేసే వెంకన్న ఆరోగ్యం సహకరించక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని, వెంకన్న మృతితో ఆధారం కోల్పోయామంటూ వారు బావురుమన్నారు. అద్దె ఇంటిలో ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. వెంకన్న పాతచిత్రాలు చూసి జగన్ కళ్లు చెమర్చాయి. ‘‘మీరు అధైర్యపడకండి, మా నాయకులు జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు మీకు అండగా నిలుస్తా’’రని జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని అంటూ.. సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం వచ్చే ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేస్తా.. తర్వాత జగన్ కరప మండలం కూరాడ వెళ్లి శివనేని మహాలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మహాలక్ష్మి కుమారులు సత్యనారాయణ, నారాయణరావుతోపాటు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. మృతురాలి మనవరాలు శిరీష మాట్లాడుతూ.. మోరంపూడి జంక్షనంటే భయమేస్తోందని, తమ కుటుంబసభ్యులు ఇద్దరు అక్కడే ప్రమాదంలో మృతి చెందారంటూ కన్నీరుమున్నీరైంది. తమ పరిస్థితి మరొకరికి రాకుండా చూడాలని కుటుంబ సభ్యులన్నారు. జగన్ స్పందిస్తూ ఆ జంక్షన్ వద్ద జరిగే ప్రమాదాలను ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయమందేలా అన్నిరకాలుగా ప్రయత్నిస్తానన్నారు. పార్టీ నేతలకు పరామర్శ.. ఇదిలా ఉండగా వేమగిరిలో మాతృవియోగంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు రావిపాటి రామచంద్రరావు, వేంకటేశ్వరరావుల కుటుంబాన్ని ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. వారి తల్లి గంగాభవాని చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె తనను ఆత్మీయంగా పలకరించారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు భార్య వెంకటలక్ష్మిలను కూడా వైఎస్సార్సీపీ అధినేత పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహవేడుకలకు హాజరైన జగన్.. వధూవరులు అంజని, హర్షవర్ధన్‌రెడ్డిలను ఆశీర్వదించారు. నగరంలోని ఒక ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన పెద్దాపురం పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు రెండో కుమారుడిని జగన్ ఆశీర్వదించారు. అనంతరం రాజమండ్రి చేరుకుని ఆర్అండ్బి అతిథిగృహంలో రాత్రి బస చేశారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, ప్రసాదరాజు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ నాయకులు పినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి తదితరులున్నారు. వైభవంగా ద్వారంపూడి కుమార్తె వివాహ రిసెప్షన్ కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె అంజని, హర్షవర్ధన్‌రెడ్డిల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భాస్కరపద్మ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు, అనధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సాక్షి డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు విచ్చేశారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వ విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేడుకకు హాజరయ్యారు. -
'మోరంపూడి' బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
ఖమ్మం నగర శివారులో భారీ చోరీ
ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని పోలేపల్లి గ్రామ పరిధి కరుణగిరి సమీపంలోని రెండు అపార్ట్మెంట్లలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సాయి రాఘవ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు చావా దుర్గాప్రసాద్-ప్రభావతి, ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న సాయిరాం టవర్స్‌లో విశ్రాంత సర్వేయర్ మర్ల వెంకటరమణ దంపతులు నివాసముంటున్నారు. దుర్గాప్రసాద్-ప్రభావతి దంపతులు తమ ప్లాట్‌కు తాళం వేసి ఈ నెల 26న హైదరాబాద్ వెళ్లారు. మర్ల వెంకటరమణ దంపతులు కూడా తాళం వేసి ఈ నెల 30న బంధువుల ఊరు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ రెండు ప్లాట్ల తాళాలను పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. దుర్గాప్రసాద్ ప్లాట్లోని బీరువాను ఇనుప చువ్వలతో తెరిచి, అందులో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. వెంకటరమణ ప్లాట్ బీరువాను కూడా ఇలాగే తెరిచి 20 తులాల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఈ రెండు ప్లాట్లలో చోరీ సొత్తు విలువ రూ. 20 లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. -
సీఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీగా దుర్గా ప్రసాద్
న్యూఢిల్లీ: గ త నవంబర్‌లో ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చీఫ్ పదవి నుంచి ఆకస్మికంగా తప్పించిన కోడె దుర్గా ప్రసాద్‌ను సీఆర్పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
కాస్ట్ అకౌంటింగ్తో మేకిన్ ఇండియాకు జోష్
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐసీఏఐ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించినప్పుడే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలం. అనవసర వ్యయాలను తగ్గించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంతో చైనాతో పోటీ పడాలంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ్సను అమలు చేయాలంటున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రెసిడెంట్ ఎ.ఎస్. దుర్గా ప్రసాద్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... కొత్త కంపెనీల చట్టంలో కాస్ట్ అకౌంటెంట్స్ పాత్రపై.. . కొంతకాలంగా కాస్ట్ అకౌంటింగ్‌పై ఉన్న అనిశ్చితికి తెరపడింది. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన ఇండియా కాస్ట్ అకౌంటింగ్ విధానానికి కొత్త కంపెనీల చట్టం 2013లో ప్రాధాన్యత తగ్గించిన మాట వాస్తవమే. మొన్నటి చట్ట సవరణ తర్వాత తిరిగి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. కొత్తగా కాస్ట్ అకౌంటింగ్ పరిధిలోకి హాస్పిటల్స్, విద్యా సంస్థలను తీసుకొచ్చినా ఆటోమొబైల్, ఆహార తయారీ, విత్తన తయారీ వంటి కొన్ని కీలక రంగాలను తప్పించారు. చట్ట సవరణలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి? కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాల్సిన రంగాలను రెగ్యులేటెడ్, నాన్ రెగ్యులేటెడ్గా విభజించారు. రెగ్యులేటెడ్ విభాగంలోకి వచ్చే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, విద్యుత్ పంపిణీ సంస్థలు, పెట్రోలియం, ఔషధాలు, ఫార్మా, ఇండస్ట్రీ ఆల్కహాల్ కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 50 కోట్లు దాటితే, అదే నాన్ రెగ్యులేటెడ్ కంపెనీలు అయితే రూ. 100 కోట్ల టర్నోవర్ దాటితే విధిగా కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాలి. ఇది కాకుండా రూ. 35 కోట్ల టర్నోవర్ దాటిన ప్రతీ సంస్థ విధిగా కాస్ట్ అకౌంటింగ్ బుక్స్‌ను నిర్వహిస్తే సరిపోతుంది. కానీ ట్రస్టుల ద్వారా నిర్వహించే హాస్పిటల్స్, విద్యా సంస్థలను మాత్రమే కాస్టింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల నుంచే ఆదాయంలో 70 శాతం ఆర్జించే ఫార్మా కంపెనీలను కాస్టింగ్ నుంచి తప్పించారు. అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించాలంటే వ్యయ నియంత్రణ చాలా కీలకం. కాస్టింగ్‌లోకి విద్య, వైద్య రంగాలను పూర్తిగా తీసుకురావాలనే అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నాం. ధరల విషయంలో అంతర్జాతీయ కంపెనీలతో పోటీ..! కాస్ట్ కాంపిటీటివ్‌నెస్‌లో ఇండియా చాలా వెనుకబడి ఉంది. మొదటి 60 దేశాలను తీసుకుంటే మనం ఎక్కడో 48 స్థానంలో ఉన్నాం. అనవసర వ్యయాలను తగ్గించుకొని అతి తక్కువ ధరలకే వస్తువులను అందించగలిగినప్పుడే విదేశాలతో మనం పోటీ పడగలం. ఈ దిశలో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమలును తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రానున్న కాలంలో ఐసీఏఐ కార్యకలాపాలు... తొలిసారిగా కీలకమైన వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని విభాగాలను ఈ పరిధిలోకి తీసుకురావడంతో అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించే విధంగా వీటికి సంబంధించిన మాన్యువల్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాం. ఇన్ఫ్రా రంగంలో కీలకమైన పీపీపీ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ రంగాలపై శ్వేతపత్రాలను తయారు చేస్తున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. ఇందుకోసం అసోచామ్‌తో కలిసి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వర్చువల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వ్యయ నియంత్రణతో పాటు, ట్యాక్సేషన్, ఇతర సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నాం. కొత్త నిబంధనలపై మా సభ్యులకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా సుమారు 50-60 శిక్షణా తరగతులను నిర్వహించనున్నాం. వ్యవసాయం, ఫార్మాలపై జాతీయ సదస్సులను నిర్వహించనున్నాం. కాస్ట్ అకౌంటెంట్స్‌కు డిమాండ్ ఏవిధంగా ఉంది? గత రెండు ఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. అలాగే ప్రాంగణ నియామకాల్లో సగటును రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 9.5 లక్షలు జీతాలు లభించాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఐటీ కంపెనీలతో పాటు ఆస్ట్రేలి యా, అమెరికా, కెనడాల వంటి పలు దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గతంలో ఐసీడబ్ల్యూఏఐగా ఉన్న పేరును మార్చడంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కదా? రెండు సంస్థల పేర్లు ఒకే విధంగా ఉండటంపై కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. తొలుత ఐసీఏఎంఐగా మార్చడాన్ని చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. అటుతర్వాత మా సంస్థ పేరును ఐసీఏఐగా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది మరింత గందరగోళానికి దారితీయడంతో మేనేజ్మెంట్ అకౌంటెంట్స్‌గా మార్చుకోవడానికి ఈసారి చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అడ్డుచెప్పకపోవచ్చని భావిస్తున్నాం. ఇప్పటికే మా సభ్యులను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ)గా వ్యవహరిస్తున్నాం. దీంతో మా సంస్థ పేరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఎంఐ)గా మారడానికి ఇబ్బందులు ఉండకూదని అంచనా వేస్తున్నాం. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రామచంద్రాపురం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో బాల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు ఎక్కడ కనిి పంచినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలన్నారు. లేనిపక్షంలో స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా చాలన్నారు. పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయవచ్చన్నారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటే వారికి జరిమానాతో పాటు శిక్ష కూడా విధించవచ్చన్నారు. బాల నేరస్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుక వచ్చినపుడు వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారిని పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్సులో సున్నితంగా విచారించాలన్నారు. అనంతరం వారిని జువనైల్ కోర్టుకు పంపిస్తామన్నారు. వారి పక్షాన వాదించేందుకు ఉచితంగా న్యాయవాది ఉంటారన్నారు. నేరం రుజువైతే జువనైల్ హోంకి తరలిస్తామన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు జిల్లాలో ఐదుగురు ప్రతి నిధులను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఎస్సీ ఎస్. సురేందర్‌రెడ్డి, సీఐ నరేందర్, ఎస్ఐ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దు జిన్నారం : బాలలను నేరస్తులుగా చూడకుండా, వారికి తగిన కౌన్సెలింగ్ఇచ్చి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండే విధంగా చూడాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసులకు సూచించారు. జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్‌లోనూతనంగా ఏర్పాటు చేసిన బాలల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొల్లారం పీఎస్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. బాలలతో పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులు ఎలాంటితప్పు చేసినా వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా రిసెప్షన్ వద్దే కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. బాలలను నే రస్తులుగా చూడొద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా 1098కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం సీఐ నరేందర్, ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్నేహితుడి కోసం వెళ్తూ మృత్యు ఒడికి..
ముక్కామల(అంబాజీపేట) :స్నేహితుల దినోత్సం సందర్భంగా స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్తున్న ఓ యువకుడిని మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పి.గన్నవరం మండలం కుందాలపల్లి (అవిడి డాం)కు చెందిన మట్టపర్తి దుర్గాప్రసాద్ (26) ఆదివారం తెల్లవారుజామున గంటిపెదపూడిలోని తన అత్తగారింటి నుంచి పల్సర్ మోటారు బైక్‌పై అయినవిల్లి మండలం మూలపాలెంలో ఉన్న తన స్నేహితుడు శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతున్నారు. అంబాజీపేట మండలం ముక్కామల పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ తలకు బలమైన గాయమైందని, అందువల్లే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. దుర్గాప్రసాద్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. భార్య, ఆరు నెలల బాబు ఉన్నారు. విజయవాడలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి గంటిపెదపూడిలోని తన అత్తగారింటికి వచ్చాడు. దుర్గాప్రసాద్ అత్త కాండ్రేగుల రామలక్ష్మి బోరున విలపిస్తూ తన కుమార్తె జీవితం తెల్లారిపోయిందని.. ఆమెకు ఎవరు దిక్కని.... ఆరు నెలల పిల్లవాడు తండ్రిలేని అనాథైపోయాడని రోధించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు. -
మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ హల్చల్
-
మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ హల్చల్
బెంగళూరు : కర్ణాటకలోని గౌరిబిందనూరు సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ గురువారం హల్చల్ చేశాడు. తీవ్ర నేరారోపణలు ఉన్న దోపిడీ దొంగ దుర్గాప్రసాద్ ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారిపై కాల్పులు జరిపాడు. ఓ ఫాంహౌస్‌లో దుర్గా ప్రసాద్ ముఠా దోపిడీకి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, దోపిడీ దొంగల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. దుర్గాప్రసాద్ పరారీ కాగా, ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఓ నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమికురాలి ప్రాణం తీసిన 'సంప్రదాయం'
బెంగళూరు : వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అయితే ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం విషయంలో ఎంతకూ ఇరు కుటుంబ సభ్యులు రాజీకాలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వర్తూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన నిమిషా (28) స్థానిక కుందనహళ్లిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ మారతహళ్లి సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వివాహానికి ఇరు కుటుం బాల పెద్దలూ అంగీకరించారు. అయితే పెళ్లి తెలుగు సంప్రదాయంలో చేయాలని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు.. కాదు, కాదు బీహార్ సంప్రదాయంలోనే జరగాలని నిమిషా కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల వారు పట్టువీడకపోవడంతో సమస్య జఠిలమైంది. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిమిషా జీవితంపై విరక్తి చెందింది. బుధవారం రాత్రి తన చిన్నాన్న రంజిత్‌కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. సుమారు 15 నిమిషాల పాటు తన గోడును వెళ్లబోసుకుంది. కొద్దిసేపు తర్వాత రంజిత్‌కు అనుమానం వచ్చి నిమిషాకు ఫోన్ చేశాడు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించాడు. గురువారం మళ్లీ నిమిషాకు రంజిత్ ఫోన్ చేశాడు. అప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను నిమిషా ఉంటున్న హాస్టల్‌కు రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కడప రూరల్/అర్బన్, న్యూస్‌లైన్ : ‘‘రేయ్....నువ్వెంత అంటే నువ్వెంత...ఒకరిపై మరొకరు చెప్పుల దాడి....తర్వాత పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషణలు... చివరకు గదిలో నిర్బంధించడం, ఒకరినొకరు తన్నుకోవడం ..ఇవన్నీ ఏ మందుబాబులో, వీధి రౌడీలో చేశారనుకుంటే పొరపాటే. కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాలకృష్ణయాదవ్, ఎమ్మెల్యే బరిలో ఉన్న దుర్గాప్రసాద్‌తోపాటు టీడీపీలో కీలక నేతగా ఉన్న శశికుమార్ మధ్య జరిగిన తగువులాట. బుధవారం అమీన్‌పీర్ దర్గా వద్దగల అమీన్ ఫంక్షన్ హాలు ఎదురుగా టీడీపీ నేతలు భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని ముఖ్య నేతలతోపాటు కార్యకర్తలను ఆహ్వానించారు. అయితే స్థానిక నాయకుడైన శశికుమార్‌ను విస్మరించారు. దీంతో చిర్రెత్తిన శశికుమార్ అక్కడికి వెళ్లి టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘నా ఏరియాలో సమావేశం ఏర్పాటు చేసి నన్నే పిలవరా పార్టీ మీ సొత్తా’ అని తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో బాలకృష్ణయాదవ్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో శశికుమార్, బాలకృష్ణయాదవ్ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరి దూషించుకునే వరకు వెళ్లింది. అంతటితో ఆగక పరస్పరం చెప్పుల దాడి చేసుకున్నారు. తుపాకులు తీసేంతవరకూ వెళ్లిన తగువు బాలకృష్ణయాదవ్, శశికుమార్ చెప్పులతో కొట్టుకున్నప్పుడు స్థానికులు విడిపించే ప్రయత్నం చేశారు. శశికుమార్వర్గీయులు బాలకృష్ణయాదవ్ను ఒక గదిలో నిర్బంధించారు. ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. శశికుమార్, బాలకృష్ణయాదవ్లను ఒకే గదిలో ఉంచి చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో కూడా పరిస్థితి చేయిదాటి ఒకరినొకరు దూషించుకోవడంతోపాటు ఇద్దరూ తుపాకులు తీశారు. దీంతో బెంబేలెత్తిన టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయాలేదని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసశర్మ తెలిపారు. -
హవ్వ.. నవ్విపోదురుగాక..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుంటుందంట.. అచ్చం అలానే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. టీడీపీ సభ్యత్వమే లేని వ్యక్తికి అసెంబ్లీ టికెట్ కట్టబెట్టడం ఒక ఎత్తయితే.. పార్టీ నిర్ణయాన్ని అతిక్రమించారంటూ ఆపై సస్పెండ్ చేయడం మరో ఎత్తు. వెరసి సరికొత్త కపటనాటకాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చింది. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ వ్యవహారం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కడప నగరంలో పారిశ్రామికవేత్తగా దుర్గా మల్లికార్జున రావుకు పేరుంది. రాజకీయాలకు అతీతంగా, వివాదస్పద కార్యక్రమాలకు దూరంగా మెలిగేవారు. అయితే అనూహ్యంగా ఈమారు ఎన్నికల్లో కడప తెరపైకి వచ్చారు. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ తెరవెనుక హామీలు, ప్రోత్సాహాలేనని పలువురు పేర్కొంటున్నారు. దుర్గా ప్రసాద్ పేరు ఇప్పటి వరకూ అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. సన్ఆఫ్ దుర్గా మల్లికార్జునరావు అని చెబితే తప్పా జనానికి తెలియని వ్యక్తి. ఏనాడూ రాజకీయ కార్యక్రమాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఏరాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. అలాంటి వ్యక్తి ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్తోపాటే టీడీపీ బీఫారాన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. తెరపైకి వచ్చిన సరికొత్త నాటకం... తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా సీమాంధ్రలో 13 అసెంబ్లీ, 4పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. ఆమేరకు కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. కడప బీజేపీ అభ్యర్థి అల్లపురెడ్డి హరినాథరెడ్డి బలహీనుడంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దుర్గా ప్రసాద్చే నామినేషన్ దాఖలు చే యించారు. అప్పటి వరకూ రాజకీయాల వాసనే పట్టని దుర్గా ప్రసాద్ ఒక్కమారుగా అభ్యర్థిగా తెరపైకి రావడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సహమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు ఉన్న చోట పోటీ చేయించడం అన్యాయమని వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బీజేపీ అగ్రనేతల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అల్లపురెడ్డి హరినాథరెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఏమాత్రం స్పందించని చంద్రబాబు ప్రస్తుతం సరికొత్తగా బీజేపీకి కేటాయించిన సీట్లలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం సస్పెన్షన్ నాటకాన్ని రక్తికట్టిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులోనూ కరువైన చిత్తశుద్ధి.... బీజేపీ, టీడీపీ పొత్తులో సైతం చంద్రబాబు తన సహజ దోరణి వీడలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి కేటాయించిన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పార్టీలో ఉన్న నాయకుడు పోటీ చేసి ఉంటే అదోరకంగా భావించే అవకాశం ఉంది. ఇంతకాలం కష్టపడ్డ మమ్మల్ని విస్మరిస్తారా.. అన్న ప్రశ్న తలెత్తడంతో టీడీపీ నేతలు పోటీ చేశారనే భావన రావచ్చు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న దుర్గా ప్రసాద్‌కు నామినేషన్ వేయమని ఏకంగా బీఫారం సహా చేతిలో పెట్టింది టీడీపీనే అన్న విషయం మరుగునపర్చారు. బీజేపీ అభ్యర్థించినా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించి ప్రస్తుతం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గా ప్రసాద్ సస్పెండ్ చేస్తే ఇప్పుడేమైనా టీ డీపీ అభ్యర్థి కాకుండా పోతారా.. ఎన్నికల్లో సైకిల్ గుర్తు దక్కకుండా పోతుందా..ఇవేవి కానప్పడు సరికొత్త కపటనాటకం కాక మరేమిటని భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. సీమాంధ్రలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి రానున్న నేపధ్యంలోనే ఈ నాటకానికి బీజం పడిందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతల కొత్త పల్లవికి కారణం కూడా అదేనని తెలుపుతున్నారు. సభ్యత్వం సైతం లేని వ్యక్తిచే నామినేషన్ వేయించడం, బీఫారం అందించడం, ఇప్పుడు సస్పెండ్ అనడంపై ప్రజానీకం నవ్విపోతారనే ఇంగితం సైతం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. -
దుర్గాప్రసాద్‌పై వేటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు మీద వేటు వేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రంలోగా తాను బరి నుంచి తప్పుకుని అధికారిక అభ్యర్థి జ్యోత్స్నలతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే వేటు తప్పదని పార్టీ నాయకత్వం ఆయన్ను హెచ్చరించింది. గూడూరులో బల్లి దుర్గాప్రసాదరావు ఓడిపోతారనే అంచనాతో పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిఫారసుతో కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలతను టీడీపీ రంగంలోకి దించింది. తనకు టికెట్ నిరాకరించడంతో దుర్గాప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, పార్టీ అధినేత బుజ్జగిం చినా అయితే నాకేంటి అనేలా వ్యవహరించడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారని తెలిసింది. తాను పిలిచినా డోంట్ కేర్ అనేలా వ్యవహరించడం పార్టీలో మిగిలిన వారికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయిందని ఆయన జిల్లా నాయకులతో వాపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంలోగా పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని పార్టీ హై కమాండ్ జిల్లా నాయకుల ద్వారా దుర్గాప్రసాద్‌కు అల్టిమే టం ఇచ్చినట్లు సమాచారం. గడువులోగా ఆయన సానుకూలంగా స్పందించకపోతే శనివారం అతని మీద సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, బహిష్కరించినా కూడా వెనక్కు తగ్గరాదని దుర్గాప్రసాద్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
‘బాబు చెప్పినా డోంట్‌కేర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గూడూరు శాసనసభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌రావు పోటీ నుంచి వెనకడుగు వేయలేదు. రెబల్‌గా నామినేషన్ ఉపసంహరించుకుంటే తగిన గుర్తింపు ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా బుజ్జగించినా డోంట్‌కేర్ అన్నారు. టీడీపీ నేతల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన బరిలోనే నిలిచారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ నాయకుడు విజయమోహన్‌రెడ్డి తనకు టికెట్ రాకపోవడానికి కారకులని పరోక్షంగా తూర్పారబట్టారు. గూడూరు టీడీపీ టికెట్ వ్యవహారంలో గత ఆర్నెల్లుగా అనేక ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు ఈసారి టికెట్ రాదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతూ వచ్చింది. జిల్లా పార్టీ సమీకరణల్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చంద్రబాబు ముఖ్యుడు కాంట్రాక్టర్ గంగాప్రసాద్ తనను వ్యతిరేకించినా అధినేత ఆశీస్సులు తనకే దక్కుతాయని బల్లి ధీమాగా వ్యవహరిస్తూ వచ్చారు. నాలుగు జాబితాల్లో తన పేరు కనిపించక పోయినా చివరి వరకు వేచి చూశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం పరిస్థితి కూడా ఇదేలా ఊగిసలాడింది. అయితే జిల్లాలోని రెండు ఎస్సీ నియోజక వర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలిద్దరికీ టికెట్ ఎగ్గొడితే ఆ సామాజిక వర్గంలో దెబ్బతింటామనే ఆలోచనతో చంద్రబాబు చివరకు పరసాకు ఓకే చేశారు. పార్టీ జిల్లా ముఖ్యుల ఒత్తిడితో గూడూరులో కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్న లతకు టికెట్ ఖరారు చేసి బల్లికి చెక్‌పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బల్లికి ఈ రకంగా టికెట్ నిరాకరించడం ఇది రెండో సారి. 2004 ఎన్నికల సమయంలో సిట్టింగ్ఎమ్మెల్యేగా ఉన్న దుర్గాప్రసాద్‌ను కాదని ఉక్కాల రాజేశ్వరమ్మకు టికెట్ ఇచ్చారు. తిరిగి 2009 ఎన్నికల్లో దుర్గాప్రసాద్ టికెట్ సాధించి గెలుపొందారు. పార్టీలో ఒక సామాజిక వర్గం నేతలకు తాను విధేయుడిగా లేననే కక్షతో తనను తొక్కేయాలని చంద్రబాబు వద్ద ప్రయత్నాలు చేయడాన్ని బల్లి ఈ సారి సీరియస్‌గా తీసుకున్నారు. టికెట్ ఇవ్వకపోయినా తాను బరిలో ఉంటానంటూ టీడీపీ, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. ఆయన్ను చల్లబరచడం పెద్ద సమస్య కాదనే ధీమాతో పార్టీ హై కమాండ్ వ్యవహరించింది. జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యులు మంగళవారం ఆయన్ను శాంతింపచేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మీ వల్లే తనకు టికెట్ రాలేదని దుర్గా ప్రసాద్ వారిపై మండిపడ్డారని తెలిసింది. చివరి ప్రయత్నంగా చంద్రబాబు స్వయంగా దుర్గాప్రసాద్‌కు ఫోన్ చేసి పోటీ నుంచి విరమించుకోవాలని కోరారు. మంగళవారం చిత్తూరు జిల్లా సత్యవేడు పర్యటనకు వెళ్లడానికి తడకు వస్తున్న తనను కలవాలని సూచించారు. ఈ ప్రతిపాదనను దుర్గాప్రసాద్ తిరస్కరించి చంద్రబాబుకు ముఖం చాటేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా దుర్గాప్రసాద్ తన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో టీడీపీ అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలత ఆందోళనలో పడ్డారు. దుర్గాప్రసాద్ మద్దతుదారులు మాత్రం తాము గెలవలేక పోయినా జ్యోత్స్నలతను ఓడించే శక్తి తమకుందని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిణామంతో గూడూరు టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. కొందరు దుర్గాప్రసాద్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఇంకొందరు నాయకులు పార్టీ అభ్యర్థి వెంటే ఉంటామని చెబుతున్నారు. -
టీడీపీలో రె‘బెల్స్’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో మరో అసమ్మతి రేగింది. గూడూరు స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావుకు నిరాకరించి కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నకు ఇవ్వడంపై బల్లి గుర్రుమన్నారు. ఆరునూరైనా శనివారం నామినేషన్ వేసి తీరుతానని ఆయన ప్రకటించారు. సూళ్లూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే పరసా రత్నం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఎదుర్కునే వరకు వెళ్లి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాదరావుకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం అనుమానమేనని గత ఆర్నెల్లుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇందుకు తగినట్లుగానే నాలుగు జాబితాల్లో వీరిద్దరికీ చోటు దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ గంగాప్రసాద్ సైతం ఈ ఎన్నికల్లో వీరిద్దరికీ చెక్ పెట్టాలని గట్టిగా పట్టుబట్టి కొత్త అభ్యర్థులను తెర మీదకు తెచ్చారు. తొలి జాబితా ప్రకటనలోనే సిట్టింగ్‌లైన తమకు చోటు ఉంటుందని ఇద్దరు నాయకులు ఆశించారు. అయితే నాలుగు జాబితాల్లో ఆ ఊసే కనిపించలేదు. ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాపకం సంపాదించడానికి శతవిధాల ప్రయత్నించారు. సూళ్లూరుపేట నుంచి మాజీ ఎంపీ నెలవలసుబ్రమణ్యంను బరిలోకి తేవడానికి గంగాప్రసాద్ తీవ్రంగానే ప్రయత్నించారు. ఒక దశలో టికెట్ ఆయనకే ఖరారవుతుందనే వాతావరణం కనిపించింది. అయితే పరసారత్నం అనేక రకాలుగా చంద్రబాబును ఒప్పించగలగడంతో చివరకు కాస్త అయిష్టంగానే పరసాకు ఆయన టికెట్ ఇచ్చారు. శుక్రవారం ప్రకటించిన చివరి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. ఇదే కోవలో ఎదురు చూసిన గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడి నుంచి కాంట్రాక్టర్ గంగాప్రసాద్ బలపరచిన డాక్టర్ జ్యోత్స్నకు టికెట్ దక్కింది. శుక్రవారం నాటి జాబితాలో ఈమె పేరు ప్రకటించి బీ ఫారం కూడా అందజేశారు. ఈ పరిణామం బల్లికి ఊహించిందే అయినా సాయంత్రం దాకా తేరుకోలేకపోయారు. తనకు టికెట్ ఇస్తే ఓడిపోతానని చంద్రబాబుకు కొందరు పంపిన నివేదికలే తనకీ పరిస్థితి తెచ్చాయని ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో నియోజకవర్గంలోని తన మద్దతుదారులు, ముఖ్య నేతలతో దుర్గాప్రసాద్ సమావేశమయ్యారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని ఆయన తేల్చి పారేశారు. శనివారం టీడీపీ అభ్యర్థిగానే తాను నామినేషన్ దాఖలు చేస్తాననీ, అధిష్టానం మనసు మారి టికెట్ ఇస్తే సరేననీ, లేకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని దుర్గాప్రసాద్ కుండబద్ధలు కొట్టారు. ఈ పరిణామంతో గూడూరు టీడీపీలో తీవ్ర అసంతృప్తి, అసమ్మతి సెగలు ఎగసి పడ్డాయి. దుర్గాప్రసాద్‌ను శాం తింపజేయడానికి చంద్రబాబు తన కోటరీలోని ఇద్దరు ముఖ్యులను రంగంలోకి దించారు. శనివారం నాటికి లేదా నామినేషన్ల ఉపసంహరణ సమయానికి దుర్గాప్రసాద్ బరి నుంచి తప్పుకుంటారనే ధీమా చంద్రబాబు కోటరీ వ్యక్తం చేస్తోంది. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.5 కోట్ల
నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.5 కోట్ల సీజీఎఫ్ నిధులు విడుదల చేసిందని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఒడ్డిమెట్ట వినాయక ఆలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో జిల్లాలో ఆరు దేవాలయాలను అభివృద్ధి, మరమ్మతుల కు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఆక్రమణలో ఉన్న దేవాదాయశాఖ భూముల స్వాధీనానికి చర్యలు చేపడుతున్నామని, వాటి వివరాలివ్వాలని ఈవోలకు ఆదేశాలిచ్చామన్నారు. ఏళ్ల తరబడి వసూలు కాని శిస్తు బకాయిలు, భూముల స్వాధీనంపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఖాళీ చేసి అప్పగించని పక్షంలో చట్టపరంగా రెవె న్యూ, పోలీసు శాఖల సహకారంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. చోడవ రం స్వయంభూ వినాయక ఆలయ షాపి ంగ్ కాంప్లెక్స్‌లో ఆక్రమణలు తొలగి ంచి బహిరంగ వేలం ద్వారా రూ.20 లక్షలు ఆదాయం పెరిగిందని చెప్పారు. భక్తులు ఆకట్టుకునేలా పూజలు... ఆలయాలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉంటే భక్తుల ఆదరణ, ఆదాయం పెరుగుతుందని ఏసీ అన్నారు. ఒడ్డిమెట్టలో జరిగే నవరాత్రి మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గణపతి విగ్రహం, అంతరాలయం, గర్భాలయాల కు ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించారు. నవరాత్రుల్లో రోజూ గణపతి హోమం, వారానికి రెండు రోజులు స్వామికి పాలాభిషేకం, విశేష పూజలు నిర్వహించి రోజూ ఉదయాన్నే భక్తి గీతా లు వినిపించాలని ఆదేశించారు. కాణిపా కం వినాయక ఆలయంలో మాదిరిగా పూజలు జరిపేందుకు అర్చకులు, సిబ్బం ది అక్కడకు వెళ్లి తెలుసుకోవాలని సూచిం చారు. భక్తుల కానుకలు, మొక్కుబడులను దుర్వినియోగం చే స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయంలో వాస్తు మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు. తొలుత ఆయనతో అర్చకులు ప్రత్యేక పూ జలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ దండు బలరామరాజు, ఈవో వెంకటాద్రిలు ఏసీని దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట యలమంచిలి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ట్రస్ట్ బోర్డు మెంబర్ పైల రాము పాల్గొన్నారు.