నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.5 కోట్ల సీజీఎఫ్ నిధులు విడుదల చేసిందని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఒడ్డిమెట్ట వినాయక ఆలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో జిల్లాలో ఆరు దేవాలయాలను అభివృద్ధి, మరమ్మతుల కు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
ఆక్రమణలో ఉన్న దేవాదాయశాఖ భూముల స్వాధీనానికి చర్యలు చేపడుతున్నామని, వాటి వివరాలివ్వాలని ఈవోలకు ఆదేశాలిచ్చామన్నారు. ఏళ్ల తరబడి వసూలు కాని శిస్తు బకాయిలు, భూముల స్వాధీనంపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఖాళీ చేసి అప్పగించని పక్షంలో చట్టపరంగా రెవె న్యూ, పోలీసు శాఖల సహకారంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. చోడవ రం స్వయంభూ వినాయక ఆలయ షాపి ంగ్ కాంప్లెక్స్‌లో ఆక్రమణలు తొలగి ంచి బహిరంగ వేలం ద్వారా రూ.20 లక్షలు ఆదాయం పెరిగిందని చెప్పారు.
భక్తులు ఆకట్టుకునేలా పూజలు...
ఆలయాలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉంటే భక్తుల ఆదరణ, ఆదాయం పెరుగుతుందని ఏసీ అన్నారు. ఒడ్డిమెట్టలో జరిగే నవరాత్రి మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గణపతి విగ్రహం, అంతరాలయం, గర్భాలయాల కు ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించారు. నవరాత్రుల్లో రోజూ గణపతి హోమం, వారానికి రెండు రోజులు స్వామికి పాలాభిషేకం, విశేష పూజలు నిర్వహించి రోజూ ఉదయాన్నే భక్తి గీతా లు వినిపించాలని ఆదేశించారు. కాణిపా కం వినాయక ఆలయంలో మాదిరిగా పూజలు జరిపేందుకు అర్చకులు, సిబ్బం ది అక్కడకు వెళ్లి తెలుసుకోవాలని సూచిం చారు. భక్తుల కానుకలు, మొక్కుబడులను దుర్వినియోగం చే స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆలయంలో వాస్తు మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు. తొలుత ఆయనతో అర్చకులు ప్రత్యేక పూ జలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ దండు బలరామరాజు, ఈవో వెంకటాద్రిలు ఏసీని దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట యలమంచిలి ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ట్రస్ట్ బోర్డు మెంబర్ పైల రాము పాల్గొన్నారు.