రామచంద్రాపురం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో బాల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు ఎక్కడ కనిి పంచినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలన్నారు. లేనిపక్షంలో స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా చాలన్నారు.
పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయవచ్చన్నారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటే వారికి జరిమానాతో పాటు శిక్ష కూడా విధించవచ్చన్నారు. బాల నేరస్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుక వచ్చినపుడు వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారిని పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్సులో సున్నితంగా విచారించాలన్నారు.
అనంతరం వారిని జువనైల్ కోర్టుకు పంపిస్తామన్నారు. వారి పక్షాన వాదించేందుకు ఉచితంగా న్యాయవాది ఉంటారన్నారు. నేరం రుజువైతే జువనైల్ హోంకి తరలిస్తామన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు జిల్లాలో ఐదుగురు ప్రతి నిధులను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఎస్సీ ఎస్. సురేందర్‌రెడ్డి, సీఐ నరేందర్, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలలను నేరస్తులుగా చూడొద్దు
జిన్నారం : బాలలను నేరస్తులుగా చూడకుండా, వారికి తగిన కౌన్సెలింగ్‌ఇచ్చి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండే విధంగా చూడాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసులకు సూచించారు. జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్‌లోనూతనంగా ఏర్పాటు చేసిన బాలల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొల్లారం పీఎస్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు.
బాలలతో పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులు ఎలాంటితప్పు చేసినా వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా రిసెప్షన్ వద్దే కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. బాలలను నే రస్తులుగా చూడొద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా 1098కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం సీఐ నరేందర్, ఎస్‌ఐ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
Published Sun, Nov 2 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement