
ఏం జరిగింది?
అదొక అందమైన స్వర్ణ మహల్. అందులో ఏం జరిగింది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో సౌమిత్రి (దుర్గాప్రసాద్ .వై) రూపొందించిన చిత్రం ‘స్వర్ణ మహల్’. ఉమ సమర్పణలో మనోజ్, అలీషా జంటగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ, ‘‘ఇదొక హారర్ ఎంటర్‌టైనర్. ఇందులోని సస్పెన్స్ థ్రిల్‌కు గురి చేస్తుంది. 40 నిమిషాల గ్రాఫిక్స్ చిత్రానికి ప్రధానాకర్షణ. పూర్తిగా విజయవాడలోనే చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.