నల్లజర్ల రూరల్, తిరుపతి క్రైం: పెళ్లైన యువకుడు, పెళ్లికాని యువతి మధ్య ప్రేమ వారి ప్రాణాలు బలిగొన్న ఘటన గురువారం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంకు చెందిన తురాయి దుర్గాప్రసాద్ (25) అలియాస్ పండుకు పెళ్లయింది. పెళ్లికి ముందు నుంచే నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ఏలూరి దేవిశ్రీ (17)తో ప్రేమ వ్యవహారం సాగుతోంది. దుర్గారావుకు ఇష్టం లేకుండా అతని తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం గోపాలపురానికి చెందిన శిరీష అనే అమ్మాయితో వివాహం చేశారు. ఇది నచ్చని దుర్గారావు తన ప్రియురాలితో నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పరారయ్యాడు.
వారు తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి సమీపంలోనున్న ఓ లాడ్జిలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. లాడ్జిలో ఇద్దరు మృతి చెందారని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరిశీలించగా ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్‌ఫోన ్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా అతని పేరు దుర్గారావు, ఆమె పేరు దేవిశ్రీ అని తెలిసింది. దేవీశ్రీ కనిపిం చలేదని నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఈనెల 11న ఫిర్యాదు చేశారు. యువతి రెండు చేతులు కోసుకుని రక్తపు మడుగులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. యువకుడు కూడా రెండు చేతులు కోసుకుని బాత్‌రూమ్‌లో వున్న షవర్‌కు ఉరివేసుకుని మృతి చెం దాడు.
ఘటనా స్థలంలో పండూ ఐ లవ్‌యూ.. పండూ ఐలవ్‌యూ అని రాసి ఉన్న నోట్‌బుక్ దొరికింది. అనంతపల్లికి చెందిన బ్యాండ్ మాస్టర్ ఏలూరు శ్రీను కుమార్తె దేవిశ్రీ (17) ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. శ్రీను బ్యాండులో దుర్గాప్రసాద్ నాలుగేళ్లుగా కీబోర్డు వాయి స్తున్నాడు. శ్రీను కుమార్తె దేవిశ్రీ పాటలు పాడుతూ ఉండేది నల్లజర్ల ఎస్.ఆర్.కె. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవిశ్రీ మంగళవారం చదువుకోవడానికి తన అమ్మమ్మ గుంటుపల్లి అప్పలమ్మ ఇంటికి వెళ్లింది. బుధవారం తల్లి తండ్రులు ఫోన్ చేస్తే వారు రాలేదని చెప్పారు. దీంతో తండ్రి ఏలూరు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య
Published Fri, Mar 13 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement