Love couple suicide
-
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తీవ్ర విషాదం.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వరసకు బాబాయ్! పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
కృష్ణ: వరసలు కలవకపోవడంతో తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పరిధిలోని కందానాటికి చెందిన మునికుమార్ (25), పారుపల్లికి చెందిన అనిత (16)ల కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం కుటుంబాలతో కలసి ఇటీవల కృష్ణ మండలంలోని చేగుంటలో పత్తి తీయడానికి వచ్చారు. అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మునికుమార్, అనిత ప్రేమించుకుంటున్నారు. అయితే మునికుమార్ అనితకు వరసకు బాబాయ్ అవుతాడు. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమ ఫలించదని మనస్తాపానికి గురైన వారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం రైల్వే గ్యాంగ్‌మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా..
గుంటూరు: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కాకాని కుంట వద్ద జరిగింది. అద్దంకిలోని బత్తులవారిపాలేనికి చెందిన బత్తుల పెద్దిరాజు (22) ఇంటర్మీడియట్ చదివి ఇటుక బట్టీల్లో పొట్టు లారీల పనికి వెళ్తున్నాడు. అదే పట్టణంలోని కొత్తపేటకు చెందిన పల్లపోతు ప్రశాంతి (20) ఇంటర్మీడియట్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయం వారి పెద్దలకు తెలిసి మందలించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ప్రశాంతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రశాంతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు స్టేషన్లో పెళ్లికి అంగీకరించి ఇంటికి తీసుకువెళ్లారు. కానీ పెళ్లి చేయకుండా కాలయాపన చేస్తుండటంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు, ప్రశాంతి సోమవారం అర్ధరాత్రి స్థానిక గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్దకు చేరుకుని చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని మృతిచెందారు. పెద్దిరాజు తండ్రి బత్తుల కృష్ణ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంనికి తరలించారు. ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా చెట్టుకు వేలాడదీశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ పెద్దిరాజు మృతదేహంతో కొందరు యువకులు ఆస్పత్రి నుంచి స్థానిక భవానీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబ్‌నగర్: పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమజంట పురుగు మందు తాగిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం ఎత్తంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన గోలగుంట సాయికుమార్(22) అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి తరపు కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న సాయికుమార్ ఆందోళన చెంది పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంలో రెండు కుటుంబాల వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. చదవండి: ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?
సాక్షి, చిత్తూరు(చిల్లకూరు): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట విషం తాగి తనువు చాలించిన ఘటన గురువారం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పొయ్య గిరిజన కాలనీకి చెందిన శివమణి, మారెక్క పెద్ద కుమారుడు మారప్ప(26), అదే కాలనీకి చెందిన వెంకటరమణయ్య, చెల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె వనజ (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. బాలికకు యుక్తవయసు రాలేదని, కొంత కాలం ఆగాలని పెద్దలు సూచించారు. అయితే వారి సూచనలు పట్టించుకోని ప్రేమ జంట కుటుంబ సభ్యులకు తెలియకుండా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిల్లకూరు మండలం, తమ్మినపట్నం పంచాయతీ, గుమ్మళ్లదిబ్బలో తమకు తెలిసిన భవన నిర్మాణ కార్మికుడు మేకల వెహేసువ ఇంట్లో ఉంటూ స్థానికంగా రొయ్యల గుంటల్లో పనిచేసుకుని జీవనం సాగించారు. ఏమైందో తెలియదు కానీ గ్రామానికి సమీపంలోని కాలువ దగ్గర పురుగుల మందు తాగి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రేమికులిద్దరూ బతుకుపై బెంగపెట్టుకుని చావుని ఎంచుకున్నారా..? కుటుంబ సభ్యులు ఎవరైనా బెదిరించారా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. చదవండి: (వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ముగ్గురు యువకులేనా?) -
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
విజయనగరం/సీతానగరం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్.స్రవంతి ఇంటరీ్మడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఎం.శ్రీను కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్రవంతి తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం ప్రేమికుడికి స్రవంతి చెప్పి గ్రామంలోని సచివాలయం వద్దకు రమ్మంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చనిపోదామని నిర్ణయం తీసుకుని పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం గమనించిన శ్రీను సోదరుడు గణపతి ఆటోలో ఇద్దరిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టుపోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
బెళుగుప్ప/ఉరవకొండ(అనంతపురం జిల్లా): బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయరులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన ఎజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్(19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయరులో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. చదవండి: నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్ రికార్డ్ బయట పెట్టడంతో.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇద్దరూ మైనర్లే.. పెళ్లి ఒప్పుకోలేదని పేమజంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని సొన్నాంకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె త్రిష(16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతోంది. అలాగే కీల్ ఆలత్తూరు గ్రామానికి చెందిన పుణ్యకోటి కుమారుడు యశ్వంత్(18) గుడియాత్తంలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వేకువజామున ప్రేమికులు ఇద్దరు గుడియాత్తం సమీపంలోని కావనూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి వెళ్లారు. ఆ సమయంలో చెన్నై నుంచి జోలార్‌పేట వైపు వస్తున్న ఎలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన లోకో పైలెట్ జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి ఆత్మహత్య.. నీవు లేని లోకం నాకొద్దు అంటూ ..
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండావాసుల సమాచారం మేరకు వివరాలిలా.. నవాబుపేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాకు చెందిన శాంతి(21) అదే తండా పక్కన ఉన్న కోమటికుంటతండాకు చెందిన శివ(25) ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఇదిలాఉండగా, శాంతి తన తల్లిదండ్రులతో కలిసి ఈనెల 3వ తేదీన పూణె వెళ్లింది. శివ ఇక్కడే ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే బాధతో పూణెలో ఉన్న ప్రియురాలు శాంతి 14వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో.. నీవు లేని లోకం నాకేందుకు అంటూ ప్రియుడు శివ షాద్‌నగర్ నుంచి తన తండాకు వస్తు మార్గమధ్యలో సువర్ణకూటీర్ వద్ద పురుగుమందు తాగాడు. చదవండి: ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని దారిగుండా వెళ్లేవారు చూసి షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులు నీలమ్మ, సేవ్యాలకు శివ ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అటు పూణెలో కూతురును కోల్పోయిన పూల్‌సింగ్, చంద్రమ్మల కుటుంబం రోదనలతో గిరిజన తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: చూడకూడనిది చూసిందని.. కన్నకూతురినే.. -
ప్రేమ జంటల విషాదాంతం..
పెళ్లికి పెద్దలు అంగీకరించారు.. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు.. ఏం జరిగిందో ఏమో గానీ ప్రేమికులిద్దరూ ‘చేయరాని తప్పుచేశాం, సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం’అంటూ చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. ఇదీ సంగారెడ్డి జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య ఘటన తీరు. మరోచోట తొలుత పెద్దలు ప్రేమను అంగీకరించలేదు.. కులం ఒకటే అయినా ఆస్తుల అంతరం అడ్డువచ్చింది.. తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయి. అయితే విషయం ప్రేమికులకు తెలియక బలవన్మరణం చెందారు. ఇదీ కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. – మునిపల్లి(అందోల్)/వాంకిడి(ఆసిఫాబాద్) తెలియక.. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వాంకిడిలోని రాంపూర్ కాలనీకి చెందిన నాగడే శ్రీకాంత్(22), అదే కాలనీకి చెందిన ఎల్ములె గీత(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 3 నెలల క్రితం ప్రేమ విషయాన్ని గీత ఇంట్లో తెలిపింది. కులాలు ఒకటైనా, శ్రీకాంత్ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో గీత ఇంట్లో అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు ఇద్దరు డిసెంబర్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వాంకిడి మండలం అక్నీ గ్రామ శివారులో శ్రీకాంత్ తండ్రి పాండు పత్తి పంట కౌలుకు సాగుచేస్తున్నారు. చేనులో మోదుగ చెట్టుకు శ్రీకాంత్ ఉరేసుకుని ఉండటం, గీత మృతదేహం చెట్టు పక్కనే ఉండటం సమీప రైతులు గమనించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాల నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలాఉండగా, ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండో రోజే పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో నిర్ణయించారు. కానీ ప్రేమికులిద్దరి సెల్ఫోన్లు స్విచాఫ్ రావడంతో సమాచారం చేరలేదు. ఇదేక్రమంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు. తప్పు చేశామని.. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కోహీర్ గ్రామానికి చెందిన బుగ్గుల అమృత(20) సం గారెడ్డి అంబేడ్కర్ స్టడీ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ తీసుకుంటోంది. మర్పల్లి మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన శివ(22) సంగారెడ్డిలోని సిద్ధార్థ పారామెడికల్ కాలేజీ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఇళ్లలో తెలుపగా.. పెద్దలు అంగీకరించారు. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా అమృత కోహీర్‌లోని ఇంటికి వచ్చింది. డిసెంబర్ 31న సంగారెడ్డికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఏం జరిగిందోగానీ.. జనవరి 2న రాత్రి 7.30 గంటల సమయంలో శివ తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివారులో సూసైడ్ చేసు కుంటున్నామని తెలిపాడు. కుటుంబ సభ్యులు రాత్రి బుదేరా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఇద్దరూ వేలాడుతూ కనిపించారు. అమృత తండ్రి అశోక్‌బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘చేయరాని తప్పు చేశాం, ఆ తప్పును సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని శివ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ (22), గీత(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి వివాహం చేయమని కోరారు. దీంతో అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నప్పటికి ,గీతా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఈ విషయం గ్రామ పెద్దలు వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పి, కొంత సమయం వేచి చూడాల్సిందిగా పెద్దలు చెప్పారు కొన్ని రోజులు వేచి చూసిన శ్రీకాంత్, గీతలు ఇక తమకు వివాహం జరపరని మనస్తాపానికి గురై గత సోమవారం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే సోమవారం పొలం పనుల కోసం అకిని గ్రామ సమీపంలోని పత్తి చేనుకు వెళ్ళిన కూలీలకు ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని శవాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్‌ను షూట్ చేశాడు! -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్‌తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్‌లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
సాక్షి, చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి(29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని.. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలులోని జిన్స్ హాస్పిటల్లో నాగచైతన్య నర్సు. అక్కడే కోటిరెడ్డి మేనేజర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాగచైతన్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 23వ తేదీ ఉదయం సిటిజన్ ఆస్పత్రి వరకు వచ్చిన అతను సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు. 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్లో ఒంగోలుకు చేరుకున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో మృతి చెందింది. కత్తి, తాడు కొనుగోలు.. 23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్ మార్కెట్లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. ఓయో రూమ్‌కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే ఓడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్‌లో తీసుకెళ్లాడు. రూమ్‌కు వెళ్లిన కొద్ది సేపటికే బయటకు వెళ్లి కూల్‌డ్రింక్స్ తీసుకొచ్చాడు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. స్విగ్గీ బాయ్ నుంచి ఫుడ్ డెలివరీ తీసుకున్న అతను రూమ్‌లోకి వెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసేందుకు చున్నీ ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కులాంతరమే హత్యకు కారణమా? కోటిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, విజయనగరం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు భావిస్తున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తిరుపతి: వివాహిత హత్య కేసులో పురోగతి.. ఆన్లైన్ క్లాస్‌లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ -
నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..
సాక్షి, గాజువాక (విశాఖపట్నం): ప్రేమ వ్యవహారం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకొంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుసుకున్న భర్త మనస్తాపంతో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆ వివాహిత ప్రేమించి పెళ్లాడిన భర్త (ప్రియుడు)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుందరయ్య కాలనీదరి దుర్గానగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన మోటూరి నాగిణి (24) అదే గ్రామానికి చెందిన బోకం అవినాష్ (28)ను ప్రేమించింది. అయితే ఆమె తల్లిదండ్రులు పాపారావు అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. అనంతరం ఉపాధి కోసం పాపారావు తన భార్యతో కలిసి అండమాన్ వెళ్లిపోయాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూ నివాసముంటున్నాడు. వాళ్ల కాపురం నాలుగేళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే బోనంగిలోని తమ పుట్టింటికి నాగిణి అండమాన్‌నుంచి వచ్చింది. పెళ్లికి ముందే ప్రేమించిన అవినాష్‌తో చనువుగా తిరుగుతోంది. ఈ క్రమంలో నాగిణిని అండమాన్ పంపేందుకు ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు టికెట్లు తీసినా వెళ్లలేదు. తన భార్యకు అవినాష్‌కు మళ్లీ సంబంధం ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న పాపారావు తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకొన్నాడు. చదవండి: (విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య) ఇదిలా ఉండగా, నాగిణి, అవినాష్‌లు ఈనెల 16న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు వారు పరవాడ దరి వాంబేకాలనీలో కనిపించడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ గురువారం ఉదయం కశింకోటలోని దుర్గా గుడిలో వివాహం చేసుకొని అవినాష్ ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇక్కడి దుర్గానగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శ్రీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నామని, ఇక్కడే కాపురముంటామని చెప్పిన వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఆ ఇంటికి అడ్వాన్స్ చెల్లించారు. రెండు రోజుల్లో సామగ్రి తెచ్చుకుంటామని ఇంట్లో దిగారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటుతున్నా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. ఇద్దరూ ఆ ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి పోసుకొని కనిపించడంతో గాజువాక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగిణి తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో తమ బిడ్డ నిర్జీవంగా ఉండడం చూసి బోరున విలపించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) సమాచారం అందుకున్న సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి, గాజువాక సీఐ మల్లీశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. కుటుంబ సభ్యుల నిరాకరణ, భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న మనస్తాపమో, మరేదైనా కారణం చేతనో వారు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని ఏసీపీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కాగా, మృతుల గదిలో సూసైడ్ నోట్ లభించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తమ ప్రేమను కాదంటున్నారనే కారణంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు ఏసీపీ తెలిపారు. తమ మృతదేహాలను ఒకేచోట ఖననం చేయాలని వారు ఆ లేఖలో కోరారు. చదవండి: (మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను) -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..
మునగాల/చివ్వెంల: కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని ఓ ప్రేమజంట అర్ధంతరంగా ఆయుష్షు తీసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన ఆ ప్రేమికులు మునగాల మండలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు అంజయ్య కుమారుడు నవీన్ (21) ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో కూలి పనిచేస్తూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (16)తో నవీన్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఆరు నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. నాటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. రాత్రి బైక్‌పై బయలుదేరి..: ఇక ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ ప్రేమికులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై గ్రామం నుంచి బయలుదేరారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మీదుగా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ నుంచి రేపాల గ్రామానికి వెళ్లే రహదారికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ వేపచెట్టు వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున రహదారిపై వెళ్తున్న కొందరు స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మునగాల ఎస్ఐ సత్యనారాయణ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బైక్ నంబర్ ఆధారంగా ముందు మృతుడు నవీన్ అడ్రస్‌ను గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వీఆర్ఓ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
చావులో ఒక్కటయ్యారు..
ప్రేమకు కులం లేదంటారు. వాళ్లిద్దరి పెళ్లికి కులమే అడ్డుగా నిలిచింది. నాలుగేళ్ల ప్రణయానికి నలుగురూ అడ్డుతగులు తారేమోనని భావించిన వారు చావులో ఒక్కటై వెళ్లిపోయారు. పసుపు బట్టలు కట్టుకోవాల్సిన వారు పాడెక్కడంతో రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది. సాక్షి, ఉరవకొండ: మండల పరిధిలోని చిన్న కౌకుంట్ల గ్రామంలో ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, ఎస్ఐ ధరణిబాబు తెలిపిన మేరకు.. తుమ్మిగనూరుకు చెందిన రవి (22) నాలుగేళ్ల క్రితం కౌకుంట్లలోని తన అక్క రాజమ్మ ఇంటికి గొర్రెల కాపరిగా వచ్చాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సుశ్మిత(20)తో అతనికి పరిచయం కాగా...ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం సుశ్మితకు పెద్దవాళ్లు వేరే పెళ్లి సంబంధం చూశారు. ఈ క్రమంలో తమ ప్రేమ విషయం పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం లేక, వారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకోలేక ఆదివారం ఉదయం తమ ఇంటి పక్కన ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ధరణిబాబు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు.. ) -
వివాహానికి నిరాకరించారని..
నిజామాబాద్‌అర్బన్/ఎడపల్లి: ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్ పట్టణానికి చెందిన నవనీత (19) డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. అయితే, ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలో తనతో పాటే చదివే మోహన్ (20)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. మోహన్ కుటుంబం జీవనోపాధి కోసం చాలా రోజుల క్రితమే వలస వెళ్లింది. అయినప్పటికీ వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రేమ వివాహం చేసుకోవాలని ఇంట్లో వారికి చెప్పగా కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన నవనీత, మోహన్ ఆదివారం అలీసాగర్ ఉద్యాన వనానికి చేరుకుని, కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిరువురినీ నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, నవనీత అప్పటికే మృతి చెందింది. మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో వైద్య చికిత్స అందిస్తున్నారు. -
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: కావేరి తీరంలో విషం తాగి ప్రేమ జంట గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి పుత్తూర్ విషంకుళం వీధికి చెందిన రాజా కుమారుడు రమేష్ (31). సొంతంగా కారు నడుపుతున్నాడు. ఈయన తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గత మార్చిలో జరిగింది. వీరికి ఏడు నెలల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. రమేష్ ఓ యువతితో తిరుచ్చిపుత్తరసన నల్లూరు సమీపంలో ఉన్న కావేరి తీరానికి కారులో వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత వారు బాటిల్లో తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ స్నానం చేస్తున్న వారు జియాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే వారు మృతి చెందినట్టు తెలిసింది. తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. తర్వాత పోలీసులు కారులో తనిఖీలు చేయగా అందులో రెండు సెల్ఫోన్లు ఉన్నాయి. వాటిని, కారును స్వాధీనం చేసుకునారు. విచారణలో రమేష్‌తో పాటు ఆత్మహత్య చేసుకుంది తిరుచ్చి తెన్నూర్ సంగీత పురానికి చెందిన అంతోని కుమార్తె రీనా (18) అని తెలిసింది. ఆమె పుత్తూరులో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. అదే సమయంలో రమేష్ కారులో వచ్చి వెళుతున్న సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వారి ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. వీరి అక్రమ సంబంధం కుటుంబీకులకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నారా, వేరే కారణమా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. -
ఒకేరోజు రెండు ప్రేమ జంటల ఆత్మహత్య
ఒకే రోజు రెండు ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటనలు రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులు మందలించారన్న బాధతో ఇరు జంటలు బలవన్మరణానికి పాల్పడ్డాయి. – షాబాద్, కేశంపేట ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కర్రె పల్లవి (19), పోచమోళ్ల మహేందర్ (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం కిందట వీరిద్దరూ శంషాబాద్‌లో కలసి ఉండటాన్ని గమనించిన పల్లవి కుటుంబసభ్యులు మహేందర్ కుటుంబీకులను మందలించారు. అప్పుడే శంషాబాద్ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదుచేశారు. పల్లవికి పెళ్లి సంబంధం చూడగా.. తనకు పెళ్లి ఇష్టం లేదని పల్లవి చెప్పింది. దీంతో పల్లవి, మహేందర్‌లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరూ గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి, అక్కడ మామిడి చెట్టుకు పల్లవి చున్నితో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం తన పొలానికి వెళ్తున్న స్వరూప అనే మహిళ వీరిని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ పని మానేసి ఇంటి వద్దే ఉంటుండగా.. పల్లవి కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. కులాలు వేరు కావడంతో.. కలసి జీవించాలనుకున్నారు. అందుకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకులకు చెందిన నాగిళ్ల శ్రీరాములు(23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన బత్తిని సుశీల (18) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సుశీల కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు సుశీలను నీలదీశారు. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సుశీల ఇంట్లోనే ఆదివారం రాత్రి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశీల మృతి విషయం తెలుసుకున్న శ్రీరాములు గ్రామలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన ప్రేమికురాలు మరణించిందని, అందుకే తానూ చనిపోతున్నట్లు చెప్పి తమ వ్యవసాయ భూమి లోని మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో రెండు ప్రేమజంటల ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమజంటలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాయి. వివరాలు.. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీరామ్(21), సుశీల(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సుశీలను మందలించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోయిన విషయం తెలిసిన శ్రీరామ్ మనస్థాపంతో పొలానికి వెళ్లి అక్కడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు వద్దన్నారని... రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన పోచమొల్ల మహేందర్(21), కర్రోళ్ల పల్లవి(19) ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరన్న భయంతో సోమవారం ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్ మదన్(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. తోరపాటి గ్రామానికి చెందిన పాండురంగన్ కుమార్తె స్వాతి అలియాస్ శ్వేతను మదన్ ప్రేమిస్తున్నాడు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో తరచూ శ్వేత ఇంటికి సైతం మదన్ వెళ్లి వచ్చేవాడు. అంతే కాదు, నర్సింగ్ చదువుతున్న స్వేతను సాయంత్రం వేళల్లో తన మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకెళ్లి మరీ దిగబెట్టి వచ్చేవాడు. ఈ ఇద్దరు ప్రేమించుకున్న విషయం కుటుంబీకులకు తొలుత తెలియదు. అయితే, తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరిస్తారా..? అన్న ఆందోళన వీరిని వెంటాడుతూ వచ్చింది. ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట తాము జీవితంలో ఒక్కటయ్యేది అనుమానమే అన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఎట్టకేలకు ధైర్యం చేసి కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లినా, వారు అంగీకరించక పోవడంతో బలన్మరణానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం కళాశాలకు వెళ్లిన శ్వేత తిరిగి ఇంటికి రాలేదు. అయితే, ఆమె చదువుకుంటున్న కళాశాల ఆస్పత్రిలో ట్రైనింగ్ నిమిత్తం చేరి ఉండటంతో అప్పుడప్పడు రాత్రుల్లో ఇంటికి వచ్చేది కాదు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రి విధులకు వెళ్లి ఉంటుందని భావించారు. పట్టాలపై మృతదేహం..... మంగళవారం ఉదయం శ్వేత, మదన్‌ల మృత దేహాలు రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్నట్టుగా సమాచారం అందుకున్న రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. అస్సలు ఏంజరిగిందోననే ఆందోళనతో కుటుంబీకులు పరుగులు తీశారు. అయితే, ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అర్థరాత్రి సమీపంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కనిచ్చ పాక్కం రైల్వే గేట్ సమీపిస్తున్న సమయంలో అతి వేగంగా దూసుకొస్తున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ ముందుగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఓ జంట ఎదురు వచ్చినట్టు , హారన్ కొట్టినా, వేగం తగ్గించే యత్నం చేసినా ఫలితం లేదని తిరుపాతి పులియూర్ రైల్వే పోలీసులకు ఆ డ్రైవర్ సమాచారం అందించి వెళ్లాడు. రైలు అతి వేగంగా వచ్చిన దృష్ట్యా, ఆ ఇద్దరి మృత దేహాలు చిద్రం అయ్యాయి. మృత దేహాల్ని కడలూరు ఆస్పత్రి మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదాన్ని నింపింది. -
పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక..
కర్ణాటక, తుమకూరు: ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ విధి నాటకంలో ఇద్దరూ వేర్వేరయ్యారు. అయినా ప్రేమను మరచిపోలేక కలిసి తనువు చాలించారు. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జిల్లాలోని పావగడ తాలూకాలో చోటు చేసుకుంది. శిరా తాలూకా క్యాదిగుంట గ్రామానికి చెందిన మంజునాథ (35) అదే గ్రామానికి చెందిన అశ్విని (30) ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్నేళ్లక్రితం ఇరువురికి వేరేవారితో పెళ్లయింది. సంతానం కూడా కలిగారు. మంజునాథ భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. దీంతో అతడు తీవ్రంగా కలత చెందాడు. తన ప్రియురాలికి విషయం చెప్పి ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమికులు ఆదివారం రాత్రి పావగడ తాలూకా నిడగల్ గ్రామ సమీపంలో ఒకే చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థులు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.