సాక్షి, సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చదవండి: ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment