ప్రేమజంట అభిజిత్, రూష్ణాపూసల్
టీ.నగర్: చెన్నై, సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో కేరళ ప్రేమజంట మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది. కేరళ రాష్ట్రం, ఎర్నాకుళం జిల్లా కూట్టుమడం ప్రాంతానికి అభిజిత్ (19) ఎర్నాకుళంలోగల కళాశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో చదువుతుండగా ఎర్నాకుళం జిల్లా నెల్లికుళికి చెందిన రూష్ణాపూసల్ (19)తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపినట్లు సమాచారం.
దీంతో ఇరువురూ గత వారం ఇంటి నుంచి పరారయ్యారు. చెన్నై చేరుకున్న ఇరువురూ బసచేసేందుకు వీలులేక చెన్నై రైల్వేస్టేషన్‌లో గడిపారు. తాము తెచ్చుకున్న నగదు ఖాళీ కావడంతో ఆహారం లేకుండా అవస్థలు పడ్డారు. మంగళవారం రాత్రి చెన్నై సబర్బన్ రైల్వేస్టేషన్ 16 నంబర్ ప్లాట్‌ఫాంపై క్రిమిసంహారక మందు తాగి స్పృహ తప్పారు. అక్కడ రాత్రి గస్తీ తిరుగుతున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు గమనించి ఇద్దరిని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ గటనపై సెంట్రల్ రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment