విషం తాగిన ప్రేమజంట | Love Couple Commit Suicide in Tamil Nadu | Sakshi
Sakshi News home page

విషం తాగిన ప్రేమజంట

Apr 16 2019 10:29 AM | Updated on Apr 16 2019 10:29 AM

Love Couple Commit Suicide in Tamil Nadu - Sakshi

సంగీత (ఫైల్‌)

అన్నానగర్‌: నత్తమ్‌ సమీపంలో ఆదివారం తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంతో ప్రేమికులు విషం సేవించారు. ఇందులో యువతి మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. దిండుక్కల్‌ జిల్లా, నత్తమ్‌ సమీపంలోని గోపాల్‌పట్టికి చెందిన చిన్నయ కుమార్తె సంగీత (22) ప్లస్‌టూ పూర్తిచేసి, సమీపంలోని ప్రైవేట్‌ మిల్లులో పనిచేస్తోంది. తిరుచ్చి జిల్లా మణప్పారై కలింగపట్టి సమీపంలోని రాజాలి కౌండమ్‌పట్టికి చెందిన నల్లతంబి కుమారుడు కనకరాజ్‌ (26). ఇతని తల్లిదండ్రులు మృతిచెందడంతో కరూర్‌ జిల్లా, సిద్ధపట్టిలోని బంధువుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ స్థితిలో గోపాల్‌పట్టి సమీపంలో జరిగిన ఓ వివాహానికి కనకరాజ్‌ వెళ్లాడు. అక్కడ సంగీతతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో వారి ప్రేమను బంధువులు అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సిద్ధపట్టిలోని ఓ తోటలో విషం తాగి స్పృహతప్పి పడి ఉన్నారు. సమాచారంతో కనకరాజ్‌ బంధువులు అక్కడికి వచ్చి ఇద్దరినీ మణప్పారైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతిచెందింది. కనకరాజ్‌ పరిస్థితి విషమంగా ఉంది. సంగీత తండ్రి చిన్నయ ఫిర్యాదు మేరకు తోగైమలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement