ప్రేమ జంట
అన్నానగర్: కావేరి తీరంలో విషం తాగి ప్రేమ జంట గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి పుత్తూర్ విషంకుళం వీధికి చెందిన రాజా కుమారుడు రమేష్ (31). సొంతంగా కారు నడుపుతున్నాడు. ఈయన తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గత మార్చిలో జరిగింది. వీరికి ఏడు నెలల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. రమేష్ ఓ యువతితో తిరుచ్చిపుత్తరసన నల్లూరు సమీపంలో ఉన్న కావేరి తీరానికి కారులో వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత వారు బాటిల్‌లో తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ స్నానం చేస్తున్న వారు జియాపురం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే వారు మృతి చెందినట్టు తెలిసింది. తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. తర్వాత పోలీసులు కారులో తనిఖీలు చేయగా అందులో రెండు సెల్‌ఫోన్లు ఉన్నాయి. వాటిని, కారును స్వాధీనం చేసుకునారు. విచారణలో రమేష్‌తో పాటు ఆత్మహత్య చేసుకుంది తిరుచ్చి తెన్నూర్ సంగీత పురానికి చెందిన అంతోని కుమార్తె రీనా (18) అని తెలిసింది. ఆమె పుత్తూరులో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. అదే సమయంలో రమేష్ కారులో వచ్చి వెళుతున్న సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వారి ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. వీరి అక్రమ సంబంధం కుటుంబీకులకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నారా, వేరే కారణమా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment