love failures
-
ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. ‘పిచ్చి ప్రేమ’తో బిచ్చగాడిలా..
ప్రేమ.. కొందరి జీవితాల్లో ఇది మధుర జ్ఞాపకం.. మరికొందరకి ఇది మరణశాసనం. అవును.. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటూ.. మింగేసే అనకొండలూ ఉంటాయి.. ముఖ్యంగా వలపు వలలో చిక్కి.. బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో..ఈ లోకంలో! మనసిచ్చిన మగువ చీత్కరిస్తే.. వలచిన వనిత నిర్ధయగా వదిలేస్తే.. ఆ బతుకు నిత్యనరకం.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ.. స్వచ్ఛమైన ప్రేమకోసం పిచ్చివాడిగా మారిన ఓ యువకుడి దీనగాథకు మూడేళ్ల కాలం సాక్ష్యంగా.. నిలిచింది.. ఈ కన్నీటి వ్యథను మీరూ చదవండి..! సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడు ఉన్నత విద్యావంతుడు. ఎంతో కొంత అందగాడు కూడా.. పీజీ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు సార్లూ విఫలం కావడంతో.. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతితప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. సమీప బంధువు కంట బడడంతో మూడేళ్ల దుర్భర జీవితం నుంచి బయటపడి తోబుట్టువుల చెంతకు చేరుకున్నాడు. వివరాలు.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో 35 ఏళ్ల యువకుడు ఒకరు మతితప్పిన స్థితిలో మూడేళ్లుగా సంచరిస్తున్నాడు. కన్యాకుమారి రైల్వేస్టేషన్ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా, బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలుకరించాడు. మాట కలిసి.. మలుపు తిరిగి ఆ యువకుడు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్‌తో మాట కలిపాడు. అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారౖణెంది. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకెళ్లగా వారు ఆ యువకుడికి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండుకొట్టించారు. తరువాత స్నానం చేయించి కొత్త గుడ్డలు తొడిగి తెన్నమలైలోని అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి అతడు తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35)గా గుర్తించారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ 2018 నవంబర్ 13వ తేదీన తాను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి జాడకానరాలే దు. ఈ నేపథ్యంలోనే మురుగన్ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా,వారు తగిన ఆధారాలు చూపి న తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. రెండుసార్లు ప్రేమ విఫలం కావడంతోనే.. ఈ సందర్భంగా ముత్తు సోదరుడు అయ్యనార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యారి్థనిని, ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు, అయితే ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్ వల్ల మూడేళ్ల తరువాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశా డు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీ సులు ఎంతో మానవత్వంతో తన సోదరుడిని క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. -
ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీకి చెందిన యువతి(24), మండలంలోని ఇప్పటూర్ పంచాయతీ చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్(25)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం తిలక్‌గౌడ్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టానంది. ఈ విషయమై బాధితురాలు నవాబుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపారని వివరించింది. చదవండి: రెండు పెళ్లిళ్లు.. మరొక వ్యక్తితో సహజీవనం..చివరకు -
అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడి..
ఇబ్రహీంపట్నం: ప్రేమ పేరుతో వంచనకుగురైన దళిత యువతికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమి షన్ సభ్యుడు చిలుకమర్రి నర్సింహ్మ తెలిపారు. ఆ ర్డీఓ అమరేందర్‌రెడ్డి, ఏసీపీ యాదగిరిరెడ్డి సమక్షంలో బాధితురాలు అరుణకు జరిగిన అన్యాయంపై ఇ బ్రహీంపట్నంలో గురువారం విచారణ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచాల మండలం కాగజ్‌ఘాట్ గ్రామానికి చెందిన అరుణను అదేగ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్‌గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మాల్ గ్రామంలో కాపురం పెట్టినట్లు చెప్పారు. మూడు నెలలు గడిచిన అనంతరం భార్య అరుణను వదలిపెట్టి పరారయ్యాడని తెలిపారు. భర్త వెంకటేశ్ అచూకీ కోసం కాగజ్‌ఘాట్‌లోని అతని ఇంటికి అరుణ వెళ్లగా.. అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడిచేశా రని తెలిపారు. బాధితురాలిని మోసగించిన వెంకటేశ్‌ను, అరుణపై దాడిచేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని ఏసీపీ యాదగిరిరెడ్డికి సూచించారు. మోసానికి గురైన దళిత మహిళకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల 25 వేలు అందజేస్తామన్నారు. బాధితురాలికి తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేస్తామని ఆర్డీఓ అమరేందర్‌రెడ్డి తెలిపారు. యు వతిని మోసం చేసిన, దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలి పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: కావేరి తీరంలో విషం తాగి ప్రేమ జంట గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి పుత్తూర్ విషంకుళం వీధికి చెందిన రాజా కుమారుడు రమేష్ (31). సొంతంగా కారు నడుపుతున్నాడు. ఈయన తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గత మార్చిలో జరిగింది. వీరికి ఏడు నెలల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. రమేష్ ఓ యువతితో తిరుచ్చిపుత్తరసన నల్లూరు సమీపంలో ఉన్న కావేరి తీరానికి కారులో వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత వారు బాటిల్లో తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ స్నానం చేస్తున్న వారు జియాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే వారు మృతి చెందినట్టు తెలిసింది. తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. తర్వాత పోలీసులు కారులో తనిఖీలు చేయగా అందులో రెండు సెల్ఫోన్లు ఉన్నాయి. వాటిని, కారును స్వాధీనం చేసుకునారు. విచారణలో రమేష్‌తో పాటు ఆత్మహత్య చేసుకుంది తిరుచ్చి తెన్నూర్ సంగీత పురానికి చెందిన అంతోని కుమార్తె రీనా (18) అని తెలిసింది. ఆమె పుత్తూరులో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. అదే సమయంలో రమేష్ కారులో వచ్చి వెళుతున్న సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వారి ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. వీరి అక్రమ సంబంధం కుటుంబీకులకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నారా, వేరే కారణమా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. -
సోషల్ మీడియాలోయువతి నగ్న చిత్రాలు
చెన్నై,టీ.నగర్: ప్రేమ నిరాకరించడంతో ఆగ్రహించిన యువకుడు ఆమె నగ్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా గండాచ్చిపురానికి చెందిన కలైయరసన్ (24) వండిపాళ్యంలో బంధువు ఇంట్లో ఉంటూ కడలూరులోని సెల్ దుకాణంలో పనిచేస్తున్నా డు. అదే షాపులో పనిచేస్తున్న యువతితో ప్రే మ ఏర్పడింది. వీరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో యువతి ఇంట్లో వ్యతిరేకించారు. దీంతో యువతి కలైయరసన్తో మాట్లాడడం ఆపేసింది. దీంతో ఆగ్రహించిన కలైయరసన్ యువతి తనకు పంపిన నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కడలూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి కలైయరసన్ను అరెస్టు చేశారు. అతని ఫేస్బుక్ అకౌంట్‌ను స్తంభింపజేశారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్.. సార్!! ఒక అమ్మాయి రోజూ నన్ను చూస్తోంది. తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రెండు మూడు సార్లు ఆ అబ్బాయి బైక్ మీద పోతుంటే చూశాను. చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఈ మధ్య తను నన్ను చూసి నవ్వుతోంది. తనతో స్నేహం మంచిదేనా? – రామ్ కుమార్ బైక్ మీద పోతున్న అమ్మాయిని నోరెళ్లబెట్టి చూస్తుంటే నవ్వు రాదా బ్రో. ..?‘అంటే రామ్‌కుమార్ దీనస్థితిని చూసి పళ్లు ఇకిలించిందా సార్’. కొంచెం ఫన్నీగా నీలూ.. అలా నోరు ఓపెన్ చేసుకుని చూస్తుంటే..?? ‘పొండి సార్.. పాపం ఇంకొకరితో క్లోజ్‌గా ఉన్న అమ్మాయి.. చూసి ప్రేమగా నవ్విందని... ఏం చేయాలో చెప్పమంటే.. మీరు రామ్ కుమార్‌ని కార్టూన్లా చేసి ఏడిపిస్తారా సార్..?? ఈ ఉసురు ఊరికే పోదు సార్!!’ నీలూ..! పోనీ అమ్మాయికి రామ్‌కుమార్ నచ్చాడే అనుకుందాం.. కానీ ఇంకో బైక్‌మీద ఇంకో రావణాసురుడితో ట్రావెల్ అవుతున్న అమ్మాయిని నేను ఇష్టపడటం కరెక్టేనా అని అడిగితే.. జోక్ వేసిఆన్సర్ తప్పించుకోకుండా నిజాలు చెబితే రామ్‌కుమార్ హర్ట్ కాడా నీలూ..? ‘ఓ.. ఓహో.. ఓహోహో.. ఓరి ఫూల్ అనకూడదని ఫన్నీగా ఫూల్ చేస్తూ రామ్‌కుమార్ గుండెకు ఆయింట్మెంట్ రాస్తున్నారా సార్..!?’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! మీరు అమ్మాయిలకు ఇచ్చే సపోర్ట్ నాకు బాగా నచ్చుతుంది. నా చెల్లెలు ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయింది. ఇప్పుడు తనకి పెళ్లి చేద్దామని అమ్మానాన్న అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య మా చెల్లి ఆ అబ్బాయికి మళ్లీ దగ్గరవుతోంది. వాడు మళ్లీ మోసం చేస్తాడని చెబుతున్నా వినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ‘తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు అన్నయ్యా’ అంటోంది. తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – దుర్గారావు తను అర్థం చేసుకోవాలా?లేదా మనమే అర్థం చేసుకోవాలా???? ఈ ప్రపంచంలో మోసాలు రోజూ చూస్తున్నాం!ద్రోహాలు రోజూ జరుగుతున్నాయి!అలాంటప్పుడు చెల్లెలికి ఒకసారి జరిగిన మోసం మళ్లీ జరగకుండా ఎలా ఉంటుంది అని అనుకోవడం చాలా నార్మల్.పోనీ గట్టిగా మందలించి చెల్లెల్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తే...అలా చేస్తే... చెల్లెలు సంతోషంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉందా?అలాగని ఒకసారి మోసం చేసిన వాడికే మళ్లీ అవకాశం ఇస్తే...ఇంకోసారి మోసం చెయ్యకుండా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలమా?రెండూ నీ చేతిలో లేవు..‘ఏంటి సార్? సింపుల్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వండని అడిగితే... సాంతం క్లాసు పీకేస్తున్నారేంటి సార్?’లేదు నీలూ!!నిర్ణయం తీసుకోవాల్సింది చెల్లెలే. ఓన్లీ షీ నోస్... వాడు ప్రాయశ్చిత్తంతో తిరిగి వచ్చాడా లేదా అన్నది. ఓన్లీ షీ కెన్ డిసైడ్!!‘ఏడిసినట్లు ఉంది సార్! ఇక అడ్వైజ్ కోసం మీకు ఉత్తరం రాయడం దేనికి? ఆ అన్నచెల్లెళ్లే ఉత్తరాలు రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కదా సార్? ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్!!’నీలూ..! చెల్లెలు కొన్ని రోజులు ప్రేమ, రొమాన్స్, పెళ్లి లాంటి విషయాల నుండి దూరముంటే.. తనకే క్లారిటీ వస్తుంది. ఏదో వెనక్కి వచ్చాడు కాబట్టి.....‘సార్...! నేను చెబుతాను ఆగండి. వెనక్కి వచ్చాడు కాబట్టి మనం వెనక్కి పరిగెత్తుకునిపోతే కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది. అదీగాక ఇదేమైనా చిన్న విషయమా? లైఫ్ డెసిషన్..! తొందర పడకుండా తీసుకోవాల్సిన నిర్ణయం..!! రామ్ గారి చెల్లెమ్మా.. ప్లీజ్ వెయిట్!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నా స్నేహితుడు నాకు చాలా పెద్ద ద్రోహం చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తనూ ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ అమ్మాయికి, నాకు మధ్య కావాలనే గొడవ పుట్టించి విడదీసాడు. ఆ విషయం తనకి తెలియక వాడినే నమ్మింది. చివరికి ఇద్దరూ కలిసి నన్ను బకరా చేశారు. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నా కన్నవాళ్ల కోసం ఆలోచిస్తున్నాను. వాళ్లిద్దరినీ నేను నా జీవితంలో క్షమించలేను. ప్లీజ్ సార్ ఏదైనా సలహా ఇచ్చి వాళ్లని పూర్తిగా మరచిపోయేలా చెయ్యండి ప్లీజ్! హెల్ప్ మీ సార్! – చిన్ను నవ్వరా బంగారం...! ఆకాశం కంపించేలా నవ్వరా...!! భూమి అదిరేలా నవ్వరా...!! ‘పిచ్చోడనుకుంటారేమో సార్...!? అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని స్క్రూ లూజ్ అయ్యిందనుకుంటారేమో సార్!? ఫ్రెండ్ లవ్వును బెండ్ చేశాడని భరించలేక బుర్ర కిర్రుమన్నదేమో అనుకుంటారు సార్!? ఆల్రెడీ అందరూ ఢోకా ఇచ్చి చిన్నూ లైఫ్‌తో ఆడుకున్నారు... మీరు కూడా పిచ్చోడిని చేసి ఆడుకుంటారేంటి సార్!?!’ అలా కాదు నీలూ...! ‘ఇంకెలా సార్? అమ్మాయి ఛీ కొట్టింది.. ఇప్పుడు అదర్స్ కూడా ఛీ కొడతారు కదా సార్?!’ కాదు నీలూ! వాళ్లిద్దరూ కుళ్లుకుంటారు. చిన్నూ నవ్వుకు కుళ్లీ కుళ్లీ కుళ్లిపోతారు నీలూ! ‘అబ్బా..! సూపర్ సార్..!! చిన్నూ హ్యాపీగా ఉన్నాడని వాళ్లకు తెలిస్తే భలే ఉంటుంది సార్..! వాళ్లకు పిచ్చెక్కుతుంది సార్.. భరించలేరు సార్.. అవును సార్.. చిన్నూ అలాగే కాన్ఫిడెంట్‌గా సాగిపోవాలి సార్..! హ్యాండ్ ఇచ్చిన వాళ్లకు బ్యాండ్ పడుతుంది సార్!’ అని నవ్వింది నీలూ. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నా. నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ట్రూగా లవ్ చేసింది. మా నేపథ్యాలు వేరు కావడంతో తనకి వేరే సంబంధం చూశారు. పెళ్లికి ముందు రోజు కాల్ చేసి ‘నాకు నువ్వు కావాలి’ అంది. అప్పుడు నేనేం చెయ్యలేకపోయాను. తనకి పెళ్లైపోయింది. ప్రాణం పోయేంతగా ఏడ్చాను. నా ప్రాబ్లమ్ ఏంటంటే... ఇప్పుడు తను రోజూ కాల్ చేస్తోంది. ఎన్నిసార్లు పట్టించుకోలేనట్లున్నా కాల్ చేస్తూనే ఉంటోంది. పైగా ‘నువ్వే కావాలి’ అంటోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక పెళ్లి అయిన అమ్మాయితో ఎలా మాట్లాడాలి. పైగా ప్రతిసారీ ‘ఐ లవ్ యూ’ అంటోంది. పెళ్లి అయ్యాక కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావని అడిగితే.. ‘పెళ్లి అయితే లవ్ చెయ్యొద్దా?’ అంటోంది. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పండి బ్రో. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. – లక్కీ మంచివాడివి...!అంతగా అమ్మాయి అడుగుతున్నా...అదుపు తప్పకుండా గౌరవంగా బిహేవ్ చేస్తున్నావ్...!!నిజంగా అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు అన్నా....!!నీలాంటి వాళ్లు కొందరున్నారు కాబట్టే...ఇంకా సమాజంలో ఒక నియమం, నిబద్ధత ఉన్నాయి...!!‘సార్...! ఇంత బటర్ పూస్తున్నారెందుకు సార్??జారి కింద పడతాడేమో సార్?!!’అమ్మాయి రాస్తున్న బటర్కే పడలేదు..!అయినా ఈ పిలగాడుపడేరకం కాదు...!పడిపోయే నీచ గుణం లేదు...!!తనను తాను తగ్గి....‘మంచిని లేపే గుణం ఉన్నవాడు కదా సార్? నిజమే... నాకు కూడా నచ్చాడు సార్...! అమ్మాయిని రాంగ్ రూట్లో పడకుండా ఉంచాడు.. శభాష్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనకి ఇప్పటికే ఫోర్ టైమ్స్ ప్రపోజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. వాళ్ల ఫాదర్.. తనకు పెళ్లి చెయ్యడానికి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లకోసమే చూస్తున్నారట. కానీ నేను చదువుకోలేదు. తను నన్ను ప్రేమించకపోతే నేను చనిపోతాను. ప్లీజ్ హెల్ప్ మీ సార్. – ఆనంద్ కుమార్ చదువుకున్నవాడు గొప్పవాడు కాదు.చదువుకోనివాడు మనసు లేనివాడు కాదు.కానీ ప్రేమ, పెళ్లి రెండు డిఫరెంట్..!!ప్రేమించడానికి అర్హతలు అక్కర్లేదు.పెళ్లి చేసుకోవడానికి బాధ్యత నింపే శక్తి అవసరం..!!ఓటమి.. ప్రేమించి పెళ్లి చేసుకో లేకపోవడంలో లేదు.ఓటమి.. కులంలో, పేదరికంలో లేదు.ఓటమి.. బతకలేకపోవడంలో లేదు.‘మరి ఎక్కడ సార్ ఓటమి ఆనంద్కి??’తన మీద తనకు భరోసా లేకపోవడంలో ఉంది.‘అవును అమ్మాయి ఓకే చెప్పలేదు, మనకు నచ్చిన వాళ్లు మనకు ఓకే చెప్పాలనేం లేదు. అలాగని మనం ఎవరికీ తక్కువ కాదు. మన మనసుకు నచ్చింది మనం చెప్పగలిగాం. అది గ్రేట్. ఆనంద్కి ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు. తిరస్కారం నుంచి భయపడి చెప్పకుండా ఉంటే దాన్ని ఓటమి అనుకోవాలి. ఆనంద్ కూడా ట్రై చేశాడు. ఫ్యూచర్లో తనకు తప్పకుండా మంచి లవ్ దొరుకుతుంది!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నాదొక సమస్య...!! రెండేళ్లుగా ఒక పెళ్లైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి ఈ మధ్య ఒక పాప కూడా పుట్టింది. మొదట్లో ‘నువ్వంటే నా ప్రాణం’ అనేది. ఎప్పుడైనా గొడవ జరిగితే నేనే ముందు ఫోన్ చేసే వాడిని. ఈ మధ్య ఆ అమ్మాయి ‘నన్ను వదిలెయ్యి. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అంటోంది. కానీ నేను ఎదురుపడితే నా వైపు చూసి నవ్వుతోంది. ఈ పెళ్లైన అమ్మాయిని నేనెలా నమ్మాలి..? నేను మానసికంగా చాలా బాధను అనుభవిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎలా మర్చిపోవాలి? ప్లీజ్ అన్నయ్యా.. నాకు మంచి సలహా ఇవ్వండి. నేను మీరు చెప్పిందే పాటిస్తాను. – గిరి మంచి ప్రేమ.. మంచి కోరుతుంది.అది ఎదగాలి, పెరగాలి, వెలగాలి, పంచాలి.తగ్గాలి, ఒగ్గాలి, నెగ్గాలి..!!కానీ దేన్నీ ధ్వంసం చెయ్యకూడదు..!!పెళ్లైన అమ్మాయి..! బిడ్డ ఉన్న తల్లి...!కుటుంబం ఉన్న కోడలు...! బాధ్యత ఉన్న చెల్లి...!ఒకసారి ఇమాజిన్ చెయ్యి.. నీకే పెళ్లి అయ్యిందనుకో...వేరెవరైనా నీ భార్యతో అలాంటి ఆలోచన పెట్టుకుంటే...నువ్వు ఆ మగాడిని అసహ్యించుకోవా??చాలు గిరి..! ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పు ఇక చాలు..!!మంచితనాన్ని గెలవనివ్వు.మదమాత్సర్యాలను అణిచివెయ్యి.‘సార్..! మదమా..త్సర్యా...లు... అంటే ఏంటి సార్??’ఏదో ఫ్లోలో అన్నాను, నాకూ తెలియదు నీలూ! ‘నాకు తెలుసు సార్! ప్రేమ లేని వాంఛ... డర్టీ థింగ్. ప్రేమను అవమానించే ఆలోచన... దట్ ఈజ్ మదమాత్సర్యాలు. గిరి..! స్టాప్ ఇట్!! బీ ఏ గుడ్ మ్యాన్!!’ ఇంకోసారి ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్‌కి నువ్వే ఆన్సర్ ఇవ్వు నీలూ! నా ముందు అసలు ప్రవేశపెట్టకు ప్లీజ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని సెవెన్త్ క్లాస్ నుంచి లవ్ చేస్తున్నాను. తను మా మావయ్య వాళ్ల అబ్బాయి. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. మా లవ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. నేను పీజీ చేస్తున్నాను. తను పీజీ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్‌కి ప్రయత్నాలు చేస్తున్నాడు. జాబ్ రాగానే మ్యారేజ్ చేసుకుందామంటున్నాడు. వాళ్ల ఇంట్లో మా పెళ్లికి సపోర్ట్‌గా ఉన్నారు కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం మా అన్నయ్య మాత్రమే సపోర్ట్‌గా ఉన్నాడు. ‘నిన్ను బావకు ఇచ్చే పెళ్లి చేస్తాను. బాధపడకు’ అని మా అన్నయ్య మాట ఇచ్చాడు. కానీ మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను హ్యాపీగా ఉండలేను కదన్నయ్యా. వాళ్లని ఒప్పించాలంటే నేను ఏం చెయ్యాలి అన్నయ్యా? దయచేసి మంచి సలహా ఇవ్వండి.– ప్రవీణ వద్దే వద్దు ప్రవీణా..!!‘ఏంటి సార్ బావామరదళ్లు పెళ్లి చేసుకుంటే... పుట్టబోయే పిల్లలకు ప్రాబ్లమ్ అని చెబితే... వాళ్లెలా ఊరుకుంటారు సార్? అయినా ప్రేమ ఏమైనా బంధుత్వం అడిగి వస్తుందా సార్? అంటే కొంచెం ఇష్టం అనిపించినప్పుడు.. లవ్ వచ్చి.. చెవులు కొరుకుతుందా సార్? ‘‘సారీ..! వాడు నీ బావ, ఈ లైన్లో లవ్వు పుడుతుంది..’’ అని చెబుతుందా సార్??? లవ్వుకు లేని రెస్ట్రిక్షన్స్ మీకేంటి సార్? ఎప్పుడూ బావామరదళ్ల లవ్వులో కాలడ్డమేస్తూ ఉంటారు. అయినా మన పెద్దవాళ్లు ఎంతమంది చేసుకోలేదు సార్ చుట్టరికం పెళ్లిళ్లు? ఎందుకు సార్ ఈ శాడిస్ట్ ఆన్సర్లు??? ఇంకేదైనా చెప్పండి పాపం! ప్రవీణ అసలే చాలా డౌట్లో ఉంది సార్!’నీలాంబరీ..! తెలిసి తెలిసి తప్పు చెయ్యొద్దు. వాళ్ల పేరెంట్స్ ఏమనుకొని ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదో తెలియదు కానీ.. ప్రవీణకి దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు తప్పు చెయ్యొద్దని, పుట్టబోయే పిల్లలకు అన్యాయం చెయ్యొద్దు! అది మహా పాపం అని.. దేవుడు పేరెంట్స్ రూపంలో వచ్చి చెబుతున్నాడు అనిపిస్తోంది నీలూ! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నా వంక చూసేది. అలా రోజూ గమనించాను. ఓ రోజు ధైర్యం చేసి తన ఫ్రెండ్ సహాయంతో తనకి లవ్ లెటర్ ఇప్పించాను. తను ఆ లెటర్ని మా అమ్మకు చూపించి, నన్ను తిట్టించింది. ఆ తర్వాత నుంచి తను నా వైపు కోపంగా చూస్తోంది. నన్ను చూడటం మాత్రం మానలేదు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఒకసారి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. అసలు నా గురించి తను ఏం అనుకుంటోందో అర్థం కావట్లేదు. తనని ఫస్ట్ టైమ్ ఒక జాతరలో చూశాను. అప్పుడు ఆ అమ్మాయి ఒకసారి నా వంక, మరోసారి పక్కకు ఫేస్ తిప్పింది. అసలు తన మనసు ఏంటో తెలియట్లేదు. నాకైతే వాళ్ల అమ్మని ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగెయ్యాలని ఉంది . కానీ నాకు ఇంకా జాబ్ లేదు. జాబ్ లేకుండా అడిగితే ఏమని అడగాలి అన్నయ్యా, చెప్పండి ప్లీజ్! – కుమార్ అడుక్కో అన్నయ్యా..! అడుక్కో....!మనసారా అడుక్కో...!తనివితీరా అడుక్కో....!తడబడకుండా అడుక్కో....!వెనుకంజ వేయకుండా అడుక్కో....!నాన్‌స్టాప్‌గా అడుక్కో....!‘ఏమనుకున్నారు.. తన్నేమనుకున్నారు.. పిచ్చివాడనుకున్నారా.. ప్రేమ బిచ్చగాడనుకున్నారా.. ఏమనుకున్నారు..????????? ఏంటి సార్..!? బిచ్చగాడికి చెప్పినట్లు చెబుతున్నారు అడుక్కో...!అడుక్కో....!! అని. ఏంటి సార్..!? ఒక సిన్సియర్ ప్రేమికుడిని మీరు అంత చీప్‌గా చూస్తున్నారు..????’లవ్వాడినప్పుడు లేని సిగ్గు.. లవ్వు అడుక్కునేటప్పుడు ఎందుకు...?? ఛీ – పో అన్నప్పుడు లేని సిగ్గు.. తనే కావాలని అనుకున్నప్పుడు ఎందుకు?? ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి గిళ్లి అనుకున్నప్పుడు లేని సిగ్గు.. కాబోయే అత్తగారిని అడుక్కునేటప్పుడు ఎందుకు??? ఏమో అత్తగారికి నచ్చితే.. పెళ్లి చేసి, ఇల్లరికం ఉంచుకుని, రాజాలాగ చూసుకుంటారేమో..!?! మనమెందుకు అడ్డం చెప్పడం నీలూ????‘సార్!! పెళ్లీ అడుక్కుని.. ఇల్లరికమూ అడుక్కుని.. ఉద్యోగమూ అడుక్కుని.. అత్తగారి దగ్గర ఏం రెస్పెక్ట్ మిగులుతుంది సార్???’ఇవన్నీ అత్తని అడిగేముందు డిసైడ్ చేసుకోమను.. సొంత లెగ్స్ మీద స్టాండ్ అయ్యి పెళ్లికి అమ్మాయిని ఇవ్వమని అత్తగారిని డిమాండ్ చేసే పొజిషన్‌కి ముందు రమ్మను నీలూ!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను మూడు సంవత్సరాలుగా ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. అనుకోకుండా రీసెంట్గా మా ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి ‘నో’ అన్నారు. అయినా సరే తననే పెళ్లి చేసుకుంటానని క్లియర్‌గా చెప్పేశాను. చివరికి ఒప్పుకున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే... నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడటం తనకి అసలు ఇష్టం ఉండటంలేదు. నిత్యం అనుమానిస్తున్నాడు. నా క్యారెక్టర్ గురించి దారుణంగా తిడుతున్నాడు. ఎవరితో మాట్లాడినా సరే రాంగ్గా ఆలోచిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి? అంత చెత్తగా మాట్లాడేవాడితో జీవితాన్ని పంచుకోవాలని లేదు. కానీ తన జ్ఞాపకాల నుంచి దూరం కాలేకపోతున్నాను. గొడవ అయిన ప్రతిసారీ ‘నిన్ను మా అమ్మ ఒప్పుకోదు, నువ్వే ఒప్పించుకోవాలి’ అంటున్నాడు. మా మధ్య ఏదయినా గొడవ జరిగినప్పుడు కూడా నేను బతిమాలుకుంటేగాని తను తిరిగి నాతో మాట్లాడడు. తనే నా సర్వస్వం అని అందరినీ వదలుకుని మరీ తనతో వస్తే, తనేమో అలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది కానీ నా పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమించినంత స్ట్రాంగ్‌గా.. ఒక అమ్మాయిని ఎందుకు ఈ అబ్బాయిలు ప్రేమించరు? నమ్మరు?? కొన్ని రోజుల్లో నా బర్త్‌డే ఉంది. ఈ బర్త్‌డేకైనా నా లైఫ్‌ని ఫ్రెష్‌గా రీస్టార్ట్ చెయ్యాలని ఉందన్నయ్యా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్..! – శ్రీ ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు శ్రీ!ఇంకొకరైతే ఆ సుడిగుండంలో పడి నరకం చూసేవారు..!కానీ నువ్వు తెగువతో ఆలోచిస్తున్నావు..!వాడికి విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంది..!లైఫ్‌లో నిన్ను ఎప్పటికీనమ్మడు..!అనుమానిస్తాడు, అవమానిస్తాడు, క్యారెక్టర్ని దెబ్బ తీస్తాడు..!నీ సెల్ఫ్ వర్త్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పాతాళానికి తొక్కేస్తాడు..!నీకు నీమీదే అనుమానం వచ్చేలా వీక్‌గా చేసేస్తాడు..! గుడ్ డెïసీషన్ ఏంటంటే, వెంటనే ఆ దుర్మార్గుడికి బై చెప్పడం..!సింపుల్‌గా చెబుతా.. నీ ప్రేమ తెగని దారం లాంటిది.ఆ అందమైన దారాన్ని బంధంగా మార్చాల్సింది పోయి...ఆ దారంతోనే నిన్ను బందీని చేయాలనుకుంటున్నాడు..!తెంచేసెయ్యి..! తుంచేసెయ్యి..!! త్యజించేసెయ్యి...!! బీ హ్యాపీ.. హ్యాపీ బర్త్ డే! హ్యాపీ న్యూ లైఫ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
నమస్తే అన్నయ్యా..! నా విరహ ప్రేమ గాథకి మీ అరటిపండు సలహా కాకుండా చక్కటి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పరిస్థితులు మా రెండు ప్రాణాలను వేరు చేశాయి. తన చదువు పూర్తి కాగానే నేను మా ఇంట్లో చెప్పాను. అందరిలానే మొదట్లో వ్యతిరేకించినా చివరికి ఒప్పుకున్నారు. తను మాత్రం మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదు. ఇక్కడ తను తన రక్షణ చూసుకుంది. ఒకవైపు తను అలా చెయ్యడమే మంచిదనిపిస్తోంది. వాళ్ల ఇంట్లో పరిస్థితుల రీత్యా ఆమెకి పెళ్లి చెయ్యాలని సంకల్పించారు. అప్పుడు కూడా తను ఇంట్లో చెప్పలేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. ‘నీ తర్వాత ఇద్దరు పెళ్లి కావలసిన వాళ్లు ఉన్నారు, మనం అలా చేస్తే మీ పేరెంట్స్ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. వీలైతే పెళ్లి వాయిదా వేసే ప్రయత్నం చెయ్యి’ అని నచ్చజెప్పాను. కానీ పెళ్లి వాయిదా వెయ్యడం కష్టమంది. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగిపోయింది. తను నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఇక్కడ నేను కూడా అంతే. కానీ ఇప్పుడు తనకి పెళ్లైపోయింది. అయినా తను నాతో మాట్లాడుతూ ఉంటోంది. అలా మాట్లాడటం తప్పని చెప్పినా వినడం లేదు. అందుకే నేను తను అంగీకరించలేని కొన్ని షరతులు పెట్టాను. ‘నువ్వు నాతో మాట్లాడాలంటే మీ ఆయన అనుమతి తీసుకో, మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి’ లాంటి షరతులు పెట్టాను. అలాగైనా తను నాకు దూరంగా ఉంటుందని, తన సంసార జీవితం చూసుకుంటుందని. కానీ నేను తనకి దూరం కాలేకపోతున్నాను. తను గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రాణం పోతోంది. తన ఆలోచనల వల్ల నా ఆరోగ్యం కూడా దెబ్బతింది. తను గుర్తుకొచ్చినప్పుడల్లా ఊపిరాడటం లేదు. చచ్చిపోదామంటే నా కన్నవాళ్లు ఏమైపోతారోనని భయం. కానీ ఇలా ఎన్నాళ్లు బతకాలి? నేను ఊహించుకున్న తన స్థానంలో ఇంకొకర్ని ఊహించలేను. అది ఈ జన్మకి సాధ్యం కాదు. కానీ మా ఇంట్లో వాళ్లు నేను ఎంత వద్దని చెబుతున్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వండి. – ఎన్.జె నిండు కుండ లాంటి మేఘానికి నిప్పు పట్టినట్టు ఉంది..!‘సార్ మీ కవిత్వం తుప్పు పట్టినట్టు ఉంది!’ఎందుకు నీలూ! భావం బాగోలేదా??‘నిండు కుండలాంటి మేఘానికి నిప్పు ఎలా అంటుకుంటుంది సార్?అసలు నిప్పు అంటుకుంటే ఆర్పేదే నిండు కుండలోని నీళ్లు కదా సార్?అయినా ఆకాశంలో తడితడిగా ఉండే మబ్బుకు మంట ఎలా పుడుతుంది సార్??అందుకే అన్నాను సార్, మేఘానికి నిప్పు కాదు మీ కవిత్వానికి తుప్పు పట్టిందని!!’అదే నీలూ ప్రేమంటే..!! తమ్ముడి మనస్సు నిండు కుండలాంటి మబ్బువోలే చల్లనిది. అమ్మాయి జీవితం చల్లగుండాలని కోరుకున్నది. తన కన్నీటిని గుండెల్లో నింపుకునితొణకక.. బెణకక.. అమ్మాయి జీవితాన్ని కాపాడిన గుండె ఇప్పుడు నిప్పులా రగిలిపోతోంది.‘అమ్మో ఇంత విషయం ఉందా సార్?!? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి??’మంచితనం మంచులాంటిది. బలంగా.. నిబ్బరంగా.. కొన్నాళ్లు ఉంటే తమ్ముడి జీవితం కూడా కోటి ప్రేమల దీపమై వెలుగుతుంది. ‘సార్ ఇవాళ్టి మీ కవిత్వం మీద.. ఓకే స్టాంప్ కొడుతున్నాను.. కానీ దయచేసి ఇంకోసారి ట్రై చెయ్యకండి, మీ చేతిలో అరటిపండు పెట్టి మరీ వేడుకుంటున్నాను!’ అని నవ్వింది నీలాంబరి..! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ నేను తనకి నచ్చినట్లే ఉండాలంటాడు. తను కూడా నాకు నచ్చినట్లే ఉంటాడు. పైగా తనకి కోపం ఎక్కువ. కోపమొస్తే రోడ్డు మీదే కొడతాడు. కనీసం ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడనివ్వడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. వదిలెయ్యాలని ఉంది కానీ వాడు లేకుండా నేను ఉండలేను. వాడు కూడా ఉండలేడు. వదిలేస్తానంటే ఏడుస్తాడు. ఏం చెయ్యాలో కొంచెం చెప్పండి అన్నయ్యా ప్లీజ్! – దివ్య వెంటనే..... ‘ఏం చెయ్యాలి సార్?????’నీలూ... వెంటనే......‘చెప్పండి సార్..!! చెప్పండి ప్లీజ్..!!!’ వెంటనే.......‘థ్యాంక్యూ, గుడ్ బై, సియూ లేటర్ ఇన్ ద నెక్ట్స్ లైఫ్. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్ కాదు. నెక్ట్స్ జన్మ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను పువ్వునైతే నువ్వు ముళ్లు. నేను పండునైతే నువ్వు తొక్క. నేను మార్నింగ్ అయితే నువ్వు నైట్. ముళ్లు లేనిదే పువ్వు ఉండదు, తొక్క లేనిదే అరటిపండు ఉండదు, నైట్ లేనిదే మార్నింగ్ ఉండదు. కానీ రెండూ వేరువేరు. స్వభావాలు సెపరేట్. ఆటిట్యూడ్ డిఫరెంట్. విడిగా ఉంటే హ్యాపీగా ఉంటాం. సో థ్యాంక్యూ, గుడ్ బై, సియూ లేటర్ ఇన్ ద నెక్ట్స్ లైఫ్. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్ కాదు. నెక్ట్స్ జన్మ నుంచి స్టార్ట్ అవుతుంది... అని చెప్పాలా సార్???’అమ్మో..! అమ్మమ్మో...!! ఓరి నాయనో..!!! నీలూ నువ్వు చాలా ఎదిగిపోయావు. ఎంత ఫిలాసఫీ పీకావు. అది కూడా ఎంత సింపుల్‌గా చాలా కరెక్ట్‌గా చెప్పావు..!!దివ్యా..! ఇప్పుడే ఇంత భయం, బాధ ఉంటే పెళ్లి చేసుకున్నాక వాడు రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. తాళి కట్టాను కాబట్టి తన సొంతం అనుకుంటాడు. ఇక అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఏవీ ఉండటానికి వీలు లేకుండా షంటుతాడు. వద్దే వద్దు. ఈ సంబంధం మనకు వద్దు దివ్యా!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అబ్బాయిని లవ్ చేశాను. మా ఇద్దరి మధ్య అనుమానం అనే చిన్న గొడవ మొదలైంది. తను నన్ను చాలా అనుమానిస్తున్నాడు. నేను అబ్బాయిలతో మాట్లాడతానని, అది తనకు నచ్చడం లేదని, నన్ను అనుమానిస్తున్నాడు. అసలు తనని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ! సలహా ఇవ్వండి. చాలా టార్చర్‌గా ఉంది. నన్ను తను అనుమానిస్తుంటే బాధగా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తనే ప్రాణంగా ప్రేమించా. తను ఇష్టం లేదని చెప్పినా మాట్లాడను కానీ, చాలా నీచంగా ఆలోచిస్తున్నాడు సార్! ఓపికతో ఇంకా మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ సార్. హెల్ప్ మీ! – ఊహ మార్చేసెయ్యి!‘మార్చడం రాక కాదు సార్ మీకు రాసింది!?’అందుకే చెబుతున్నా కదా, మార్చేసెయ్యి!‘ఏంటి సార్! గానుగ ఎద్దులా అక్కడే తిరుగుతున్నారు. చెప్పిందే చెబుతున్నారు. మార్చడానికి సలహా అడిగితే... మార్చేసెయ్యి అని ఈజీగా అనేస్తున్నారు?’కరెక్ట్‌గానే చెబుతున్నా నీలూ. అలాంటోడిని మార్చేస్తే పోలా?‘ఓ.. ఓహో.. ఓహో.. ఓహోహోహో... ఓహో.. ఓహోహోహోహో... క్యాండిడేట్‌నే మార్చేసి ఇంకొకడిని ప్రేమించమంటున్నారా మహాప్రభో?!’ఎగ్జాట్లీ!‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది సార్ మీ చెల్లెలు! ప్రాణం తీసేసే అంత జెలసీ, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉన్న క్యాండిడేట్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా సుఖపడుతుంది!‘మరి ప్రేమా?’ప్రేమ, నమ్మకం జోడెద్దులు! రెండూ కరెక్ట్‌గా నడిస్తేనే బతుకుబండి హ్యాపీగా ఉంటుంది.‘అబ్బ.. అబ్బబ్బా.. అబ్బబ్బబ్బా.. ఏం చెప్పారు సార్!! లవ్ అండ్ ట్రస్ట్ జీవితం అనే బండిని లాగే రెండు ఎద్దులని. అబ్బ.. అబ్బబ్బబ్బా...!’ వెటకారం ఆపి అరటిపండు ఇవ్వు నీలూ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ డాక్టర్..! నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను ఇష్టపడింది. కొంతకాలం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అయితే మేం థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ జరిగి, ఏడాది పాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత సారీ చెప్పాను. బట్ తను పట్టించుకోలేదు. చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ తను మారలేదు. చివరికి నాకు తెలిసిన విషయమేంటంటే.. తను ఇంకొకరిని లవ్ చేస్తోందట. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఎంత మరచిపోవడానికి ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. ఏం చెయ్యాలో చెప్పండి డాక్టర్..? – శ్రీకాంత్ ‘సార్... పాపం ఈ యంగ్ బాయ్ మిమ్మల్ని నిజంగా డాక్టర్ అనుకుంటున్నాడు. మీరిచ్చే సలహా సీరియస్‌గా తీసుకుంటాడో ఏమోనని నాకు టెన్షన్ వస్తుంది. ఎందుకైనా మంచిది. మీరు ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకుంటే.. కొంపలు మునగకుండా తప్పుకుంటాం. అయినా వీళ్లేంటి సార్.. మీ వంకర టింకర సమాధానాలు చూశాక కూడా మిమ్మల్ని ఇంత సీరియస్‌గా ఎలా తీసుకుంటున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. అయినా ఈ ప్రశ్నకు మీరేం సమాధానం ఇస్తారో నాకు తెలియదా సార్. ఎలాగూ మీరు సమాధానం ఇవ్వకుండా ఉండలేరు. మీరు ఇచ్చిన సమాధానం తను సీరియస్‌గా తీసుకోకుండా ఉండడు. అందుకే నేనే చెప్పేస్తా సార్. ఇదిగో.. గుడ్ బాయ్..! ఆ అమ్మాయికి నువ్వు ప్చ్.. ప్చ్.. ప్చ్..! అది సంగతి!!’ అబ్బబ్బబ్బబ్బా... నీలూ ఏం చెప్పావు..!‘నిజం కాదా సార్..? అమ్మాయి ఇంకొకరిని ఇంకా ఎక్కువగా ఇష్టపడి మనోడిని ప్చ్.. ప్చ్.. ప్చ్.. అని వదిలెయ్యలేదా సార్?’ప్రేమలో ఉన్నప్పుడు గొడవపడితే ప్రేమ గాఢంగా మారాలి. అలాకాకుండా తేలిపోయిందంటే... అమ్మాయి ఎప్పుడూ మనోడితో సీరియస్ కాదని అనిపిస్తుంది. కానీ హార్ట్ అయితే చాలా డీప్‌గా హర్ట్ అయ్యిందిమనోడికి. నా మాట విను బ్రో! లవ్ స్ట్రాంగ్ కానప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వాలి. స్మైల్ చేసి ముందుకు నడవాలి. కొత్త జీవితానికి ఊపిరి పోసుకుని చలాకీగా అడుగులు వెయ్యాలి. బాధను నెమరేసుకుంటూ దానిలోని తియ్యదనాన్ని చూయింగ్ గమ్లాగా ఎంజాయ్ చెయ్యాలి.‘దున్నపోతులు.. ముందు మింగి, తర్వాత నములుతూ కూర్చుంటాయి అలాగా సార్ బాధను చూయింగ్ చూయింగ్ చెయ్యాల్సింది???’ఆడపిల్లవి నీకేం తెలుసు మగాడి ప్రేమ బాధ ఎలాంటిదో..? నువ్వు జోకులేసుకో.. ఇంకేమైనా చేసుకో..! చూస్తూ ఉండు మనోడు బాధను మెడిసిన్‌గా మార్చుకున్నాక సూపర్ హీరో అయిపోతాడు. ప్చ్.. ప్చ్.. ప్చ్.. అమ్మాయి ఇలాంటి హీరోని పోగొట్టుకున్నందుకు ఎప్పటికైనా షి విల్ రియలైజ్!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -lovedoctorram@sakshi.com -
మరణించిన భగ్న ప్రేమికుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనను విడిచి వెళ్లిపోయిందనే బాధతో ఆత్మాహుతియత్నానికి పాల్పడిన అక్షయ్‌దేవ్ (28) చెన్నై కీల్పాక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారిన తిరుచెందూరుకు చెందిన అక్షయ్‌దేవ్ 28 ఏళ్ల యువతిని 2016లో పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహంపై మనసు మార్చుకున్న ఆమె భర్తను విడిచి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 8వ తేదీన శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకోగా గురువారం మరణించాడు. -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నా. తనూ నన్ను ఇష్టపడ్డాడు. ఇద్దరం బాగా ఉండేవాళ్లం. ఉన్నట్లుండి బ్రేకప్ అనేశాడు. ఎందుకని అడిగితే... ‘నా గోల్స్ (లక్ష్యాలు) గుర్తుకొచ్చాయ్’ అన్నాడు. ఆ కోపంతో, వాడి బెస్ట్ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేస్తే, ఓకే చెప్పాను. దాంతో ఆ అబ్బాయి మళ్లీ లవ్ అంటున్నాడు. ఏం చెయ్యాలో చెప్తారా? ప్లీజ్ అన్నయ్యా! – జాను ‘ఏంటి సార్..? బంతిని గోడకు కొట్టి పట్టుకుంటున్నారు?’కొడితే అటేపోవాలి కానీ, వెనక్కు ఎందుకు వస్తోందా...??? అని చూస్తున్నా నీలూ!‘సార్ జోక్ చెయ్యకండి. గోడకు కొడితే.. ఎలాపోతుంది సార్?? వస్తుంది కానీ...!!’వై? ఎందుకు? క్యూమ్...???????‘బంతి సాఫ్ట్‌గా ఉంటుంది కదా సార్!!’అయితే????‘గోడ స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా సార్!!’సో..????‘సాఫ్ట్‌గా ఉన్న బంతి, స్ట్రాంగ్‌గా ఉన్న గోడను పగల కొట్టి ముందుకు పోలేదు కదా సార్.. అందుకే వెనక్కి వస్తోంది సార్!!’జాను గోడలాగ స్ట్రాంగ్ నీలాంబరి!!‘అబ్బాయిలంతా బంతులా సార్?’మొదటివాడు ఖచ్చితంగా బంతే...!స్ట్రాంగ్‌గా ఉన్న జానుని లవ్‌తో పగలగొడదాం అనుకున్నాడు!పొరబాటున నువ్వెంతా, నీ లవ్వెంతా అని బంతిని పంక్చర్ చేసేసింది.జానుతో గేమ్స్ వర్కౌట్ కాదని తెలిసి.. ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు.‘మరి ఇప్పుడు జాను ఏం చెయ్యాలి సార్???’గోడలా ఉండాలి. పట్టించుకోకూడదు. వాడి నాటకపు ప్రేమను ఒప్పుకోకూడదు..!!వాడు కాదన్నాడని, తాను బంతిలా ఇంకొకడికి చులకన కాకూడదు..!!‘కరెక్ట్ సార్.. గోడ గోడలాగే ఉండాలి స్ట్రాంగ్‌గా. బంతిలా సాఫ్ట్ అవ్వకూడదు.!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను టెన్త్ క్లాస్‌లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ అప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పలేదు. టెన్త్ తర్వాత కొన్ని రోజులకి ఆమెకు ఫేస్బుక్లో రిక్వస్ట్ పెట్టాను. ఓకే చేసింది. బాగా క్లోజ్ అయిన తర్వాత ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవాడిని. అయితే ఎవరో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. బాగా బెదిరిపోయి.. ఫేస్‌బుక్‌లోకి రావడం మానేసింది. ఈ తర్వాత ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని మెసేజ్ చేసింది. ఎందుకు అని అడిగితే.. ‘ఏం లేదు, ఇక్కడితో ఆపేద్దాం. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని అంటోంది. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – బాషా ఏం సలహా ఇవ్వాలి బాషా?‘ఏంటి సార్...! మిమ్మల్ని సలహా అడిగితే... ఏ టైప్ సలహా ఇవ్వాలని మీరే అడుగుతున్నారు!? బాషాకి మీ మీద చాలా పూర్ ఒపీనియన్ వచ్చేస్తుంది సార్. ఆ బాషాకు వచ్చిన ఒపీనియన్ మిగితా లవర్స్‌కి కూడా వచ్చేస్తుంది. దాంతో వాళ్లందరూ మీకు ఉత్తరాలు రాయరు. ఎవరూ ఉత్తరాలు రాయకపోతే మీరు ఇక్కడ కూర్చుని ఈగలు తోలుకుంటూ ఉంటారు. సారీ, ఈగలు కూడా ఉండవు. ఎందుకంటే అరటిపండ్లు లేకపోతే ఈగలేందుకు వస్తాయి సార్? అరటిపండ్లు ఎందుకు ఉండవనుకుంటున్నారా? దానికేముంది సార్.. మీకు ఒక్క లెటర్ కూడా రాకపోతే మీరు బోర్డ్ తిప్పెయ్యాలి కదా సార్. బోర్డ్ తిప్పేస్తే పేపర్ వాళ్లు... ‘వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫెలో?’ అని అనుకుని మీ కాలమ్ ఆపేస్తారు కదా సార్. అప్పుడు పాపులారిటీ ఉండదు. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. నా దగ్గర ఉన్న సేవింగ్స్ గట్రా అంతా నేను ఖర్చు పెట్టేస్తాను. మా మమ్మీ వాళ్లు పెట్టిన బంగారం అమ్మేస్తాను. ఈ స్టెతస్కోప్ కూడా ఇచ్చి లాస్ట్ డజన్ అరటిపండ్లు ఇద్దరం మెక్కుతాం. ఆ తర్వాత ఇంకేముంది సార్ అంతా శూన్యమే. అందుకే నా మాట విని ఏదో తెలిసిన స్మార్ట్ ఫెలోలా సలహా ఇవ్వండి. అంతే కానీ ‘‘ఏం సలహా ఇవ్వమంటావ్?’’ అని బాషాని అడగకండి సార్!!’బాషా బ్రో..! టెన్త్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించావు. అనవసరంగా ఇంకో సారి అలాంటి పసి ప్రేమను కెలక్కు. కన్నీళ్లు పెట్టకు. నిన్ను అర్థం చేసుకుని రిటర్న్ ప్రేమించే అమ్మాయిని, ఫ్రెష్‌గా ఎవరినైనా ఒకరిని వెతికి... ప్రపోజ్ చేసే ముందు నాకే రాయి.. ఓకే!?!‘అప్పుడు కరెక్ట్ సలహా ఇస్తారా సార్? అబ్బా మీరు మేధావులు సార్..!! క్లయింట్ మిమ్మల్ని వదిలి పోకుండా భలే బిజినెస్ ఐడియా పెట్టారు సార్. ఫ్యూచర్లో ఇలాగే సలహాకి ఒక చిన్న ఫిటింగ్ పెట్టండి. మన బిజినెస్ త్రీ గెలలు, ఆరువందల పండ్లుగా అభివృద్ధి చెందుద్ది సార్’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను ఏ అమ్మాయిని లవ్ చేసినా ‘ఫ్రెండ్’ అని సైడ్ అయిపోతున్నారు. కొందరు చాలా క్లోజ్ అవుతున్నారు. ఎంతగా అంటే చూసేవాళ్లంతా లవర్స్ అనుకునేంతగా క్లోజ్ అవుతున్నారు. కానీ ‘ఫ్రెండ్’ అంటున్నారు. నేను ఇప్పటికే ఇద్దరిని లవ్ చేశాను. ఫస్ట్ ఒక అమ్మాయిని త్రీ ఇయర్స్ లవ్ చేశాను కానీ, తను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బట్ తనేమో ‘నాకు లవ్ అంటే గిట్టదు, ఫ్రెండ్స్‌లా అయితే ఉందాం’ అంటోంది. నా వల్ల కావడం లేదు. లోపల ఒకలా బయట ఒకలా ఎలా నటిస్తూ ఉండాలి? అలా నావల్ల కావట్లేదు. తనని మరిచిపోలేకపోతున్నా. స్టడీస్‌పై దృష్టి పెట్టలేకపోతున్నా. ప్లీజ్ సార్ నాకో మంచి సలహా ఇవ్వండి.– – అనుదీప్ ఫ్రెండ్‌గా ఉండటం కూడా సూపర్ బ్రదర్!‘ఏంటి సార్ అనుదీప్ లైఫ్ అంతేనా?’ఏమైంది బ్రో జీవితానికి??‘లవ్వు జివ్వు లేకుండా అలా..?’అలా అంటే???‘అంటే మ్యారేజ్ లేకుండా ఇలా... అని సార్!’ఇలా అంటే అలా... అలా అంటే ఇలా... ఎలా నీలూ..?????‘ఏంటి సార్ ఈ తికమక మాటలు..? అక్కడ అనుదీప్ లైఫ్‌లో.. అణువంత లవ్దీపం వెలగడం లేదుసార్!’అంతా ఒక పరీక్ష నీలూ!‘ఏంటి సార్ ప్రేమించినప్పుడల్లా తెడ్డు చూపించడం కూడా ఎగ్జామేనా సార్?’తెడ్డు చూపించకపోతే... ప్రేమగుడ్డు పెడతారా నీలూ?‘మరి ఎలా సార్ అనుదీప్ లవ్‌లైఫ్????’అమ్మాయి ప్రేమను పట్టుకోవడం గొప్ప కాదు నీలూ!‘మరి ఏంటి సార్ గొప్పా?!!?’ప్రేమించే అమ్మాయిని పట్టుకోవడం గ్రేట్! ‘అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది సార్?’టైమ్ వచ్చినప్పుడు పుటుక్కున ఒడిలో పడుతుంది నీలూ!! నడ్డి విరుగుద్దేమో సార్?’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నాది అందరితోనూ ఈజీగా కలిసిపోయే మనస్తత్వం. టెన్త్ క్లాస్‌లో నాకొక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తనంటే ఇష్టంతో ఓకే చెప్పాను. ఆ తర్వాత మళ్లీ తను టూ ఇయర్స్ కనిపించలేదు. టూ ఇయర్స్ తర్వాత ఫేస్బుక్లో చాట్ చేశాడు. తనకి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని, ఓకే చేశానుని, కిస్ చేశానని కూడా చెప్పాడు. ఫస్ట్ కోపమొచ్చింది. కానీ మనం ఇష్టపడిన వాళ్లు మనల్ని ఇష్టపడాలనేం లేదుకదా అనుకుని, లైట్ తీసుకున్నా. దాంతో మా ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. రీసెంట్గా ఫేస్బుక్లో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. అభిప్రాయాలు కలిశాయి. నేను అడగకుండానే ‘మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోరు’ అని చెప్పాడు. కానీ నాకు తనతో ఉంటే లైఫ్ చాలా బాగుంటుందనిపిస్తోంది. అయితే ఇప్పుడు టెన్త్ ఫ్రెండ్ తిరిగి నన్ను కలుసుకుని నువ్వంటే ప్రాణం, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం, లేదంటే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. నాకు ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయి మీదే చచ్చేంత ప్రేముంది. పైగా, నా పేరెంట్స్‌ని మోసం చేసి మొదటి అబ్బాయితో వెళ్లాలని కూడా లేదన్నయ్యా. నిజానికి టెన్త్‌లో నాది ప్రేమ కాదు ఆకర్షణ అనిపిస్తోంది. కానీ, తను నన్ను కావాలంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – సంధ్య ఒక్క గుద్దు గుద్దు...!!‘ఎవరిని సార్?’ఆ ముద్దు అబ్బాయిని!‘ముద్దు పెడితే గుద్దు గుద్దాలా సార్?’ఎంగిలబ్బాయి మనకెందుకురా అంటున్నా..!‘ఆ అబ్బాయి మంచోడు కాబట్టి చెప్పాడు. ఫేస్బుక్ అబ్బాయి ఏం చేసాడో... ఏం చెప్పలేదో మనకెలా తెలుసు సార్??’వీడి ఫేస్‌కి అంత లేదులే.‘ఫేస్బుక్ అబ్బాయికి ముద్దు పెట్టే ఫేస్ లేదంటున్నారు. ముద్దు పెట్టుకుంటూ ఆంబోతులా తిరుగుతున్నోడిది.. నమ్మే కేస్ కాదంటున్నారు. మరి ఎవరికి ఓకే చెప్పాలి సార్ మీ ముద్దుల చెల్లెలు?షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎ రిలేషన్షిప్!!‘అంటే ఈ కన్ఫ్యూజన్లో ఎవరికీ ఓకే చెప్పకుండా కొంచెం లైఫ్‌ని అర్థం చేసుకునే దాకా వెయిట్ చెయ్యమంటున్నారు కదా సార్!?!’అబ్బా..! నువ్వు ఎంత ముద్దుగా చెబుతావు నీలాంబరీ!!బరీ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నాకు అన్నయ్యలు లేరు. అందుకే ఆ బంధమంటే చాలా అభిమానం. టూ ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ పార్టీలో ఒక అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) పరిచయమయ్యాడు. ఆ రోజువరకూ ఒకరికి ఒకరం తెలీదు కానీ, అన్నయ్యే కదా! అని బాగా క్లోజ్‌గా మాట్లాడాను. తర్వాత నుంచి తనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని. తను కూడా నన్ను సొంత చెల్లెలుగానే ట్రీట్ చేస్తున్నాడు. అయితే తన లాస్ట్ బర్త్‌డేకి ‘హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. లవ్ యూ’ అని విష్ చేశాను. ఆ మెసేజ్ తన గర్ల్‌ఫ్రెండ్ చూసిందట. అప్పటి నుంచి తనని అనుమానిస్తోందట. రోజూ గొడవ పడుతోందట. వాళ్ల గొడవలకు నేనే కారణం అయ్యానని చాలా గిల్టీగా ఉంది అన్నయ్యా. బాగా ఏడుపొస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్లీజ్ సలహా ఇవ్వండి. – లక్కీ ఓరి.. ఓరి.. ఓరి... బంగారుకన్నా....!మీ అన్నయ్య లైఫ్‌ని నువ్వు సేవ్ చేసావు.‘అదెలా సార్? లక్కీ... లవ్ యూ అన్నయ్యా అన్నందుకు, డౌట్ పడి, లక్కీ అన్నయ్యను మోస్ట్ అన్‌లక్కీ చేసేసింది కదా సార్? అందుకే కదా పాపం మీ చెల్లెలు సో మచ్ క్రయింగ్...! ఫీలింగ్ వెరీ వెరీ సాడ్...! మీకు లెటర్ రైటింగ్...! ఇదంతా జరిగింది కదా సార్?!? మరి మీరేంటి సార్.. లక్కీ, వాళ్ల అన్నయ్య లైఫ్‌ని సేవ్ చేసిందని అంటున్నారు?’లక్కీ వాళ్ల అన్నయ్యకి అలా రాసినందుకే అంత అనుమానించే అమ్మాయిని చేసుకుంటే లైఫ్ అంతా అన్‌లక్కీ అయిపోతుందని అందరికీ తెలిసిపోయింది. మై సిస్టర్ ఈజ్ గ్రేట్!!‘మీతో ఎంత కరెక్టుగా చెప్పించాను సార్?’ అందుకే నువ్వు కూడా చాలా గ్రేట్ నీలూ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
క్షణికావేశం!
వనపర్తి క్రైం: చిన్నచిన్న కారణాలను సాకుగా చేసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు.. ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.. పిల్లలను అనాథలను చేస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా.. ప్రేమ విఫలమైనా.. కుటుంబంలో కలహాలు వచ్చినా.. పరీక్షల్లో తప్పినా.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువగా మహిళలు, యువకులే ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహాలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. ఇవీ లక్షణాలు ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధ చూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు నిద్రలేకుండా ఉండటం, ఆందోళన, మానసిక ఓత్తిడి, కంగారు పడటం, తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతి, యువకులు పరిక్షల్లో పేలయినా, ప్రేమలో విఫలమయినా చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు. చాలామంది కుటుంబ కలహాలతో ఎంతో మంది మహిళలు ప్రాణాలు తీసుకుని కుటుంబానికి తీరని విషాదం నింపుతున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. ప్రతి చిన్న విషయానికి చావే శరణ్యమని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచన చేస్తే వారిపై ఆధారపడిన వారు రోడ్డున పడతారనే విషయం గుర్తుకొస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేకపోవడంతో ప్రతి చిన్నదానికి వారితో చెప్పే ధైర్యం లేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముందువెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. సమస్యను ౖధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కోనాలి. భార్యాభర్తల మధ్య సర్దుబాటు లేకపోవడం, యువత చెడు అలవాట్లకు గురికావడంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ప్రేమలో విఫలమైనా.. పరిక్షలో ఫేలైనా మనోధైర్యం కోల్పోతున్నారు. చనిపోయి అందరిని దూరమయ్యేదానికన్నా బతికుండి సమస్యను ఎదుర్కోవాలి. – రవిసాగర్, సైకాలజిస్ట్, వనపర్తి -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను, మా మామ కూతురు ఇద్దరం ఇష్టపడ్డాం. ఒకరంటే ఒకరికి ప్రాణం అనుకున్నాం. కానీ మేము వాళ్లకన్నా ఆస్తిలో చాలా తక్కువని, వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. మేము ఇద్దరం ఓకే అనుకున్నాం. కానీ, ఇప్పుడు మరిచిపోలేకపోతున్నాం. ఏం చెయ్యాలి సార్? మంచి సలహా ఇవ్వండి. – మహేష్ సంపాదించన్నా...!మీ కాబోయే మామ కళ్లు తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే అత్త కళ్లు తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే బామ్మర్ది సొల్లు కార్చుకునేంత సంపాదించన్నా...!మీ కాబోయే మరదలు... దిమ్మ తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే ఆవిడ(మరదలు) ఫ్రెండ్స్ అంతా ‘తను నన్ను చేసుకోవచ్చుగా?’ అంటూ ఆఫర్లపై ఆఫర్స్ ఇచ్చే అంతగా సంపాదించన్నా...!మీ కాబోయే అత్తగారి ఊరు ఊరంతా ‘మైండ్ బ్లాక్’ అయ్యేంత సంపాదించన్నా...!‘సార్ ఏంటి సార్ డబ్బు ఒకటేనా సార్... లవ్‌కి సక్సెస్?’ప్రేమ సంపాదించాడు మహేష్. డబ్బు సంపాదించమని అడుగుతున్నాడు మామ. ఆ మాత్రం చెయ్యలేడా ప్రేమను గెలవడానికి? ‘ఓ..! ప్రయోజకుడు అయితే వర్కౌట్ అవుతుందంటున్నారా...!? విన్నావా మహేష్.. సంపాదించెయ్!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్...! కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ఇద్దరం సేమ్ క్లాస్. తను బాగా రిచ్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను మ్యారేజ్ సెట్ అవ్వదనే ఆలోచనతో ఒప్పుకోలేదు. బట్ తనంటే నాకూ ఇష్టమే. కానీ నన్ను కన్విన్స్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరం బాగా లవ్ చేసుకున్నాం. జాబ్స్ రావడం వల్ల ఇద్దరం వేరే వేరే ఊళ్లకు వెళ్లిపోయాం. ఇద్దరి మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చేసింది. కానీ మాకు అలా అనిపించేది కాదు. తను ఒక నెల తరువాత నన్ను కలవడానికి వచ్చింది. ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చింది. కానీ వెళ్లేటప్పుడు నాకు సారీ చెప్పి, మన పెళ్లి జరగదు విడిపోదాం అని చెప్పింది. నేను తట్టుకోలేకపోయా. కారణం ఏంటంటే... ‘‘నాకు సంబంధాలు చూస్తున్నారు’’ అంది. ‘‘ఇంట్లో అసలు ఒప్పుకోరు’’ అంటోంది. నేను తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. దీనికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – జీవ ఏం చెప్పమంటావ్ అన్నయ్యా..?నీ పరిస్థితి చూస్తుంటే దిగులుగా ఉంది...నిన్నే చదివా నీ ఉత్తరం....రాత్రంతా పట్టలేదు నిద్దర...బతుకంతా చిందర వందర...ముందు వద్దనుకుని.. మళ్లీ దిగావు సుందరా...కానీ చివరికి మిగిలింది ఏందిరా....లైఫ్ అంతా చిందర వందర...‘ఏంటి సార్..! మీ లైఫ్‌లో కూడా ఒక రిచ్ అమ్మాయి...మిమ్మల్ని వాడుకుని.. బనానా మిల్క్ షేక్ చేసుకుని...తొక్కలా పారేసిందా సార్..!?’నువ్వు నా లైఫ్ డిగ్ చేయకు నీలూ...జీవాకి బిగ్ సొల్యూషన్ చెప్పు...‘ఆ.. ఏముంది సార్, లైఫ్‌లో ఇలాంటివి జరిగితే టేకిటీజీ పాలసీ ఉండాలి సార్. అంతగా ఫీల్ కాకూడదు. మనోడు ఎంత హ్యాండ్సమ్ కాకపోతే రిచ్ అమ్మాయిలు ఇష్టపడతారు సార్? ఇప్పటికి మాత్రం అమ్మాయిల నుంచి వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ మెయిన్‌టెన్ చేస్తే కుదుట పడతాయి. ఏమంటారు సార్???’ సూపర్ నీలూ...! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా...! నేను ఒక అమ్మాయిని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడింది. కానీ మా నేపథ్యాలు వేరు. నాకు తనంటే పిచ్చి. తనకి తన పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ‘‘ముందు నువ్వు జాబ్ తెచ్చుకో.. ఇంట్లో ఒప్పిస్తాను’’ అంది. ఇదంతా ఇంట్లో చెబితే, మా ఇంట్లో వాళ్లు చాలా భయపడుతున్నారు. నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే మేం చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఒకవైపు నా ఫ్యామిలీ కావాలి. మరోవైపు తనూ కావాలి అనిపిస్తోంది. ప్లీజ్ అన్నయ్యా.. నాకు సలహా ఇవ్వండి ప్లీజ్.– రాజీవ్ ఉద్యోగం తెచ్చుకో రాజీవ్....ఎక్కడైనా దూరంగా....హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ....లైఫ్ ఎంజాయ్ చెయ్యి..ఆ ఊరిలోనే...అవే పరిసరాలలో ఉండీ.. ఉండీ....బుర్ర బర్బాద్ అయిపోయింది.గాలి తగలాలి....మనసుకు... హృదయానికి....రోజూ ఏవో ఆలోచనలతో పిచ్చెక్కి....బాగా డౌన్ అయిపోయావు ఎమోషనల్‌గా...కొంచెం టైమ్, ఆ పరిసరాల నుంచి దూరంగా ఉంటే...మంచి నిర్ణయం తీసుకోగలుగుతావు రాజీవ్.‘అబ్బా ఎంత సింపుల్‌గా, క్లియర్‌గా చెప్పారు సార్ ఆన్సర్...రోజూ ఇలాగే చెబితే ఎవరికీ తలనొప్పి ఉండదు కదా సార్????’గుండె నొప్పి అలాగే ఉండిపోతుంది నీలూ...! నవ్వుతూ... నవ్విస్తూ... పరిష్కారం చెబితే... బాధ, కోపం, విస్మయం తగ్గి సంతోషం కలుగుతుందిరా బంగారం. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతుందనిపిస్తోంది. ప్రపోజ్ కూడా చేశాను కానీ, అ అమ్మాయి బయటపడ్డంలేదు. ఎందుకు లవ్ చెయ్యడంలేదని అడిగితే.. ‘‘నేను చదువుకోవాలి’’ అని చెబుతోంది. సో నేను ఏం చెయ్యాలి? లవ్ చెయ్యాలా..??? వదిలెయ్యాలా..???? – రాజ్ వదిలెయ్యి! ‘సార్ రాజ్ గుండె మీద తుపాకీతో కాల్చినట్టు ఏంటి సార్ ఆ సమాధానం?’ గురి పెట్టి కాల్చడానికి రాజ్ ఏమైనా పిట్టా??? ‘అది తెలిసి కూడా.. డిష్యూం అని ఎలా కాల్చారు సార్?’ రాజ్ కాల్చలేదా? ‘ఏంటి సార్ కాల్చింది?’ తన గుండెలో భావాన్ని తీసుకుని.. దాన్ని బుల్లెట్లా సాన పెట్టి... నోటి పండ్ల మధ్య బిగబెట్టి.. మాటల తూటా పేల్చలేదా??? ‘ప్రేమించానని చెప్పడం కూడా పేల్చడమేనా సార్?’ అమ్మాయి పిట్ట కాదు. బడేల్మని రాలి మనోడి కాళ్లదగ్గర పడ్డానికి..? షీ ఈజ్ ఎ కంప్లీట్ ఉమెన్. రిమెంబర్ దట్!! ‘ఎందుకు సార్ అంత కోపం మీకు!!!?!!!’అరే.. ప్రేమించాను అనగానే అమ్మాయి పడాలా? రాజ్ తన మనసులో మాట చెప్పుకున్నాడు. అమ్మాయికి ఇష్టం ఉంటే ఒప్పుకుంటుంది. తెలియక పోతే టైమ్ తీసుకుని చెబుతుంది. అప్పుడు కూడా పాజిటివ్‌గా చెప్పాలనేంలేదు. తనకు కూడా కరెక్ట్ అనిపిస్తేనే కదా.. అమ్మాయి మనసును గౌరవించకుండా రాజ్ లాంటి మంచి వాళ్లు కూడా రెచ్చిపోతే ఎలా నీలాంబరీ!?!‘కరెక్ట్‌గా చెప్పారు సార్..! రాజ్.... ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ యార్!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఎంతలా అంటే నాకు ప్రతిక్షణం తనే గుర్తొస్తోంది. తనని నేను నాలుగేళ్ల క్రితం కాలేజ్‌లో చూశాను. తనూ నాకు కనెక్ట్ అయింది. మా కాలేజ్ అయిపోయి రెండేళ్లు అయిపోయింది. ఇప్పటికీ తను నాకు టచ్‌లోనే ఉంది. తను మరాఠీ అమ్మాయి. తనకి ప్రపోజ్ చేశా, బట్ నేనంటే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కానీ రోజూ నాతో మాట్లాడుతోంది. చాలా క్లోజ్‌గా ఉంటోంది. మా ఇంట్లో ఈ విషయం చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు కానీ ఆ అమ్మాయి సైడ్ నుండి నాకు క్లారిటీ రావట్లేదు. తనకి కూడా నేనంటే ఇష్టం అనుకుంటున్నా. కాకపోతే తన ఇంట్లో రెస్పాన్స్ గురించి ఆలోచిస్తుందేమో అని అనిపిస్తోంది. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇది లవ్వా? లేక అట్రాక్షనా? చెప్పండి ప్లీజ్. – సాగర్ హికడే ఆ! ‘అంటే ఏంటి సార్?’ తికడే ఝా! ‘సార్ షో అప్ చేయకండి.. మీకు మరాఠీలో రెండే ముక్కలొచ్చని...!’ ఇక్కడికి రా.. ‘వస్తున్నా సార్..’ హికడే ఆ అంటే ఇక్కడికి రా అని.. ‘ఓ.. తికడే ఝా అంటే అక్కడకి పొమ్మనా సార్??’ ఎంత కరెక్ట్‌గా చెప్పావు నీలాంబరీ? ‘దానికి, సాగర్ ప్రేమకు ఏంటి సార్ సంబంధం???’ ఏం లేదు. మరి...! అమ్మాయి మరాఠీలో ఏం చెప్పిందో... సాగర్ ఏమని అర్థం చేసుకున్నాడో.. మనోడు తెలుగులో ఏం చెప్పాడో.. అమ్మాయికి ఏం అర్థమయిందో.. ఇక్కడికి పో అంటే ఇక్కడికి రా అనుకున్నాడేమో... అక్కడికి పో అంటే అక్కడికి రా అనుకున్నాడేమో... ‘సార్.. మీ కుళ్లు జోక్‌కి నాకే నవ్వు రావడంలేదు.. ఏడుస్తున్న సాగర్‌కి ఏం నవ్వు వస్తుంది సార్??? ఏదైనా పనికొచ్చే విషయం ఉంటే తెలుగులో చెప్పండి సార్!’ సాగర్... అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ప్రేమలేదు. నీ కంపెనీ అంటే ఇష్టం. నీతో ‘ఆ’ కనెక్షన్ ఇష్టంలేదు... నువ్వు ఫ్రెండ్‌గా మాట్లాడ్డానికి ఇష్టం. ముడులేసుకోవడానికి కష్టం అని చెబుతోంది. ‘దీన్నిబట్టి మనకు అర్థం ఏం అయిందంటే... సాగర్ చాలా మంచివాడు. అమ్మాయిలు సాగర్ మంచితనాన్ని నమ్ముతారు. గ్రేట్! ‘ఇక సాగర్‌కి లవ్ ప్రాప్తం కాదా సార్?? మంచోడూ.. మంచోడూ... అని అమ్మాయిలంతా ఆటాడుకుంటారా సార్? అన్యాయం సార్, మంచితనానికి రోజులే లేవు సార్!’ అట్లేమీ లేదు. చూస్తూ ఉండు.. సాగర్‌కి గ్రేట్ లవ్ దొరుకుద్ది. 100%..!! ‘హికడే ప్రేమ తికడే దొరుకుద్దా సార్..???’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. తనూ నన్ను లవ్ చేస్తున్నాను అంటున్నాడు కానీ, మళ్లీ లవ్ చెయ్యడంలేదు అంటున్నాడు. మరి ఫస్ట్ ఎందుకు లవ్ చేశావని అడిగితే... ‘‘నచ్చావ్, అందుకే లవ్ చేశాను’’ అంటున్నాడు. మరి ఇప్పుడు..? అని అడిగితే.. లవ్ చెయ్యడం లేదంటున్నాడు. ఒకసారి నువ్వంటే ప్రాణం అంటాడు మరోసారి అదేం లేదంటాడు. నన్ను ఫుల్‌గా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అసలు తనని లవ్ చెయ్యాలా వద్దా సార్? అలా అని తనని మరిచిపోలేను. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – రమ థౌజెండ్ మందార పువ్వులు తీసుకో చెల్లెమ్మా..! ‘వెయ్యి మందార పువ్వులతో ఏం చెయ్యాలి సార్???’ముందు తీసుకుంటే అప్పుడు చెబుతా.. ‘చీటింగ్ చీటింగ్ సార్..! రేపు మీ చెల్లెలు వెయ్యి మందార పూలు కొన్నాక.. మీరు పట్టించుకోకపోతే..? కుదరదంటే కుదరదు అంతే.. ఏం చెయ్యాలో ఇప్పుడే చెప్పాలి సార్!’ ఓకే.. నువ్వు ఇంక నస పెట్టకు నీలాంబరీ.. అందమైన అమ్మాయిలు నస పెడితే అందం ఎగిరిపోతుంది. ‘సార్... నా అందం ఇంపార్టెంట్ కాదు సార్.. నేను ఇంటెలిజెంట్ అది ఇంపార్టెంట్..!!’ ఒక పువ్వు తీసుకుని... ‘ఊ.. తీసుకుని?’ దాంట్లో నుంచి ఒక రేక తుంచేయాలి. ‘ఊ.. తుంచేసి..?’ ‘‘తను నన్ను ప్రేమిస్తున్నాడు..’’ అని అనుకోవాలి. ‘ఊ.. అనుకుని...?’ మళ్లీ ఇంకో రెక్క తుంచేయాలి. ‘ఊ.. మళ్లీ తుంచేసి..?’ ‘‘తను నన్ను ప్రేమించడం లేదు..’’ అని అనుకోవాలి.‘ఊ.. అనుకుని..?’ చివరి పువ్వులోని చివరి రెక్క పీకి పారేసినప్పుడు.. ‘ఊ.. పీకి పారేసినప్పుడు..?’ ప్రేమిస్తున్నాడని అనుకుంటుందో.. ప్రేమించడంలేదని అనుకుంటుందో.. దాన్నిబట్టి అబ్బాయి రమను ప్రేమిస్తున్నాడో లేదో తెలిసిపోతుంది. ‘తొండి సార్.. వెయ్యి మందార పువ్వులకు గుండు కొట్టి అబ్బాయి ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి మీకు ఉత్తరం రాయాల్సిన అవసరం ఏముంది సార్??’ నేను చెబుతుందీ అదే. ఆ అబ్బాయి మతిస్థిమితం లేని కాండిడేట్. ఎప్పుడు ఎస్ అంటాడో.. ఎప్పుడు నో అంటాడో ఆ మెంటల్కే తెలీదు. అది తెలుసుకునే బదులు రమ... ‘వెయ్యి మందారపువ్వులను బాధ పెట్టినట్టు తనను తాను బాధపెట్టుకోకుండా ముందుకు సాగిపోతే మంచిదని చెబుతున్నారా సార్??’ యు ఆర్ వెరీ స్మార్ట్ నీలూ...! ‘మీరు కూడా సార్..!! ఇంద తొక్క పీకేసిన అరటిపండు’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
న న్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా..! నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను ఒకరోజు కాలేజ్‌కి వెళ్తూ... వేరే కాలేజ్ అమ్మాయిని చూశాను. బాగా నచ్చింది. దాంతో తన పూర్తి వివరాలు తెలుసుకున్నా. వన్ మంత్ తనని చూడ్డానికి వాళ్ల బస్టాప్‌కి వెళ్లేవాడిని. ఆ తరువాత ఎఫ్బి ఐడీ తీసుకుని కొద్ది రోజులు చాట్ చేశా. తను ఒప్పుకోవడంతో రెండు సార్లు కలిసి మాట్లాడాను కూడా. అయితే రెండోసారి కలిసినప్పుడు తనకి తెలీకుండా తన బ్యాగ్‌లో చాక్లెట్ వేశాను. ఇక అంతే.. ఆ రోజు నుంచి నాతో సరిగా చాట్ చెయ్యడం మానేసింది. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాసేసింది. నన్ను బ్లాక్ చేసింది. తనని నేను మరిచిపోలేకపోతున్నాను. పైగా తను నాకంటే వన్ ఇయర్ పెద్దది. ఆ విషయం కూడా నేనే తనకి చెప్పాను. ఎందుకు తను మాట్లాడటం మానేసిందో అర్థం కావడంలేదు. ప్లీజ్ నాకో మంచి సలహా ఇవ్వండి అన్నా. – శాండి సరైన చాక్లెట్ ఇవ్వకపోతే అలాగే అవుతుంది. ‘ఏంటి సార్ అయ్యేది!?!’ యా! ‘ఎలాంటి చాక్లెట్ ఇస్తే లవ్ వర్కౌట్ అవుతుంది సార్??’ అది అమ్మాయిని బట్టి ఉంటుంది. ‘రామచంద్ర.. శాండీ నెత్తి కొట్టుకుంటాడు సార్!’ అవును నీలాంబరీ... అమ్మాయికి చాక్లెట్ సూట్ అయితే... ‘లవ్ సూట్ అవుద్దా సార్? టు మచ్ సార్. శాండీ ఏదో కష్టాల్లో ఉండి సాయం అడిగితే ఆడుకుంటున్నారు కదా సార్? మీరూ, మీ సిస్టర్.. ప్రేమికులంటే మీకు అంత చీపా సార్??? మీకు బ్యాడ్ డేస్ వస్తాయి సార్, అప్పుడు రాయండి శాండీకి... ఉతికి ఆరేస్తాడు..!’ ఎందుకు నీలాంబరీ అంత కోపం...? తప్పు కాదా నీలూ అమ్మాయి బ్యాగ్‌లో దొంగతనంగా చాక్లెట్ వెయ్యడం?? ‘సార్ చాక్లెట్ వేశాడు. తీసుకోలేదు. తీసుకుంటే దొంగ సార్!’ మనస్సు దొంగలించాలన్న వాడు దొరలా అడగాలి కానీ.. తుంటరి పనులు చేస్తే... ‘చేస్తే ఏంటి సార్.. చేస్తే...???’ అలా చాక్లెట్ వేస్తే... అమ్మాయి బిస్కెట్ వేస్తుంది నీలాంబరీ...! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. మొదట్లో మేం బెస్ట్ ఫ్రెండ్స్. చాలా క్లోజ్ అయ్యాం. వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చాక... ‘‘వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది, తనంటే నాకు ఇష్టంలేదు. కానీ చేసుకోకపోతే మా నాన్న చచ్చిపోతాడు’’ అని చెప్పాడు. ఒకసారి నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మేం లవ్ చేసుకుంటున్నామని కూడా చెప్పాను. కానీ తన నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ ఇయర్లో పెళ్లి అవొచ్చు అంటున్నాడు. అయినా సరే నాతోనే ఉంటున్నాడు. మరిపోవాలని ట్రై చేస్తున్నా కానీ ప్రతిసారీ ఫెయిల్ అవుతున్నా. వాడికి ఎక్కడ పెళ్లి అయిపోతుందోనని చాలా భయపడుతున్నా. నిద్రాహారాలు లేకుండా నిత్యం ఏడుస్తున్నా. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – కావ్య కావ్యా బంగారం...!నీ పేరులా... జీవితం అంత అందమైన కావ్యం కాదురా!అపశృతులు ఎక్కువ.ప్రేమ సరైన వాడితో చెయ్యకపోతే..లైఫ్ అంతా అపశృతే..!కొలనులోని అందమైన కమలం చుట్టూ బురదే ఉంటుంది నాన్నా.తామరాకులా ఉండడం నేర్చుకోవాలి.‘సార్ తామరాకులా అంటే ఎలా సార్??’బురద చుక్కలు పడ్డా..తామరాకు అందం మారదు..తామరాకు ఆలోచనా మారదు...ఎందుకంటే తామరాకుకు తెలుసు..తాను స్వచ్ఛమైనదని.మంచీచెడు తనను కెరటంలా ఎగరనివ్వదని, పడనివ్వదని. ‘అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ప్రేమ పన్నీరా? బురద చుక్కా? సార్????’ప్రేమించిన వాడిలో పవిత్రత ఉంటే నాన్న కొడతాడనో..అమ్మ కోప్పడుతుందనో అమ్మాయికి అన్యాయం చెయ్యడు.అమ్మానాన్నల మీద అంత గౌరవం ఉంటే.. అమ్మాయిని తప్పుదారి పట్టించాల్సింది కాదు.ఆ అబ్బాయికి, తన ఫియాన్సీకి కావ్య అంటే చాలా చిన్న చూపు ఉంటుంది.అలాంటి చోట.. అలాంటి మనుషుల మధ్య నా బంగారం....‘ఒక్క క్షణం కూడా ఉండకూడదు సార్... ఉండకూడదు అంతే..!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మీరు లవర్స్‌కి ఇచ్చే సలహాలు చాలా బాగుంటాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను ఇష్టపడుతోంది. లైఫ్‌లో సెటిల్ అయ్యాక ఇంట్లో ఒప్పించి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బట్ నాకు తను రోజూ గుర్తుకొస్తోంది. చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నా. ఏ పనీ సరిగ్గా చెయ్యలేకపోతున్నా. తను కూడా అదే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తోందట. ఏం చెయ్యాలో అర్థంకావడంలేదు. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నా. – ప్రకాశ్ మీది చాలా అందమైన ప్రాబ్లమ్.. ‘ప్రాబ్లమ్ కూడా అందంగా ఉంటుందా సార్..???’ ప్రేమ అందంగా ఉంటే, ప్రేమ ప్రాబ్లమ్ కూడా అందంగానే ఉంటుంది నీలాంబరీ..! ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది సార్.. కానీ, మీకు అబ్బాయిల ప్రేమే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో అంత వివక్ష మీకు... అర్థం కాదు సార్!’ అబ్బాయి ప్రేమ దొరకకపోయినా బతకడం నేర్చుకున్నాడు... చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాడు.. ‘డిస్ట్రాక్ట్ అంటే ఏంటి సార్??’ ఆంక్షలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఏదో ఒకటి చేస్తూ ప్రేమ లేని లోటు.. ఆ లోటు కలిగించే విపరీతమైన బాధను కొద్దిగా తప్పించుకోగలుగుతాడు. కానీ, అమ్మాయికి ప్రేమే ప్రపంచం అయిపోతుంది. ఇంటా బయటా ఆంక్షలు కూడా ఎక్కువ అవడంతో... ఒక ట్రాప్‌లో ఉండిపోతుంది. కుమిలిపోతుంది. కృంగిపోతుంది. అందుకే, అమ్మాయిల పక్షం తీసుకుంటాను. అబ్బాయిలు చెడ్డవారని కాదు. ‘చాలా తెలివిగా తప్పించుకుంటారు సార్ మీరు... ప్రకాశ్‌కి సమాధానం చెప్పండి.’ ప్రేమను గుర్తు చేసుకోవడం కంటే... ‘కంటే...?’ ప్రేమను గురిగా మార్చుకుని... రాబోయే రోజుల్లో కలసి ఉండే అందమైన జీవితాన్ని తలుచుకుంటూ.. గొప్ప వాళ్లు అవ్వండి ప్రకాశ్..! గాడ్ బ్లెస్ యు..!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తనంటే నాకు ప్రాణం. అలా అని తను లేకుండా బతకలేనని చెప్పలేను. ఎందుకంటే.. నాకు నా ఫ్యామిలీ కూడా ముఖ్యమే. తను నాతో లేకపోతే నేను హ్యాపీగా మాత్రం ఉండలేనన్నది నిజం. విషయం ఏంటంటే... మేమిద్దరం స్కూల్‌మేట్స్. బట్ ఎప్పుడూ స్కూల్లో కలవలేదు, మాట్లాడుకోనూలేదు. రీసెంట్గా తనని చూశాను. చూడగానే లవ్ చేశాను. తరువాత ఫ్రెండ్‌గా బాగా క్లోజ్ అయ్యాను. నిజానికి నేను చాలా మంది అమ్మాయిలతో చాట్ చేస్తాను కానీ, ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ రాలేదు. ఇప్పటిదాకా లవ్ చేస్తున్నానని చెప్పలేదు. బట్ నా లవ్ ఫీలింగ్ తనకు అర్థమయ్యేలా చేశాను. దాంతో లవ్ అయితే నాతో మాట్లాడకు.. ఫ్రెండ్‌లా అయితే మాట్లాడు అంటోంది. సో, నేను ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్! – రూపేశ్ లవ్ అమ్మా... చాలా కాంప్లికేటెడ్!‘అది తెలిసే కదా సార్ మీకు రాసింది..!?’ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు! ‘ఏంటి సార్??? లవ్ కంటే మీ ఆన్సర్ కాంప్లికేటెడ్‌గా ఉంది!’ నీలాంబరీ... నన్ను మాట్లాడనిస్తే.... ‘ఏంటి సార్ మాట్లాడేది...?? నాకు మీరు ఏమి చెబుతారో ఆల్రెడీ తెలుసు..!’ సరే నువ్వే చెప్పు... ‘ఓరి బడుద్దాయ్...! ఇలా కాదు రా లవ్వేది..’ అబ్జెక్షన్ నీలాంబరి. ‘దేనికి సార్ అబ్జెక్షన్?’ బడుద్దాయ్కి అండ్ లవ్వేదికి అబ్జెక్షన్...!! ‘బడుద్దాయ్ అంటే లవ్‌ని అర్థం చేసుకోలేని పసివాడు అని సార్!’ అవునా? అబ్బో నాకు తెలియదే...! మరి.. లవ్వేది..?!? ‘అది ఒక ప్రక్రియ సార్.. లవ్ చేసే ప్రక్రియను లవ్వేది అంటారు సార్!’ లవ్ దోమ కుడితే వచ్చే ప్రేమ జ్వరాన్ని లవేరియా అన్నట్టు.. మలేరియా లాగ.. అంతేనా?? ‘డిస్టర్బ్ చెయ్యకండి సార్ ఫ్లో దెబ్బ తింటుంది..’ కానియ్యి.. నీ లవ్ ఫ్లో.... ‘స్నేహాన్ని ప్రేమగా అబ్బాయిలు కన్ఫ్యూజ్ అవుతారు..’ మరి అమ్మాయిలు?? ‘సార్.. అమ్మాయిలూ.. మీ బుజ్జి బంగారాలు.. ప్రేమను స్నేహం అని కన్ఫ్యూజ్ అవుతారు సార్!’ మరి రూపేశ్ ఏం చెయ్యాలి?? ‘అదే సార్ పాయింట్.. రూపేశ్ ఏమీ చెయ్యకూడదు. అసలు అమ్మాయిని పట్టించుకోకూడదు. అంజాన్ కొట్టాలి.. ముందు నుంచి అమ్మాయి వస్తుంటే వెనక నుంచి తుర్రుమని జారుకోవాలి. మాట్లాడితే చెవిటి వాడిలా యాక్టింగ్ చెయ్యాలి. ఫోన్లో మెసేజ్ పెడితే గుడ్డివాడిలా యాక్ట్ చెయ్యాలి. రా.. నా వెంట రా అని పిలిస్తే.. కుంటి వాడిలా యాక్ట్ చెయ్యాలి.’ అర్థమయ్యింది నీలాంబరీ.. ఇవన్నీ చేస్తే రూపేశ్కి లవ్ దొరుకుద్దా?? ‘ఎందుకు దొరకదు సార్... అమ్మాయిని పట్టించుకోకపోతేనే లవ్ బిక్ష దొరుకుతుంది సార్..’ నిజంగా ఏదైనా రాంగ్ అనుకుని.. ఓ రూపాయి బిచ్చమేస్తే రూపేశ్ తట్టుకోలేడేమో నీలాంబరీ..? ‘పొండి సార్.. రూపేశ్‌ని నేను చెప్పినట్లు ట్రై చేయమనండి. లవ్ బిక్ష దొరకకపోతే అప్పుడు మీరు ఆన్సర్ ఇద్దురుగానీ, అప్పటి దాకా ఇంద అరటిపండు తినండి!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా.. మీరు చాలా సమాధానాల్లో అబ్బాయిలది లవ్ కాదు పొసెసివ్‌నెస్ అని చెబుతుంటారు. పొసెసివ్‌నెస్ ఉన్నవాడితో సంతోషంగా ఉండలేం, దూరంగా ఉండమని చెప్పారు. అసలు పొసెసివ్‌నెస్ అంటే ఏంటి? నేను ఇష్టపడ్డ అబ్బాయిది కూడా పొసెసివ్‌నెస్ అని నా ఫ్రెండ్స్ అంటున్నారు. తనకి నేనంటే చాలా ఇష్టం. నాకు తనని మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. ఏం చేస్తే తను మారతాడో చెప్పండి. తెలియని కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకునే కంటే.. అన్నీ తెలిసిన తననే చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాననిపిస్తోంది. నిజానికి తను లేకుండా నేను బతకలేను. సలహా ఇవ్వండి ప్లీజ్. – సమత సమతా.. నీకు దండం పెడతా నాన్నా..! పొసెసివ్‌నెస్ లవ్‌గా మారదు..! అదొక జబ్బురా బంగారం...!! అనవసరంగా నీ లైఫ్‌లోకి ఒక డిసీజ్‌ని ఇన్వైట్ చేయొద్దు! చాలా కష్టపడతావు ఛాంపియన్!! అతిగా ప్రేమించే వాడు చాలా ముచ్చటగా అనిపిస్తాడు...! ఎంత ప్రేమలేకపోతే నన్ను అంతగా ఆరాధిస్తాడు అని అనిపిస్తుంది! కానీ, చెబుతున్నా.. నా మాట జాగ్రత్తగా విను..!! ఊపిరి పోసేది ప్రేమ...! ఊపిరి ఆడనివ్వనిది పొసెసివ్‌నెస్..!! తేడా అర్థం చేసుకో..!! ఇలాంటివాళ్లే కంట్రోల్ తప్పుతారు..! నిన్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏదైనా చేస్తారు..! కొత్త వాడితో కాంప్రమైజ్ అవడం కన్నా... ఈ మానసిక రోగితో అడ్జెస్ట్ అయిపోతాననుకోవడం.. ఇట్ ఈజ్ డేంజరస్... నీకు నీవు కీడు చేసుకున్న దానివి అవుతావు.. నీకు దండం పెడతా ఆ ట్రాప్‌లో పడకు నాన్నా..! డోంట్ బి ఎమోషనల్లీ వీక్.. డోంట్ బ్రేక్‌డౌన్ అండ్ మేక్ ఎ మిస్టేక్. వెంటనే దూరంగా ఉండడం నేర్చుకో... నీకు ఒక ఫ్రెండ్‌గా.. ఒక అన్నగా.. ఒక శ్రేయోభిలాషిగా.. అర్థిస్తున్నాను.. ఐ యామ్ బెగ్గింగ్ యూ టు కీప్ అవే ఫ్రమ్ హిమ్! ‘సార్ మీరు ఆన్సర్ ఇస్తుంటే అసలు ఆటపట్టించాలని అనిపించలేదు... నిజం సార్ అలాంటి వాడు సమత లైఫ్‌ని డిస్టర్బ్ చేసేస్తాడు.. మీరు చెప్పిందే కరెక్ట్.. ఒక అమ్మాయిగా నాకూ భయంగా ఉంది.. సమతా.. మీ అన్న చెప్పింది తప్పకుండా పాటించు. లవ్ యు రా!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్, నేను ఒక అమ్మాయిని వన్ అండ్ ఆఫ్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. తనూ నేను ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నాం. నాకు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడటం చేతకాదు. కానీ తనతో ఎప్పుడూ మాట్లాడాలనిపిస్తోంది. తను లేకపోతే జీవితమే లేదనిపిస్తోంది. తనకు ప్రపోజ్ చెయ్యాలంటే ఎందుకో తెలియని కంగారు, భయం. నా లవ్‌కి చిన్న సొల్యూషన్ ఇవ్వండి సార్ ప్లీజ్! – అభి ఎయిటీన్ మంత్స్ గుండె గర్భంలో పెంచుతున్నావా అన్నా.. నీ ప్రేమను!??‘అబ్బా.. ఏం ప్రయోగం సార్ అది.. ‘‘గుండె గర్భంలో..!’’ వెరీ ఫన్నీ..!! నాట్ ఎటాల్ సీరియస్ సార్!!’తల్లి గర్భంలో పెరిగేది బాధ్యత అయితే....‘అయితే...!?!’గుండె గర్భంలో పెరిగేది ప్రేమ!!‘అంటే.. గుండెలో పెరిగే ప్రేమకు బాధ్యత ఉండదని తిడుతున్నారు కదా సార్?’తిట్టానా నీలాంబరీ..?‘సార్ అసలు అబ్బాయిలు అడ్వయిజ్ కావాలని మీకు రాయడముంది చూసారూ... వాళ్ల గుండెల్ని వాళ్ల రాళ్లతోనే కొట్టుకున్నట్టు సార్!’ఏంటి నీలూ నీ ఫ్లోలో నువ్వు రెచ్చిపోతున్నావు.. ఇప్పుడు నేనేమన్నానని?‘ఇంకేమనాలి సార్? అభిది బాధ్యత లేని వల్లమాలిన ప్రేమ అనే కదా సార్ మీరు చెప్పాలనుకుంది? అలాంటి వల్లమాలిన ప్రేమ చెప్పుకునే బదులు ఎయిటీన్ మంత్స్ ఏం కర్మా.. ఎయిటీన్ ఇయర్స్ అయినా మౌనంగా గుండె గర్భంలో పెట్టుకో.. అనే కదా సార్ మీరు చెప్పబోయేది..!?’ రామరామా... నేనెపుడన్నాను అట్లా?‘సరే సార్ చెప్పండి ఏం చెబుతారో చూస్తానుగా!’కంగారు ఎందుకు అభి..? భయం ఎందుకు అబ్బీ..? 143 చెప్పడానికి జంకు ఎందుకు అబ్బబ్బి...?? లవ్ గుండెలో ఉంటే లబ్..డబ్.. అవుతుంది! మూతవేసిన డబ్బి.. ఓపెన్ చెయ్యి..! ఓపెన్‌గా చెప్పెయ్యి.. తగిలితే రెండు చెంపదెబ్బలు.. కలిగితే లవ్ చప్పుళ్లు... డెసీషన్ నీది... భయపడకు! కంగారు వద్దు!! హెల్మెట్ వేసుకుని వెళ్లి చెప్పెయ్యి...!‘సార్.. మీ అసలు కలర్ బయటపడింది సార్! హెల్మెట్ వేసుకుంటే చెంపదెబ్బ పడదు కానీ, అబ్బాయి ఎవరో తెలియదు కదా సార్??? అభి ప్రేమకు మీరు హెల్మెట్ అడ్డం పెట్టారు సార్!’ వెకిలి పనులు చెయ్యకుండా జెంటిల్మన్లాగా ప్రపోజ్ చేస్తే హెల్మెట్ అక్కర్లేదు..! ప్రేమను బాధ్యతగా గుర్తిస్తే చాలు!! గుండె గర్భం ప్రేమను తప్పకుండా డెలివర్ చేస్తుంది. ఇంకా మంచి ఐడియా ప్రపోజల్ ఇచ్చేముందు...‘అరటిపండు ఇవ్వాలి కదా సార్!’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్నిగందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. నేను ఒక అబ్బాయిని సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేశాను కానీ, ఇద్దరి నేపథ్యాలు వేరు. వాళ్ల ఇంట్లో వాళ్లకి నేను అసలు ఇష్టంలేదు. దాంతో నన్ను మరిచిపో అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యలో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్లు కూడా నన్ను ఇష్టపడుతున్నారట. నేను నో చెబితే చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు. నాకు భయం వేసి వాళ్లతో తప్పక మాట్లాడాల్సి వస్తోంది. కానీ నాకు ఇవన్నీ వదిలేసి హ్యాపీగా అమ్మానాన్న చూసిన వాళ్లనే చేసుకోవాలనుంది. ఇదే విషయం వాళ్లకి చెబితే.. ఏం చేస్తారో, ఏం చేసుకుంటారోనని భయంగా ఉంది. అన్నయ్యా.. ఈ లైఫ్ నాకు చాలా అనీజీగా అనిపిస్తోంది. వాళ్లకి అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – అనన్య చెప్పాల్సింది వాళ్లకు కాదు!!‘అబ్బాయిలకు చెప్పండి ఏమి చెప్పాలో.. అని అడుగుతుంటే, చెప్పనంటారేంటి సార్??’చెప్పాల్సింది వాళ్లకు కాదు...!!‘సార్... అమ్మాయి అడిగింది కాకుండా మీకిష్టమైంది చెబుతానంటే ఎలా సార్??’నా కాలమ్ నా ఇష్టం...!‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు సార్!! కాలం మారుతుంది! మారుద్ది!! టైమ్ విల్ ఛేంజ్ సార్! ఇతరులకు కూడా టైమ్ వస్తుంది!! టైమ్‌ని ఎవరు పట్టుకుని కూర్చోలేరు సార్!! ప్రతీ సెకండ్ టైమ్ పారిపోతూనే ఉంటుంది!! దేనికైనా అడ్డుగోడ వేయొచ్చు కానీ, టైమ్‌కి డామ్ కట్టలేం సార్! టైమ్ అనే అల కొట్టిందంటే.. సామ్రాజ్యాలే కూలిపోతాయి!! కోటలు కూడా తుడుచుకుపోతాయి!! టైమ్ కన్నెర్ర చేస్తే......’నీలాంబరీ...! ఏమైంది అలా ఊగిపోతున్నావ్...???‘కాలం నాదంటారా సార్..??? ఎంత టెక్కు సార్ మీకు...? టైమ్ కన్నెర్ర చేస్తే.. అంతా చిందర వందరే సార్..! టైమ్ అనే సింహం.. జూలు విదిలిస్తే అంతా జులుమే సార్!’నీలాంబరీ.. ఆపు.. ఆపు.. ఆపు..!! నేనేమన్నాను నీలాంబరీ..??? లవ్ డాక్టర్ కాలమ్ నాది, నా ఇష్టమైంది రాస్తా అంటే.. కాలమ్ అంటే టైమ్ అనుకుని ఏం బాదుడు బాదావ్?? ఏంటా ఉద్రేకం? ఏంటా తిక్కా? ఏంటా ఊగిపోవడం.......????‘సారీ సార్! నేను వేరే కాలం అనుకుని కొంచెం తొక్క మీద కాలు వేశాను. రయ్..రయ్.. మీరు ప్రొసీడ్ సార్!’ చెప్పాల్సింది అబ్బాయిలకు కాదు అనన్య! చెప్పాల్సింది నీకు..!! వాళ్ల తలకాయ.. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు! నువ్వు ఎమోషనల్‌గా ఉంటావని తెలిసి.. ఒక సారి లవ్‌లో దెబ్బతిన్నావని తెలిసీ.. ఆడుకుంటున్నారు. నీకేం కావాలో నువ్వు అదే చెయ్యి. వాడి చెయ్యి పట్టుకుని, వీడి చెయ్యి పట్టుకుని.. వాళ్లందరినీ నడిపించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వాళ్లను జాగ్రత్తగా హైవే మీద నడిపిద్దామనుకున్నా ఈ ప్రయత్నంలో.. నువ్వు నీ గమ్యాన్ని పోగొట్టుకుంటావు!! స్టాప్ థింకింగ్ వాళ్ల గురించి!! హ్యాపీగా నీకు నచ్చింది చెయ్యి.. శభాష్ బంగారం!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
ఇక సె‘లవ్’..!
ఇరవై ఏళ్లు నిండని యువకులు బతుకులను బలిపీఠంపై పెడుతున్నారు. ఆలోచనలను అదుపులో పెట్టుకోలేక ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. సినిమా ప్రభావానికి లోనై సహ విద్యార్థులతో ప్రేమలో పడి దాన్ని నెగ్గించుకునే దారి తెలీక ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. ఈ పెడ ధోరణి జిల్లా యువతలో ఇటీవల బాగా పెరిగింది. సిక్కోలు నలువైపులా వరుసగా చోటు చేసుకున్న బలవన్మరణాలే దీనికి నిదర్శనం. క్షణికావేశంలో కొందరు, ఆలోచన చేయలేక మరికొందరు, సరైన సూచనలు అందక ఇంకొందరు మృత్యువును ఆశ్రయిస్తున్నారు. యువతలో కనిపిస్తున్న ఈ మార్పు తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తోంది. – రాజాం కొత్త కారణం.. అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంటి బరువులు మోయలేక, ఆర్థిక సమస్యలు పరి ష్కరించలేక ఇన్నాళ్లూ ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. కానీ ఇప్పుడు నిం డు నూరేళ్లు బతకాల్సిన చిరంజీవులు ఉత్తి పుణ్యానికి ఊపిరి ఆపుకుంటున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను, కనిపెట్టుకుని ఉండే స్నేహితులను కూడా కాదని ప్రేమ కోసం నిండు జీవితాన్ని బలి పెడుతున్నారు. వయసుతో పాటు వచ్చే ఆకర్షణను అర్థం చేసుకోలేక మితిమీరిన ఆలోచనలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువతపై సినిమా చాలా ఎక్కువ ప్రభావం చూపుతోంది. హీరో హీరోయిన్లను అనుకరించడంతో పాటు ఆ పాత్రలను అనుసరించడంతో సమస్యలు వస్తున్నాయి. జీవితం విలువ తెలుసుకోలేక.. కౌమార దశలో ఉన్న యు వత ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేకపోతున్నారు. వయసుతో పాటు సహజంగా వచ్చే మార్పులకు మితిమీరిన ఆలోచనలు తోడు కావడంతో వీరు పెడదారిన పడుతున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద, విద్యాలయాల్లో ఒత్తిడి కూడా వీరిని చిత్తు చేస్తోంది. టీనేజీ వయస్సులోకి అడుగుపెట్ట డంతో పాటు జల్సాల వైపు దృష్టిపెట్టడం, ఖాళీ సమయాల్లో సినిమాలకు వెళ్లడం, తల్లిదండ్రుల సావాసం మెల్లగా దూరమవుతుండడంతో ఘోరాలు జరిగిపోతున్నాయి. మోసగిస్తున్న మొబైళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా యువతను పక్కదోవ పట్టిస్తోంది. పదో తరగతిలోనే చేతికి సెల్‌ఫోన్ రావడంతో పుస్తకాలు చదివే అలవాటు, తద్వారా మానసిక పరిణితి పొందే అవకాశాలను యువత పూర్తిగా దూరం చేసుకుంటోంది. ఇష్టానుసారం వస్తున్న సోషల్ మీడియా పోస్టింగ్‌లతో పాటు అభూత కల్పనలు, చిన్నచిన్న కవితలు, మెసేజ్‌లు తెలియని స్నేహితులను కూడా దగ్గరకు చేర్చుతున్నాయి. స్నేహితుల మధ్య బంధాన్ని ప్రేమగా మార్చి యువతను మోసగిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలేవీ? గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ర్యాగింగ్ నిర్మూలనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. అదే సమయంలో ఆత్మహత్యలు, ఒత్తిళ్లు జయించడం వంటి వాటిపై అవగాహన కల్పించే వారు. అలాగే 8 నుంచి 10 తరగతులకు చెందిన విద్యార్థులకు కౌమార విద్యపై అవగాహన కల్పించేవారు. ఈ పాఠాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అవగాహన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇంటి వద్దా తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయం తగ్గిపోతూ వస్తోం ది. ఫలితంగా యువతకు మార్గదర్శకం కనుమరుగైంది. ఆ ప్రేమ కనిపించకేనా..? ఈమె మీ అమ్మమ్మ, ఈయన మీ తాతయ్య, ఇది మన ఊరు.. ఇతడు మనవాడు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నాడు అని ప్రేమగా కబుర్లు చెప్పే తల్లిదండ్రులు ప్రస్తుతం తక్కువైపోతున్నారు. మార్కులు, ర్యాంకులు, కెరీర్, సంపాదన ఒత్తిడిలో పడి పిల్లలతో మాట్లాడే సమయం తగ్గించేస్తున్నారు. ఇదే సమయంలో తాము తమ పిల్లలకు అందివ్వాల్సిన ప్రేమానురాగాలను ఇవ్వడం మర్చిపోతున్నారు. అదే పిల్లలను వేరే ప్రేమ వెతుక్కునేలా చేస్తోంది. ప్రేమికుల ఆత్మహత్యలు జిల్లాలో గతంలో కంటే ఈ ఏడాది ప్రేమికుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 26న పొందూరు రైల్వే స్టేషన్ వద్ద పొందూరుకు చెందిన ఎ. మహాలక్ష్మి, రాజాం నగరపంచాయతీ పరిధి కొండంపేట గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌లు ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి తల్లిదండ్రులుకు తీవ్ర దుఖాన్ని మిగిల్చారు. ఈ నెల 2న పొందూరులోని కింతలి సమీపంలో కనిమెట్టకు చెందిన పవన్‌కళ్యాణ్, మొదలవలస గ్రామానికి చెందిన రేణుకలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు కింతలి జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. నిండా పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని వీరు తమ తొలి అడుగుల్లోనే మరణాన్ని వెతుకున్నారు. ఇలా చెప్పుకుంటే ఈ ఏడాది జిల్లాలో 14 ప్రేమికుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఎక్కువ మంది 22 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. తల్లిదండ్రుల లోపం కూడా.. యుక్త వయస్సులోకి వస్తున్న యువతపై తల్లిదండ్రుల దృష్టి ఉండాలి. యువత పెడదోవ పట్టకుండా చూడాలి. వారికి తమ కుటుంబ జీవనం, భవిష్యత్‌లో సాధిం చాల్సిన మానవ దృక్పథాలను వివరించాలి. ప్రస్తుతం చాలా మంది యువత ఇంటి వద్ద ప్రేమను పొందలేకపోతున్నారు. ఆరుబయట ఆకర్షణకు గురవుతున్నారు. టీనేజీలోని ఈ ఆకర్షణను ప్రేమగా భావించుకుని అనర్థాల వైపు పరుగులెడుతున్నారు. – డాక్టర్ గార రవిప్రసాద్, రాజాం వ్యక్తిత్వ వికాస తరగతులేవీ? ప్రతి కళాశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు ఉండాలి. ఉన్నత స్థాయి పాఠశాలల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలతో కూడిన పాఠ్యాంశాలు ఉండాలి. అయితే ఇవి ప్రస్తుతం పాఠ్యాంశాల కరిక్యులమ్‌లో లేవు. దీంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కళాశాలల్లో కూడా ప్రముఖలతో యువతకు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఏర్పాటుచేయాలి. ఇంటి వద్ద కూడా సుద్దులు చెప్పే పెద్దవారు ఉంటే మానసిక పరిణితి పెరుగుతుంది. – వారాడ వంశీకృష్ణ, వ్యక్తిత్వ వికాసనిపుణులు, రాజాం. -
ప్రాణం తీసిన ప్రేమ
-
ప్రాణం తీసిన ప్రేమ
పెద్దపల్లి,హుజూరాబాద్‌రూరల్: ‘శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేశావు. తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా.. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు..దేవుడు ఉంటే ఇంతకింత అనుభవిస్తారు..’ అంటూ సూసైడ్‌నోట్ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని మనోవేదనకు గురైన సైదాపూర్ మండలం వెన్నంపల్లి పరిధిలోని లస్మన్నపల్లికి చెందిన కనకం ప్రవళిక(24) హెయిర్‌డై తాగి ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన కనకం ఎల్లయ్య–మాణిక్యమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రవళిక హన్మకొండలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఇంటి పక్కనే ఉంటున్న సమీప బంధువు మొలుగూరి శ్రీకాంత్, ప్రవళిక కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు వేరే సంబంధం చూడడంతో ఈనెల 28న ప్రవళిక సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదుతో ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిలయ్యానో?
తమిళసినిమా: నేను ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిలయ్యానో తెలుసా? అంటోంది నటి రాయ్‌లక్ష్మి. సంచలనాలకు కేంద్రబిందువుగా ముద్ర పడిన ఈ బహుభాషా నటి తరచూ ఏదో ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం పుట్టిస్తూనే ఉంటుంది. ఆ మధ్య క్రికెట్ క్రీడాకారుడు ధోనీతో డేటింగ్ అంటూ రాయ్‌లక్ష్మి గురించి హాట్ హాట్ ప్రచారం జరిగింది. తాజాగా హిందీ చిత్రం జూలీ–2 చిత్ర ట్రైలర్లో మోతాదే మించిన అందాలతో మరో సారి వార్తలో నానుతోంది. ఇటీవల ఈ అమ్మడు ఇచ్చిన భేటీ చూద్దాం. జూలీ–2 చిత్రంలో తాను గ్లామరస్‌గా నటించాననే ప్రచారం జరుగుతోందన్నారు. చిత్ర ట్రైలర్‌ను చూసిన వారు అలా అనుకోవడంలో తప్పులేదని, అయితే చిత్రం పూర్తిగా చూస్తే తన పాత్రను, నటననూ మీరే అయ్యో పాపం అనుకుంటారని అంది. నాన్న చనిపోతాడు. అమ్మ రెండవ పెళ్లి చేసుకుంటుంది.అమ్మ రెండో భర్త తనను బయటకి వెళ్లి సంపాదించకురా అని తరిమేస్తాడని చెప్పింది. అలా ఎంతో కష్టపడి పోరాడి నటిగా నిలదొక్కుకుంటానని చెప్పింది. సినీరంగంలో ఇటీవల అత్యాచారాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారని అయితే తనకలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. తనను దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ కర్క కచడర చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేశారని, ఆ తరువాత అవకాశాలు లేక నాలుగేళ్లు పోరాడానని చెప్పింది. ఆ సమయంలో తనకు లైంగిక సంబంధం గురించి నర్మగర్భంగా అర్థంమైందని చెప్పింది.అనుసరించిపోవాలని కొందరు చెప్పారంది. అలా చేస్తే తానిప్పుడు సూపర్ హీరోయిన్ అయ్యేదానినని అంది. అప్పట్లో తనకు తమిళ భాషలో ఒక్క పదం కూడా తెలిసేది కాదని, తనగురించి ఎవరెవరో తప్పుతప్పుగా ప్రచారం చేసేవారని చెప్పింది. ఇక ప్రేమలో తాను ఐదుసార్లు ఓడిపోయానని తెలిపింది. అలా ఓడిపోయిన ప్రతిసారి గదిలో కూర్చుని ఏడ్చేదానిని అంది. మగవారిలో చాలామంది మంచి వాళ్లు, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారని చెప్పింది.నటుడు ఆర్య తనకు చాలా కాలంగా మంచి స్నేహితుడని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తను ఒక స్నేహితుడు మాత్రమేనని అంది. తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల రాజకీయరంగంలోకి వచ్చే ఆలోచనే లేదని రాయ్‌లక్ష్మీ స్పష్టం చేసింది. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నాకు ఇప్పుడు 23 ఇయర్స్. నా స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా సీనియర్ నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పాడు. వన్ ఇయర్ తరువాత నేను కూడా ఓకే చెప్పాను. ఇప్పటికి మా లవ్ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయ్యింది. స్టార్టింగ్‌లో బాగానే ఉన్నాం. రోజులు గడిచేకొద్దీ నాలో ప్రతీదీ ఫాల్ట్లా చూడ్డం మొదలుపెట్టాడు. చాలా డామినేట్ చేస్తుండేవాడు. తనని వదులుకోవడం ఇష్టం లేక తను ఏది చెబితే అదే చేశాను. అయినా సరే చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాడు. తనకోసం నా ఫ్రెండ్స్‌ని కూడా వదిలేశాను. తను తప్ప నాకు వేరే లోకమేలేదు. అయినా కూడా తప్పులు వెతుకుతుండేవాడు. ఏం చేసినా తప్పు అనేవాడు. తను ఒక అమ్మాయితో క్లోజ్‌గా ఉండేవాడు. ఎంత చెప్పినా వినలేదు. కొన్నాళ్లకి తను నన్ను ఫిజికల్‌గా కావాలనుకున్నాడు. అలా దగ్గరైతే నాతోనే ఉండిపోతాడని నేను కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు చిన్న గొడవతో నన్ను వదిలేశాడు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. వేరే అమ్మాయికి ప్రపోజ్ కూడా చేశాడు. నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇంకొకరితో ఎలా ఉండాలో అర్థం కావడంలేదు. ప్లీజ్ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – నిఖిత నీకు ప్రాబ్లమ్ వచ్చిందనుకుంటున్నావా నిఖితా? ‘ఇప్పుడు వచ్చింది ప్రాబ్లమ్ కాదా సార్? అబ్బాయి ఉన్నన్ని రోజులు టార్చర్ చేశాడు. ఇప్పుడు వదిలేసి టార్చర్ చేస్తున్నాడు. ఇది ప్రాబ్లమ్ కాదా సార్??’ కాదు!! ‘ఏంటి సార్ మీరు అలా మాట్లాడితే అసలు మీకు గుండె లేదేమో అన్నంత కోపం వస్తుంది. అక్కడ మీ సిస్టర్ అంత ప్రాబ్లమ్‌తో రాస్తే... మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఏమి పట్టనట్టు ఉంటున్నారు? అబ్బాయిలంటే ఇష్టమయిన నాకే... వాడ్ని పోయి నాలుగు పీకాలని ఉంది. మీరు అంత పెద్ద మీసాలు పెట్టుకుని ఏమి లాభం సార్..? ప్రాబ్లమ్ అర్థం చేసుకోరెందుకు సార్??’అయ్యిందా.. నీ ఎమోషనల్ అటాక్..!?! మరీ అంత దగ్గరకొచ్చి కొట్టేలా మాట్లాడుతున్నావ్? ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నువ్వు అలా కోపంగా అంత దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మై మీసం ఈజ్ వణికింగ్!! నాకు తెలిసి ప్రాబ్లమ్ రాలేదు. పోయింది!! ‘అంటే.. ఏంటి సార్..? మోసం చేసి ఫిజికల్‌గా వాడేసుకుని.. మెంటల్‌గా టార్చర్ చేసి.. ఇప్పుడు ఇంకో అమ్మాయికి లైన్ వేస్తే ప్రాబ్లమ్ పోయిందంటారేంటి సార్??’వాడు మనల్ని వాడుకున్నా.. మనల్ని పారేసినా.. దానికి కారణం మనమే!!‘సార్.. అన్యాయం సార్.. తప్పు మీ సిస్టర్ ది అంటారా?!? క్రేజీ.. వెరీ వెరీ క్రేజీ!!’ముందునుంచి వాడి క్యారెక్టర్ చూపిస్తూనే ఉన్నాడు! అయినా వాడి డర్టీ మైండ్‌ని అర్థం చేసుకోకుండా వాడు ఆడిందే ఆట అన్నట్లు అన్నింటికీ తలాడించి.. తన లైఫ్‌ని ఒక వెధవ చేతిలో పెట్టింది నా చెల్లెలే.ఇప్పటికయినా అలాంటి దరిద్రుడు లైఫ్ నుంచి పోయాడని అర్థం చేసుకుని స్ట్రాంగ్ అవ్వాలి. ‘మరి ఫిజికల్‌గా వాడుకున్నాక ఇంకొకరితో కాపురం చెయ్యాలంటే మనసు ఒప్పుకోవాలి కదా సార్? చీట్ అవ్వడమే కాక ఇంకొకరిని చీట్ చేసినట్టు కదా సార్??తప్పు నీలూ...! నిఖిత మానసికంగా.. శారీరకంగా రేప్‌కి గురయ్యింది. తాను చెయ్యని తప్పుకు గాయం అయ్యింది. రేప్ అయినా వాళ్లకు పెళ్లి జరగకూడదా? వాళ్లు మళ్లీ మంచి జీవితం జీవించకూడదా? నేరం మగవాడు చెయ్యాలి, శిక్ష ఆడది భరించాలా? సారీ నీలూ.. లైఫ్‌ని అలా ట్రీట్ చెయ్యకూడదు. పెళ్లి చేసుకుని నిఖిత సంతోషంగా జీవించాలి!!‘మరి ఆ దరిద్రుడు??’కుక్క తోక..! ఎవరో ఒకరు దాన్ని కత్తిరిస్తారు. ఇప్పుడు ఆలోచించాల్సింది నిఖిత గురించి..! లవ్ యు చెల్లెమ్మా!!!‘లవ్ యు నిఖితా... ఆల్ ది బెస్ట్ ఫర్ ఎ న్యూ లైఫ్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
డీప్.. డీప్.. డిప్రెషన్
ఒత్తిడికి చిత్తవుతున్న యువతరం చదువు, కెరీర్, ప్రేమ వైఫల్యాలు, సోషల్ మీడియానే కారణం ఒంటరితనం.. ప్రతికూల ఆలోచనలతో తీవ్ర ఒత్తిడిలోకి.. నిస్పృహలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొందరు ‘కాస్మోస్’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో సర్వే బాధితుల్లో 18–25 ఏళ్ల మధ్య వయసు వారు.. 64% 25–44 ఏళ్ల వయసు వారు 50% సాక్షి, హైదరాబాద్ : ‘‘సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. బౌండరీలు దాటే మనస్సు మాదీ..’’అని పాడు కోవాల్సిన యువతరం ఇప్పుడు తీవ్ర ఒత్తిడితో చిత్తవుతోందట. మార్కులు, ర్యాంకులు.. కెరీర్, ఉద్యోగం.. టీనేజ్ లవ్, వైఫల్యాలు ఇలా సవాలక్ష సవాళ్లతో సతమతమవుతోందట. ఏకా గ్రత కోల్పోయి.. ఏ పనిమీదా మనసు లగ్నం చేయలేక.. ఒంటరితనం.. నెగెటివ్ ఆలోచనలు చుట్టుముట్టి డిప్రెషన్‌కు లోనవుతోందట. ఒత్తిడి శ్రుతిమించితే కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్యకు సైతం పాల్పడటం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ మానసిక వైద్యశాల ‘కాస్మోస్’దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో యువత ఒత్తిడితో కుంగిపోతున్నట్లు వెల్ల డైంది. ఈ జాబితాలో మన నగరానికి చెందిన సుమారు 20 కళాశాలలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడుపుతున్న కుర్రకారు ఆత్మీయ సంబంధాలు, స్నేహితులతో ఆటపాటలకు దూరమవుతూ ఒత్తిడి అనే ఉపద్రవంలో చిక్కుకుంటోందని మాన సిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా 18–25 ఏళ్ల మధ్యనున్న యువతరంలో ఏకంగా 64 శాతం మంది ఇలాంటి పరిస్థితితో బాధపడుతుండటంతో ఆందోళన కలిగిస్తోందంట ున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కళాశాలలో సీటు సాధించడం మొదలుకుని మార్కులు, ర్యాంక్‌లు తెచ్చుకోవడం.. అత్యుత్తమ కెరీర్ ఎంచుకోవడం.. క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఉద్యోగం సాధించడం.. ఆ మధ్యలో టీనేజ్ లవ్‌లు.. ప్రేమ వైఫల్యాల వంటి సవాళ్లు యువతరాన్ని చుట్టుముడుతున్నాయని పేర్కొంటున్నారు. యువతలో ఒత్తిడికి కారణాలివే.. సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడం. మార్కుల రేస్‌లో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం. తెలిసీతెలియని వయసులో డ్రగ్స్, తాగుడు, పోర్న్ సైట్స్ వంటివాటికి అలవాటుపడటం. టీనేజ్‌లో ఆకర్షణకు లోనుకావడం. వన్‌సైడ్ లవ్. మంచి కళాశాలలో సీటు సాధించలేకపోవడం. కెరీర్‌పరంగా ఒడిదుడుకులు. చదువును నిర్లక్ష్యం చేయడం. చదువుకు అనుగుణంగా ఉద్యోగం దొరక్కపోవడం. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంట్లో వారి నుంచి సరైన మార్గదర్శనం లభిం చకపోవడం. 25–44 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇలా.. ఇక 25–44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగానికి సంబంధించి అధిక పని ఒత్తిడి, కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవడం, దాంపత్య సమస్యలు, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవ్వడం వంటి కారణాలతో సుమారు 50 శాతం మంది ఒత్తిడితో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ఇలా చేస్తే ఒత్తిడిమాయం.. సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదు. చదువు, మార్కులు, ర్యాంకులు, కెరీర్ ఎంచుకునే విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. యువతరంతో తల్లిదండ్రులు, టీచర్లు స్నేహితుల్లా మెలిగి.. వారు ఎదుర్కొంటున్న మాన సిక సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలి. దురలవాట్లు, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం. చెడు స్నేహాలను వదిలేయడం. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎంచుకున్న రంగం, కెరీర్లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి విజయగాథలను తెలుసుకోవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి. వివిధ రకాల ఆకర్షణలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగా, నడక, మార్షల్ ఆర్ట్స్, ధ్యానం వంటిలో ఏదో ఒకదానికి నిర్ణీత సమయం కేటాయించాలి. మానసిక విశ్రాంతికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, గార్డెనిం గ్ వంటి కార్యకలాపాలతో బిజీగా ఉండాలి. ఇష్టమైన పుస్తకాలు చదవాలి. నలుగురితో సరదాగా మాట్లాడటం, నవ్వడం, నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, నిద్రపో వడం వంటి సూత్రాలను విధిగా పాటించాలి. – డాక్టర్ అనిత, సైకియాట్రిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, రిమ్స్