
హాయ్ సార్...! కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ఇద్దరం సేమ్ క్లాస్. తను బాగా రిచ్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను మ్యారేజ్ సెట్ అవ్వదనే ఆలోచనతో ఒప్పుకోలేదు. బట్ తనంటే నాకూ ఇష్టమే. కానీ నన్ను కన్విన్స్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరం బాగా లవ్ చేసుకున్నాం. జాబ్స్ రావడం వల్ల ఇద్దరం వేరే వేరే ఊళ్లకు వెళ్లిపోయాం. ఇద్దరి మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చేసింది. కానీ మాకు అలా అనిపించేది కాదు. తను ఒక నెల తరువాత నన్ను కలవడానికి వచ్చింది. ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చింది. కానీ వెళ్లేటప్పుడు నాకు సారీ చెప్పి, మన పెళ్లి జరగదు విడిపోదాం అని చెప్పింది. నేను తట్టుకోలేకపోయా. కారణం ఏంటంటే... ‘‘నాకు సంబంధాలు చూస్తున్నారు’’ అంది. ‘‘ఇంట్లో అసలు ఒప్పుకోరు’’ అంటోంది. నేను తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. దీనికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – జీవ
ఏం చెప్పమంటావ్ అన్నయ్యా..?నీ పరిస్థితి చూస్తుంటే దిగులుగా ఉంది...నిన్నే చదివా నీ ఉత్తరం....రాత్రంతా పట్టలేదు నిద్దర...బతుకంతా చిందర వందర...ముందు వద్దనుకుని.. మళ్లీ దిగావు సుందరా...కానీ చివరికి మిగిలింది ఏందిరా....లైఫ్ అంతా చిందర వందర...‘ఏంటి సార్..! మీ లైఫ్‌లో కూడా ఒక రిచ్ అమ్మాయి...మిమ్మల్ని వాడుకుని.. బనానా మిల్క్ షేక్ చేసుకుని...తొక్కలా పారేసిందా సార్..!?’నువ్వు నా లైఫ్ డిగ్ చేయకు నీలూ...జీవాకి బిగ్ సొల్యూషన్ చెప్పు...‘ఆ.. ఏముంది సార్, లైఫ్‌లో ఇలాంటివి జరిగితే టేకిటీజీ పాలసీ ఉండాలి సార్. అంతగా ఫీల్ కాకూడదు. మనోడు ఎంత హ్యాండ్సమ్ కాకపోతే రిచ్ అమ్మాయిలు ఇష్టపడతారు సార్? ఇప్పటికి మాత్రం అమ్మాయిల నుంచి వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ మెయిన్టెన్ చేస్తే కుదుట పడతాయి. ఏమంటారు సార్???’ సూపర్ నీలూ...!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment