priyadarsini ram
-
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మా మతాలు వేరు గానీ.. మా నేపథ్యాలు ఒకటే. వాళ్ల పేరెంట్స్ వాళ్ల మత పద్థతిలోనే పెళ్లి చేస్తామన్నారు. రెండు లక్షలు కట్నం ఇస్తామన్నారు. మా పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోలేదు. నేనే కష్టపడి ఒప్పించాను. తను మా ఇంటికి వచ్చాక కూడా వాళ్ల మతాన్నే పాటిస్తాను అంటోంది. దానికి మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇద్దరం కలిసి చాలా బాగుండేవాళ్లం. తనకి అన్యాయం చెయ్యడం ఇష్టం లేదు. దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్!– కృష్ణ ప్రేమకు మతం లేదు, కులం లేదని చెప్పినా నీకు ఎక్కదు! కట్నం తీసుకోవడం నేరమని చెప్పినా నీకు అర్థం కాదు!! ఏదైనా పెళ్లికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి అంటే విసుక్కుంటావు! నీకు అమ్మాయి నచ్చిందంతే! అంటే.. రూపం నచ్చిందంతే...!! అమ్మాయి కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ల పీకల మీద కూర్చుని పెళ్లికి ఒప్పించావు. ఇప్పటికైనా మారు అన్నయ్యా ప్లీజ్!! నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో! తన మతాన్ని గౌరవించు..!! తన పద్ధతులను గౌరవించలేనివాడివి.. తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేవు. నీ కోసం అమ్మాయి చెయ్యని త్యాగం లేదు. నీ కోసం తన వాళ్లని వదిలి నీ నమ్మకం మీద వచ్చింది..!! నువ్వు ఆ నమ్మకం మరిచి.. ఈ నమ్మకాల కోసం గింజుకుంటున్నావు..!! వద్దు అన్నయ్యా! అలా చెయ్యకు. ఏ నమ్మకమైనా నేర్పించేది ప్రేమే..!! నువ్వు ప్రేమనే నమ్మకం చేసుకో..!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ బాబాయ్..! మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తుంటారు కదా. మరి నాకు కూడా ఓ మంచి సమాధానం ఇవ్వండి బాబాయ్. నేనొక అమ్మాయిని రెండేళ్ల నుంచి ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతోంది. కానీ వాళ్ల పేరెంట్స్ రిజెక్ట్ చేస్తారనే భయంతో నన్ను రిజెక్ట్ చేస్తోంది. నన్ను అవాయిడ్ చేస్తోంది బాబాయ్. ఏం చెయ్యమంటారు బాబాయ్? రోజూ మాట్లాడే తను.. ఇప్పుడు నాతో మాట్లాడకపోవడంతో తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి బాబాయ్? తనకి భయం పోయేటట్లు నేను ఏం చెయ్యాలో చెప్పండి బాబాయ్! ప్లీజ్. – అభిషేక్ నీకంటే మంచి అబ్బాయిని చూసి లవ్ ప్రపోజ్ చెయ్యించు అబ్బాయ్..!!‘ఏంటి సార్ అంత రఫ్‌గా అలా అనేశారు? మిమ్మల్ని బాబాయ్ అన్నందుకా సార్ అంత కోపం? ఇంకా నయం కదా సార్.. తాతయ్య అనలేదు. అనుంటే అబ్బాయ్ అనకుండా వెధవాయ్ అనేవారేమో పాపం అభిషేక్‌ని..!? అయినా.. అదేమి ఆన్సర్ సార్? ఇంకో అబ్బాయిని చూసి, వాడికీ.. వీడి గర్ల్ ఫ్రెండ్‌తో కనెక్షన్ పెట్టమంటున్నారేంటి సార్??ఎంత అనెథికల్ సార్.? అంటే హార్ట్ లేని డర్టీ సలహా సార్?’నీలాంబరీ..! అమ్మాయికి అభిషేక్ అంటే.. రియల్‌గా లవ్ ఉంటే మమ్మీ.. డాడీ.. ఏమంటారోనని ఆగదు. జంప్ కొట్టి రెడీ అయిపోయేది. అలా చెబితే బాధపడతాడేమోనని...‘ఇంకొకడిని లైన్లో పెట్టమన్నారా సార్.. మీకూ, మీ రౌండ్ అబౌట్ ఆన్సర్కీ ఓ దండం సార్!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. నన్ను ప్రస్తుతానికి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – కృప మనం ముచ్చటగా మూడో లవ్ స్టోరీ అయ్యామా చెల్లీ..? ఎందుకమ్మా అంత తొందరపాటు?? వాడు ఇద్దరికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు... వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి కన్సిడర్ చెయ్యమ్మా... ఒట్టి పెంటగాడు.. వాడితో చెయ్యి కలిపితే.. మనకు అంటుకుంటుంది ఆ పెంట వాసన! ఈ సమాజం ఆ పెంట వాసన చూసి.. నిన్నూ రెస్పెక్ట్ చెయ్యదు!! ‘సార్..! కానీ ఫస్ట్, సెకండ్ లవ్ స్టోరీలు వర్కౌట్ కాక.. కృపతోనే లవ్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్???’ నీలూ..! రెండు చోట్ల రిజెక్ట్ అయిన కాండిడేట్ నా చెల్లెలికి ఎందుకు? అసలు ఇలాంటి ఫెయిల్యూర్ కాండిడేట్ మీద అనవసరంగా సింపతీ చూపించి.. దాన్ని లవ్ అనుకుని, ఆ కన్ఫ్యూజన్లో హార్ట్ పారేసుకుని.. ఆ తర్వాత వీడు నెక్ట్స్ ఫిట్టింగ్ కోసం వెళ్లిపోతే.. కృప ఏం కావాలి??? అసలే స్టెబిలిటీ లేని యూజ్లెస్ ఫెలో వాడు.. మనకు వద్దే వద్దు!!‘విన్నావుగా కృప.. బీ కేర్‌ఫుల్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్ నంబర్ అడిగాను. ఇచ్చింది. ఫోన్లోనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఓకే అంది. బాగానే మాట్లాడుకున్నాం. అన్నీ షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులకి మా మధ్య క్యాస్ట్ గురించి చర్చ వచ్చింది. మా కులాలు వేరని తెలిసింది. దాంతో ‘మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడితో వదిలేద్దాం’ అంది. సరే..! నీకే లేనప్పుడు నాకెందుకని ఫోన్లు, మెసేజులు చెయ్యడం మానేశాను. తర్వాత కొన్ని రోజులకి తన నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను. ‘మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ‘మనం వెళ్లిపోతే మన ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది. వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. తను వినట్లేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటోంది. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను’ అని బెదిరిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ఒక్కడికే కాకుండా ఇద్దరికీ హెల్ప్ అయ్యే సలహా ఇవ్వండి ప్లీజ్. – ప్రవీణ్ బెదిరిస్తోందా????‘సార్..! ‘‘బెదిరిస్తోందా..దా..దా..?’’ అని దీర్ఘం తీస్తున్నారంటే అమ్మాయి నిజంగా ఏం చేసుకోదని లైట్‌గా తీసుకుంటున్నారా సార్? మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్! ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారని అంటారా సార్? మనకు లవ్ వర్కౌట్ కాకపోతే ఇంక వేరే మార్గమే లేదని మీ చెల్లెలు వాపోతుంటే ఏంటి సార్ మీ సెటైర్లు..?? ‘‘బెదిరిస్తోందా.. దా..దా’’?? అని అంటున్నారు. టూ మచ్ సార్!’అది కాదు నీలూ! ముందేమో తాను క్యాస్ట్ సేమ్ కాదు.. లవ్ స్టాప్ చేద్దామంటే.. తనకేనా పొగరు నేను కూడా కట్ ఆఫ్ చేసేస్తా.. అని పోజ్ కొట్టాడు ప్రవీణ్. లవ్ లేకపోయినా బతకొచ్చు అనుకుంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణం సైతం వదిలేస్తా ప్రేమ కోసం అని బాధపడుతుంటే.. పారిపోవడానికి కూడా రెడీ అంటుంటే... మనవాడు స్లో మోషన్లో మనకు ఉత్తరం రాస్తున్నాడని కొంచెం ఫీలయ్యి వెక్కిరించా నీలాంబరి. ‘‘బెదిరిస్తుందా..దా..దా?’’ అని.‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ప్రవీణ్ వాళ్ల ఇంట్లో కన్విన్స్ చేసి మమ్మీ డాడీలను తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్‌ని కన్విన్స్ చేసుకోవాలి!!‘తంతారేమో సార్!?’బెదిరిస్తున్నావా నీలూ???? ‘లేదు సార్! ప్రవీణ్ ఈజ్ స్ట్రాంగ్. మీరు చెప్పినట్లే చేస్తాడు!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్.. సార్!! ఒక అమ్మాయి రోజూ నన్ను చూస్తోంది. తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రెండు మూడు సార్లు ఆ అబ్బాయి బైక్ మీద పోతుంటే చూశాను. చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఈ మధ్య తను నన్ను చూసి నవ్వుతోంది. తనతో స్నేహం మంచిదేనా? – రామ్ కుమార్ బైక్ మీద పోతున్న అమ్మాయిని నోరెళ్లబెట్టి చూస్తుంటే నవ్వు రాదా బ్రో. ..?‘అంటే రామ్‌కుమార్ దీనస్థితిని చూసి పళ్లు ఇకిలించిందా సార్’. కొంచెం ఫన్నీగా నీలూ.. అలా నోరు ఓపెన్ చేసుకుని చూస్తుంటే..?? ‘పొండి సార్.. పాపం ఇంకొకరితో క్లోజ్‌గా ఉన్న అమ్మాయి.. చూసి ప్రేమగా నవ్విందని... ఏం చేయాలో చెప్పమంటే.. మీరు రామ్ కుమార్‌ని కార్టూన్లా చేసి ఏడిపిస్తారా సార్..?? ఈ ఉసురు ఊరికే పోదు సార్!!’ నీలూ..! పోనీ అమ్మాయికి రామ్‌కుమార్ నచ్చాడే అనుకుందాం.. కానీ ఇంకో బైక్‌మీద ఇంకో రావణాసురుడితో ట్రావెల్ అవుతున్న అమ్మాయిని నేను ఇష్టపడటం కరెక్టేనా అని అడిగితే.. జోక్ వేసిఆన్సర్ తప్పించుకోకుండా నిజాలు చెబితే రామ్‌కుమార్ హర్ట్ కాడా నీలూ..? ‘ఓ.. ఓహో.. ఓహోహో.. ఓరి ఫూల్ అనకూడదని ఫన్నీగా ఫూల్ చేస్తూ రామ్‌కుమార్ గుండెకు ఆయింట్మెంట్ రాస్తున్నారా సార్..!?’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నాకు ఒక అమ్మాయితో త్రీ ఇయర్స్‌గా పరిచయముంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అసలు సమస్య ఏమిటంటే.. తనకి అందరితో మాట్లాడటమంటే ఇష్టం. అబ్బాయిలతో అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతోంది. వాళ్లతో మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. దాంతో నా ఫ్రెండ్స్ చాలా మంది ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయిని లవ్ చెయ్యకు’ అని అంటున్నారు. దాంతో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. ప్లీజ్ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – జయరాజు చెయ్యి..! చెయ్యకు!!‘ఏంటి సార్?? డబుల్ మీనింగ్ ఆన్సర్ ఇస్తున్నారు?’చెయ్యగలిగితే చెయ్యి..! చెయ్యలేకపోతే మానెయ్యి!!‘సార్...!! మరీ ఇంత పచ్చిగా డబుల్ మీనింగ్‌లో ఆన్సర్ ఇస్తున్నారేంటి సార్??’నీలూ! జయరాజు ఏం చేస్తాడు.. చెయ్యాలంటే దమ్ము ఉండాలి.‘సార్! స్టాప్ ఇట్!!’చూశావా నీలూ! నేను చాలా సింపుల్‌గా లవ్ చెయ్యగలిగితే చెయ్యి అన్నాను. లవ్వు చేసే దమ్ము లేకపోతే మానెయ్యి అన్నాను. నేను అంత సింగిల్ మీనింగ్‌తో చెప్పినా నీకు డబుల్ మీనింగ్‌లా అనిపించింది.. చెప్పడంలో డబుల్ మీనింగ్ లేదు నీ మనసులో డబుల్ మీనింగ్ ఉంది కాబట్టి నీకది బూతులా అనిపించింది.‘అబ్బా! ఏం కొట్టారు సార్! మీ కొట్టుడే కొట్టుడు సార్!!’నీలూ! ఏంటి ఆ మాటలు? స్టాప్ ఇట్ ఐసే!!‘చూశారా సార్! నేనేమన్నాను? ఎంత సూపర్ డైలాగ్ కొట్టి నాకు స్పష్టత తెచ్చారు అని చెబితే మీరు డర్టీ మైండ్‌తో ఇంకో రకంగా రిసీవ్ చేసుకున్నారు. నా మాటలు సింపుల్! మీరే డబుల్!!’చూశావా జయరాజు..! నీ ఫ్రెండ్స్ డబుల్ మీనింగ్ గాళ్లు. వాళ్లను నమ్మద్దు. నీ లవర్ సింపుల్ గర్ల్. సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో...‘అవును జయరాజు! అపార్థాలు ఆన్సర్లు ఇచ్చే మా మధ్యే వస్తున్నప్పుడు.. సున్నితమైన మీ మనసులకు అపార్థాలు రావడం నాచురల్. గుడ్ లక్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేను మీ లవ్ డాక్టర్ కాలమ్ ప్రతిరోజూ చదువుతాను. నాకొక సమస్య వచ్చింది సార్. నేను నా మేనమామ కూతురిని ప్రేమించాను. తనూ నన్ను ప్రేమించింది. అలా మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాం. సడెన్‌గా తన నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. చాలా కాలం బాధపడ్డాను. తర్వాత తను వేరే అతడిని ప్రేమిస్తోందని తెలిసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాను. ‘సారీ బావా.. నేను ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, నిన్నే పెళ్లి చేసుకుంటాను’ అంది. దాంతో నేను ‘సరే మారుతుందిలే.. పెళ్లి చేసుకుందాం’ అనుకున్నాను. కానీ మళ్ళీ ఫోన్, మెసేజ్ ఏమీ చెయ్యట్లేదు. అలాగని ఇంట్లో ఏమైనా సమస్యా అంటే అది కూడా లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నేను చాలా ఇష్టమే. అసలు ఈ అమ్మాయిని నమ్మొచ్చో లేదో అర్థం కావడం లేదు. మంచి సలహా ఇవ్వండి సార్ ప్లీజ్. – రవి ‘రవీ.. ఈ లవ్ డాక్టర్ని ఆ ఒక్కటీ అడగొద్దు!!నువ్వు ఎన్నిసార్లు అడిగినా...ఎన్ని రకాలుగా అడిగినా...ఏమార్చి అడిగినా...బతిమాలీ బామాలీ అడిగినా...కాళ్లూ గడ్డం పట్టుకుని అడిగినా...మీసం ముట్టుకుని అడిగినా...నో.. అనే చెబుతారు!!మేనరికాలు.. ససేమిరా అంటారు.మీకు పుట్టబోయే పిల్లలు అవిటివాళ్లు అయ్యే చాన్స్ ఉందని రివర్స్‌లో మిమ్మల్నే కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి.. బామాలి.. నీకు మీసం ఉంటే.. రోషం ఉంటే వద్దని అడుక్కుంటారు.. అందుకే ఇంకో లవ్ డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో అడుక్కోవడం బెటర్!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో నా పక్క సీట్లోనే కూర్చుంటుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూనే ఉంటుంది. ఆ పాట నాకోసమే అనిపిస్తుంది. అడిగేద్దామంటే జాబ్ పోతుందేమోనని భయం! ఏం చెయ్యమంటారు సార్? – శివ కుమార్ పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదా వ వహవా ఎవరేమనుకున్నా వినదీ ప్రేమవ వహవా ఎదురేమున్నా కనదీ ప్రేమవ వహవా కనులే తెరిచిన కల ఈ ప్రేమవ వహవా ఎదురే రాకున్నా నిజమీ ప్రేమఓ చెలీ.. సఖీ.. ప్రియా.. యూ లవ్ మీ నౌ ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నే....పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతేప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదాఓ.. ఓహోహో.. వయస్సాగక నిన్ను కలిసిననన్ను మరచిన పదే పదే పరాకులేఓ.. ఓ... నీ ఆశలో.. నీ ధ్యాసలో.. చిగురించగ అదే అదే నీదాయెలేప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంతే అది ప్రేమించిందో ఏమో నన్నే ఐ లవ్ యు అంటుందేనువ్వంటే చాలా ఇష్టం లవ్వంటే ఎంతో ఇష్టంఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు.....‘ఈ పాట పాడాలా సార్? అమ్మాయి ఫీల్ అయ్యి ముందు పీకుతుంది. తర్వాత బాస్‌కి చెప్పి ఉద్యోగం పీకిస్తుంది సార్!’డైరెక్ట్‌గా చెప్పలేనప్పుడు ఇదో మెథడ్ నీలూ! అమ్మాయి అర్థం చేసుకుని చరణం అందుకుంటే ఓకే... చరణాలకు ఉన్న చెప్పు తీసి.. బాస్ దగ్గరకు తీసుకుని వెళ్తే.. ‘‘అయ్యో తను అలా అనుకున్నారా..? నేనేదో నా వంతు పాట పాడుకుంటున్నాను సార్’’ అని సంజాయిషీ ఇచ్చుకోవచ్చు! -ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! మీరు అమ్మాయిలకు ఇచ్చే సపోర్ట్ నాకు బాగా నచ్చుతుంది. నా చెల్లెలు ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయింది. ఇప్పుడు తనకి పెళ్లి చేద్దామని అమ్మానాన్న అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య మా చెల్లి ఆ అబ్బాయికి మళ్లీ దగ్గరవుతోంది. వాడు మళ్లీ మోసం చేస్తాడని చెబుతున్నా వినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ‘తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు అన్నయ్యా’ అంటోంది. తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – దుర్గారావు తను అర్థం చేసుకోవాలా?లేదా మనమే అర్థం చేసుకోవాలా???? ఈ ప్రపంచంలో మోసాలు రోజూ చూస్తున్నాం!ద్రోహాలు రోజూ జరుగుతున్నాయి!అలాంటప్పుడు చెల్లెలికి ఒకసారి జరిగిన మోసం మళ్లీ జరగకుండా ఎలా ఉంటుంది అని అనుకోవడం చాలా నార్మల్.పోనీ గట్టిగా మందలించి చెల్లెల్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తే...అలా చేస్తే... చెల్లెలు సంతోషంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉందా?అలాగని ఒకసారి మోసం చేసిన వాడికే మళ్లీ అవకాశం ఇస్తే...ఇంకోసారి మోసం చెయ్యకుండా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలమా?రెండూ నీ చేతిలో లేవు..‘ఏంటి సార్? సింపుల్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వండని అడిగితే... సాంతం క్లాసు పీకేస్తున్నారేంటి సార్?’లేదు నీలూ!!నిర్ణయం తీసుకోవాల్సింది చెల్లెలే. ఓన్లీ షీ నోస్... వాడు ప్రాయశ్చిత్తంతో తిరిగి వచ్చాడా లేదా అన్నది. ఓన్లీ షీ కెన్ డిసైడ్!!‘ఏడిసినట్లు ఉంది సార్! ఇక అడ్వైజ్ కోసం మీకు ఉత్తరం రాయడం దేనికి? ఆ అన్నచెల్లెళ్లే ఉత్తరాలు రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కదా సార్? ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్!!’నీలూ..! చెల్లెలు కొన్ని రోజులు ప్రేమ, రొమాన్స్, పెళ్లి లాంటి విషయాల నుండి దూరముంటే.. తనకే క్లారిటీ వస్తుంది. ఏదో వెనక్కి వచ్చాడు కాబట్టి.....‘సార్...! నేను చెబుతాను ఆగండి. వెనక్కి వచ్చాడు కాబట్టి మనం వెనక్కి పరిగెత్తుకునిపోతే కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది. అదీగాక ఇదేమైనా చిన్న విషయమా? లైఫ్ డెసిషన్..! తొందర పడకుండా తీసుకోవాల్సిన నిర్ణయం..!! రామ్ గారి చెల్లెమ్మా.. ప్లీజ్ వెయిట్!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! ఎలా ఉన్నారు. మీకూ, నీలాంబరికీ అరటిపండు దండం సార్. నేను మా జూనియర్ని లవ్ చేస్తున్నాను. తనకి లవ్ చెయ్యడమన్నా, కలిసి తిరగడమన్నా చాలా చిరాకు. ఫ్రెండ్‌గా ఉండమంటోంది. ఏదో ఆశించే మనసుకి ఫ్రెండ్ అనే ముసుగు వేయడం అవసరమా అని దూరంగా ఉన్నాను. తను నాకు కావాలి సార్! ఏం చెయ్యను?? – అయ్యప్ప ముసుగేసుకో!!‘ఎందుకు సార్ మీరు అంత నిష్ఠూరంగా మాట్లాడతారు..?? ఇష్టం లేకపోతే ఆన్సర్ ఇవ్వకండి. అంతే కానీ... ముసుగేసుకో.. నీ ముఖానికి లవ్ ఏంటి? అమ్మాయి ఫ్రెండ్ అంటుంటే.. నీకు వేరే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయిరా డర్టీ ఫెలో...? తప్పు పని చేస్తేనే కదా ముసుగులు అవసరం..! అలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు రా బ్యాడ్ బాబు..? అని ఒక లవర్ని కించపరచడం తప్పు కాదాసార్? మీరే చెప్పండి సార్?!!’నిజమే నీలూ..! లవ్ వద్దు ఫ్రెండ్ అయితే ఓకే అన్నప్పుడు కావాలంటే ఒక మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. ఫ్రెండ్‌లాగా అమ్మాయిని కాపాడాలి. అంతేకానీ కోరుకోకూడదు. అందుకే.... ‘ఓ... ఓహో... ఓహోహో... బ్యాడ్ ఆలోచనలకు ముసుగు వేసుకుని బీ ఎ గుడ్ ఫ్రెండ్ అంటున్నారు. సూపర్ సార్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నా స్నేహితుడు నాకు చాలా పెద్ద ద్రోహం చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తనూ ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ అమ్మాయికి, నాకు మధ్య కావాలనే గొడవ పుట్టించి విడదీసాడు. ఆ విషయం తనకి తెలియక వాడినే నమ్మింది. చివరికి ఇద్దరూ కలిసి నన్ను బకరా చేశారు. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నా కన్నవాళ్ల కోసం ఆలోచిస్తున్నాను. వాళ్లిద్దరినీ నేను నా జీవితంలో క్షమించలేను. ప్లీజ్ సార్ ఏదైనా సలహా ఇచ్చి వాళ్లని పూర్తిగా మరచిపోయేలా చెయ్యండి ప్లీజ్! హెల్ప్ మీ సార్! – చిన్ను నవ్వరా బంగారం...! ఆకాశం కంపించేలా నవ్వరా...!! భూమి అదిరేలా నవ్వరా...!! ‘పిచ్చోడనుకుంటారేమో సార్...!? అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని స్క్రూ లూజ్ అయ్యిందనుకుంటారేమో సార్!? ఫ్రెండ్ లవ్వును బెండ్ చేశాడని భరించలేక బుర్ర కిర్రుమన్నదేమో అనుకుంటారు సార్!? ఆల్రెడీ అందరూ ఢోకా ఇచ్చి చిన్నూ లైఫ్‌తో ఆడుకున్నారు... మీరు కూడా పిచ్చోడిని చేసి ఆడుకుంటారేంటి సార్!?!’ అలా కాదు నీలూ...! ‘ఇంకెలా సార్? అమ్మాయి ఛీ కొట్టింది.. ఇప్పుడు అదర్స్ కూడా ఛీ కొడతారు కదా సార్?!’ కాదు నీలూ! వాళ్లిద్దరూ కుళ్లుకుంటారు. చిన్నూ నవ్వుకు కుళ్లీ కుళ్లీ కుళ్లిపోతారు నీలూ! ‘అబ్బా..! సూపర్ సార్..!! చిన్నూ హ్యాపీగా ఉన్నాడని వాళ్లకు తెలిస్తే భలే ఉంటుంది సార్..! వాళ్లకు పిచ్చెక్కుతుంది సార్.. భరించలేరు సార్.. అవును సార్.. చిన్నూ అలాగే కాన్ఫిడెంట్‌గా సాగిపోవాలి సార్..! హ్యాండ్ ఇచ్చిన వాళ్లకు బ్యాండ్ పడుతుంది సార్!’ అని నవ్వింది నీలూ. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేనొక అబ్బాయిని ఆరేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్నాడు. ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. కానీ ప్రాబ్లమ్ ఏమిటంటే... నేను వాళ్ల ఫ్యామిలీకి అంతగా నచ్చలేదు. మా మతాలు వేరు. ‘మా ఫ్యామిలీ కోసం నువ్వు మారాలి’ అంటున్నాడు. ఇంకా మా విషయం మా ఇంట్లో తెలియదు. తను చాలా మంచివాడు అన్నయ్యా. బట్ ఇప్పుడు యూఎస్ వస్తేనే పెళ్లి చేసుకోవడానికి కుదురుతుందని అంటున్నాడు అన్నయ్యా. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్. – కీర్తి మారడానికి, మార్చుకోవడానికి ఇదేమైనా చున్నీనా తల్లీ..!? జీవితం. ఎన్నో ఏళ్లుగా... అసలు నువ్వు పుట్టకముందు నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు... ధరించిన అభిమానం తల్లీ!! నువ్వు అన్నది ఒక మనిషి కాదు.. ఒక ఫిలాసఫీ.. ఒక జీవన విధానం.. ఒక నమ్మకం.. ఎన్నో ఏళ్లు మన ఇంట్లో వ్యవస్థ మనకు ఉగ్గు పాలతో పట్టిన మన ఉనికి... మారకూడదు.. ఎప్పుడూ ఇంకొకరి కోసం మారకూడదు. నువ్వు ఎలా ఉన్నావో అలా నచ్చే కదా నిన్ను ఇష్టపడింది. నువ్వు మారిన మరుక్షణం నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. నిజానికి రిలేషన్షిప్లో నువ్వు తగ్గిపోతావు.‘సార్ ఇంత ఉపన్యాసం యూత్‌కి అవసరమా సార్? వాళ్లకు తలపోటు వస్తుంది. ఏదో పుస్తకంలో నీతుల్లాగా చెప్పుకుంటూనే పోతున్నారు. అన్నీ బౌన్సర్లలాగ నెత్తి మీద నుంచి వెళ్లిపోతున్నాయి. కొంచెం సింపుల్‌గా చెప్పండి ప్లీజ్!’కీర్తీ! నువ్వు నమ్మిన దాన్ని వదులుకున్న రోజు.. అది ఏదేమైనా కావచ్చు... నీలో ఒక భాగం కట్ అయిపోయినట్టే...! నువ్వు ఫుల్‌గా అనిపించవు. ప్రేమించుకున్నది మీరిద్దరూ. పెళ్లి చేసుకోవలసింది మీరిద్దరూ. వాడికి ప్రేమ ఉంటే చేసుకుంటాడు. వాడికి డౌట్స్ ఉంటే నువ్వే చేసుకోవద్దు. బీ స్ట్రాంగ్!! lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మీరెప్పుడూ ఎందుకని అమ్మాయిలనే సపోర్ట్ చేస్తారు? నాకొకటి అనిపిస్తోంది. బహుశ ఒక ఆర్గనైజేషన్ నేమ్‌తో మీరు సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయిలు తప్పు చేసినా ఏం అనట్లేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు న్యాయంగా సమాధానం చెప్పండి. తనే నన్ను ‘లవ్ చేశాను’ అంది. తనే ‘మా వాళ్లు ఒప్పుకోరు సారీ’ అంది. ఈ మధ్యలో నన్ను పిచ్చోడిని చేసి తన అవసరాలు, ఆశలు అన్నీ తీర్చుకుని వాళ్ల పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. అంటే తనకో క్లారిటీ ఉందనేగా అర్థం. అదే విషయం నాకు చెప్పి ఉంటే.. నేను హ్యాపీగా తిరిగి, హ్యాపీగా మరిచిపోయి ఉండేవాడినిగా? సార్ మాట మార్చకండి. న్యాయం చెప్పండి. ఆ అమ్మాయిది తప్పేనని ఒప్పుకోండి. కనీసం నా మనసు సంతోషిస్తుంది.– రఘు అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... ‘సార్... రామకోటి లాగ.. తప్పు కోటి రాస్తున్నారు. ఎందుకో మీరు అలా రాస్తుంటే మీరు లెంపలేసుకుంటున్నారేమోనన్న ఫీలింగ్ రఘుకి వచ్చి చాలా.. చాలా.. చాలా.. చాలా... చాలా... సంతోషిస్తాడు సార్!’ అని కడుపు పట్టుకుని నేల మీద దొల్లుతూ నీలాంబరి నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ ఉండిపోయింది!! lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మీరు అమ్మాయిలకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. అందుకే మీరంటే ఇష్టం. నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను. తను కూడా మీలానే అమ్మాయిలని చాలా గౌరవిస్తాడు. అలానే వాళ్ల మమ్మీ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ల మమ్మీ మా పెళ్లికి నో అంటున్నారు. ‘ఒప్పుకోకపోతే లైఫ్‌లో పెళ్లే చేసుకోను. నీ మాట కాదని ఆ అమ్మాయినీ చేసుకోను’ అని చెప్పాడట వాళ్ల మమ్మీకి. ఆమె మనసు గెలవాలంటే నేనేం చెయ్యాలి? – రాధిక ‘పడింది సార్.. బాంబు..! దీనికి ఆన్సర్ చెప్పలేకపోతే... మీ మీద లవర్స్‌కి ఫుల్‌గా కాన్ఫిడెన్స్ కూలిపోతుంది సార్!’ అవును నీలూ చాలా టఫ్ క్వశ్చన్. నువ్వేమైనా ట్రై చేస్తావా ఆన్సర్ చెప్పడానికి... ‘సార్ రాసింది మీ సిస్టర్! అబ్బాయి రాసుంటే నేనే ఆన్సర్ ఇచ్చేదాన్ని!’ ఫర్ సపోజ్ అబ్బాయే రాశాడనుకుందాం. ఈ అబ్బాయికి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం కదా నీలూ! వాళ్ల అమ్మకి అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. మరి అబ్బాయేమో మమ్మీ..మమ్మీ..మమ్మీ.. అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు కదా.. ఆ అబ్బాయికి ఏం ఆన్సర్ ఇస్తావు నీలూ????? ‘చెబుతాను సార్..! సూపర్ ఆన్సర్ చెబుతాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇస్తాను సార్!’ దేనికి వెయింటింగ్ నీలూ! కమాన్ ఐసే అటాక్!! ‘ఓరీ అబ్బాయీ!! ప్రేమించక ముందు మమ్మీ.. మమ్మీ.. అని ఏడ్చావా? ఏడ్చివుంటే... ఇవ్వాళ లవ్ డాక్టర్ గారి చెల్లి ఏడ్చేది కాదు కదా!! ప్రేమించినప్పుడు ఆలోచించాలి. ఆలోచించి ప్రేమించాలి. అయినా ప్రేమేమైనా ఆలోచించి వస్తుందా? ఓరీ అబ్బాయీ!! ఆలోచిస్తే వచ్చే ప్రేమ ప్రేమే కాదు. ఓరీ శుంఠా!! ప్రేమించాక ఆలోచించడం ఆడపిల్లను గౌరవించడం ఎలా అవుతుంది. అమ్మను కన్విన్స్ చేసుకో... లేదంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ బిడ్డకు కాబోయే అమ్మను గౌరవించు!!’ నీలూ! నీలూ!! ఆవేశం తగ్గించుకో...!! ఇవిగో నీళ్లు తాగు. కూల్..కూల్..కూల్!!! - lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నాకు మూడేళ్ల క్రితం ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నాకూ తనంటే ఇష్టం ఉండటంతో ఓకే అన్నాను. అయితే ఐదు నెలలుగా తను నాతో సరిగా మాట్లాడటం లేదు. నా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం లేదు. ‘నన్ను పెళ్లి చేసుకో’ అని అడిగితే... క్యాస్ట్ కారణంగా చూపించి.. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటున్నాడు. పైగా ‘నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ అంటూ సోది చెబుతున్నాడు. నేను ప్రతిరోజూ ఏడుస్తూనే ఉంటున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా! ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – సాయి లత వీడు దొంగ రాస్కెల్, క్యాస్ట్ అడ్డం పెట్టుకుని... నిన్ను వాడుకుంటున్నాడు... ఏ క్యాస్ట్‌లోనూ ఒక అమ్మాయిని కష్టబెట్టమని ఉండదు!ఏ క్యాస్ట్‌లోనూ ప్రేమను ఛిద్రం చెయ్యమని ఉండదు!క్యాస్ట్ట్ స్ట్రెన్త్ ఇస్తుంది, ప్రేమను కూల్చదు...పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానెయ్యమను!క్యాస్ట్‌కి చెడ్డ పేరు... ప్రేమకు చీడ పెట్టొద్దని హెచ్చరించు!గుండె దిటవు చేసుకో.. ఇలాంటి వాడి అసలు రంగు ముందే బయటపడినందుకు దేవుడికి థ్యాంక్యూ చెప్పుకో..! ఆల్ ది బెస్ట్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్...! మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరూ త్రీ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కానీ, వాళ్లిద్దరి నేపథ్యాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో విడిపోయారు. వాళ్లు్ల కలిసి పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి సార్? – పల్లవి ఇద్దరూ మేజర్స్ అయితే వాళ్లను ఎవరూ ఆపలేరు.‘మేజర్స్ అంటే ఏంటి సార్? అది కూడా చెప్పండి. సగం చెబుతారు. సగం మింగుతారు. పల్లవి నేను చెబుతాను. అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్... అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ దాటితే... ఇద్దరూ మేజర్స్. ఏ పోలీస్ స్టేషన్‌కి పోయి వాళ్లిద్దరూ ప్రాబ్లమ్ చెప్పుకున్నా సొల్యూషన్ దొరుకుతుంది. కరెక్టా సార్?’రాంగ్!!‘ఏంటి సార్? అది కరెక్ట్ కాదా? దేశంలో ఉన్న రూల్ కంటే మీ రూల్ కరెక్టా సార్?’ నా రూల్ నాకు ఉత్తరం రాసిన వాళ్లకు వర్తిస్తుంది. ప్రాబ్లమ్ నాకు చెప్పారు కాబట్టి నేను చెప్పేదే కరెక్ట్ నీలూ!‘అయితే చెప్పండి ఏమి చెయ్యాలి?’ వయసు ఒక్కటే సరిపోదు పల్లవీ! జీవితంలో కలిసి జీవించే మెచ్యూరిటీ ఉండాలి. పెద్దల సలహా, సంప్రదింపులు లేకుండా అంత పెద్ద నిర్ణయం చెయ్యకూడదు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఒకరికొకరు ఉంటారో లేదో తెలియదు కానీ.. కష్టం వస్తే ఏకాకులైపోతారు. ఎవరూ సాయం చెయ్యరు. ప్రపంచం అంత మంచిది కాదు. కుటుంబాలను దూరం చేసుకుని పారిపోవడం చాలా కష్టాలకు కారణం అవుతుంది. వాళ్లిద్దరినీ... మొదట పెద్దలను కన్విన్స్ చేసుకోమను. అవసరమైతే సమాజంలోని ఇతర పెద్దలను సంప్రదించి పేరెంట్స్‌తో మాట్లాడటం మంచిది. - lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నా. నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ట్రూగా లవ్ చేసింది. మా నేపథ్యాలు వేరు కావడంతో తనకి వేరే సంబంధం చూశారు. పెళ్లికి ముందు రోజు కాల్ చేసి ‘నాకు నువ్వు కావాలి’ అంది. అప్పుడు నేనేం చెయ్యలేకపోయాను. తనకి పెళ్లైపోయింది. ప్రాణం పోయేంతగా ఏడ్చాను. నా ప్రాబ్లమ్ ఏంటంటే... ఇప్పుడు తను రోజూ కాల్ చేస్తోంది. ఎన్నిసార్లు పట్టించుకోలేనట్లున్నా కాల్ చేస్తూనే ఉంటోంది. పైగా ‘నువ్వే కావాలి’ అంటోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక పెళ్లి అయిన అమ్మాయితో ఎలా మాట్లాడాలి. పైగా ప్రతిసారీ ‘ఐ లవ్ యూ’ అంటోంది. పెళ్లి అయ్యాక కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావని అడిగితే.. ‘పెళ్లి అయితే లవ్ చెయ్యొద్దా?’ అంటోంది. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పండి బ్రో. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. – లక్కీ మంచివాడివి...!అంతగా అమ్మాయి అడుగుతున్నా...అదుపు తప్పకుండా గౌరవంగా బిహేవ్ చేస్తున్నావ్...!!నిజంగా అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు అన్నా....!!నీలాంటి వాళ్లు కొందరున్నారు కాబట్టే...ఇంకా సమాజంలో ఒక నియమం, నిబద్ధత ఉన్నాయి...!!‘సార్...! ఇంత బటర్ పూస్తున్నారెందుకు సార్??జారి కింద పడతాడేమో సార్?!!’అమ్మాయి రాస్తున్న బటర్కే పడలేదు..!అయినా ఈ పిలగాడుపడేరకం కాదు...!పడిపోయే నీచ గుణం లేదు...!!తనను తాను తగ్గి....‘మంచిని లేపే గుణం ఉన్నవాడు కదా సార్? నిజమే... నాకు కూడా నచ్చాడు సార్...! అమ్మాయిని రాంగ్ రూట్లో పడకుండా ఉంచాడు.. శభాష్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని. ఆరు నెలల క్రితం నేనొక అమ్మాయిని చూశాను. తను నాకు బాగా నచ్చింది. నేను తనని కలిసినప్పుడు తను బిజినెస్ చేసేది. దానికి సంబంధించి మనీ కావాలంటే కొంతవరకు హెల్ప్ చేశాను. నెల తర్వాత ‘నా బిజినెస్ కొలాప్స్ అయ్యింది. నేను చచ్చిపోతాను’ అంది. నేను తనకు బాగా ధైర్యం చెప్పి, లాస్ అయిన మనీ నేనే ఎలాగైనా ఎరేంజ్ చేస్తానన్నాను. తనకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా ఖర్చులకు నేనే ఇచ్చేవాడిని. ఒకసారి మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజ్ చేశాను. తనేమో ‘మా పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను’ అంది. తనకు ఆల్రెడీ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే అదే సమాధానం చెప్పిందట. కానీ ఇప్పటికీ నా దగ్గర ఖర్చులకు మనీ తీసుకుంటూనే ఉంది. మనీ ఇవ్వకపోతే ఏడుస్తోంది. ఇప్పటికే తన కోసం చాలా మనీ ఖర్చుచేశాను. ‘నువ్విచ్చిన మనీ లెక్క అంతా నా దగ్గర ఉంది. నీకు తిరిగి ఇచ్చేస్తాను’ అంటోంది. అసలు తనకి నా మీద లవ్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – నాగు టాటా..!! వీడుకోలు ..!గుడ్ బై..! ఇంక సెలవు..!తొలినాటి స్నేహితులారా...చెలరేగే కోరికలారా...ప్రియురాలి వలపుల కన్నా...నును వెచ్చనిదేదీ లేదని...నిన్నను నాకు తెలిసింది...ఒక చిన్నది నాకు తెలిపింది...ఆ ప్రేమ నగరుకే పోతాను.. పోతాను.. పోతాను..!!‘ఏంటి సార్!? ఎప్పుడో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో పాట పాడుతున్నారు. అక్కడ నాగు డబ్బులు... ఇస్తూ... ఇస్తూ.. ఇస్తూ... పోతాడు...పోతాడు... పోతాడు..’ఇచ్చుటలో ఉన్న హాయీ.. వేరెచ్చటనూ లేనే లేదని...లేటుగ తెలుసుకున్నాను.. నా లోటును దిద్దుకున్నాను...‘సార్! సార్!! సార్!! ఆపండి సార్! అదే పాట పాడి నాగును కన్ఫ్యూజ్ చెయ్యకండి. నాగు...! అర్థమైందా..!? లేటుగా అయినా లోటును తెలుసుకో. లేకపోతే మునిగిపోతావు... పోతావు...పోతావు...!’అవును నాగు! అమ్మాయి స్టేబుల్ పర్సన్ కాదు. అసలు ఇన్వాల్వ్ కావద్దు. గుండె దిటవు చేసుకో. బి స్ట్రాంగ్! లవ్ యు. టేక్ కేర్! టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. ఇంక సెలవు!! ‘అని చెప్పమంటున్నారు కదా సార్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్ లవ్ చేశాను. తనకి ఎనిమిది నెలల క్రితమే ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. కానీ తనకి అంతకు ముందే ఒకరితో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. ‘నువ్వు ఆ అబ్బాయిని పూర్తిగా మరిచిపోతేనే నన్ను లవ్ చెయ్యి. లేకపోతే వద్దు’ అని చెప్పాను. తనని పూర్తిగా మరిచిపోయానంది. ‘సరే అయితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ఓకే అంది. అయితే రెండు నెలలు తర్వాత అతను కాల్ చేసి.. ‘మనం మళ్లీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం’ అన్నాడట. ఆ విషయం నాకు పదిరోజుల తర్వాత చెప్పింది. ‘ఇది సరికాదు.. అతనికి నో అని చెప్పెయ్’ అన్నాను. తను మాత్రం ‘అతడిని వదులుకోవాలని అనిపించట్లేదు’ అంది. ‘నేను నీ లైఫ్‌లోకి రాక ముందు ఏం జరిగినా నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది?’ అని అడిగాను. దాంతో మా విషయం ఆ అబ్బాయికి చెప్పిందట. ‘సరే గుడ్ బై’ అని చెప్పి వెళ్లిపోయాడట. ఆ తర్వాత ఇప్పటివరకూ బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోరు, మనం విడిపోదాం’ అంటోంది. నాకు తను కావాలి. తన ప్రేమ కావాలి. ఒక్క వన్ ఇయర్ ఆగితే నేను లైఫ్‌లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ని ఒప్పిస్తాను’ అని చెబుతున్నా తను వినట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్? – ఆంజనేయులు అమ్మాయి జంపు కొట్టేసింది అన్నా!‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే... ‘పెళ్లికూతురు లవ్ స్టేటస్ ఏంటి?’ అని అడిగాడట మునుపటికి ఓ ప్రబుద్ధుడు. అలా మిమ్మల్ని ఆంజనేయులు కలపమని సలహా అడుగుతుంటే.. అమ్మాయి జంపు గింపు అంటారేంటి సార్?’అమ్మాయి ఇంకా పాత లవ్వులోనే కూరుకుపోయి ఉంది. ఆంజనేయులు ప్రేమ చూసి అక్కడ నుంచి రీబౌండ్ అయ్యి ఆంజనేయులు హార్ట్‌లో పడింది. మళ్లీ ఆ అబ్బాయి కనపడేటప్పటికి...‘మళ్లీ రీబౌండ్ అయ్యి హార్ట్ అక్కడ పడిందా సార్ అమ్మాయిది?’అవును నీలూ! అమ్మాయి ఎమోషనల్ కండిషన్ చాలా వీక్‌గా ఉంది. ఇలాంటప్పుడు మనంఇన్వాల్వ్ అయితే...‘హార్ట్ ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా సార్!?’అబ్బా ఏం క్యాచ్ చేశావు నీలూ! ఆంజనేయులు మెయిన్‌టెయిన్ డిస్టెన్స్. అలాంటి స్టేజ్‌లో ఉన్న అమ్మాయితో రిలేషన్ కోరుకోవడం....‘కొరివితో కాపురంలాంటిదే కదా సార్?’అబ్బబ్బబ్బా నీలూ.....! యూ ఆర్ వెరీ స్మార్ట్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనూ ఒక అమ్మాయీ 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉన్నాం. కానీ లాస్ట్ ఇయర్లో ఆమెకూ నాకూ మధ్య మా ఫ్రెండ్స్ గొడవ క్రీయేట్ చేశారు. ఆ విషయం నాకు లాస్ట్‌లో తెలిసింది. తను మాత్రం నాకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. నాకు ఏం అర్థం కాలేదు. కాల్ చేసిన రెస్పాన్స్ ఇవ్వలేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. ‘‘ఏంటిది..? ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నాం. ‘నీకంటే ఎవ్వరూ ఎక్కవ కాద’ని చెప్పిన అమ్మాయి... కనీసం ఒక్క మెసేజ్ కూడా పెట్టడంలేదేంటి?? ఇదే నా లవ్ అంటే??’’ అని చాలా బాధపడ్డాను. ఇదంతా 2016లో జరిగింది. అయితే కొన్ని రోజులుగా తను కాల్ చేసి మాట్లాడుతోంది. ఇప్పుడు నేను ఏం అనుకోవాలి?? లవ్ అనుకోవాలా? లేదా క్యాజువల్‌గా ఫోన్ చేస్తుందనుకోవాలా? అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి లవ్ గురు..! – రాహుల్ చాలా క్యాజువల్ రాహుల్!!చాలా క్యాజువల్ అంటే క్యాజువల్..!!ఇది కన్ఫార్మడ్..!!డౌట్ లేదు!!ఒక్క క్షణం కూడా ఇంకోలా ఆలోచించకు..!!మళ్లీ ప్రేమ అనుకుని పడ్డావో...అరటి తొక్క మీద కాలు వేసినట్లే...!జీవితం మాడిన పెసరట్టే..!!తెల్లటి చొక్కా వేసుకుని వీధిలోకి రాగానే పడ్డ కాకి రెట్టే..!!నీ పీస్ ఆఫ్ మైండ్ ఫట్టే!!ఇక్కడేదో జట్టు అవుతుందనుకుంటే ఇంకో లవ్ స్టోరీ లైఫ్‌లో లేనట్టే..!!‘ఎందుకు సార్..!? అంతగా డిస్కరేజ్ చేస్తున్నారు. పాపం రాహుల్‌కి ఉన్న కాస్త హోప్ కూడా ఫట్టే!!’అవును నీలూ..!! ఫాల్స్ హోప్ పెట్టుకుంటే లైఫ్ లైఫ్ అంతా డౌటే!‘రాహుల్ ఇది నిజమే! మళ్లీ హోప్స్ పెట్టుకుంటే... మళ్లీ ఎగిరిపోయేది పిట్టే!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నాకొక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం మంచిగా క్లోజ్‌గా ఉంటాం. కానీ వన్ మంత్ నుంచి అవాయిడ్ చేస్తోంది. చూసి చూడనట్లు ఉంటోంది. నేనొక రోజు గట్టిగ అడిగాను. అడిగితే.. ‘మా ఇంట్లో సంబంధం చూశారు, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది’ అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు ఏదైనా సలహా ఇవ్వండీ ప్లీజ్. – నన్నే సాహెబ్ నువ్వు కూడా మీ ఇంట్లో గట్టిగా చెప్పు..!‘ఏం చెప్పాలి సార్?’నాకు ఫిక్స్ చెయ్యండి అని.‘మరి లవ్ ఏం కావాలి సార్?’అదేంటి నీలూ? మన లవ్ అమ్మాయి లవ్ కంటే ఏమైనా తక్కువా?‘మరి అలాంటప్పుడు ఆ అమ్మాయితోనే ఎలాగైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలి కదా సార్??’కాదు నీలూ..! ఇక్కడ లవ్ కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా గట్టిగా దెబ్బతిన్నది.‘అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి సార్ మన హీరో?’ ఆ అమ్మాయి కంటే ముందు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తన మ్యారేజ్ కార్డ్ అమ్మాయికి ఇవ్వాలి నీలూ..! మెగా లవర్ అంటే ఏంటో అమ్మాయికి చూపించాలి..!!‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ మ్యారేజ్ కార్డ్ అనాలి కదా సార్?!??’అబ్బబ్బబ్బా నీలూ.. యు ఆర్ వెరీ స్మార్ట్! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనకి ఇప్పటికే ఫోర్ టైమ్స్ ప్రపోజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. వాళ్ల ఫాదర్.. తనకు పెళ్లి చెయ్యడానికి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లకోసమే చూస్తున్నారట. కానీ నేను చదువుకోలేదు. తను నన్ను ప్రేమించకపోతే నేను చనిపోతాను. ప్లీజ్ హెల్ప్ మీ సార్. – ఆనంద్ కుమార్ చదువుకున్నవాడు గొప్పవాడు కాదు.చదువుకోనివాడు మనసు లేనివాడు కాదు.కానీ ప్రేమ, పెళ్లి రెండు డిఫరెంట్..!!ప్రేమించడానికి అర్హతలు అక్కర్లేదు.పెళ్లి చేసుకోవడానికి బాధ్యత నింపే శక్తి అవసరం..!!ఓటమి.. ప్రేమించి పెళ్లి చేసుకో లేకపోవడంలో లేదు.ఓటమి.. కులంలో, పేదరికంలో లేదు.ఓటమి.. బతకలేకపోవడంలో లేదు.‘మరి ఎక్కడ సార్ ఓటమి ఆనంద్కి??’తన మీద తనకు భరోసా లేకపోవడంలో ఉంది.‘అవును అమ్మాయి ఓకే చెప్పలేదు, మనకు నచ్చిన వాళ్లు మనకు ఓకే చెప్పాలనేం లేదు. అలాగని మనం ఎవరికీ తక్కువ కాదు. మన మనసుకు నచ్చింది మనం చెప్పగలిగాం. అది గ్రేట్. ఆనంద్కి ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు. తిరస్కారం నుంచి భయపడి చెప్పకుండా ఉంటే దాన్ని ఓటమి అనుకోవాలి. ఆనంద్ కూడా ట్రై చేశాడు. ఫ్యూచర్లో తనకు తప్పకుండా మంచి లవ్ దొరుకుతుంది!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నాదొక సమస్య...!! రెండేళ్లుగా ఒక పెళ్లైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి ఈ మధ్య ఒక పాప కూడా పుట్టింది. మొదట్లో ‘నువ్వంటే నా ప్రాణం’ అనేది. ఎప్పుడైనా గొడవ జరిగితే నేనే ముందు ఫోన్ చేసే వాడిని. ఈ మధ్య ఆ అమ్మాయి ‘నన్ను వదిలెయ్యి. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అంటోంది. కానీ నేను ఎదురుపడితే నా వైపు చూసి నవ్వుతోంది. ఈ పెళ్లైన అమ్మాయిని నేనెలా నమ్మాలి..? నేను మానసికంగా చాలా బాధను అనుభవిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎలా మర్చిపోవాలి? ప్లీజ్ అన్నయ్యా.. నాకు మంచి సలహా ఇవ్వండి. నేను మీరు చెప్పిందే పాటిస్తాను. – గిరి మంచి ప్రేమ.. మంచి కోరుతుంది.అది ఎదగాలి, పెరగాలి, వెలగాలి, పంచాలి.తగ్గాలి, ఒగ్గాలి, నెగ్గాలి..!!కానీ దేన్నీ ధ్వంసం చెయ్యకూడదు..!!పెళ్లైన అమ్మాయి..! బిడ్డ ఉన్న తల్లి...!కుటుంబం ఉన్న కోడలు...! బాధ్యత ఉన్న చెల్లి...!ఒకసారి ఇమాజిన్ చెయ్యి.. నీకే పెళ్లి అయ్యిందనుకో...వేరెవరైనా నీ భార్యతో అలాంటి ఆలోచన పెట్టుకుంటే...నువ్వు ఆ మగాడిని అసహ్యించుకోవా??చాలు గిరి..! ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పు ఇక చాలు..!!మంచితనాన్ని గెలవనివ్వు.మదమాత్సర్యాలను అణిచివెయ్యి.‘సార్..! మదమా..త్సర్యా...లు... అంటే ఏంటి సార్??’ఏదో ఫ్లోలో అన్నాను, నాకూ తెలియదు నీలూ! ‘నాకు తెలుసు సార్! ప్రేమ లేని వాంఛ... డర్టీ థింగ్. ప్రేమను అవమానించే ఆలోచన... దట్ ఈజ్ మదమాత్సర్యాలు. గిరి..! స్టాప్ ఇట్!! బీ ఏ గుడ్ మ్యాన్!!’ ఇంకోసారి ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్‌కి నువ్వే ఆన్సర్ ఇవ్వు నీలూ! నా ముందు అసలు ప్రవేశపెట్టకు ప్లీజ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని నాలుగేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేశాడు. మేమిద్దరం క్లాస్మేట్స్. చదువు పూర్తికాగానే జాబ్ చేద్దామనుకున్నాను. కానీ తను ‘నేను జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోను, వద్దు’ అన్నాడు. నేను కూడా తన మాటకు గౌరవమిచ్చి జాబ్ చెయ్యాలనే ఆలోచనను మానుకున్నాను. తనకి మంచి జాబ్ వచ్చింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ తర్వాత నుంచి నన్ను ఇగ్నోర్ చెయ్యడం మొదలుపెట్టాడు. రీజన్ లేకపోయినా తిట్టేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగితే... ‘నాకు నువ్వు వద్దు, మా ఆఫీస్‌లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను’ అన్నాడు. చాలా ఏడ్చాను. కొన్ని రోజులకి మళ్లీ తనే కాల్ చేసి సారీ చెప్పాడు. ‘ఇద్దరం జాబ్ చేస్తేనే లైఫ్ బాగుంటుంది. నువ్వు కూడా జాబ్ ట్రై చెయ్యి’ అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా కష్టపడి ఓ మంచి జాబ్ సంపాదించాను. తర్వాత తనకి మరో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ తను దాన్ని వదులుకున్నాడు. ఎందుకు అని అడిగితే.. ‘ఇప్పుడు నేను చేస్తున్న ఆఫీస్‌లో నాకో మంచి ఫ్రెండ్ ఉంది. తనని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. తనని నేను మిస్ అవ్వలేను’ అన్నాడు. తను చెబుతున్న ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. తన ఫ్రెండ్షిప్ కోసం మంచి జాబ్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘నీకు వచ్చిన జాబ్ నాకు నచ్చడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను’ అంటున్నాడు. చాలా మంచి అబ్బాయి అన్నయ్యా. మేము చాలా బాగా ఉండేవాళ్లం. ఆ జాబ్ వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయాడు. ఇప్పటికీ తన మీద నాకు ప్రేమ పోవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – సౌమ్య మంచోడా పాడా????ఒట్టి దగుల్బాజీ!!కుట్రకామకుడు..!‘అంటే ఏంటి సార్??’నాకూ తెలియదు నీలూ..! ఒక దొంగ రాజకీయ నాయకుడి గురించి ఎవరో మంచోడు అంటుంటే విన్నాను. నేను అనేశాను.కుట్రకామకుడు, ఏబ్రాసి...అబద్ధాల కోరు...మోసాల దిబ్బ...వెన్నుపోటుదారుడు...ఐరన్ లెగ్...చీటర్ కాక్...యాక్ తూ ఫెలో...సెల్ఫిష్ ధార్ది ఎంకమ్మ....................‘సార్..! ఇదంతా ఏదో రాజకీయ దుర్మార్గుడిని అన్నట్లుంది సార్!’వాడేమైనా తక్కువా నీలూ! విశ్వాసం లేని అక్కుపక్షి..!రోజుకో మాట మార్చే పెంటగాడు...!ఎప్పుడు ఎవరితో కనెక్షన్ పెట్టుకుంటాడో తెలియని యాగీగాడు...!!‘అంటే ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని పొలిటీషియన్ లాటి వాడా సార్..??’కరెక్ట్‌గా గెస్ చేశావు నీలూ..! మన అమ్మాయి లక్కీ. ఇంకా పొత్తు ఫైనల్ కాలేదు. అయ్యుంటే లైఫ్ మటాష్ అయ్యేది..!!‘అంటే ఫసక్ అయ్యేదా సార్?’ అబ్బబ్బబ్బా... నువ్వు ఎంత స్మార్ట్ నీలూ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! ఎలా ఉన్నారు? నేను మాత్రం హ్యాపీగా లేను. తన పేరు ప్రశాంతి. తను నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. ఒక రోజు తనే ప్రపోజ్ చెయ్యమంటే.. నేను ప్రపోజ్ చేశాను. తీరా ప్రపోజ్ చేశాక సరదాగా అన్నానంది. ఆ తర్వాత ఫ్రెండ్లీగానే ఉన్నాం. అప్పుడప్పుడు లవ్ సింబల్స్ పెట్టేది. ఈ మధ్య తను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నానంటోంది. ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీనే. కానీ వాడు మోసం చేసే రకం. అందుకే ప్రశాంతి పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. తనకి చెబుతున్నా అర్థం చేసుకోవడం లేదు. మీరే ఏదైనా సలహా ఇవ్వండి సార్. – కృష్ణ ఇంకో అబ్బాయిని చూసిపెట్టు కృష్ణా!!‘అదేంటి సార్ అంత మాట అనేశారు?’నీలూ! ఈ అబ్బాయి మంచోడు కాదు, చీటింగ్ టైప్ అని చెబుతున్నాడు కదా..! అందుకే ఒక మంచివాడిని చూడమని చెబుతున్నాను..!!‘ఎట్లా కనపడుతున్నాడు సార్ మీకు కృష్ణ????’పేపర్లో, టీవీల్లో, ఫేస్బుక్లో అడ్వర్టయిజ్మెంట్లు వేసేవాడిలా కనబడుతున్నాడు నీలూ!!‘ఎలాంటి అడ్వర్టయిజ్మెంట్లు సార్????’గుణవతి, శీలవతి, భాగ్యవతి, ‘అంద’వతి, ప్రశాంతి.. ఒక మంచి లవర్ అండ్ మొగుడు కావలెను! అని అడ్వర్టయిజ్మెంట్ వేసేవాడిలా కనబడుతున్నాడు. ‘అయ్యో.. పాపం కృష్ణ కంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు సార్ ప్రశాంతికి???’అది చెప్పలేకే.. ఉన్నవాడు మంచివాడు కాదని మొర పెట్టుకుంటున్నాడు కదా నీలూ!‘అయితే కృష్ణా..! అర్జెంట్‌గా వెళ్లి అమ్మాయికి నువ్వే కరెక్ట్’ అని గట్టిగా చెప్పు. ఒప్పుకోకపోతే ఈ జన్మలో తనకి కృష్ణలాంటి లవర్ దొరకడని చెప్పి.. అబౌటర్న్ కొట్టి సినిమా హీరోలా దుమ్ము లేపుతూ వెళ్లిపో కృష్ణా!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్