
హాయ్.. సార్!! ఒక అమ్మాయి రోజూ నన్ను చూస్తోంది. తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రెండు మూడు సార్లు ఆ అబ్బాయి బైక్ మీద పోతుంటే చూశాను. చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఈ మధ్య తను నన్ను చూసి నవ్వుతోంది. తనతో స్నేహం మంచిదేనా? – రామ్ కుమార్
బైక్ మీద పోతున్న అమ్మాయిని నోరెళ్లబెట్టి చూస్తుంటే నవ్వు రాదా బ్రో. ..?‘అంటే రామ్‌కుమార్ దీనస్థితిని చూసి పళ్లు ఇకిలించిందా సార్’. కొంచెం ఫన్నీగా నీలూ.. అలా నోరు ఓపెన్ చేసుకుని చూస్తుంటే..?? ‘పొండి సార్.. పాపం ఇంకొకరితో క్లోజ్‌గా ఉన్న అమ్మాయి.. చూసి ప్రేమగా నవ్విందని... ఏం చేయాలో చెప్పమంటే.. మీరు రామ్ కుమార్‌ని కార్టూన్‌లా చేసి ఏడిపిస్తారా సార్..?? ఈ ఉసురు ఊరికే పోదు సార్!!’ నీలూ..! పోనీ అమ్మాయికి రామ్‌కుమార్ నచ్చాడే అనుకుందాం.. కానీ ఇంకో బైక్‌మీద ఇంకో రావణాసురుడితో ట్రావెల్ అవుతున్న అమ్మాయిని నేను ఇష్టపడటం కరెక్టేనా అని అడిగితే.. జోక్ వేసిఆన్సర్ తప్పించుకోకుండా నిజాలు చెబితే రామ్‌కుమార్ హర్ట్ కాడా నీలూ..? ‘ఓ.. ఓహో.. ఓహోహో.. ఓరి ఫూల్ అనకూడదని ఫన్నీగా ఫూల్ చేస్తూ రామ్‌కుమార్ గుండెకు ఆయింట్మెంట్ రాస్తున్నారా సార్..!?’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment