హలో అన్నా. నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ట్రూగా లవ్ చేసింది. మా నేపథ్యాలు వేరు కావడంతో తనకి వేరే సంబంధం చూశారు. పెళ్లికి ముందు రోజు కాల్ చేసి ‘నాకు నువ్వు కావాలి’ అంది. అప్పుడు నేనేం చెయ్యలేకపోయాను. తనకి పెళ్లైపోయింది. ప్రాణం పోయేంతగా ఏడ్చాను. నా ప్రాబ్లమ్ ఏంటంటే... ఇప్పుడు తను రోజూ కాల్ చేస్తోంది. ఎన్నిసార్లు పట్టించుకోలేనట్లున్నా కాల్ చేస్తూనే ఉంటోంది. పైగా ‘నువ్వే కావాలి’ అంటోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక పెళ్లి అయిన అమ్మాయితో ఎలా మాట్లాడాలి. పైగా ప్రతిసారీ ‘ఐ లవ్ యూ’ అంటోంది. పెళ్లి అయ్యాక కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావని అడిగితే.. ‘పెళ్లి అయితే లవ్ చెయ్యొద్దా?’ అంటోంది. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పండి బ్రో. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. – లక్కీ
మంచివాడివి...!అంతగా అమ్మాయి అడుగుతున్నా...అదుపు తప్పకుండా గౌరవంగా బిహేవ్ చేస్తున్నావ్...!!నిజంగా అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు అన్నా....!!నీలాంటి వాళ్లు కొందరున్నారు కాబట్టే...ఇంకా సమాజంలో ఒక నియమం, నిబద్ధత ఉన్నాయి...!!‘సార్...! ఇంత బటర్ పూస్తున్నారెందుకు సార్??జారి కింద పడతాడేమో సార్?!!’అమ్మాయి రాస్తున్న బటర్‌కే పడలేదు..!అయినా ఈ పిలగాడుపడేరకం కాదు...!పడిపోయే నీచ గుణం లేదు...!!తనను తాను తగ్గి....‘మంచిని లేపే గుణం ఉన్నవాడు కదా సార్? నిజమే... నాకు కూడా నచ్చాడు సార్...! అమ్మాయిని రాంగ్ రూట్‌లో పడకుండా ఉంచాడు.. శభాష్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Jan 2 2019 12:52 AM | Last Updated on Wed, Jan 2 2019 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment