Love Doctor
-
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మా మతాలు వేరు గానీ.. మా నేపథ్యాలు ఒకటే. వాళ్ల పేరెంట్స్ వాళ్ల మత పద్థతిలోనే పెళ్లి చేస్తామన్నారు. రెండు లక్షలు కట్నం ఇస్తామన్నారు. మా పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోలేదు. నేనే కష్టపడి ఒప్పించాను. తను మా ఇంటికి వచ్చాక కూడా వాళ్ల మతాన్నే పాటిస్తాను అంటోంది. దానికి మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇద్దరం కలిసి చాలా బాగుండేవాళ్లం. తనకి అన్యాయం చెయ్యడం ఇష్టం లేదు. దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్!– కృష్ణ ప్రేమకు మతం లేదు, కులం లేదని చెప్పినా నీకు ఎక్కదు! కట్నం తీసుకోవడం నేరమని చెప్పినా నీకు అర్థం కాదు!! ఏదైనా పెళ్లికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి అంటే విసుక్కుంటావు! నీకు అమ్మాయి నచ్చిందంతే! అంటే.. రూపం నచ్చిందంతే...!! అమ్మాయి కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ల పీకల మీద కూర్చుని పెళ్లికి ఒప్పించావు. ఇప్పటికైనా మారు అన్నయ్యా ప్లీజ్!! నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో! తన మతాన్ని గౌరవించు..!! తన పద్ధతులను గౌరవించలేనివాడివి.. తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేవు. నీ కోసం అమ్మాయి చెయ్యని త్యాగం లేదు. నీ కోసం తన వాళ్లని వదిలి నీ నమ్మకం మీద వచ్చింది..!! నువ్వు ఆ నమ్మకం మరిచి.. ఈ నమ్మకాల కోసం గింజుకుంటున్నావు..!! వద్దు అన్నయ్యా! అలా చెయ్యకు. ఏ నమ్మకమైనా నేర్పించేది ప్రేమే..!! నువ్వు ప్రేమనే నమ్మకం చేసుకో..!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ బాబాయ్..! మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తుంటారు కదా. మరి నాకు కూడా ఓ మంచి సమాధానం ఇవ్వండి బాబాయ్. నేనొక అమ్మాయిని రెండేళ్ల నుంచి ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతోంది. కానీ వాళ్ల పేరెంట్స్ రిజెక్ట్ చేస్తారనే భయంతో నన్ను రిజెక్ట్ చేస్తోంది. నన్ను అవాయిడ్ చేస్తోంది బాబాయ్. ఏం చెయ్యమంటారు బాబాయ్? రోజూ మాట్లాడే తను.. ఇప్పుడు నాతో మాట్లాడకపోవడంతో తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి బాబాయ్? తనకి భయం పోయేటట్లు నేను ఏం చెయ్యాలో చెప్పండి బాబాయ్! ప్లీజ్. – అభిషేక్ నీకంటే మంచి అబ్బాయిని చూసి లవ్ ప్రపోజ్ చెయ్యించు అబ్బాయ్..!!‘ఏంటి సార్ అంత రఫ్‌గా అలా అనేశారు? మిమ్మల్ని బాబాయ్ అన్నందుకా సార్ అంత కోపం? ఇంకా నయం కదా సార్.. తాతయ్య అనలేదు. అనుంటే అబ్బాయ్ అనకుండా వెధవాయ్ అనేవారేమో పాపం అభిషేక్‌ని..!? అయినా.. అదేమి ఆన్సర్ సార్? ఇంకో అబ్బాయిని చూసి, వాడికీ.. వీడి గర్ల్ ఫ్రెండ్‌తో కనెక్షన్ పెట్టమంటున్నారేంటి సార్??ఎంత అనెథికల్ సార్.? అంటే హార్ట్ లేని డర్టీ సలహా సార్?’నీలాంబరీ..! అమ్మాయికి అభిషేక్ అంటే.. రియల్‌గా లవ్ ఉంటే మమ్మీ.. డాడీ.. ఏమంటారోనని ఆగదు. జంప్ కొట్టి రెడీ అయిపోయేది. అలా చెబితే బాధపడతాడేమోనని...‘ఇంకొకడిని లైన్లో పెట్టమన్నారా సార్.. మీకూ, మీ రౌండ్ అబౌట్ ఆన్సర్కీ ఓ దండం సార్!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. నన్ను ప్రస్తుతానికి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – కృప మనం ముచ్చటగా మూడో లవ్ స్టోరీ అయ్యామా చెల్లీ..? ఎందుకమ్మా అంత తొందరపాటు?? వాడు ఇద్దరికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు... వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి కన్సిడర్ చెయ్యమ్మా... ఒట్టి పెంటగాడు.. వాడితో చెయ్యి కలిపితే.. మనకు అంటుకుంటుంది ఆ పెంట వాసన! ఈ సమాజం ఆ పెంట వాసన చూసి.. నిన్నూ రెస్పెక్ట్ చెయ్యదు!! ‘సార్..! కానీ ఫస్ట్, సెకండ్ లవ్ స్టోరీలు వర్కౌట్ కాక.. కృపతోనే లవ్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్???’ నీలూ..! రెండు చోట్ల రిజెక్ట్ అయిన కాండిడేట్ నా చెల్లెలికి ఎందుకు? అసలు ఇలాంటి ఫెయిల్యూర్ కాండిడేట్ మీద అనవసరంగా సింపతీ చూపించి.. దాన్ని లవ్ అనుకుని, ఆ కన్ఫ్యూజన్లో హార్ట్ పారేసుకుని.. ఆ తర్వాత వీడు నెక్ట్స్ ఫిట్టింగ్ కోసం వెళ్లిపోతే.. కృప ఏం కావాలి??? అసలే స్టెబిలిటీ లేని యూజ్లెస్ ఫెలో వాడు.. మనకు వద్దే వద్దు!!‘విన్నావుగా కృప.. బీ కేర్‌ఫుల్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్ నంబర్ అడిగాను. ఇచ్చింది. ఫోన్లోనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఓకే అంది. బాగానే మాట్లాడుకున్నాం. అన్నీ షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులకి మా మధ్య క్యాస్ట్ గురించి చర్చ వచ్చింది. మా కులాలు వేరని తెలిసింది. దాంతో ‘మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడితో వదిలేద్దాం’ అంది. సరే..! నీకే లేనప్పుడు నాకెందుకని ఫోన్లు, మెసేజులు చెయ్యడం మానేశాను. తర్వాత కొన్ని రోజులకి తన నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను. ‘మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ‘మనం వెళ్లిపోతే మన ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది. వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. తను వినట్లేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటోంది. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను’ అని బెదిరిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ఒక్కడికే కాకుండా ఇద్దరికీ హెల్ప్ అయ్యే సలహా ఇవ్వండి ప్లీజ్. – ప్రవీణ్ బెదిరిస్తోందా????‘సార్..! ‘‘బెదిరిస్తోందా..దా..దా..?’’ అని దీర్ఘం తీస్తున్నారంటే అమ్మాయి నిజంగా ఏం చేసుకోదని లైట్‌గా తీసుకుంటున్నారా సార్? మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్! ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారని అంటారా సార్? మనకు లవ్ వర్కౌట్ కాకపోతే ఇంక వేరే మార్గమే లేదని మీ చెల్లెలు వాపోతుంటే ఏంటి సార్ మీ సెటైర్లు..?? ‘‘బెదిరిస్తోందా.. దా..దా’’?? అని అంటున్నారు. టూ మచ్ సార్!’అది కాదు నీలూ! ముందేమో తాను క్యాస్ట్ సేమ్ కాదు.. లవ్ స్టాప్ చేద్దామంటే.. తనకేనా పొగరు నేను కూడా కట్ ఆఫ్ చేసేస్తా.. అని పోజ్ కొట్టాడు ప్రవీణ్. లవ్ లేకపోయినా బతకొచ్చు అనుకుంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణం సైతం వదిలేస్తా ప్రేమ కోసం అని బాధపడుతుంటే.. పారిపోవడానికి కూడా రెడీ అంటుంటే... మనవాడు స్లో మోషన్లో మనకు ఉత్తరం రాస్తున్నాడని కొంచెం ఫీలయ్యి వెక్కిరించా నీలాంబరి. ‘‘బెదిరిస్తుందా..దా..దా?’’ అని.‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ప్రవీణ్ వాళ్ల ఇంట్లో కన్విన్స్ చేసి మమ్మీ డాడీలను తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్‌ని కన్విన్స్ చేసుకోవాలి!!‘తంతారేమో సార్!?’బెదిరిస్తున్నావా నీలూ???? ‘లేదు సార్! ప్రవీణ్ ఈజ్ స్ట్రాంగ్. మీరు చెప్పినట్లే చేస్తాడు!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్.. సార్!! ఒక అమ్మాయి రోజూ నన్ను చూస్తోంది. తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రెండు మూడు సార్లు ఆ అబ్బాయి బైక్ మీద పోతుంటే చూశాను. చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఈ మధ్య తను నన్ను చూసి నవ్వుతోంది. తనతో స్నేహం మంచిదేనా? – రామ్ కుమార్ బైక్ మీద పోతున్న అమ్మాయిని నోరెళ్లబెట్టి చూస్తుంటే నవ్వు రాదా బ్రో. ..?‘అంటే రామ్‌కుమార్ దీనస్థితిని చూసి పళ్లు ఇకిలించిందా సార్’. కొంచెం ఫన్నీగా నీలూ.. అలా నోరు ఓపెన్ చేసుకుని చూస్తుంటే..?? ‘పొండి సార్.. పాపం ఇంకొకరితో క్లోజ్‌గా ఉన్న అమ్మాయి.. చూసి ప్రేమగా నవ్విందని... ఏం చేయాలో చెప్పమంటే.. మీరు రామ్ కుమార్‌ని కార్టూన్లా చేసి ఏడిపిస్తారా సార్..?? ఈ ఉసురు ఊరికే పోదు సార్!!’ నీలూ..! పోనీ అమ్మాయికి రామ్‌కుమార్ నచ్చాడే అనుకుందాం.. కానీ ఇంకో బైక్‌మీద ఇంకో రావణాసురుడితో ట్రావెల్ అవుతున్న అమ్మాయిని నేను ఇష్టపడటం కరెక్టేనా అని అడిగితే.. జోక్ వేసిఆన్సర్ తప్పించుకోకుండా నిజాలు చెబితే రామ్‌కుమార్ హర్ట్ కాడా నీలూ..? ‘ఓ.. ఓహో.. ఓహోహో.. ఓరి ఫూల్ అనకూడదని ఫన్నీగా ఫూల్ చేస్తూ రామ్‌కుమార్ గుండెకు ఆయింట్మెంట్ రాస్తున్నారా సార్..!?’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నాకు ఒక అమ్మాయితో త్రీ ఇయర్స్‌గా పరిచయముంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అసలు సమస్య ఏమిటంటే.. తనకి అందరితో మాట్లాడటమంటే ఇష్టం. అబ్బాయిలతో అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతోంది. వాళ్లతో మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. దాంతో నా ఫ్రెండ్స్ చాలా మంది ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయిని లవ్ చెయ్యకు’ అని అంటున్నారు. దాంతో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. ప్లీజ్ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – జయరాజు చెయ్యి..! చెయ్యకు!!‘ఏంటి సార్?? డబుల్ మీనింగ్ ఆన్సర్ ఇస్తున్నారు?’చెయ్యగలిగితే చెయ్యి..! చెయ్యలేకపోతే మానెయ్యి!!‘సార్...!! మరీ ఇంత పచ్చిగా డబుల్ మీనింగ్‌లో ఆన్సర్ ఇస్తున్నారేంటి సార్??’నీలూ! జయరాజు ఏం చేస్తాడు.. చెయ్యాలంటే దమ్ము ఉండాలి.‘సార్! స్టాప్ ఇట్!!’చూశావా నీలూ! నేను చాలా సింపుల్‌గా లవ్ చెయ్యగలిగితే చెయ్యి అన్నాను. లవ్వు చేసే దమ్ము లేకపోతే మానెయ్యి అన్నాను. నేను అంత సింగిల్ మీనింగ్‌తో చెప్పినా నీకు డబుల్ మీనింగ్‌లా అనిపించింది.. చెప్పడంలో డబుల్ మీనింగ్ లేదు నీ మనసులో డబుల్ మీనింగ్ ఉంది కాబట్టి నీకది బూతులా అనిపించింది.‘అబ్బా! ఏం కొట్టారు సార్! మీ కొట్టుడే కొట్టుడు సార్!!’నీలూ! ఏంటి ఆ మాటలు? స్టాప్ ఇట్ ఐసే!!‘చూశారా సార్! నేనేమన్నాను? ఎంత సూపర్ డైలాగ్ కొట్టి నాకు స్పష్టత తెచ్చారు అని చెబితే మీరు డర్టీ మైండ్‌తో ఇంకో రకంగా రిసీవ్ చేసుకున్నారు. నా మాటలు సింపుల్! మీరే డబుల్!!’చూశావా జయరాజు..! నీ ఫ్రెండ్స్ డబుల్ మీనింగ్ గాళ్లు. వాళ్లను నమ్మద్దు. నీ లవర్ సింపుల్ గర్ల్. సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో...‘అవును జయరాజు! అపార్థాలు ఆన్సర్లు ఇచ్చే మా మధ్యే వస్తున్నప్పుడు.. సున్నితమైన మీ మనసులకు అపార్థాలు రావడం నాచురల్. గుడ్ లక్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేను మీ లవ్ డాక్టర్ కాలమ్ ప్రతిరోజూ చదువుతాను. నాకొక సమస్య వచ్చింది సార్. నేను నా మేనమామ కూతురిని ప్రేమించాను. తనూ నన్ను ప్రేమించింది. అలా మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాం. సడెన్‌గా తన నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. చాలా కాలం బాధపడ్డాను. తర్వాత తను వేరే అతడిని ప్రేమిస్తోందని తెలిసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాను. ‘సారీ బావా.. నేను ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, నిన్నే పెళ్లి చేసుకుంటాను’ అంది. దాంతో నేను ‘సరే మారుతుందిలే.. పెళ్లి చేసుకుందాం’ అనుకున్నాను. కానీ మళ్ళీ ఫోన్, మెసేజ్ ఏమీ చెయ్యట్లేదు. అలాగని ఇంట్లో ఏమైనా సమస్యా అంటే అది కూడా లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నేను చాలా ఇష్టమే. అసలు ఈ అమ్మాయిని నమ్మొచ్చో లేదో అర్థం కావడం లేదు. మంచి సలహా ఇవ్వండి సార్ ప్లీజ్. – రవి ‘రవీ.. ఈ లవ్ డాక్టర్ని ఆ ఒక్కటీ అడగొద్దు!!నువ్వు ఎన్నిసార్లు అడిగినా...ఎన్ని రకాలుగా అడిగినా...ఏమార్చి అడిగినా...బతిమాలీ బామాలీ అడిగినా...కాళ్లూ గడ్డం పట్టుకుని అడిగినా...మీసం ముట్టుకుని అడిగినా...నో.. అనే చెబుతారు!!మేనరికాలు.. ససేమిరా అంటారు.మీకు పుట్టబోయే పిల్లలు అవిటివాళ్లు అయ్యే చాన్స్ ఉందని రివర్స్‌లో మిమ్మల్నే కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి.. బామాలి.. నీకు మీసం ఉంటే.. రోషం ఉంటే వద్దని అడుక్కుంటారు.. అందుకే ఇంకో లవ్ డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో అడుక్కోవడం బెటర్!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో నా పక్క సీట్లోనే కూర్చుంటుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూనే ఉంటుంది. ఆ పాట నాకోసమే అనిపిస్తుంది. అడిగేద్దామంటే జాబ్ పోతుందేమోనని భయం! ఏం చెయ్యమంటారు సార్? – శివ కుమార్ పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదా వ వహవా ఎవరేమనుకున్నా వినదీ ప్రేమవ వహవా ఎదురేమున్నా కనదీ ప్రేమవ వహవా కనులే తెరిచిన కల ఈ ప్రేమవ వహవా ఎదురే రాకున్నా నిజమీ ప్రేమఓ చెలీ.. సఖీ.. ప్రియా.. యూ లవ్ మీ నౌ ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నే....పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతేప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదాఓ.. ఓహోహో.. వయస్సాగక నిన్ను కలిసిననన్ను మరచిన పదే పదే పరాకులేఓ.. ఓ... నీ ఆశలో.. నీ ధ్యాసలో.. చిగురించగ అదే అదే నీదాయెలేప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంతే అది ప్రేమించిందో ఏమో నన్నే ఐ లవ్ యు అంటుందేనువ్వంటే చాలా ఇష్టం లవ్వంటే ఎంతో ఇష్టంఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు.....‘ఈ పాట పాడాలా సార్? అమ్మాయి ఫీల్ అయ్యి ముందు పీకుతుంది. తర్వాత బాస్‌కి చెప్పి ఉద్యోగం పీకిస్తుంది సార్!’డైరెక్ట్‌గా చెప్పలేనప్పుడు ఇదో మెథడ్ నీలూ! అమ్మాయి అర్థం చేసుకుని చరణం అందుకుంటే ఓకే... చరణాలకు ఉన్న చెప్పు తీసి.. బాస్ దగ్గరకు తీసుకుని వెళ్తే.. ‘‘అయ్యో తను అలా అనుకున్నారా..? నేనేదో నా వంతు పాట పాడుకుంటున్నాను సార్’’ అని సంజాయిషీ ఇచ్చుకోవచ్చు! -ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! మీరు అమ్మాయిలకు ఇచ్చే సపోర్ట్ నాకు బాగా నచ్చుతుంది. నా చెల్లెలు ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయింది. ఇప్పుడు తనకి పెళ్లి చేద్దామని అమ్మానాన్న అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య మా చెల్లి ఆ అబ్బాయికి మళ్లీ దగ్గరవుతోంది. వాడు మళ్లీ మోసం చేస్తాడని చెబుతున్నా వినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ‘తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు అన్నయ్యా’ అంటోంది. తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – దుర్గారావు తను అర్థం చేసుకోవాలా?లేదా మనమే అర్థం చేసుకోవాలా???? ఈ ప్రపంచంలో మోసాలు రోజూ చూస్తున్నాం!ద్రోహాలు రోజూ జరుగుతున్నాయి!అలాంటప్పుడు చెల్లెలికి ఒకసారి జరిగిన మోసం మళ్లీ జరగకుండా ఎలా ఉంటుంది అని అనుకోవడం చాలా నార్మల్.పోనీ గట్టిగా మందలించి చెల్లెల్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తే...అలా చేస్తే... చెల్లెలు సంతోషంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉందా?అలాగని ఒకసారి మోసం చేసిన వాడికే మళ్లీ అవకాశం ఇస్తే...ఇంకోసారి మోసం చెయ్యకుండా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలమా?రెండూ నీ చేతిలో లేవు..‘ఏంటి సార్? సింపుల్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వండని అడిగితే... సాంతం క్లాసు పీకేస్తున్నారేంటి సార్?’లేదు నీలూ!!నిర్ణయం తీసుకోవాల్సింది చెల్లెలే. ఓన్లీ షీ నోస్... వాడు ప్రాయశ్చిత్తంతో తిరిగి వచ్చాడా లేదా అన్నది. ఓన్లీ షీ కెన్ డిసైడ్!!‘ఏడిసినట్లు ఉంది సార్! ఇక అడ్వైజ్ కోసం మీకు ఉత్తరం రాయడం దేనికి? ఆ అన్నచెల్లెళ్లే ఉత్తరాలు రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కదా సార్? ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్!!’నీలూ..! చెల్లెలు కొన్ని రోజులు ప్రేమ, రొమాన్స్, పెళ్లి లాంటి విషయాల నుండి దూరముంటే.. తనకే క్లారిటీ వస్తుంది. ఏదో వెనక్కి వచ్చాడు కాబట్టి.....‘సార్...! నేను చెబుతాను ఆగండి. వెనక్కి వచ్చాడు కాబట్టి మనం వెనక్కి పరిగెత్తుకునిపోతే కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది. అదీగాక ఇదేమైనా చిన్న విషయమా? లైఫ్ డెసిషన్..! తొందర పడకుండా తీసుకోవాల్సిన నిర్ణయం..!! రామ్ గారి చెల్లెమ్మా.. ప్లీజ్ వెయిట్!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! ఎలా ఉన్నారు. మీకూ, నీలాంబరికీ అరటిపండు దండం సార్. నేను మా జూనియర్ని లవ్ చేస్తున్నాను. తనకి లవ్ చెయ్యడమన్నా, కలిసి తిరగడమన్నా చాలా చిరాకు. ఫ్రెండ్‌గా ఉండమంటోంది. ఏదో ఆశించే మనసుకి ఫ్రెండ్ అనే ముసుగు వేయడం అవసరమా అని దూరంగా ఉన్నాను. తను నాకు కావాలి సార్! ఏం చెయ్యను?? – అయ్యప్ప ముసుగేసుకో!!‘ఎందుకు సార్ మీరు అంత నిష్ఠూరంగా మాట్లాడతారు..?? ఇష్టం లేకపోతే ఆన్సర్ ఇవ్వకండి. అంతే కానీ... ముసుగేసుకో.. నీ ముఖానికి లవ్ ఏంటి? అమ్మాయి ఫ్రెండ్ అంటుంటే.. నీకు వేరే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయిరా డర్టీ ఫెలో...? తప్పు పని చేస్తేనే కదా ముసుగులు అవసరం..! అలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు రా బ్యాడ్ బాబు..? అని ఒక లవర్ని కించపరచడం తప్పు కాదాసార్? మీరే చెప్పండి సార్?!!’నిజమే నీలూ..! లవ్ వద్దు ఫ్రెండ్ అయితే ఓకే అన్నప్పుడు కావాలంటే ఒక మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. ఫ్రెండ్‌లాగా అమ్మాయిని కాపాడాలి. అంతేకానీ కోరుకోకూడదు. అందుకే.... ‘ఓ... ఓహో... ఓహోహో... బ్యాడ్ ఆలోచనలకు ముసుగు వేసుకుని బీ ఎ గుడ్ ఫ్రెండ్ అంటున్నారు. సూపర్ సార్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నా స్నేహితుడు నాకు చాలా పెద్ద ద్రోహం చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయిని తనూ ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ అమ్మాయికి, నాకు మధ్య కావాలనే గొడవ పుట్టించి విడదీసాడు. ఆ విషయం తనకి తెలియక వాడినే నమ్మింది. చివరికి ఇద్దరూ కలిసి నన్ను బకరా చేశారు. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నా కన్నవాళ్ల కోసం ఆలోచిస్తున్నాను. వాళ్లిద్దరినీ నేను నా జీవితంలో క్షమించలేను. ప్లీజ్ సార్ ఏదైనా సలహా ఇచ్చి వాళ్లని పూర్తిగా మరచిపోయేలా చెయ్యండి ప్లీజ్! హెల్ప్ మీ సార్! – చిన్ను నవ్వరా బంగారం...! ఆకాశం కంపించేలా నవ్వరా...!! భూమి అదిరేలా నవ్వరా...!! ‘పిచ్చోడనుకుంటారేమో సార్...!? అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని స్క్రూ లూజ్ అయ్యిందనుకుంటారేమో సార్!? ఫ్రెండ్ లవ్వును బెండ్ చేశాడని భరించలేక బుర్ర కిర్రుమన్నదేమో అనుకుంటారు సార్!? ఆల్రెడీ అందరూ ఢోకా ఇచ్చి చిన్నూ లైఫ్‌తో ఆడుకున్నారు... మీరు కూడా పిచ్చోడిని చేసి ఆడుకుంటారేంటి సార్!?!’ అలా కాదు నీలూ...! ‘ఇంకెలా సార్? అమ్మాయి ఛీ కొట్టింది.. ఇప్పుడు అదర్స్ కూడా ఛీ కొడతారు కదా సార్?!’ కాదు నీలూ! వాళ్లిద్దరూ కుళ్లుకుంటారు. చిన్నూ నవ్వుకు కుళ్లీ కుళ్లీ కుళ్లిపోతారు నీలూ! ‘అబ్బా..! సూపర్ సార్..!! చిన్నూ హ్యాపీగా ఉన్నాడని వాళ్లకు తెలిస్తే భలే ఉంటుంది సార్..! వాళ్లకు పిచ్చెక్కుతుంది సార్.. భరించలేరు సార్.. అవును సార్.. చిన్నూ అలాగే కాన్ఫిడెంట్‌గా సాగిపోవాలి సార్..! హ్యాండ్ ఇచ్చిన వాళ్లకు బ్యాండ్ పడుతుంది సార్!’ అని నవ్వింది నీలూ. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్...! మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరూ త్రీ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కానీ, వాళ్లిద్దరి నేపథ్యాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో విడిపోయారు. వాళ్లు్ల కలిసి పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి సార్? – పల్లవి ఇద్దరూ మేజర్స్ అయితే వాళ్లను ఎవరూ ఆపలేరు.‘మేజర్స్ అంటే ఏంటి సార్? అది కూడా చెప్పండి. సగం చెబుతారు. సగం మింగుతారు. పల్లవి నేను చెబుతాను. అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్... అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ దాటితే... ఇద్దరూ మేజర్స్. ఏ పోలీస్ స్టేషన్‌కి పోయి వాళ్లిద్దరూ ప్రాబ్లమ్ చెప్పుకున్నా సొల్యూషన్ దొరుకుతుంది. కరెక్టా సార్?’రాంగ్!!‘ఏంటి సార్? అది కరెక్ట్ కాదా? దేశంలో ఉన్న రూల్ కంటే మీ రూల్ కరెక్టా సార్?’ నా రూల్ నాకు ఉత్తరం రాసిన వాళ్లకు వర్తిస్తుంది. ప్రాబ్లమ్ నాకు చెప్పారు కాబట్టి నేను చెప్పేదే కరెక్ట్ నీలూ!‘అయితే చెప్పండి ఏమి చెయ్యాలి?’ వయసు ఒక్కటే సరిపోదు పల్లవీ! జీవితంలో కలిసి జీవించే మెచ్యూరిటీ ఉండాలి. పెద్దల సలహా, సంప్రదింపులు లేకుండా అంత పెద్ద నిర్ణయం చెయ్యకూడదు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఒకరికొకరు ఉంటారో లేదో తెలియదు కానీ.. కష్టం వస్తే ఏకాకులైపోతారు. ఎవరూ సాయం చెయ్యరు. ప్రపంచం అంత మంచిది కాదు. కుటుంబాలను దూరం చేసుకుని పారిపోవడం చాలా కష్టాలకు కారణం అవుతుంది. వాళ్లిద్దరినీ... మొదట పెద్దలను కన్విన్స్ చేసుకోమను. అవసరమైతే సమాజంలోని ఇతర పెద్దలను సంప్రదించి పేరెంట్స్‌తో మాట్లాడటం మంచిది. - lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నా. నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ట్రూగా లవ్ చేసింది. మా నేపథ్యాలు వేరు కావడంతో తనకి వేరే సంబంధం చూశారు. పెళ్లికి ముందు రోజు కాల్ చేసి ‘నాకు నువ్వు కావాలి’ అంది. అప్పుడు నేనేం చెయ్యలేకపోయాను. తనకి పెళ్లైపోయింది. ప్రాణం పోయేంతగా ఏడ్చాను. నా ప్రాబ్లమ్ ఏంటంటే... ఇప్పుడు తను రోజూ కాల్ చేస్తోంది. ఎన్నిసార్లు పట్టించుకోలేనట్లున్నా కాల్ చేస్తూనే ఉంటోంది. పైగా ‘నువ్వే కావాలి’ అంటోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక పెళ్లి అయిన అమ్మాయితో ఎలా మాట్లాడాలి. పైగా ప్రతిసారీ ‘ఐ లవ్ యూ’ అంటోంది. పెళ్లి అయ్యాక కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావని అడిగితే.. ‘పెళ్లి అయితే లవ్ చెయ్యొద్దా?’ అంటోంది. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పండి బ్రో. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. – లక్కీ మంచివాడివి...!అంతగా అమ్మాయి అడుగుతున్నా...అదుపు తప్పకుండా గౌరవంగా బిహేవ్ చేస్తున్నావ్...!!నిజంగా అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు అన్నా....!!నీలాంటి వాళ్లు కొందరున్నారు కాబట్టే...ఇంకా సమాజంలో ఒక నియమం, నిబద్ధత ఉన్నాయి...!!‘సార్...! ఇంత బటర్ పూస్తున్నారెందుకు సార్??జారి కింద పడతాడేమో సార్?!!’అమ్మాయి రాస్తున్న బటర్కే పడలేదు..!అయినా ఈ పిలగాడుపడేరకం కాదు...!పడిపోయే నీచ గుణం లేదు...!!తనను తాను తగ్గి....‘మంచిని లేపే గుణం ఉన్నవాడు కదా సార్? నిజమే... నాకు కూడా నచ్చాడు సార్...! అమ్మాయిని రాంగ్ రూట్లో పడకుండా ఉంచాడు.. శభాష్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
గుడ్ మార్నింగ్ ఇదొక అందమైన మార్నింగ్
డబుల్ ధమాకా ‘సాక్షి ఫ్యామిలీ’ ఒక ధమాకా అయితే అందులో ప్రతిష్ఠాత్మకంగా మొదలైన ఆదివారం ఇంటర్వ్యూ ఫీచర్ ‘డబుల్ ధమాకా’. ఒక సెలబ్రిటీని చూడటానికే కళ్లు చాలనప్పుడు ఇద్దరు సెలబ్రిటీలను కూచోబెడితే... వారి మనసులో మాటలను వెలికి తీస్తే... ఒకరిని ఒకరితో ఒకరు మాట్లాడుకోనిస్తే.... సాక్షి ఆవిర్భావంతో పాటు మొదలైన ఈ మెగా మేజిక్ ప్రతి ఆదివారం లక్షలాది మంది పాఠకులను ఆకట్టుకుంది. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో మొదలైన ‘డబుల్ ధమాకా’ వంద సుదీర్ఘ వారాల తర్వాత మళ్లీ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల త్రిపుల్ ధమాకాతో ముగిసింది. వంద వారాలు... ఒక ఇంటర్వ్యూ బేస్డ్ ఫీచర్‌ను నడపడం అసామాన్యం. అవీ మామూలు కాంబినేషన్లా? వైఎస్ఆర్ – కెవిపి, ఉండవల్లి – జయశంకర్, సురేశ్ రెడ్డి– కిరణ్‌కుమార్ రెడ్డి, పూరి జగన్నాథ్–రవితేజ, ఈనాడు సుమన్– ఈటీవీ ప్రభాకర్, ఇవివి సత్యనారాయణ– ఆర్.నారాయణమూర్తి, ఎన్టీఆర్–వినాయక్... ఇలా ఎన్నో. సంగీతం విషయంలో బాలకృష్ణ ప్రసాద్– శోభరాజ్ల కాంబినేషన్, కారుణ్య– హేమచంద్రల జంటతో భేటీ... ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్.... ఇవన్నీ ఈ ఆదివారం ఏ డబుల్ ధమాకా వస్తుందా అని పాఠకులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురు చూసింది. ఈ ఫీచర్‌ను తోటి పత్రికలు ఇమిటేట్ చేయాలని చూడటం దీని సక్సెస్‌కు ఒక సూచి. సాక్షి ఫీచర్ కన్సల్టెంట్ ఇందిరా పరిమి ఈ ఇంటర్వ్యూలతో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రతి ఇంటర్వ్యూ వెనుక రీసెర్చ్, హోం వర్క్ కనిపిస్తున్నదనే ప్రశంసలు పొందారు. సాక్షి తొలి పదేళ్ల జర్నీలో ముందు వరుసలో నిలిచే ఒక ప్రతిభావంతమైన ముద్ర– డబుల్ ధమాకా. అదర్ సైడ్ సినిమా తారల వ్యక్తిగత జీవితాల్లో ఉండే మంచీ చెడూ తెలుసుకోవాలనే ఆసక్తి రీడర్స్‌కు ఉంటుంది. అయితే సినిమా విశేషాలు తప్ప పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి సెలబ్రిటీలు ఇష్టపడరు. మరీ ముఖ్యంగా పర్సనల్ లైఫ్‌లో ఉండే కాంట్రవర్సీస్ గురించి అడిగితే ‘నో కామెంట్’ అంటారు. అలా ‘నో కామెంట్’ అనే విషయాలను సైతం ఆవిష్కరించిన ఫీచర్ ‘అదర్ సైడ్’. జనరల్‌గా సినిమా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలిచ్చేటప్పుడు ‘ఫేక్’ అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. ఇండస్ట్రీ పట్ల పబ్లిక్‌కి ఉండే ఆ ఫీల్‌ని మార్చిన ఫీచర్ ‘అదర్‌సైడ్’. కొంచెం చొరవ తీసుకుని, అడిగే విధానంలో అడిగితే సెలబ్రిటీలు అంతే క్లియర్‌గా ఉంటారని, ఇంటర్వ్యూ కోసం రంగు పులుముకోరని ప్రూవ్ చేసిన ఫీచర్. జస్ట్ సెన్సేషన్‌ని టార్గెట్ చేయడం కాకుండా సెలబ్రిటీల లైఫ్‌తో పాటు సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ, వీలు కుదిరినప్పుడల్లా నాలుగు మంచి మాటలు సమాజానికి చెప్పించాలన్న ప్రయత్నంతో చేసిన పలు ఇంటర్వ్యూస్ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచాయి. ఆరేడేళ్లుగా ‘అదర్ సైడ్’, ‘స్టారిస్ట్రీ’, ‘తారాంతరంగం’, ఇప్పుడు ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ’.... ఇలా ఫీచర్ పేరు ఏదైనా ప్రతి వారం రేంజ్ తగ్గకుండా ఇవ్వడానికి చేస్తున్న కృషి విజయవంతంగా సాగుతోంది. కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూస్ ఈ విధంగా...నటుడు శరత్‌బాబు తన మాజీ భార్య రమాప్రభ గురించి అప్పటివరకూ ఎక్కడా విపులంగా మాట్లాడలేదు. ఈ ఇద్దరి లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని శరత్‌బాబుతో ‘సాక్షి’ చెప్పించగలిగింది.నటి విజయశాంతికి పెళ్లయిందా? లేదా? అనే విషయం నాలుగైదేళ్ల క్రితం వరకూ ఉన్న డౌట్. అయితే శ్రీనివాస్ ప్రసాద్‌తో పెళ్లి, పిల్లలు ఎందుకు ప్లాన్ చేసుకోలేదనే వ్యక్తిగత విషయాలను విజయశాంతి ఫస్ట్ టైమ్ షేర్ చేసుకున్న విషయాలు ‘సాక్షి’కి స్పెషల్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ గురించి, రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఓ సెలబ్రిటీగా సమాజానికి అతను ఇచ్చే సందేశం ఏంటి? అనే యాంగిల్ నుంచి చేసిన ఇంటర్వ్యూ ఓ హైలైట్.మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడటం, రిలాప్స్ అయ్యాక పంచుకున్న విశేషాలు మనకు స్పెషల్. కేన్సర్ బారినపడ్డవారికి ఆత్మస్థయిర్యం ముఖ్యం అనే యాంగిల్లో సాగిన ఈ ఇంటర్వ్యూ ఓ ఇన్స్పిరేషన్.∙‘మిస్ ఆంధ్రప్రదేశ్’ అనిపించుకుని సుమలత సోసోగా ఉన్న నటుడు అంబరీష్‌తో ప్రేమలో పడటానికి కారణం, పెళ్లి.. తదితర విషయాల్లో సుమలతతో ఓపెన్ టాక్. వివాహ బంధం పటిష్టంగా ఉండటానికి కారణం అందం కాదు.. మనసు, మంచితనం, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం అంటూ సుమలత చెప్పిన విషయాలు ‘బ్యూటీ’కి ప్రాధాన్యం ఇచ్చి, జీవితాలు పాడు చేసుకుంటున్నవారికి ఓ మెసేజ్. సౌత్ బ్యూటీ విద్యాబాలన్ హిందీ ఇండస్ట్రీకి వెళ్లి, అక్కడ కూడా సౌతిండియన్లాగానే డ్రెస్ చేసుకోవడంతో ఆ కట్టుబొట్టుని బాలీవుడ్లో విమర్శించారు. ‘మీరు మీలా ఉండండి. ఎవరి కోసమూ మారొద్దు. ఒకప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు నన్ను ప్రశంసిస్తున్నాయి’ అంటూ విద్యాబాలన్ ఇచ్చిన ఇంటర్వ్యూ.. ‘ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్’కి గురయ్యేవారికి ఓ మంచి సందేశం. ‘జస్ట్ లైక్ దట్’ అని కాకుండా ఇలా ‘థాట్ ప్రొవోకింగ్’గా సాగిన ఇంటర్వ్యూస్ రీడర్స్కి ‘సండే స్పెషల్’. లవ్ డాక్టర్ అల్లోపతికి, హోమియోపతికి, ఆయుర్వేదానికి అన్నింటికీ డాక్టర్లు ఉన్నారు. కాని యువతరాన్ని తరచూ సిక్ చేసి సతమతం చేసే లవ్‌కు డాక్టర్లు లేరు. తెలుగునాట ‘లవ్ డాక్టర్’ లేని లోటును సాక్షి ఫ్యామిలీ తీర్చింది. అమ్మాయిల డైలమాలు, అబ్బాయిల అయోమయాలు, బయటకు చెప్పుకోలేని ప్రేమ, బయటకు సరిగ్గా చెప్పని ప్రేమ, బయటకు చెప్పాక తిరస్కరణకు లోనైన ప్రేమ, కొన్నాళ్లు అంగీకారం పొంది ఆ తర్వాత దారి మార్చుకున్న ప్రేమ, అబ్బాయి ఉలకని పలకని ప్రేమ, అమ్మాయి మనసులో ఏముందో ఎప్పటికీ అర్థం కాని ప్రేమ... ఇవన్నీ ప్రశ్నల రూపంలో సాక్షికి వచ్చిపడుతుంటే బెదిరించి భయపెట్టే రీతిలో కాకుండా ఒక సరదా మిత్రుని సున్నితమైన సూచనగా సమాధానాలు నడిచే తీరు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి ఫీచర్ అదీ డైలీ ఫీచర్‌గా నడవడం తెలుగు దినపత్రికల్లో ఇదే ప్రథమం. ఈ సమాధానాలతో తెరిపిన పడినవాళ్లు, ఆత్మహత్యల ఆలోచనలు మార్చుకున్నవాళ్లు, ఆ సమాధానాలు తల్లిదండ్రులకు చూపి ప్రేమను ఒప్పించుకున్నవారు ఎందరో తిరిగి సాక్షికి ఆ సంగతి తెలిపి ఆశ్చర్యపరిచారు. అసలు సమస్యే వినకుండా కోప్పడే తల్లిదండ్రులు, తేలిగ్గా తీసుకునే స్నేహితులు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు లవ్ డాక్టర్‌ను తమ ఆప్తుడిగా మార్చుకున్నారు. ఒక అన్నయ్యకు తమ సమస్యలు చెప్పుకున్నట్టు చెప్పుకున్నారు. తెలుగు ప్రేమావరణంలో లవ్ డాక్టర్ నిర్వర్తించిన బాధ్యత బాధ్యతాయుతమైనది. ఎంతో కీలకమైనది. ఈ శీర్షిక ఎవర్‌గ్రీన్‌గా గ్రీన్‌కలర్ స్ట్రిప్‌లో నేటికీ ప్రచురితమవుతూ పాఠకాదరణ పొందుతూనే ఉంది. చెట్టు కథలు ‘చెట్టు’– ఈ మాట వినగానే ప్రాణం లేచి వస్తుంది. జ్ఞాపకాలు ఊడలు పట్టుకుని ఊగుతాయి. చెట్టుతో జీవితం గడవని మనిషంటూ ఉంటాడా? అందుకే సాక్షి ఫ్యామిలీ ‘చెట్టు కతలు’ ఫీచర్‌ని పెట్టింది. చెట్టుతో పాఠకులకు ఉన్న అనుబంధాన్ని రాసి పంపమని చెప్పింది. ఇక చూసుకోండి. తాటి చెట్టు గెలలు పేజీల్లోకి వచ్చిపడ్డాయి. జామచెట్టు కాసిన ఫలాల మధుర రుచులు అక్షరాల రూపం దాల్చాయి. అరటి చెట్టు జ్ఞాపకం గురించి ఒకరు రాస్తే, రావిచెట్టుకు నమస్కారం పెడుతూ రోజెలా మొదలెట్టేవారో మరొకరు రాశారు. పెరట్లో మామిడిచెట్టు కాసిన పూతపూతా ఒకరికి జ్ఞాపకమొస్తే సపోటా చెట్టు చిమ్మిన పాలు మునివేళ్లకు వదలకుండా పట్టుకున్న అనుభవం మరొకరు పంచుకున్నారు. చెట్టు... పచ్చటి చెట్టు... మనకు నీడనిచ్చి, పండునిచ్చి, కలపనిచ్చి, ప్రాణవాయువునిచ్చిన చెట్టు చుట్టూ ఎన్ని జ్ఞాపకాలని? నిద్ర గన్నేరు చెట్టు, జీడిమామిడి చెట్టు, వేప, మర్రి... ఆఖరుకు తుమ్మచెట్టుతో ఉన్న అనుబంధం కూడా సాక్షి ఫ్యామిలీ పట్టుకోగలిగింది. ‘చెట్టు కథలు’ ఫీచర్ పెద్ద హిట్. అందరూ ముచ్చటపడి పోటీలు పడి మరీ రాశారు. పర్యావరణం మీద ప్రేమ ఆ విధంగా సాక్షి ఫ్యామిలీ కలిగించింది. విధ్వంసంపై ఏవగింపును కూడా పుట్టించగలిగింది. నాస్టాల్జియా ఎప్పుడూ మధురంగా ఉంటుంది. ఈ ఫీచర్ నాస్టాల్జియాను రికార్డు చేసింది కనుక ఒక కాలపు తెలుగువారి జీవితం కూడా ఈ చెట్టు కథల్లో ఇమిడిపోయింది. పచ్చటి ఫీచర్ ఇది. ఆకుపచ్చటి ఫీచర్. టీ పాయ్ ఇద్దరు కలిస్తే సంభాషణ. నలుగురు కలిస్తే కబుర్లు. మరి ముగ్గురు కలిస్తే? ఆలోచన. తెలుగు దినపత్రికల్లో ‘టీపాయ్’ అనేది ఒక సరికొత్త ఆలోచన. ముగ్గురు సభ్యులు ప్రతివారం కలిసి కూర్చొని ఒక అంశం మీద పిచ్చాపాటి మాట్లాడే ఫీచర్ అది. కాని అవి పిచ్చాపాటి కబుర్లు కావు. ఆలోచన రేకెత్తించే భావధారలు. ‘దేశంలో క్యూ సిస్టమ్’, ‘అద్దె ఇళ్లకు పెట్టే షరతులు’, ‘వంట పని ఎవరిది?’, ‘ఎంచుకునే స్వేచ్ఛ అబ్బాయికేనా?’, ‘ట్రాఫిక్’... ఇలా అనేక సమస్యలు, సంస్కారాలపై టీ పాయ్లో చర్చ జరిగింది. ముందే ప్రిపేర్ అయిన సంభాషణ కాదు కనుక వీటిలో ఒక స్వేచ్ఛ, నిరభ్యంతరమైన అభిప్రాయం కనిపించింది. ఇలా కూడా ఫీచర్ ఉంటుందా అని ఆశ్చర్యపరిచిన ఫీచర్ ఇది. ఈ పాటకు ట్యూన్ తెలుసా? ‘సాక్షి ఫ్యామిలీ’ ఓయ్ అని పలికితే ఓయ్ అని పాఠకులు బదులిచ్చేలా చేసిన ఫీచర్ ఇది. రోజూ పాత, కొత్త సినిమాల పాటల్లోని ఒక పాట టెక్ట్స్ మొత్తం ఇస్తే దానిని చూసి, దాచుకుని, హమ్ చేసి, నలుగురు కూడినప్పుడు పాడుకోవడానికి డైరీలా చేసుకున్న పాఠకులు ఎంతమందో. దీనిని రాసింది ఫలానా వారా, పాడింది ఫలానా గాయకులా అని తెలుసుకొని ఒక పరిశోధన అంశంగా ఈ ఫీచర్‌ను పరిశీలించిన పాఠకులు ఎందరో. గాయనీ గాయకుల, సంగీత దర్శకుల, గీత రచయితల పుట్టిన రోజు సందర్భాలలో ఇచ్చిన పాటలు ఆ సంగీతకారులను సంతోషపెట్టాయి. దివంగతులను స్మరించుకునేలా చేశాయి. ‘తేటతేట తెలుగులా’... వంటి ఆత్రేయ పాటలను దాచుకున్న పాఠకులే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది’ వంటి చంద్రబోస్ పాటలను కూడా దాచుకున్నారు. రెహమాన్ ‘మెంటల్ మదిలో’, మిక్కీ జె.మేయర్ ‘కళాశాలలో’ వంటి పాఠకులు యువ పాఠకులను ఈ ఫీచర్ అంటిపెట్టుకునేలా చేశాయి. ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘నీ ఉండేదా కొండపై’, ‘దారి చూపిన దేవత’... వంటి పాటలు ఏ గృహిణి మాత్రం పాడుకోదు. సిరివెన్నెల, రామజోగయ్య, కందికొండ, గద్దర్, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల... అందరి పాటలూ ఈ ఫీచర్లో వచ్చాయి. ‘వై దిస్ కొలవరి’ ఈ ఫీచర్లో వెరీ వెరీ ఫేవరేట్‌గా నిలిచింది. కీరవాణి ‘అన్నమయ్య’ చేసినా, దేవిశ్రీ ‘మన్మధుడు’ చేసినా ఆ పాటలు ఈ ఫీచర్‌లోనే దొరికాయి. రోజూ ఒక పాట... రోజూ ఒక కూనిరాగం... ఇది సాక్షి ఫ్యామిలీ మాత్రం తెచ్చిన సరాగం. ఈ పదేళ్లలో దాదాపు 3000 పాటలను అందించిన ఘనత సాక్షిది. వెల కట్టలేని బ్యాంక్. పాఠకులు పోగేసుకున్న విలువైన ఆస్తి. రీఛార్జ్ ‘సున్నా’ను బండి చక్రంలా మార్చుకుని తిరిగి ప్రయాణం సాగించవచ్చని స్ఫూర్తి నింపేలా ప్రముఖుల అనుభవాలతో ‘సాక్షి’ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్‌గా మారి ఆదరణ పొందింది. చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఇళయరాజా, కలకత్తాలో ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఉంటే చాలనుకునే అమితాబ్ బచ్చన్, యాక్టింగ్ రాని అందాల బొమ్మ మాత్రమే అని విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్యారాయ్, ప్రాణాలు తీయగలిగే ప్రమాదాల అంచుకు వెళ్లిన అజిత్, తీవ్ర అనారోగ్యం వేధించిన విక్రమ్, పోలీసు కేసులను ఎదుర్కొని జైలులో క్షోభ అనుభవించిన సుమన్, ఒక దశలో సొంత ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చే స్థితికి వెళ్లిన జగపతిబాబు... ఇలా ఎందరో ‘జీరో’ స్థితి ఎదురైనప్పుడు తిరిగి ఎలా రీఛార్జ్ అయ్యారో, జీవితం ముందుకు సాగిపోవడానికే తప్ప ఆగిపోవడానికి కాదు అని ఎలా నిరూపించారో ఈ ఫీచర్ చెప్పింది. అయినవాళ్లు ద్రోహం చేసినప్పుడు దాదాపు 30 కోట్ల అప్పుకు వెళ్లిన పూరి జగన్నాథ్ తాను తిరిగి గోడకు కొట్టిన బంతిలా ఎలా నిలబడ్డారో చెప్పిన రీచార్జ్ కథనం వాడవాడలా ఎంతో చర్చకు దారి తీసింది. దాసరి నారాయణరావు, కైకాల సత్యనారాయణ, జయసుధ, రమాప్రభ, జేడీ చక్రవర్తి, కృష్ణవంశీ... ఇలా ఎందరో ఈ శీర్షికలో తమ అనుభవాలను పంచుకున్నారు. జీవితం ఆటుపోట్ల మయం. మన అనుభవాల నుంచే కాక ఎదుటివారి అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. పదే పదే ఛార్జ్ కావాలి. ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచిన ఫీచర్, సాక్షి ఫ్యామిలీని రీఛార్జ్ చేసిన ఫీచర్ ‘రీఛార్జ్’. జెంటిల్మన్ మగవాడు మగవాడే. ఆకాశంలో స్త్రీకి మొత్తం వాటా ఇచ్చేశాడు. ఇక వేదికలన్నీ ఆమెవే, గొంతంతా ఆమెదే. మరి మగవాడికి లేవా ఫీలింగ్స్? వాడికి లేవా ఎమోషన్స్? అదిగో, సరిగ్గా అలాంటి సమయంలో మగవాడికి కూడా ఒక స్పేస్ ఇచ్చింది ‘సాక్షి–ఫ్యామిలీ’. మగవాడి అంతరంగాన్ని ప్రతి బుధవారం ‘జెంటిల్మన్’గా పరిచింది. పురుషుల సమస్యలను నవ్విస్తూనే లోకం దృష్టికి తెచ్చింది. ‘సంపాదించేది నేను – కాణీ లేదు’, ‘ఒకటో తారీఖు చక్రవర్తి’, ‘బ్యాచిలర్ ఓ మంచిమొగుడు’, ‘భార్యను మాయ చేయడం ఎలా?’, ‘ఏడ్చే మగవాడిని నమ్మొచ్చు’. ‘లాగుకునేవాడే మగవాడు’, ‘గుర్రంలా నిద్రపోతున్న మగాడు’, ‘నిండు చంద్రుడికి జుట్టుంటుందా?’, ‘మనకేం తక్కువ? మనకెవడు ఎక్కువ?’... ఇలా పురుషుడి ఆలోచనా ప్రవాహాన్ని పేజీ మీదకు మళ్లించింది. మగవాడి ఆత్మవిశ్వాసాన్నీ, న్యూనతనూ, భయాల్నీ, బాధలనూ సున్నితంగా ఆవిష్కరించింది. ‘మీరు మా ఇంట్లో ఉండి ఇవన్నీ గమనిస్తున్నారా?’ అని 25 వారాల పాటు ప్రపంచంలోని తెలుగు మగవాళ్లు అనుకునేట్టు చేయగలిగింది.అయితే, ఈ జెంటిల్మన్ మీసం మెలేస్తాడు, సింహాన్ని అనుకుంటాడు. అయినా దురుసైనవాడు కాదు, మర్యాద తెలీనివాడు కాదు, ప్రత్యేకించి స్త్రీ మీద ప్రతికూల భావన ఉన్నవాడు కాదు. అయినా స్త్రీని నిందిస్తాడు, ఉడికిస్తాడు, కవ్విస్తాడు, తన అన్ని సమస్యలకూ ఆమే మూలం అన్నట్టుగా కనబడతాడు. ఇది శ్రీరామదాసు శ్రీరాముణ్ని తిట్టినట్టుగా సాగిన ఫీచర్. స్త్రీని పురుషుడికీ, పురుషుడిని స్త్రీకీ మరింత అర్థం చేయించడానికి సాగిన కాలమ్. తెలుగు ఫీచర్ జర్నలిజంలో ఒక ట్రెండ్ సెట్టర్! హోమ్ థియేటర్ పిల్లలు తడబడుతూ అడుగులు వేయడం కూడా ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది వారి ముద్దుమాటలు ఇంకెంత వినసొంపుగా ఉంటాయి! అలాగే, వారి అమాయక ప్రశ్నలు ఒక్కోసారి ఐన్‌స్టీన్‌ను మరిపిస్తాయి. అందుకే పిల్లల అచ్చిబుచ్చి మాటలనూ, అల్లరిగా కనబడే ప్రశ్నలనూ ‘హోమ్ థియేటర్’గా సెలబ్రేట్ చేసింది ‘సాక్షి–ఫన్డే’. ‘బంగారు తొండ’ అంటుందో పాప. ‘పైనాపిల్ కిందాపిల్’ అంటాడో బాబు. ‘న్యాయమూర్తి=జుడ్గే’ అని చెబుతుందో బుజ్జి. ‘నేటీ బుచ్చినా దివక్కా?’ అని అడుగుతుందో బుచ్చి. ‘చందమామను కొరికి తిన్నదెవరు?’ అని ఒక సందేహం. ‘సూర్యుడు రాత్రి ఎక్కడికెళ్తాడు?’ అని మరో అనుమానం. ‘పెళ్లి ఫొటోలో ఎందుకు లేను?’ అని ఒకరు. ‘అమ్మ కడుపులోకి తమ్ముడు ఎలా దూరాడు?’ అని మరొకరు. ‘క్వీన్ అంటే రాణీ ఆంటీ’ అని ఒక గడుగ్గాయి. ‘పోస్ట్వ్యూన్లకు వున అడ్రసులన్నీ ఎలా తెలుస్తాయి?’ అని ఇంకో వంకాయి. ‘మా చిన్నదానికి జలుబు చేసింది’, అని ఒక హింట్ ఇస్తూ ఎలా రాయాలో పెట్టిందే తడవు పాఠకుల నుంచి అనూహ్యమైన వెల్లువలా వారి బుడ్డోళ్ల కబుర్లు వచ్చి పడ్డాయి. పిల్లల అరివీర కృత్యాలు ప్రతి ఆదివారం పేజీకి చక్కిలిగింతలు పెట్టాయి. కొత్త తల్లిదండ్రులైతే వారి పిల్లలను ఈ మాటల్లో చూసుకున్నారు. పాత అమ్మానాన్నలయితే ఒకప్పటి వారి పిల్లల బాల్యాన్ని తలుచుకున్నారు. అంతెందుకు, వారి బాల్యాన్ని సైతం అద్దంలోలా చూసుకున్నారు.సుమారు మూడేళ్లపాటు ఈ ఇంటింటి బాలరామాయణానికి వేదికైంది ఫన్డే. దీనికి వాసు బొమ్మలు అదనపు అందాన్నిచ్చాయి. రియాలిటీ చెక్ నిజంగా నిజం ఏమై వుంటుంది? దాన్ని పట్టుకోవడం సాధ్యమేనా?హిజ్రాలతో మాట కలిపితే ఏమంటారు? సెక్స్ వర్కర్లను కదిలిస్తే ఏం చెబుతారు?ఒక కల్లు కాంపౌండ్‌లో జనం ఏం మాట్లాడుకుంటారు? ఒక ఎఫ్ఎం స్టేషన్లో జాకీలు ఎలా డ్యూటీ చేస్తారు?గాంధీ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ల హడావుడి ఎలా ఉంటుంది? ఉస్మానియా మార్చురీలో జొబ్బుమనే ఈగలు ఏం అర్థం చేయిస్తాయి?ఒక ఇరానీ హోటల్లో కూర్చుని, రైల్వే స్టేషన్లో తిరిగి, శ్మశానాన్ని చూసి, బిచ్చగాళ్లను విని, గుడిలో ఆహ్లాదపడి, బడిలో ఆలోచన చేసి, రాయాలన్న ఆలోచనే ‘రియాలిటీ చెక్’. పీపుల్ అండ్ ప్లేసెస్. ‘ఫన్డే’లో యాభై వారాలకు పైగా సాగిన కాలమ్. తర్వాతి వారం ఎక్కడికి వెళ్తున్నారని పాఠకులు కుశలంతో పాటు కుతూహలాన్ని కూడా ప్రదర్శించేలా ఆదరణ పొందిన ఫీచర్. పార్కు, కోర్టు, జూ, చార్మినార్, గోల్కొండ కోట, చేపల మార్కెట్, పోలీస్ స్టేషన్, రాష్ట్రపతి నిలయం... ఇలా ప్రదేశాల్లో ఉన్న మనుషుల, మనుషులు ఉండే ప్రదేశాల వాస్తవ జీవితాన్ని, సాహిత్య విలువలు జోడించి, అంతర్గతంగా ఉన్న తత్వాన్ని విడమరిచి రెండు పేజీల్లో, వెయ్యి పదాల్లో చెప్పడం ఇందులోని హైలైట్. -
పదేళ్లు... పదివేల ఆనందాలు
గుడ్ మార్నింగ్ ఇదొక అందమైన మార్నింగ్ పదేళ్ల క్రితం..దాదాపు పదివేలమంది కలిసినాటిన మొక్క ఇది! పదివేలమంది కలం కత్తులతో కవాతు చేసిన రోజు అది! పదివేల మంది దశ దిశలా..సత్యాన్ని పతాకంలా ఎగరేసిన రోజు అది!పదివేలమంది యాభై ఆరు అక్షరాలతోఒక కొత్త విప్లవాన్ని అచ్చుగుద్దిన రోజు అది!పదివేలమంది ఒక నాణేన్ని రెండో వైపు తిప్పి చూపిన రోజు అది!పదివేలమంది.. తెలుగు ఇళ్లలో..క్షేమం, ధైర్యం, ఆరోగ్యం, ఆనందం,చైతన్యంపంచిన రోజు అది!పదివేలమంది అక్షర సేద్యానికి స్వరూపంఈ ‘సాక్షి’ వృక్షం!! ఆ.. సత్యవృక్షానికి ఇవిగో.. కొన్ని ఫ్యామిలీ, కొన్ని ఫన్డే ఫలాలు. ఇదొక అందమైన మార్నింగ్! స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది. ఈ పదేళ్లలో సాక్షి ఫ్యామిలీలో వచ్చిన ఫీచర్స్ అన్నీ పాఠకుల మనసులను, బుద్ధిని ఊరించేలా చేసినవే. ఒకటి కాదు... రెండు చాలదు.. మూడు నిలవదు... అన్నట్టుగా పదులు వందల సంఖ్యలో విశేష వ్యాసాలు, శీర్షికలు ఈ పదేళ్లలో ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు అందించింది. అప్పటి వరకూ ఇతర దినపత్రికల్లో ఫీచర్ పేజీలకు విడివిడిగా పేర్లు ఉండే సంప్రదాయాన్ని కాదని సాక్షి మొత్తం ఫీచర్ పేజీలకు ‘ఫ్యామిలీ’ అనే పేరు ఇవ్వడం మొదటి ఆకర్షణగా నిలిచింది. అవును. ఫీచర్ పేజీలో కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అలరించాలనే ఉద్దేశంతో ఈ పేజీల రూపకల్పన జరిగింది. స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది. సాక్షి పాఠకులు అందించిన ఆర్థిక సహాయంతో ఎందరో అసామాన్య మహిళలు లబ్ధి పొందగలిగారు. కళాకారిణులు, సంఘ సేవికలు, భర్తను కోల్పోయినవారు, భర్త లేదా సంతానం అనారోగ్యంతో పోరాడుతుంటే ఇంటిని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే స్త్రీలు... వీరందరి కథనాలు సాక్షిలో వచ్చి వారికి సాయం అందడం మరువలేని, సంతృప్తినిచ్చే సంగతి. భాషా వికాసం కోసం ఇచ్చిన ఇంగ్లిష్ పాఠాలు ముఖ్యమైనవి. స్త్రీ ఆరోగ్యం కోసం ఇచ్చిన ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్ పొందిన ప్రతిస్పందనను ఎలా మర్చిపోతాం? ‘పింక్ చెడ్డీ’ ఉద్యమం నుంచి మొన్నటి ‘మీటూ’ ఉద్యమం వరకు స్త్రీల ప్రగతిశీల భావధారలో భాగం అవుతూ సాక్షి తన వంతుగా ఒక నెలరోజుల పాటు ఇటీవల స్వీకరించిన ‘నేను శక్తి’ ఉద్యమం, ఆ ఉద్యమానికి ఫ్యామిలీ పేజీలు ప్రదర్శించిన అంకితభావం పాఠకుల మన్ననలు పొందటం ఆనందకరం. అయితే స్త్రీ అంటే సౌందర్యం కూడా. ఆ సౌందర్యాభిలాషను తీర్చేలా ఫ్యామిలీలో ఇచ్చిన ‘ఫ్యాషన్’ పేజీలు, ‘బ్యూటీ’, ‘ఫిట్నెస్’, ‘యోగా’ పేజీలు పెద్ద సక్సెస్ సాధించాయి. ఆధ్యాత్మికం కోసం ‘సన్నిధి’, భ్రమణకాంక్షను తీర్చే ‘ఫ్లెమింగో’, వంటింటి రుచుల కోసం ‘వంటలు’, వ్యక్తులలోకి ‘నేను’గా అంతర్యానం... అంతర్ బాహిర్ ఆసక్తులను నెరవేర్చాయి. కుటుంబం మూఢ విశ్వాసాల బారిన పడకుండా నిర్వహించిన ‘చేతనబడి’ ఒక ముఖ్యమైన శీర్షిక. క్రైమ్ బారిన పిల్లలు పడకుండా చేతన కలిగించే ‘క్రైమ్ అండ్ పేరెంటింగ్’ మరో ముఖ్యమైన శీర్షిక.ఇక ప్రతి తెలుగు కుటుంబాలకు సాక్షి ఫ్యామిలీ పేజీలు కౌన్సెలింగ్ శీర్షికలతో చేసిన సేవ కూడా సామాన్యమైనది కాదు. డైలీ హెల్త్ కౌన్సెలింగ్‌లు ప్రముఖంగా ఇవ్వడమే కాదు లీగల్ కౌన్సెలింగ్, ట్రావెల్ కౌన్సెలింగ్, లైంగిక విషయాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ముఖ్యమైన కంట్రిబ్యూషన్.సాహిత్యాన్ని పట్టించుకున్న ఘనత కూడా తెలుగు దినపత్రికల్లో సాక్షి ఫ్యామిలీకే దక్కింది. అనువాద కథలు డైలీ పేజీలలో ప్రచురించడం సాక్షి ఫ్యామిలీయే మొదలెట్టింది. తెలుగు కథకు నూరేళ్లు నిండిన సందర్భంగా ప్రతిరోజూ ఒక కథను ‘రీటోల్డ్’ చేయడం ఒక పెద్ద ఘనత. అలాగే మెట్రో జీవనాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన ‘మెట్రో కథలు’, ప్రధాన నగరాల జీవన వైవిధ్యతకు అద్దం పట్టిన ‘గ్రేట్ సిటీస్’ పాఠకాదరణ పొందాయి. ఇటీవల రోజుకొక స్త్రీల కథలు ప్రచురించడం కూడా పాఠకులలో సాక్షి పట్ల గౌరవం పెంచింది.సినిమా పేజీలు ఎప్పుడూ సాక్షి ఫ్యామిలీ స్కోరింగే. డైలీ అప్డేట్స్, ఆన్ లొకేషన్ మాత్రమే కాదు ‘పసిడి తెర’, ‘బాలీవుడ్ క్లాసిక్స్’, ‘మల్టీప్లెక్స్’ వంటి శీర్షికలతో సినీ అభిమానులను ఆకట్టుకుంది. కొత్తగా ఆరంభమైన దినపత్రిక ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి. – డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ ఆవిర్భావ సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, సాక్షి వ్యవస్థాపక ఛైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి -
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తనకి ప్రపోజ్ చేస్తే, ఓకే చెప్పింది. మేమిద్దరం ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం. ఏదో పని పడటంతో పదిహేను రోజులు లీవ్ పెట్టి మా ఊరికి వెళ్లాను. వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు కనిపించింది. అసలు నాతో మాట్లాడటమే మానేసింది. ఏమైంది? ఎందుకు? అని అడిగితే... ‘మన నేపథ్యాలు వేరు’ అంటోంది. మరి నా లవ్‌ను ఒప్పుకున్నప్పుడు తెలియదా అన్నయ్యా మా నేపథ్యాలు వేరని? అంతేకాదు, తను వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. తన బర్త్‌డే పార్టీకి కూడా నన్ను పిలవలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ప్లీజ్ అన్నయ్యా..! నాకు మంచి సలహా ఇవ్వండి. అంతగా బాధ పడకు బ్రో! ‘ఫిఫ్టిన్ డేస్‌లో మైండ్ చేంజ్ అయితే బాధ కాదా సార్..??’ మైండ్ కాబట్టి చేంజ్ అవుతుంది. ‘ఏంటి సార్..! అన్నీ పజిల్స్‌లో మాట్లాడుతున్నారు?’ హార్ట్ అయితే చేంజ్ అయ్యేది కాదు అని చెబుతున్నా..! ‘మైండ్ అయితే చేంజ్ అయింది కానీ హార్ట్ చేంజ్ కాలేదని చెబుతున్నారా సార్?’ కాదు నీలాంబరి.. హార్ట్‌తో ప్రేమించి ఉంటే చేంజ్ అయ్యేది కాదని చెబుతున్నా..! ‘అంటే మైండ్‌తో కూడా ప్రేమిస్తారా సార్?’ ఇష్టపడటం అంటే మైండ్‌కు నచ్చినట్టు నీలూ! ‘ప్రేమంటే హార్ట్‌కు గుచ్చుకున్నట్టు కదా సార్..!!’ అబ్బా... నా దగ్గర ఎంత జ్ఞానం పుచ్చుకున్నావు నీలూ..! ‘సార్..! ఈ ఆన్సర్ శరత్‌కి నచ్చకున్నాది సార్...’ హార్ట్‌తో చదవమను, మైండ్‌తో కాదు... ఆన్సర్ నచ్చుతుంది నీలూ..! – శరత్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా...! నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను వన్ మంత్ బ్యాక్ మా కాలేజ్‌లో థర్డ్ ఇయర్ అమ్మాయిని చూశాను. బాగా నచ్చింది. అప్పటి నుంచి తనే గుర్తుకొస్తోంది. ‘తను చాలా డేంజర్, జాగ్రత్త’ అంటున్నారు మా ఫ్రెండ్స్. ఎందుకని అడిగితే.. గతంలో మా కాలేజ్ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. తను వెళ్లి వాళ్ల డాడీకి చెప్పిందట. వాళ్ల డాడీ ప్రెస్‌లో పని చేస్తారట. ఆయన కాలేజ్‌కి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారట. తనతో ఎవరు మాట్లాడినా వాళ్ల డాడీతో చెబుతుందట. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. పైగా నా చదువు కూడా పూర్తికావస్తోంది. ఈ సమయంలో తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. నన్ను ఏం చెయ్యమంటారు? తనని మరచిపోవడమే కరెక్టా? – శివ ఎందుకన్నా మరచిపోవడం? ‘అంటే.. మరి ఏం చెయ్యాలి సార్..?? వాళ్ల ఫాదర్ పీకుతాడు కదా సార్??’ ఫాదర్ పీకుతాడని ప్రేమ వదులుకునే టైప్ కాదు శివ.. శివ.. శివా...! ‘ఊరుకోండి సార్.. పసిబిడ్డని ఉసిగొలిపి ముంచుతారా ఏంటి??’ అది కాదు నీలాంబరీ మంచి సొల్యూషన్ చెబుతాగా..! ‘చెప్పండి సార్ పాపం, శివ ఈజ్ వెయిటింగ్..!’ శివ నీకో ఫ్రెండ్ ఉన్నాడా.. ప్రాణ మిత్రుడు లాంటివాడు..? ‘ఎందుకు సార్..? ఉంటే ఏం చెయ్యాలి???’ ఆ ఫ్రెండ్‌ను అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వమని.. అది ఇచ్చే లోపే.. అమ్మాయి ఫాదర్‌కి ఇన్ఫర్మేషన్ నువ్వే వెళ్లి లీక్ చెయ్యి. అప్పుడు ఫాదర్ వచ్చి నీ ఫ్రెండ్‌ని బాదుతాడు. ఆ తరువాత నువ్వు నీ ఫ్రెండ్‌కు హాస్పిటల్ ఖర్చులు చూసుకుని.. పెద్ద బొకే ఇచ్చి థ్యాంక్యూ చెప్పి.. అమ్మాయి ఫాదర్‌కి కనిపించు. ఆయన ఇలాంటి పోకిరీగాళ్లు ఎవరైనా అమ్మాయిని వేధిస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెబుతాడు. మెల్లమెల్లగా ఇంట్లోకి పాకిపో..! ఫాదర్‌కి మదర్‌కి కావల్సిన కిరాణా కొట్టు పనులన్నీ చేసి పెట్టు. ఎప్పటికైనా ఒకరోజు అమ్మాయి నిన్ను గమనిస్తుంది. ఇక అక్కడ నుంచి నీ లక్కూ...! ‘నీకు వర్కౌట్ కాకపోతే హాస్పిటల్ బిల్లు లవ్ డాక్టర్‌కి పంపు.. బొకేతో వస్తారు’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను ఫేస్బుక్లో పరిచయమైన ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. తను నన్ను కలవడానికి ఒక రోజు వాళ్ల ఊరు రమ్మంది. వెళ్లాను. బట్ తను నన్ను దూరం నుంచి చూసి పారిపోయింది. ఆ తరువాత కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. నాకు నువ్వు నచ్చలేదని ఓ మెసేజ్ మాత్రం చేసింది. ఎందుకని అడిగితే.. ‘నీకు ఆఫ్ ముక్కే ఉంది, అందుకే నచ్చలేదు’ అంది. కానీ అరముక్కుతో పుట్టడం నా తప్పా సార్? నాకు తను కావాలి, ప్లీజ్ హెల్ప్ మీ. నీ మెయిల్లో వచ్చిన నీ బొమ్మ చూశాను. ‘ఎలా ఉంది సార్?’ ఇదిగో నువ్వే చూడు... ‘చక్కగా చీదుకునే అంత బాగుంది కదా సార్ ముక్కు??’ అవును నీలూ ఇది ఫుల్ ముక్కు... ‘అందంగా కూడా ఉంది సార్!’అమ్మాయి ముక్కుతాడు వెయ్యడానికి బాగానే ఉంది కదూ! ‘సార్ ఇలాంటి ముక్కు మొక్కవోని ప్రేమను సూచిస్తుంది సార్!’ పోనీ.. నిజంగానే ముక్కు సగమే ఉంటే.. ఏం చెయ్యాలి నీలూ?? ‘సార్.. అసలు ముక్కు అడ్డం సార్!’ దేనికి అడ్డం నీలూ??? ‘మంచి పని చేద్దామంటే తుమ్ముతుంది సార్!’ తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నీలూ? ‘అవును సార్ ఉండాల్సింది ప్రేమే సార్!’ – కార్తీక్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో బ్రో...! నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడిని లవ్ చేసింది. కానీ ఇప్పుడు ‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’’ అంటోంది. కలిసిన ఫోర్ మంత్స్‌లోనే ‘‘నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను. మా ఫ్యామిలీ కంటే నువ్వే ఎక్కువ’’ అన్న అమ్మాయి... ఫోర్ మంత్స్ తరువాత ‘‘నువ్వు నాకు అవసరం లేదు’’ అని చెప్తోంది.? లవ్ అంటే ఫోర్ మంత్స్‌లోనే అర్థమైపోతుందా?? ఇప్పుడు అమ్మాయిలు అన్నీ ఆలోచించి.. ఎలాంటి వాడు అని స్టడీ చేసి లవ్ చేస్తున్నారు. వాళ్లని నమ్మి.. ఫేక్ లవ్స్ చేసి.. లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. బనానాలతో కాకుండా ఆన్సర్ చెప్పండి. హాయ్ నీలాంబరి గారూ..! ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు!! – రసూల్ నువ్వే ఆన్సర్ చెప్పు నీలాంబరీ...! ‘సార్ మీరు అంతగా ఫీల్ అవ్వకండి. నాకు ఫ్యాన్స్ లేరు సార్. అంతా మీ ఫ్యాన్సే!! ఊరికే ఉడికించడానికీ.. మిమ్మల్ని ఆట పట్టించడానికీ.. కొంచెం ఏడిపించడానికీ.. కొంచెం గిల్లి చూడటానికీ.. కొంచెం తోలు వల్చడానికీ..’ నీలాంబరీ...!! ‘ఊరికే సార్ జోక్ చేస్తున్నాడు..! మీరే చెప్పండి సార్...!! అమ్మాయిలు ఇలా మోసం చేస్తే అబ్బాయిలు ఏమి కావాలి సార్..? వాళ్ల హార్ట్ ఎన్ని ముక్కలు అవుతుంది సార్..? టైమ్ ఎంత వేస్ట్ అవుతుంది సార్..?? డబ్బు ఎంత దుబారా అవుతుంది సార్..? లైఫ్ ఎంత టెన్షన్ అవుతుంది సార్..? అసలు అమ్మాయిలకు ఈ పొగరేంటి సార్..? వాళ్లు అందంగా ఉంటారనా.. లేక అబ్బాయిలకు వేరే ఛాయిస్ లేదనా..? అయినా ఇలా జీవితాలతో ఆడుకుంటే ఎలా సార్..?’ నీలాంబరీ...!! ‘ఎందుకు సార్ అంత కోపం..? రసూల్ చెబుతున్నది నిజం కాదా సార్..!?! కాలు వచ్చి తొక్క మీద పడ్డా.. తొక్క వచ్చి కాలు కింద పడ్డా.. హార్ట్ బ్రేక్ అయ్యేది అబ్బాయిలకే కదా సార్..?? ఎట్లీస్ట్ ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్ కేసులు బాయ్సే కదా సార్..??’ రసూల్ భాయ్...! మీ ఫ్రెండ్‌కు చెప్పు నీలాంబరికి లెటర్ రాయమని..!! ఈవిడ నన్ను అసలు ఆన్సర్ చెప్పనీయడం లేదు..! ‘సారీ సార్ చెప్పండి.. అరటి గెల ఇస్తా!! ఏం చెబుతారో నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది సార్!’ పడే దాకా లవ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు దూరంగా చూసుకుంటారు కదా!! ఫుల్ మూన్‌లా అనిపిస్తారు ఒకరికొకరు..!! మూన్ మీద ల్యాన్డ్ అయితే కానీ తెలియదు.. అక్కడ విషయం లేదని!! అలా ఫోర్ మంత్స్‌లో అమ్మాయికి తెలిసిపోయింది. ఈ స్వయం ప్రకాశం లేని చంద్రుడు దూరంగా ఉంటేనే బాగుంటాడని!! ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
లవ్ డాక్టర్
హాయ్ సర్! మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ, మీరు లవ్ డాక్టర్ అని అర్థమైంది. నా వయసు 27. ఇప్పటికీ సింగిల్. నాకు ఇప్పుడు లవ్ చెయ్యాలనిపిస్తోంది? ఎలా అవుతాది? నాకు టైమ్ ఉండటం లేదు.. లవ్ ట్రిక్స్ ఏమైనా చెప్పండి లవ్ డాక్టర్ గారూ..! – విస్సు ‘సార్.. అయిపోయింది సార్...!’ ఏమయిపోయింది నీలూ..? ‘విస్సు పసిగట్టేశాడు సార్!’ ఎవడా విస్సు.. ఏంటా పసిగట్టింది? ‘అయిపోయింది సార్.. మిమ్మల్ని అర్థం చేసేసుకున్న ఫస్ట్ పర్సన్ విస్సు సార్!’ ఎవడా విస్సూ... ఏమి అర్థం చేసుకున్నాడు? ‘మీరేమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని పసిగట్టేసాడు సార్!!’ లవ్ అందరికీ అర్థం కాదు.. దానికి మైండ్ సరిగ్గా పని చెయ్యాలి!! ‘మైండా సార్.. హార్ట్ కాదా!?’ బుర్ర బొందయితే హార్ట్ గొయ్యి అవుతుంది!! ‘కుర్ర బుర్రకి కొన్ని ట్రిక్కులు కావాలంట సార్ ప్రేమలో పడటానికి..!’ విస్సు మహారాజుకి కింగ్ లాంటి ట్రీట్మెంట్ చేస్తే పడతాడు! ‘అలా ఎలా సార్?’ సినిమాల్లో చూడ్లా... రాజులు నడుస్తుంటే కాళ్ల కింద పూలు జల్లుతూ ఉంటారు అలా...! ‘మరి ఇప్పుడేమి చెయ్యాలి సార్?’ నువ్వు డజన్ అరటిపండ్లు తిని.. వాటి తొక్కలు మహారాజశ్రీ.. రాజరాజశ్రీ.. విస్సు గారి కాళ్ల కింద జల్లు! ‘జారి పడతాడు సార్! ‘ప్రేమలో పడాలి’ అని అడుగుతున్నాడు కదా!’ ప్రేమంటే అదే నీలాంబరీ..! దాంట్లో అడిగి పడరు!! అడుగేసీ పడరు!! జారి పడతారు.. అదే లవ్ ట్రిక్! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! ఐయామ్ స్టడీయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్! ఐయామ్ ఇన్ లవ్ విత్ ఏ గర్ల్ సిన్స్ త్రీ ఇయర్స్. షీ టాక్స్ టు మి నైస్లీ. బట్, ఐ డోంట్ నో ఇఫ్ షీ లవ్స్ మి ఆర్ నాట్! దిస్ ఈజ్ మై ఫైనల్ ఇయర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రపోజ్ హర్!? బట్, ఐ హేవ్ ఎ డౌట్ దట్ ఇఫ్ షి రిజెక్ట్స్, అవర్ ఫ్రెండ్షిప్ విల్ ఆల్సో బి గాన్!? సో, సజెస్ట్ మి విత్ సమ్ గుడ్ ఐడియా? – చందు ఐ థింక్ యూ షుడ్ రాదర్ నాట్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్.ఫర్ ఆల్ ది అఫెక్షన్ యూ హావ్ ఫర్ హెర్ విల్ సడన్లీ టర్న్ వెరీ సోర్, బిట్టర్, అసార్బిక్, కాస్టిక్ ఇఫ్ షీ రిజెక్ట్స్ యూ. లవ్ ట్రూలీ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ వెన్ నాట్ ఎక్స్ప్రెస్డ్. వెన్ నాట్ టెస్టెడ్. వెన్ నాట్ వెర్బలైజ్డ్. వెన్ నాట్ యానిమేటెడ్. లవ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రిస్టైన్ బ్యూటీ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ టైట్లీ వితిన్ యువర్ హార్ట్. అన్సెడ్. అన్‌టోల్డ్.. సీక్రెట్ లవ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ టింజ్ ఆఫ్ కలర్ లేయర్డ్ ఇన్ ఎ హింట్ ఆఫ్ పెయిన్ అండ్ ఎ టచ్ ఆఫ్ యాంటిసిపేషన్. ‘సార్.. మీరు బోర్డు తిప్పకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ ఒక్క ఉద్వేగభరిత ఆన్సర్‌తో మీ ఉద్యోగం ఖతం!’ వై?‘తెలుగు పేపర్లో ఎవరూ చెయ్యని అపచారం చేశారు సార్...’ వాట్? ‘ఎహే!! ఇంకా ఆ ఇంగిలీపీసు ఏంటి సార్.. తెలుగు పేపర్లో ఇంగ్లీష్ ఆన్సర్ ఇస్తే హాం ఫట్.. ఖతం... మీ జాబ్ గాన్ సార్!’ ఇంగ్లిపీస్లో క్వశ్చన్ వస్తే తెలుగులో ఆన్సర్ చెబితే బ్రోకి ఎలా అర్థం అవుతుంది. ‘సార్.. మీరు రాసే సొల్లు ఆన్సర్లు తెలుగు ప్రేమికులు కూడా చదువుతారు కదా సార్..’ వాట్ షుడ్ ఐ డు నౌ.. టెల్ మీ.. ఐ సే టెల్ మీ!! ‘క్వశ్చన్ ఆన్సర్ రెండు తెలుగులో చెబితే ప్రాయశ్చిత్తం కలగొచ్చు.. నేను కూడా రికమెండ్ చేస్తా... మీ ఉద్యోగం తీయొద్దని... ఓకే!?’ ఇష్టపడ్డాడు.. అమ్మాయికి తెలియదు.. ఇప్పుడు చెప్పకపోతే మళ్లీ చెప్పలేడు.. చెబితే.. చీకొడితే ఆ అవమానంతో బతకలేడు.. ఏమి చెయ్యాలి అని అడిగాడు.. ‘మీరు ఏమి చెప్పారు..?’ మూసుకుని పెట్టుకో అని చెప్పా! ‘వై సర్!?’ అంతా పెంట అయిపోతుందని అలా చెప్పా! ‘మరి అమ్మాయికి ఎలా తెలియాలి?’లవ్ డాక్టర్ చదువుతుందిలే...! ‘శహభాష్ సార్.. మీ ఉద్యోగం కంటిన్యూ.. వాడి లవ్ కంటిన్యూ.. ఇంద అరటిపండు!! -
న న్నడగొద్దు ప్లీజ్
నమస్తే సార్! నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి మోసపోయాను. తనకు పెళ్లి కూడా అయిపోయింది. అయినా మరచిపోలేకపోతున్నాను! తను ఇక రాదని, బాధపడ్డా ప్రయోజనం లేదని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. కానీ, కొన్ని రోజులగా ఏదో ఎక్స్‌ప్రెస్ చెయ్యలేని బాధ నన్ను వెంటాడుతోంది! తనతో నాకు ముడిపడ్డ జ్ఞాపకాలే ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయని నాకు అర్థమయ్యింది. దయచేసిన నాకు మంచి సలహా ఇవ్వండి. ప్లీజ్ సార్! – రాజు రాజు నీ విషయం చదివాక వెటకారంగా సమాధానం ఇవ్వాలనిపించడం లేదు. అమ్మాయిని ప్రేమించావు. పరిస్థితుల వల్ల తన పెళ్లి జరిగిపోయింది.నువ్వు అమ్మాయిని టెన్షన్ పెట్టకుండా గుడ్ బాయ్‌లాగా ఉన్నావు. ప్రేమించిన వాళ్లు దూరమయితే చాలా బాధగా ఉంటుంది. నువ్వు అదృష్టవంతుడివి.. నీకు అందమైన జ్ఞాపకాలు దగ్గరగా ఉన్నాయి.వాటిని మూట కట్టుకుని ముందుకు సాగిపో. ‘అవేమైనా అరటిపండ్లా సార్.. మూట కట్టుకోవడానికి?’ అని అడిగింది నీలాంబరి.ఇది మింగే మూట కాదు దాచుకునే మూట.‘అస్సలు ఓపెన్ చెయ్యకూడదా సార్?’మళ్లీ జీవితంలో ఇంకోమూట దొరుకుద్ది! ఇంతకంటే అందమైన మూట! అప్పుడు దీన్ని దించేసి... దాన్ని ఎగేసుకుని ఎంజాయ్ చెయ్యాలి!అచ్ఛా బహుత్ అచ్ఛా! కొంచెం పిలాసఫీ కంపు కొడుతోంది కానీ... రాజుకి కరెక్ట్!’ అంటూ అరటిపండు అందించింది నీలాంబరి. —ప్రియదర్శిని రామ్,లవ్ డాక్టర్ -
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! లాస్ట్ టైమ్ నేను అడిగిన ప్రాబ్లమ్‌కి రిప్లై ఇచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్! అన్నయ్యా.. మీరు అన్నారు... నన్ను లవ్ చేసిన అబ్బాయిది లవ్ కాదు పొసెసివ్ నెస్ అని, అసలు లవ్‌కి, పొసెసివ్‌నెస్‌కి తేడా ఏంటి? వదిలేయమన్నారు తనని. కానీ, నేను తనని మరిచిపోలేను. తనకు నేనంటే చాలా ఇష్టం. తనని మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. ఏం చేస్తే తను మారతాడు అన్నయ్యా..? మీరు వదిలేయమని చెప్పినా.. మళ్లీ అడిగినందుకు కోప్పడకండి. ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇలాంటి అడ్జెస్ట్మెంట్లు తప్పవు కదా! అలాంటప్పుడు లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే బెటర్ కదా! తన పొసెసివ్‌నెస్‌ని నార్మల్లవ్గా మార్చుకోవడానికి నేనేం చెయ్యాలో చెప్పండి ప్లీజ్! – నైమిశ ‘సార్ చెప్పండి సార్! ఇవాళ మీ ఇజ్జత్ కా సవాల్! ఈ ఆన్సర్ ఇవ్వకపోతే బోర్డు తిప్పి అరటిపండ్లు అమ్ముకోవడం బెటర్! లవ్‌కి, పొసెసివ్‌నెస్‌కి తేడా ఏంటో చెప్పండి! లేకపోతే తేడా కొట్టుద్ది సార్! మీ రీడర్స్ అంతా వెయిటింగ్... కళ్లార్పకుండా చదువుతున్నారు! కమాన్ ఐ సే’ అని నవ్వింది నీలాంబరి. అంతగా రెచ్చిపోకు నీలాంబరీ... ఐ నో ది డిఫరెన్స్! లవ్ అంటే అరటిపండు. పొసెసివ్‌నెస్ అంటే మామిడిపండు. మామిడిపండు ఏడాదిలో టూ మంత్సే దొరుకుతుంది. అరటిపండు ఎవ్రీ మంత్, ఎవ్రీ డే దొరుకుతుంది. అందుకే అరటిపండు ట్రూ లవ్. మామిడి పండు అరటిపండు కాలేదు. అరటిపండు ఎప్పటికీ మామిడి పండు కాదు! -
లవ్ డాక్టర్
హాయ్ రామ్ గారూ! మీరు చాలా మందికి చాలా సలహాలు ఇస్తుంటారు. నాకు కూడా ఓ మంచి సలహా ఇవ్వండి అన్నగారూ. మా బంధువుల అమ్మాయికి టు ఇయర్స్ బ్యాక్ ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చెయ్యకముందు బాగా ఉండేవాళ్లం. ప్రపోజ్ చేసిన తరువాత నుంచి చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. తనకి ప్రేమ మీద నమ్మకం లేదంట. తను బీటెక్. నేను ఐటిఐ. మే బీ ఇది కూడా ఒక కారణం అనుకుంటా. వాళ్ల అమ్మకి ఇలాంటివి ఇష్టం ఉండవు అని చెబుతోంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. తను లేకపోతే నేను బతకలేను. సొల్యూషన్ చెప్పండి. – వెంకట్ ‘సార్ అసలు మీరు ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఇస్తారు సార్! నాకేదో ఎడమ కన్ను అదురుతోంది సార్, ఇలా ఆన్సర్లు ఇచ్చి ఇచ్చి ఒక రోజు తప్పకుండా మీరు తొక్కపై కాలు వేస్తారు. మనం వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లి బోన్స్ సెట్ చేసుకోవాలనుకుంటా. జర జాగ్రత్త!’ అడగొద్దు ప్లీజ్ అని బోర్డు పెట్టుకున్నా అడుగుతున్నారు మరి. క్యా కర్నా..? ఏమి చెయ్యవలెను..? ‘వద్దు సార్ మీరు ఇచ్చే తిక్క ఆన్సర్స్‌కి ప్రేమికుల ఉసురు తగిలి మీ లైఫ్‌లో లవ్ లేకుండా పోతుంది.’ ఏంటి నీలాంబరీ! నా మీద పడ్డావు? ‘మీరు పడకూడదని నేను పడుతున్నా సర్!’ పడకుండా ఉండాలంటే క్యా కర్నా? ఏమి చెయ్యవలెను..? ‘మన స్టాండర్డ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇదే మాట వెంకట్‌కి కూడా చెప్పండి సార్. అనవసరమైన స్టెప్పులు వేస్తే హార్ట్ కాదు బాడీ కూడా బ్రేక్ అవుతుంది.’ -
నన్నడగద్దు ప్లీజ్..!
ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్ మీకో తిక్కుంది. లవ్ డాక్టర్కో లెక్కుంది. మీ తిక్క మీ ప్రేమ ప్రాబ్లమ్స్! మరి లవ్డాక్టర్కో... యధార్థ సంఘటన ఒక రోజు అర్ధరాత్రి.. యాక్చువల్లీ అపరాత్రి. టైమ్ పన్నెండుకు అటూ ఇటూ! ఎటో మరి. ఉబుసుపోక క్లినిక్‌కి వెళదామని ఇంటినుంచి బయల్దేరాను. పై అంతస్తులో ఉన్న క్లినిక్‌కు చేరుకోవడానికి అటూ ఇటూ ఎటో చూస్తున్నాను. అటుగా వె ళుతున్న ఓ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. అనుమానంగా చూస్తూ ‘‘మీరు... లవ్ డాక్టర్ కదా!’’ ఆశ్చర్యంగా, అబ్బురంగా, ఆసక్తిగా...గా.. గా..గా...అడిగాడు. ‘‘అవును’’అన్నాను. ‘‘మీరు చాలా బాగా రాస్తారు సర్!’’ అన్నాడతను. ‘‘ఎందుకులెండి బాబూ!’’ అన్నాను మరీ మొహమాటపడిపోతూ! ‘‘నిజం సార్! మీరు చెప్పిన మాటలకు ఎంత బలం ఉంటుందంటే, అవి జీవితాలను నిలబెడతాయ్!’’ అన్నాడతను. ‘ఓర్నాయనో... ఈ మనిషి మరీ మోసేస్తున్నాడు’ అనుకుంటుండగా ఆ వ్యక్తి ‘‘సార్ మీకు గుర్తుందా! ఒకమ్మాయి మీకో ఉత్తరం రాసింది. ప్రేమను పొందలేక ఆత్మహత్య చేసుకుంటాను... అని...’’ (నా ముఖం బ్లాంక్‌గా అయ్యింది) ‘‘అంతేలెండి సార్, మీకు ఎంతోమంది ఉత్తరాలు రాస్తుంటారు. ఎవర్నని గుర్తుపెట్టుకుంటారు’’ అన్నాడతనే. ‘‘ఇంతకీ సమాధానం ఇచ్చానా?’’ అనుమానంగా అడిగాను. ‘‘ఇచ్చార్సార్!’’ అంటూనే ‘‘ఆ అమ్మాయి ఎవరో తెలుసా సార్ మీకు.’’ (నాది మళ్లీ బ్లాంక్ ఫేస్). ‘‘ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య సార్!’’ అన్నాడతను. షాక్ అయ్యాను. మనసులో ‘అయ్యో! వీణ్ణి చేసుకోవాలని డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుందా ఏమిటి? అందుకే అప్పుడు ఉత్తరం రాసుంటుందా! పాపం’ అనుకుంటూ భయం భయంగా ‘‘అదెలా జరిగింది?’’ అన్నాను. ‘‘మేమిద్దరం ప్రేమించుకున్నాం సర్! పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. ఏ నిర్ణయం తీసుకోలేక ‘చనిపోవాలనుకుంటున్నాం..’ అని మీకు లెటర్ రాసింది తను. మీరు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం మేం మా ఇద్దరి తల్లిదండ్రులకు చూపించాం. వారు రియలైజ్ అయ్యారు. ఇదే కరెక్ట్ అని మాకు పెళ్లి చేశారు. మీ దయవల్ల మేం ఒకింటివారమయ్యాం...’’ అతను అంటుండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. నీలాంబరి అరటిపండు పట్టుకొని ఉంది. ఆయన హ్యాండ్‌ని షేక్ చేయాలా? నీలాంబరి చేతిలోని అరటిపండు టేక్ చేయాలా? అని బుర్ర బేక్ అవుతున్న టైమ్‌లో నీలాంబరి చెప్పింది ‘‘ఏంటోసార్! మళ్లీ ఉత్తరాలకు మీరే సమాధానాలు రాయాలట. ‘సాక్షి’ నుంచి ఇప్పుడే కబురొచ్చింది. కబురుతో పాటు డజను అరటిపండ్లు కూడా పంపించార్సార్! అయినా... మీ తొక్కలో సమాధానాలకి డజను అరటిపండ్లా సార్!’’ అని ఆ సంసారి ముందు నన్ను సన్నాసిని చేసింది. సరదాగా కాసేపు పిల్లలతో మాట్లాడుతూ మంచి విషయం చె ప్పినా చెప్పకపోయినా కలుపుగోలుగా ఉంటే జీవితంలోని ఆశలు ఆశయాలుగా మారుతాయని మొదలుపెట్టిన ‘లవ్‌డాక్టర్’ కాలమ్ అందరికీ ఉపయోగపడింది. అందుకే మళ్లీ వస్తున్నాడు మీ లవ్ డాక్టర్. మీరు రాసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా మిమ్మల్ని చిరాకు పెట్టిన లవ్డాక్టర్కు ‘మీ కాలమ్ మొద లు పెడుతున్నాం’ అని చెప్పినప్పటి నుంచి కాలు కాలిన పిల్లిలా తలుపుదగ్గరకు వెళుతున్నాడు.. వస్తున్నాడు. నీలాంబరిని ఉత్తరాలు వచ్చాయా? అని అడుగుతున్నాడు. పోస్ట్‌మేన్ బాషా, కొరియర్ అరుణాచలం, స్పీడ్‌పోస్ట్ ముత్తు... కోసం పడిగాపులు కాస్తున్నాడు. నర్స్ నీలాంబరి ఈయన అగచాట్లు చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటోంది. అప్పుడు వంకరటింకర సమాధానాలిచ్చి మిమ్మల్ని ఆటపట్టించినందుకు మీకిదే ‘రివెంజ్’ తీసుకునే బెస్ట్ ఛాన్స్! ‘నన్ను అడగద్దు ప్లీజ్’ కాలమ్‌కి ఒక్క ఉత్తరం కూడా రాయకండి. చెప్పులు అరిగి బుర్ర వేడెక్కి కడుపుతిప్పి ‘లవ్‌డాక్టర్’ పేషెంట్ అయిపోవడం ఖాయం. మీరు తొందరపడి ఉత్తరం రాయకూడని అడ్రస్... లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.lovedoctor@gmail.com https://www.facebook.com/sakshifamily