లవ్ డాక్టర్
హాయ్ రామ్ గారూ! మీరు చాలా మందికి చాలా సలహాలు ఇస్తుంటారు. నాకు కూడా ఓ మంచి సలహా ఇవ్వండి అన్నగారూ. మా బంధువుల అమ్మాయికి టు ఇయర్స్ బ్యాక్ ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చెయ్యకముందు బాగా ఉండేవాళ్లం. ప్రపోజ్ చేసిన తరువాత నుంచి చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. తనకి ప్రేమ మీద నమ్మకం లేదంట. తను బీటెక్. నేను ఐటిఐ. మే బీ ఇది కూడా ఒక కారణం అనుకుంటా. వాళ్ల అమ్మకి ఇలాంటివి ఇష్టం ఉండవు అని చెబుతోంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. తను లేకపోతే నేను బతకలేను. సొల్యూషన్ చెప్పండి. – వెంకట్
‘సార్ అసలు మీరు ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఇస్తారు సార్! నాకేదో ఎడమ కన్ను అదురుతోంది సార్, ఇలా ఆన్సర్లు ఇచ్చి ఇచ్చి ఒక రోజు తప్పకుండా మీరు తొక్కపై కాలు వేస్తారు. మనం వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లి బోన్స్ సెట్ చేసుకోవాలనుకుంటా. జర జాగ్రత్త!’
అడగొద్దు ప్లీజ్ అని బోర్డు పెట్టుకున్నా అడుగుతున్నారు మరి. క్యా కర్నా..? ఏమి చెయ్యవలెను..?
‘వద్దు సార్ మీరు ఇచ్చే తిక్క ఆన్సర్స్‌కి ప్రేమికుల ఉసురు తగిలి మీ లైఫ్‌లో లవ్ లేకుండా పోతుంది.’
ఏంటి నీలాంబరీ! నా మీద పడ్డావు?
‘మీరు పడకూడదని నేను పడుతున్నా సర్!’
పడకుండా ఉండాలంటే క్యా కర్నా? ఏమి చెయ్యవలెను..?
‘మన స్టాండర్డ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇదే మాట వెంకట్‌కి కూడా చెప్పండి సార్. అనవసరమైన స్టెప్పులు వేస్తే హార్ట్ కాదు బాడీ కూడా బ్రేక్ అవుతుంది.’