
హాయ్ సార్! మా మతాలు వేరు గానీ.. మా నేపథ్యాలు ఒకటే. వాళ్ల పేరెంట్స్ వాళ్ల మత పద్థతిలోనే పెళ్లి చేస్తామన్నారు. రెండు లక్షలు కట్నం ఇస్తామన్నారు. మా పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోలేదు. నేనే కష్టపడి ఒప్పించాను. తను మా ఇంటికి వచ్చాక కూడా వాళ్ల మతాన్నే పాటిస్తాను అంటోంది. దానికి మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇద్దరం కలిసి చాలా బాగుండేవాళ్లం. తనకి అన్యాయం చెయ్యడం ఇష్టం లేదు. దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్!– కృష్ణ
ప్రేమకు మతం లేదు, కులం లేదని చెప్పినా నీకు ఎక్కదు! కట్నం తీసుకోవడం నేరమని చెప్పినా నీకు అర్థం కాదు!!
ఏదైనా పెళ్లికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి అంటే విసుక్కుంటావు! నీకు అమ్మాయి నచ్చిందంతే! అంటే.. రూపం నచ్చిందంతే...!! అమ్మాయి కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ల పీకల మీద కూర్చుని పెళ్లికి ఒప్పించావు. ఇప్పటికైనా మారు అన్నయ్యా ప్లీజ్!! నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో! తన మతాన్ని గౌరవించు..!! తన పద్ధతులను గౌరవించలేనివాడివి.. తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేవు.
నీ కోసం అమ్మాయి చెయ్యని త్యాగం లేదు. నీ కోసం తన వాళ్లని వదిలి నీ నమ్మకం మీద వచ్చింది..!! నువ్వు ఆ నమ్మకం మరిచి.. ఈ నమ్మకాల కోసం గింజుకుంటున్నావు..!! వద్దు అన్నయ్యా! అలా చెయ్యకు. ఏ నమ్మకమైనా నేర్పించేది ప్రేమే..!! నువ్వు ప్రేమనే నమ్మకం చేసుకో..!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment