
హాయ్ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. నన్ను ప్రస్తుతానికి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – కృప
మనం ముచ్చటగా మూడో లవ్ స్టోరీ అయ్యామా చెల్లీ..? ఎందుకమ్మా అంత తొందరపాటు?? వాడు ఇద్దరికి ఆల్‌రెడీ హ్యాండ్ ఇచ్చాడు... వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి కన్సిడర్ చెయ్యమ్మా... ఒట్టి పెంటగాడు.. వాడితో చెయ్యి కలిపితే.. మనకు అంటుకుంటుంది ఆ పెంట వాసన! ఈ సమాజం ఆ పెంట వాసన చూసి.. నిన్నూ రెస్పెక్ట్ చెయ్యదు!! ‘సార్..! కానీ ఫస్ట్, సెకండ్ లవ్ స్టోరీలు వర్కౌట్ కాక.. కృపతోనే లవ్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్???’ నీలూ..! రెండు చోట్ల రిజెక్ట్ అయిన కాండిడేట్ నా చెల్లెలికి ఎందుకు? అసలు ఇలాంటి ఫెయిల్యూర్ కాండిడేట్ మీద అనవసరంగా సింపతీ చూపించి.. దాన్ని లవ్ అనుకుని, ఆ కన్ఫ్యూజన్‌లో హార్ట్ పారేసుకుని.. ఆ తర్వాత వీడు నెక్ట్స్ ఫిట్టింగ్ కోసం వెళ్లిపోతే.. కృప ఏం కావాలి??? అసలే స్టెబిలిటీ లేని యూజ్‌లెస్ ఫెలో వాడు.. మనకు వద్దే వద్దు!!‘విన్నావుగా కృప.. బీ కేర్‌ఫుల్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment