హాయ్ అన్నా! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్ నంబర్ అడిగాను. ఇచ్చింది. ఫోన్‌లోనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఓకే అంది. బాగానే మాట్లాడుకున్నాం. అన్నీ షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులకి మా మధ్య క్యాస్ట్ గురించి చర్చ వచ్చింది. మా కులాలు వేరని తెలిసింది. దాంతో ‘మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడితో వదిలేద్దాం’ అంది. సరే..! నీకే లేనప్పుడు నాకెందుకని ఫోన్లు, మెసేజులు చెయ్యడం మానేశాను. తర్వాత కొన్ని రోజులకి తన నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను. ‘మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ‘మనం వెళ్లిపోతే మన ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది. వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. తను వినట్లేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటోంది. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను’ అని బెదిరిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ఒక్కడికే కాకుండా ఇద్దరికీ హెల్ప్ అయ్యే సలహా ఇవ్వండి ప్లీజ్.
– ప్రవీణ్
బెదిరిస్తోందా????‘సార్..! ‘‘బెదిరిస్తోందా..దా..దా..?’’ అని దీర్ఘం తీస్తున్నారంటే అమ్మాయి నిజంగా ఏం చేసుకోదని లైట్‌గా తీసుకుంటున్నారా సార్? మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్! ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారని అంటారా సార్? మనకు లవ్ వర్కౌట్ కాకపోతే ఇంక వేరే మార్గమే లేదని మీ చెల్లెలు వాపోతుంటే ఏంటి సార్ మీ సెటైర్లు..?? ‘‘బెదిరిస్తోందా.. దా..దా’’?? అని అంటున్నారు. టూ మచ్ సార్!’అది కాదు నీలూ! ముందేమో తాను క్యాస్ట్ సేమ్ కాదు.. లవ్ స్టాప్ చేద్దామంటే.. తనకేనా పొగరు నేను కూడా కట్ ఆఫ్ చేసేస్తా.. అని పోజ్ కొట్టాడు ప్రవీణ్. లవ్ లేకపోయినా బతకొచ్చు అనుకుంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణం సైతం వదిలేస్తా ప్రేమ కోసం అని బాధపడుతుంటే.. పారిపోవడానికి కూడా రెడీ అంటుంటే... మనవాడు స్లో మోషన్‌లో మనకు ఉత్తరం రాస్తున్నాడని కొంచెం ఫీలయ్యి వెక్కిరించా నీలాంబరి. ‘‘బెదిరిస్తుందా..దా..దా?’’ అని.‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ప్రవీణ్ వాళ్ల ఇంట్లో కన్విన్స్ చేసి మమ్మీ డాడీలను తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్‌ని కన్విన్స్ చేసుకోవాలి!!‘తంతారేమో సార్!?’బెదిరిస్తున్నావా నీలూ???? ‘లేదు సార్! ప్రవీణ్ ఈజ్ స్ట్రాంగ్. మీరు చెప్పినట్లే చేస్తాడు!!’
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, May 1 2019 12:13 AM | Last Updated on Wed, May 1 2019 12:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment