
హాయ్ బాబాయ్..! మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తుంటారు కదా. మరి నాకు కూడా ఓ మంచి సమాధానం ఇవ్వండి బాబాయ్. నేనొక అమ్మాయిని రెండేళ్ల నుంచి ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతోంది. కానీ వాళ్ల పేరెంట్స్ రిజెక్ట్ చేస్తారనే భయంతో నన్ను రిజెక్ట్ చేస్తోంది. నన్ను అవాయిడ్ చేస్తోంది బాబాయ్. ఏం చెయ్యమంటారు బాబాయ్? రోజూ మాట్లాడే తను.. ఇప్పుడు నాతో మాట్లాడకపోవడంతో తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి బాబాయ్? తనకి భయం పోయేటట్లు నేను ఏం చెయ్యాలో చెప్పండి బాబాయ్! ప్లీజ్. – అభిషేక్
నీకంటే మంచి అబ్బాయిని చూసి లవ్ ప్రపోజ్ చెయ్యించు అబ్బాయ్..!!‘ఏంటి సార్ అంత రఫ్‌గా అలా అనేశారు? మిమ్మల్ని బాబాయ్ అన్నందుకా సార్ అంత కోపం? ఇంకా నయం కదా సార్.. తాతయ్య అనలేదు. అనుంటే అబ్బాయ్ అనకుండా వెధవాయ్ అనేవారేమో పాపం అభిషేక్‌ని..!? అయినా.. అదేమి ఆన్సర్ సార్? ఇంకో అబ్బాయిని చూసి, వాడికీ.. వీడి గర్ల్ ఫ్రెండ్‌తో కనెక్షన్ పెట్టమంటున్నారేంటి సార్??ఎంత అనెథికల్ సార్.? అంటే హార్ట్ లేని డర్టీ సలహా సార్?’నీలాంబరీ..! అమ్మాయికి అభిషేక్ అంటే.. రియల్‌గా లవ్ ఉంటే మమ్మీ.. డాడీ.. ఏమంటారోనని ఆగదు. జంప్ కొట్టి రెడీ అయిపోయేది. అలా చెబితే బాధపడతాడేమోనని...‘ఇంకొకడిని లైన్‌లో పెట్టమన్నారా సార్.. మీకూ, మీ రౌండ్ అబౌట్ ఆన్సర్‌కీ ఓ దండం సార్!’
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment