హలో బ్రో...! నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడిని లవ్ చేసింది. కానీ ఇప్పుడు ‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’’ అంటోంది. కలిసిన ఫోర్ మంత్స్‌లోనే ‘‘నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను. మా ఫ్యామిలీ కంటే నువ్వే ఎక్కువ’’ అన్న అమ్మాయి... ఫోర్ మంత్స్ తరువాత ‘‘నువ్వు నాకు అవసరం లేదు’’ అని చెప్తోంది.? లవ్ అంటే ఫోర్ మంత్స్‌లోనే అర్థమైపోతుందా?? ఇప్పుడు అమ్మాయిలు అన్నీ ఆలోచించి.. ఎలాంటి వాడు అని స్టడీ చేసి లవ్ చేస్తున్నారు. వాళ్లని నమ్మి.. ఫేక్ లవ్స్ చేసి.. లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. బనానాలతో కాకుండా ఆన్సర్ చెప్పండి. హాయ్ నీలాంబరి గారూ..! ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు!! – రసూల్
నువ్వే ఆన్సర్ చెప్పు నీలాంబరీ...!
‘సార్ మీరు అంతగా ఫీల్ అవ్వకండి. నాకు ఫ్యాన్స్ లేరు సార్. అంతా మీ ఫ్యాన్సే!! ఊరికే ఉడికించడానికీ.. మిమ్మల్ని ఆట పట్టించడానికీ.. కొంచెం ఏడిపించడానికీ.. కొంచెం గిల్లి చూడటానికీ.. కొంచెం తోలు వల్చడానికీ..’
నీలాంబరీ...!!
‘ఊరికే సార్ జోక్ చేస్తున్నాడు..! మీరే చెప్పండి సార్...!! అమ్మాయిలు ఇలా మోసం చేస్తే అబ్బాయిలు ఏమి కావాలి సార్..? వాళ్ల హార్ట్ ఎన్ని ముక్కలు అవుతుంది సార్..? టైమ్ ఎంత వేస్ట్ అవుతుంది సార్..?? డబ్బు ఎంత దుబారా అవుతుంది సార్..? లైఫ్ ఎంత టెన్షన్ అవుతుంది సార్..? అసలు అమ్మాయిలకు ఈ పొగరేంటి సార్..? వాళ్లు అందంగా ఉంటారనా.. లేక అబ్బాయిలకు వేరే ఛాయిస్ లేదనా..? అయినా ఇలా జీవితాలతో ఆడుకుంటే ఎలా సార్..?’
నీలాంబరీ...!!
‘ఎందుకు సార్ అంత కోపం..? రసూల్ చెబుతున్నది నిజం కాదా సార్..!?! కాలు వచ్చి తొక్క మీద పడ్డా.. తొక్క వచ్చి కాలు కింద పడ్డా.. హార్ట్ బ్రేక్ అయ్యేది అబ్బాయిలకే కదా సార్..?? ఎట్లీస్ట్ ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్ కేసులు బాయ్సే కదా సార్..??’
రసూల్ భాయ్...! మీ ఫ్రెండ్‌కు చెప్పు నీలాంబరికి లెటర్ రాయమని..!! ఈవిడ నన్ను అసలు ఆన్సర్ చెప్పనీయడం లేదు..!
‘సారీ సార్ చెప్పండి.. అరటి గెల ఇస్తా!! ఏం చెబుతారో నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది సార్!’
పడే దాకా లవ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు దూరంగా చూసుకుంటారు కదా!! ఫుల్ మూన్‌లా అనిపిస్తారు ఒకరికొకరు..!! మూన్ మీద ల్యాన్డ్ అయితే కానీ తెలియదు.. అక్కడ విషయం లేదని!! అలా ఫోర్ మంత్స్‌లో అమ్మాయికి తెలిసిపోయింది. ఈ స్వయం ప్రకాశం లేని చంద్రుడు దూరంగా ఉంటేనే బాగుంటాడని!!
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment