హాయ్ అన్నయ్యా! మీరు అమ్మాయిలకు ఇచ్చే సపోర్ట్ నాకు బాగా నచ్చుతుంది. నా చెల్లెలు ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయింది. ఇప్పుడు తనకి పెళ్లి చేద్దామని అమ్మానాన్న అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య మా చెల్లి ఆ అబ్బాయికి మళ్లీ దగ్గరవుతోంది. వాడు మళ్లీ మోసం చేస్తాడని చెబుతున్నా వినట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ‘తను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు అన్నయ్యా’ అంటోంది. తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – దుర్గారావు
తను అర్థం చేసుకోవాలా?లేదా మనమే అర్థం చేసుకోవాలా???? ఈ ప్రపంచంలో మోసాలు రోజూ చూస్తున్నాం!ద్రోహాలు రోజూ జరుగుతున్నాయి!అలాంటప్పుడు చెల్లెలికి ఒకసారి జరిగిన మోసం మళ్లీ జరగకుండా ఎలా ఉంటుంది అని అనుకోవడం చాలా నార్మల్.పోనీ గట్టిగా మందలించి చెల్లెల్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తే...అలా చేస్తే... చెల్లెలు సంతోషంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉందా?అలాగని ఒకసారి మోసం చేసిన వాడికే మళ్లీ అవకాశం ఇస్తే...ఇంకోసారి మోసం చెయ్యకుండా ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలమా?రెండూ నీ చేతిలో లేవు..‘ఏంటి సార్? సింపుల్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వండని అడిగితే... సాంతం క్లాసు పీకేస్తున్నారేంటి సార్?’లేదు నీలూ!!నిర్ణయం తీసుకోవాల్సింది చెల్లెలే.
ఓన్లీ షీ నోస్... వాడు ప్రాయశ్చిత్తంతో తిరిగి వచ్చాడా లేదా అన్నది. ఓన్లీ షీ కెన్ డిసైడ్!!‘ఏడిసినట్లు ఉంది సార్! ఇక అడ్వైజ్ కోసం మీకు ఉత్తరం రాయడం దేనికి? ఆ అన్నచెల్లెళ్లే ఉత్తరాలు రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కదా సార్? ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్!!’నీలూ..! చెల్లెలు కొన్ని రోజులు ప్రేమ, రొమాన్స్, పెళ్లి లాంటి విషయాల నుండి దూరముంటే.. తనకే క్లారిటీ వస్తుంది. ఏదో వెనక్కి వచ్చాడు కాబట్టి.....‘సార్...! నేను చెబుతాను ఆగండి. వెనక్కి వచ్చాడు కాబట్టి మనం వెనక్కి పరిగెత్తుకునిపోతే కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది. అదీగాక ఇదేమైనా చిన్న విషయమా? లైఫ్ డెసిషన్..! తొందర పడకుండా తీసుకోవాల్సిన నిర్ణయం..!! రామ్ గారి చెల్లెమ్మా.. ప్లీజ్ వెయిట్!’
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Mar 13 2019 1:31 AM | Last Updated on Wed, Mar 13 2019 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment