లవ్‌ డాక్టర్‌ | love doctor priyadarshini ram | Sakshi
Sakshi News home page

లవ్‌ డాక్టర్‌

Oct 16 2017 2:32 AM | Updated on Oct 16 2017 2:32 AM

love doctor priyadarshini ram

హాయ్‌ సర్‌! మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ, మీరు లవ్‌ డాక్టర్‌ అని అర్థమైంది. నా వయసు 27. ఇప్పటికీ సింగిల్‌. నాకు ఇప్పుడు లవ్‌ చెయ్యాలనిపిస్తోంది? ఎలా అవుతాది? నాకు టైమ్‌ ఉండటం లేదు.. లవ్‌ ట్రిక్స్‌ ఏమైనా చెప్పండి లవ్‌ డాక్టర్‌ గారూ..! – విస్సు

‘సార్‌.. అయిపోయింది సార్‌...!’ ఏమయిపోయింది నీలూ..? ‘విస్సు పసిగట్టేశాడు సార్‌!’ ఎవడా విస్సు.. ఏంటా పసిగట్టింది? ‘అయిపోయింది సార్‌.. మిమ్మల్ని అర్థం చేసేసుకున్న ఫస్ట్‌ పర్సన్‌ విస్సు సార్‌!’ ఎవడా విస్సూ... ఏమి అర్థం చేసుకున్నాడు? ‘మీరేమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని పసిగట్టేసాడు సార్‌!!’ లవ్‌ అందరికీ అర్థం కాదు.. దానికి మైండ్‌ సరిగ్గా పని చెయ్యాలి!!

‘మైండా సార్‌.. హార్ట్‌ కాదా!?’ బుర్ర బొందయితే హార్ట్‌ గొయ్యి అవుతుంది!! ‘కుర్ర బుర్రకి కొన్ని ట్రిక్కులు కావాలంట సార్‌ ప్రేమలో పడటానికి..!’ విస్సు మహారాజుకి కింగ్‌ లాంటి ట్రీట్మెంట్‌ చేస్తే పడతాడు!
‘అలా ఎలా సార్‌?’ సినిమాల్లో చూడ్లా... రాజులు నడుస్తుంటే కాళ్ల కింద పూలు జల్లుతూ ఉంటారు అలా...! ‘మరి ఇప్పుడేమి చెయ్యాలి సార్‌?’ నువ్వు డజన్‌ అరటిపండ్లు తిని.. వాటి తొక్కలు మహారాజశ్రీ.. రాజరాజశ్రీ.. విస్సు గారి కాళ్ల కింద జల్లు! ‘జారి పడతాడు సార్‌! ‘ప్రేమలో పడాలి’ అని అడుగుతున్నాడు కదా!’ ప్రేమంటే అదే నీలాంబరీ..! దాంట్లో అడిగి పడరు!! అడుగేసీ పడరు!! జారి పడతారు.. అదే లవ్‌ ట్రిక్‌!

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement