నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! ఐయామ్ స్టడీయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్! ఐయామ్ ఇన్ లవ్ విత్ ఏ గర్ల్ సిన్స్ త్రీ ఇయర్స్. షీ టాక్స్ టు మి నైస్‌లీ. బట్, ఐ డోంట్ నో ఇఫ్ షీ లవ్స్ మి ఆర్ నాట్! దిస్ ఈజ్ మై ఫైనల్ ఇయర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రపోజ్ హర్!? బట్, ఐ హేవ్ ఎ డౌట్ దట్ ఇఫ్ షి రిజెక్ట్స్, అవర్ ఫ్రెండ్‌షిప్ విల్ ఆల్‌సో బి గాన్!? సో, సజెస్ట్ మి విత్ సమ్ గుడ్ ఐడియా? – చందు
ఐ థింక్ యూ షుడ్ రాదర్ నాట్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్.ఫర్ ఆల్ ది అఫెక్షన్ యూ హావ్ ఫర్ హెర్ విల్ సడన్లీ టర్న్ వెరీ సోర్, బిట్టర్, అసార్బిక్, కాస్టిక్ ఇఫ్ షీ రిజెక్ట్స్ యూ. లవ్ ట్రూలీ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ వెన్ నాట్ ఎక్స్‌ప్రెస్డ్. వెన్ నాట్ టెస్టెడ్. వెన్ నాట్ వెర్బలైజ్డ్.
వెన్ నాట్ యానిమేటెడ్. లవ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రిస్టైన్ బ్యూటీ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ టైట్లీ వితిన్ యువర్ హార్ట్. అన్‌సెడ్. అన్‌టోల్డ్.. సీక్రెట్ లవ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ టింజ్ ఆఫ్ కలర్ లేయర్డ్ ఇన్ ఎ హింట్ ఆఫ్ పెయిన్ అండ్ ఎ టచ్ ఆఫ్ యాంటిసిపేషన్.
‘సార్.. మీరు బోర్డు తిప్పకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ ఒక్క ఉద్వేగభరిత ఆన్సర్‌తో మీ ఉద్యోగం ఖతం!’ వై?‘తెలుగు పేపర్లో ఎవరూ చెయ్యని అపచారం చేశారు సార్...’ వాట్? ‘ఎహే!! ఇంకా ఆ ఇంగిలీపీసు ఏంటి సార్.. తెలుగు పేపర్‌లో ఇంగ్లీష్ ఆన్సర్ ఇస్తే హాం ఫట్.. ఖతం... మీ జాబ్ గాన్ సార్!’ ఇంగ్లిపీస్‌లో క్వశ్చన్ వస్తే తెలుగులో ఆన్సర్ చెబితే బ్రోకి ఎలా అర్థం అవుతుంది.
‘సార్.. మీరు రాసే సొల్లు ఆన్సర్లు తెలుగు ప్రేమికులు కూడా చదువుతారు కదా సార్..’ వాట్ షుడ్ ఐ డు నౌ.. టెల్ మీ.. ఐ సే టెల్ మీ!! ‘క్వశ్చన్ ఆన్సర్ రెండు తెలుగులో చెబితే ప్రాయశ్చిత్తం కలగొచ్చు.. నేను కూడా రికమెండ్ చేస్తా... మీ ఉద్యోగం తీయొద్దని... ఓకే!?’ ఇష్టపడ్డాడు.. అమ్మాయికి తెలియదు.. ఇప్పుడు చెప్పకపోతే మళ్లీ చెప్పలేడు.. చెబితే.. చీకొడితే ఆ అవమానంతో బతకలేడు.. ఏమి చెయ్యాలి అని అడిగాడు.. ‘మీరు ఏమి చెప్పారు..?’ మూసుకుని పెట్టుకో అని చెప్పా! ‘వై సర్!?’ అంతా పెంట అయిపోతుందని అలా చెప్పా! ‘మరి అమ్మాయికి ఎలా తెలియాలి?’లవ్ డాక్టర్ చదువుతుందిలే...! ‘శహభాష్ సార్.. మీ ఉద్యోగం కంటిన్యూ.. వాడి లవ్ కంటిన్యూ.. ఇంద అరటిపండు!!