గుడ్ మార్నింగ్ ఇదొక అందమైన మార్నింగ్
పదేళ్ల క్రితం..దాదాపు పదివేలమంది కలిసినాటిన మొక్క ఇది! పదివేలమంది కలం కత్తులతో కవాతు చేసిన రోజు అది! పదివేల మంది దశ దిశలా..సత్యాన్ని పతాకంలా ఎగరేసిన రోజు అది!పదివేలమంది యాభై ఆరు అక్షరాలతోఒక కొత్త విప్లవాన్ని అచ్చుగుద్దిన రోజు అది!పదివేలమంది ఒక నాణేన్ని రెండో వైపు తిప్పి చూపిన రోజు అది!పదివేలమంది.. తెలుగు ఇళ్లలో..క్షేమం, ధైర్యం, ఆరోగ్యం, ఆనందం,చైతన్యంపంచిన రోజు అది!పదివేలమంది అక్షర సేద్యానికి స్వరూపంఈ ‘సాక్షి’ వృక్షం!! ఆ.. సత్యవృక్షానికి ఇవిగో.. కొన్ని ఫ్యామిలీ, కొన్ని ఫన్‌డే ఫలాలు. ఇదొక అందమైన మార్నింగ్!
స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది.
ఈ పదేళ్లలో సాక్షి ఫ్యామిలీలో వచ్చిన ఫీచర్స్ అన్నీ పాఠకుల మనసులను, బుద్ధిని ఊరించేలా చేసినవే. ఒకటి కాదు... రెండు చాలదు.. మూడు నిలవదు... అన్నట్టుగా పదులు వందల సంఖ్యలో విశేష వ్యాసాలు, శీర్షికలు ఈ పదేళ్లలో ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు అందించింది. అప్పటి వరకూ ఇతర దినపత్రికల్లో ఫీచర్ పేజీలకు విడివిడిగా పేర్లు ఉండే సంప్రదాయాన్ని కాదని సాక్షి మొత్తం ఫీచర్ పేజీలకు ‘ఫ్యామిలీ’ అనే పేరు ఇవ్వడం మొదటి ఆకర్షణగా నిలిచింది. అవును. ఫీచర్ పేజీలో కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అలరించాలనే ఉద్దేశంతో ఈ పేజీల రూపకల్పన జరిగింది. స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది. సాక్షి పాఠకులు అందించిన ఆర్థిక సహాయంతో ఎందరో అసామాన్య మహిళలు లబ్ధి పొందగలిగారు. కళాకారిణులు, సంఘ సేవికలు, భర్తను కోల్పోయినవారు, భర్త లేదా సంతానం అనారోగ్యంతో పోరాడుతుంటే ఇంటిని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే స్త్రీలు... వీరందరి కథనాలు సాక్షిలో వచ్చి వారికి సాయం అందడం మరువలేని, సంతృప్తినిచ్చే సంగతి.
భాషా వికాసం కోసం ఇచ్చిన ఇంగ్లిష్ పాఠాలు ముఖ్యమైనవి. స్త్రీ ఆరోగ్యం కోసం ఇచ్చిన ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్ పొందిన ప్రతిస్పందనను ఎలా మర్చిపోతాం? ‘పింక్ చెడ్డీ’ ఉద్యమం నుంచి మొన్నటి ‘మీటూ’ ఉద్యమం వరకు స్త్రీల ప్రగతిశీల భావధారలో భాగం అవుతూ సాక్షి తన వంతుగా ఒక నెలరోజుల పాటు ఇటీవల స్వీకరించిన ‘నేను శక్తి’ ఉద్యమం, ఆ ఉద్యమానికి ఫ్యామిలీ పేజీలు ప్రదర్శించిన అంకితభావం పాఠకుల మన్ననలు పొందటం ఆనందకరం. అయితే స్త్రీ అంటే సౌందర్యం కూడా. ఆ సౌందర్యాభిలాషను తీర్చేలా ఫ్యామిలీలో ఇచ్చిన ‘ఫ్యాషన్’ పేజీలు, ‘బ్యూటీ’, ‘ఫిట్‌నెస్’, ‘యోగా’ పేజీలు పెద్ద సక్సెస్ సాధించాయి. ఆధ్యాత్మికం కోసం ‘సన్నిధి’, భ్రమణకాంక్షను తీర్చే ‘ఫ్లెమింగో’, వంటింటి రుచుల కోసం ‘వంటలు’, వ్యక్తులలోకి ‘నేను’గా అంతర్యానం... అంతర్ బాహిర్ ఆసక్తులను నెరవేర్చాయి.
కుటుంబం మూఢ విశ్వాసాల బారిన పడకుండా నిర్వహించిన ‘చేతనబడి’ ఒక ముఖ్యమైన శీర్షిక. క్రైమ్ బారిన పిల్లలు పడకుండా చేతన కలిగించే ‘క్రైమ్ అండ్ పేరెంటింగ్’ మరో ముఖ్యమైన శీర్షిక.ఇక ప్రతి తెలుగు కుటుంబాలకు సాక్షి ఫ్యామిలీ పేజీలు కౌన్సెలింగ్ శీర్షికలతో చేసిన సేవ కూడా సామాన్యమైనది కాదు. డైలీ హెల్త్ కౌన్సెలింగ్‌లు ప్రముఖంగా ఇవ్వడమే కాదు లీగల్ కౌన్సెలింగ్, ట్రావెల్ కౌన్సెలింగ్, లైంగిక విషయాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ముఖ్యమైన కంట్రిబ్యూషన్.సాహిత్యాన్ని పట్టించుకున్న ఘనత కూడా తెలుగు దినపత్రికల్లో సాక్షి ఫ్యామిలీకే దక్కింది. అనువాద కథలు డైలీ పేజీలలో ప్రచురించడం సాక్షి ఫ్యామిలీయే మొదలెట్టింది. తెలుగు కథకు నూరేళ్లు నిండిన సందర్భంగా ప్రతిరోజూ ఒక కథను ‘రీటోల్డ్’ చేయడం ఒక పెద్ద ఘనత. అలాగే మెట్రో జీవనాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన ‘మెట్రో కథలు’, ప్రధాన నగరాల జీవన వైవిధ్యతకు అద్దం పట్టిన ‘గ్రేట్ సిటీస్’ పాఠకాదరణ పొందాయి. ఇటీవల రోజుకొక స్త్రీల కథలు ప్రచురించడం కూడా పాఠకులలో సాక్షి పట్ల గౌరవం పెంచింది.సినిమా పేజీలు ఎప్పుడూ సాక్షి ఫ్యామిలీ స్కోరింగే. డైలీ అప్‌డేట్స్, ఆన్ లొకేషన్ మాత్రమే కాదు ‘పసిడి తెర’, ‘బాలీవుడ్ క్లాసిక్స్’, ‘మల్టీప్లెక్స్’ వంటి శీర్షికలతో సినీ అభిమానులను ఆకట్టుకుంది.
కొత్తగా ఆరంభమైన దినపత్రిక ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి.
– డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
‘సాక్షి’ ఆవిర్భావ సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, సాక్షి వ్యవస్థాపక ఛైర్మన్ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment