women employee
-
కాగితం కళ: పేపర్ సూపర్
‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్‌ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేమ్‌లు... మొదలైనవి తయారు చేస్తోంది.‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్‌వర్క్‌కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది. ఎంతో ఇచ్చింది...చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.– మేడా రజని– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం -
‘శాడిస్ట్ బాస్‌కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్‌తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో.. రెస్టారెంట్‌లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్‌కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్‌కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి!
న్యూఢిల్లీ: కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు. ఇంటి నుంచి పని, ఉన్న చోట నుంచే పని, ఇల్లు, కార్యాలయాల నుంచి పనికి వీలు కల్పించే హైబ్రిడ్ నమూనాలను అనుసరించే కంపెనీలు.. మహిళల నుంచి ఎక్కువగా ఉద్యోగ దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపాయి. ఈ పరిణామంతో కొన్ని కంపెనీల్లో స్త్రీ/పురుష ఉద్యోగుల సమానత్వం/వైవిధ్యం పరంగా మెరుగుదల కనిపిస్తోంది. ఆర్పీజీ గ్రూపు పరిధిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో మహిళలు 15–20 శాతం పెరిగారు. దీనివల్ల తాము లింగ వైవిధ్య లక్ష్యాలను త్వరగా చేరుకోవడం సాధ్యపడుతుందని ఆర్పీజీ గ్రూపు భావిస్తోంది. ‘‘మా రిమోట్ పని విధానం ఎంతో మంది మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంది. దాంతో వారు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకుంటున్నారు’’అని ఆర్పీజీ గ్రూపు చీఫ్ టాలెంట్ ఆఫీసర్ సుప్రతిక్ భట్టాచార్య తెలిపారు. ముంబైకి చెందిన ఆర్పీజీ గ్రూనపు ఉద్యోగులను వారి విధుల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించింది. కొన్ని కేటగిరీల్లోని వారికి 50 శాతం సమయాన్ని ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. కొన్ని కేటగిరీల్లో నూరు శాతం ఉన్న చోట నుంచే పనిచేసేందుకు అనుమతిస్తోంది. స్పష్టమైన మార్పు.. విద్యా సంబంధిత టెక్నాలజీ యూనికార్న్ ఎరూడిటస్.. గ్రూపు పరిధిలోని అన్ని స్థాయిల్లో కరోనాకు ముందు మహిళలు 41 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 51 శాతానికి పెరిగారు. అదే మధ్య స్థాయి ఉద్యోగాల్లో అయితే 37 శాతంగా ఉన్న మహిళలు 47 శాతానికి చేరారు. ‘‘నూరు శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లిన తర్వాత గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని మహిళలు సైతం ఇప్పుడు ముందుకు వస్తున్నారు’’అని ఎరూడిటస్ సీఈవో అశ్విన్ దామెర తెలిపారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఈ విధానం మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. హెచ్ఆర్ టెక్నాలజీ స్టార్టప్ అయిన ‘స్ప్రింగ్‌వర్క్స్’ నూరు శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ సంస్థలో మహిళా ఉద్యోగులు 30 శాతం నుంచి 35 శాతానికి పెరిగారు. ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు కల్పించడం వల్ల టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి నిపుణుల సేవలను పొందగలిగినట్టు యాక్సిస్ బ్యాంకు సైతం తెలిపింది. లేదంటే ఈ అవకాశం ఉండేది కాదని పేర్కొనడం గమనార్హం. -
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! ఆఫీస్‌కు మగాళ్లను పంపాలని ఆదేశం
కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. 'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు. గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు -
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
మెదక్ జిల్లాలో దారుణం.. మహిళా ఉద్యోగితో అనుచిత ప్రవర్తన
సాక్షి, మెదక్: తెలంగాణలో ఏదో ఒక చోట మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లాలో కింది స్థాయి ఉద్యోగినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఐసీడీఎస్‌లో (ICDS) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జయరాం నాయక్.. కింది స్థాయి మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. కాగా, బాధితురాలు ICDSలో కాంట్రాక్టు జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రతీ సంవత్సరం మార్చి నెలతో కాంట్రాక్ట్ ముగుస్తుండటంతో మళ్లీ రెన్యూవల్ చేస్తారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కూడా జాబ్ పొడగింపు కోసం లెటర్‌పైన సంతకం కావాలని సదరు మహిళ కోరింది. ఈ సందర్భంగా జయరాం నాయక్.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో ఓ రాత్రి గడిపితే సంతకం పెడతానని అనడంతో బాధితురాలు ఒక్కసారిగా షాకైంది. దీంతో ఈ విషయం గురించి పైఅధికారులకు ఫిర్యాదు చేసినా వారి పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులు బాధితురాలిపై బదిలీ వేటు వేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మెదక్ జిల్లాలోని నాగపూర్ సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ ఉమారాణిని సీఈవో శ్రీకాంత్ వేధింపులకు గురిచేశాడు. ఆమెను ఏడుపాయలకు రమ్మని, అక్కడ తాను రూమ్ బుక్చేస్తానంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మరువకముందే ఇలా మరో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: సుమతిపై అనుమానం పెంచుకున్న భర్త.. ఏం చేశాడంటే..? -
మహిళా ఉద్యోగి ఆత్మహత్య: ఎయిర్‌ఫోర్స్ చీఫ్ రాజీనామా
సియోల్ : ఓ మహిళా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాజీనామాకు దారితీసింది. ఉద్యోగి మరణానికి బాధ్యత వహిస్తూ.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పురుష సహోద్యోగి లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా మాస్టర్ సార్జంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దీంతో జనరల్ లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్... జనరల్ లీ రాజీనామాను ఆమోదించారు. కాగా, మహిళా సార్జంట్ వేధింపులకు సంబంధించి ఓ ఎయిర్ ఫోర్స్ మాస్టర్ సార్జంట్‌ను అరెస్ట్ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. మార్చి నెలలో సదరు నిందితుడు కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఉన్నతాధికారులు ఈ సంఘటనను బయటకు రాకుండా చూడ్డానికి ప్రయత్నించారని, నిందితుడితో ప్రైవేటు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితురాలపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి కుటుంబం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె మే నెలలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ప్రెసిడెన్షియల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేసును తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారులకు శిక్ష విధించాలంటూ శుక్రవారం మధ్యాహ్నం 34వేలకు పైగా మంది ఆ పిటిషన్‌పై సంతకం చేశారు. దీనిపై ప్రెసిడెంట్ మూన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగిని పై దాడి
-
కాంట్రాక్ట్ ఉద్యోగిని రోజాపై దాడి
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ దాడికి ఒడిగట్టాడు. గతంలో రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని చేశాడు. ఆ సమయంలో రోజా జూనియర్ అసిస్టెంట్ అయిన రామకృష్ణ కింద పని చేసేవారు. గత ఏడాది రామకృష్ణ పదోన్నతిపై బోధన్ మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళాడు. బదిలీపై వెళ్లిన నుంచి తరచుగా రామకృష్ణ రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలిసింది. గత నెల రోజులుగా రామకృష్ణ ఫోన్ చేసిన రోజా స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రామకృష్ణ సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రోజాపై దాడి చేశాడు. (బయటపడుతున్న రెవెన్యూ లీలలు!) అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. ఈ దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయం అయింది. వెంటనే రోజాను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రోజా ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను దాడి చేసే దృశ్యాలు స్థానికులు ఫోన్లో రికార్డు చేశారు. అతని తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దివ్యాంగురాలిపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మహిళా ఉద్యోగి అని కూడా చూడలేదు.. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేదు. ఆవేశంతో మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ దాడి చేశాడు. కార్యాలయ సిబ్బంది అతడ్ని నిలువరించేందుకు యత్నించినా దాడి కొనసాగించాడు. చివరికి సిబ్బంది గట్టిగా ప్రయత్నించి ఆపారు. నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కేసు నమోదు చేసి డిప్యూటీ మేనేజర్‌ను అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. మాస్క్ ధరించాలని సూచించడమే నేరం పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు కొండాయపాళెం గేట్ సమీపంలోని మిలటరీకాలనీలో చెరుకూరు ఉషారాణి, వీరగంధం హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. హరిబాబు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో బెంగళూరులో ఉంటున్నారు. దివ్యాంగురాలైన ఉషారాణి ఏపీ టూరిజం శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఆమె విజయవాడ నుంచి నెల్లూరు దర్గామిట్టలోని ఏపీ టూరిజం హోటల్‌కు బదిలీ అయ్యారు. అదే హోటల్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్ సుమారు ఏడు నెలల క్రితం ఆమె గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు భర్తకు తెలియజేశారు. దీంతో భాస్కర్‌ను హరిబాబు తీవ్రంగా మందలించారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ గత నెల 27న మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్‌తో మాట్లాడసాగాడు. గమనించిన ఉషారాణి కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్ ఆమెతో గొడవపడ్డాడు. కుర్చీలో ఉన్న ఆమె జట్టు పట్టుకొని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కుర్చీ హ్యాండిల్‌తో కొట్టడంతో ఆమె గాయపడ్డారు. అతికష్టంపై తోటి ఉద్యోగులు అతని బారినుంచి విడిపించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. బాధితురాలు దర్గామిట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ నిందితుడిపై దాడి, నిర్భయతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నిందితుడిని అదే రోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి మంగళవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.∙ఘటనపై మంత్రి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించి, నిందితుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. న్యాయం జరిగింది: ఉషారాణి దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాకు న్యాయం జరిగింది. మహిళలకు అండగా ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉషారాణితో మాట్లాడి జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులు పాల్గొన్నారు. దాడి ఘటనపై సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు ఇచ్చారని డీజీపీ తెలిపారు. మహిళలపై దాడులు సహించేది లేదు: హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మహిళలపై దాడులను సహించేది లేదని, తప్పుచేస్తే ఎంతటివారైనా చట్టం ముందు తల వంచాల్సిందేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి
సాక్షి, జనగామ: తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారికి ఓ మహిళా అధికారి చెప్పుతో బుద్ధి చెప్పారు. ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులు భరించలేక సహ మహిళా ఉద్యోగి చెప్పు తో కొట్టిన సంఘటన జనగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా అల్పసంఖ్యకుల సంక్షేమ శాఖలో (జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్) శ్రీనివాస్ అధికారిగా పని చేస్తున్నారు. అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌గా ఓ మహిళ ఉద్యోగి పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఆ మహిళా ఉద్యోగితో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాను చెప్పినట్టు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శ్రీనివాస్ తీరుతో విసుగు చెందిన ఆ మహిళా ఉద్యోగి విషయాన్ని స్థానిక నాయకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతను ఆఫీసుకెళ్లి నిలదీసి డీసీపీకి చెప్పుతానని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతను తన తీరును మార్చుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ఉద్యోగి కార్యాలయంలోనే శ్రీనివాస్‌ను చెప్పుతో కొట్టింది. అందరిముందు కొట్టడంతో చేసేది ఏమిలేక ఆమె కాళ్లపై పడి తాను తప్పుచేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే విషయం బయటకు రావడంతో అధికారి కీచక పర్వంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
మహిళా ఉద్యోగులు రెట్టింపు
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మాక్సిన్ విలియమ్స్ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు, లాటిన్ అమెరికన్ దేశస్తులు, దివ్యాంగులు మొదలైన వారు ఉండనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 36.9 శాతంగా ఉంది. గతేడాది ఇది 36.3 శాతం. సీనియర్ లీడర్షిప్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగింది. సాంకేతిక విభాగానికి సంబంధించి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23 శాతం మేర ఉన్నారు. -
కిలాడీ లేడీ!
సాక్షి, చెన్నై : తిన్నింటి వాసాలు లెక్కించిన ముత్తూట్ ఫైనాన్స్ మహిళా ఉద్యోగి కటకటాల పాలైంది. ప్రియుడితో కలిసి పక్కా పథకం రచించిన ఈ కిలాడీ లేడి పోలీసులకు ఇచ్చిన సమాచారం, తనను చితక్కొట్టినట్టుగా వ్యక్తం చేసిన ఆవేదన వెరసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. దీంతో ప్రియుడితో పాటుగా కిలాడీ ని కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో శనివారం దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు రూ. 2 కోట్ల విలువైన నగలు, నగదు చోరీకి గురైంది. అయితే ఒకే వ్యక్తి దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు పోలీసుల్నే విస్మయంలో పడేశాయి. వచ్చి రాగానే ఆ వ్యక్తి తనను చితక్కొట్టినట్టుగా, స్పృహ తప్పినట్టుగా అక్కడి మహిళా ఉద్యోగి రేణుకాదేవి(24) ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణను మొదలెట్టారు. తొలుత ఓ క్లీనిక్‌లో ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో రేణుకాదేవి అడ్మిట్ అయినా, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తేల్చారు. ఇది పోలీసుల అనుమానానికి బలం చేకూర్చింది. అలాగే తనపై దాడి చేసి బంగారాన్ని అపహరించుకుని వెళ్లిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా ఆమె పేర్కొనడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అయితే ఓ చోట సీసీ కెమెరాలో దోపిడికి పాల్పడ్డ వ్యక్తి ఆటోలో వెళ్లడం కనిపించింది. డ్రైవర్‌ను విచారించగా అతడు స్పష్టమైన తమిళంలో మాట్లాడినట్టు పేర్కొనడం పోలీసుల అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో రేణుకాదేవిని తమదైన స్టైల్లో మహిళా పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి వేసిన స్కెచ్ బయట పడింది. పథకం ప్రకారం...అన్ని సక్సెస్ ఫైనాన్స్ సంస్థలో ఏ మేరకు నగలు ఉన్నాయి, శనివారం రద్దీ వివరాలను ముందుగానే తన ప్రియుడు ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన సురేష్(30)కు రేణుకాదేవి చేరవేసింది. ఆ రోజు విధుల్లో తనతో పాటుగా దివ్య కూడా ఉండడంతో పథకం ప్రకారం సాయంత్రం 3 గంటల తర్వాత నిద్ర మాత్రల్ని కాఫీలో కలిపి ఆమెకు ఇచ్చింది. దీంతో దివ్య పక్కనే ఉన్న గదిలో నిద్రకు ఉపక్రమించగా, తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా ప్రియుడికి డైరెక్షన్ ఇచ్చింది. అతడు ఉన్నది దోచుకున్నట్టు చేసింది. తాను స్పృహ తప్పినట్టుగా పడి పోవడం, గంట తర్వాత లేచి కేకలు పెట్టడం, ఇది విన్న దివ్య భయంతో పరుగున రావడం, ఆ పరిసర వాసులు చేరుకోవడం చోటు చేసుకున్నాయి. పథకం ప్రకారం దోపిడిని విజయవంతం చేసిన రేణుకా దేవి, తనపై దాడి చేసినట్లుగా, కొట్టిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా పేర్కొని అడ్డంగా బుక్కయింది. కాగా సురేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకా దేవితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సురేష్ విలాసవంతంగా జీవించేందుకు ప్రియురాలితో కలిసి పథకం వేసి చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఈ ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు నగల్ని ఎక్కడ దాచి పెట్టారో విచారిస్తున్నారు. కాగా, సురేష్ తండ్రి నగల తయారీలో నిమగ్నమై ఉన్న దృష్ట్యా, ఆయన ద్వారా ఆ నగల్ని కరిగించే ప్రయత్నం చేసి ఉండవచ్చన్న కోనంలో విచారణ చేస్తున్నారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలతో వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు
-
పదేళ్లు... పదివేల ఆనందాలు
గుడ్ మార్నింగ్ ఇదొక అందమైన మార్నింగ్ పదేళ్ల క్రితం..దాదాపు పదివేలమంది కలిసినాటిన మొక్క ఇది! పదివేలమంది కలం కత్తులతో కవాతు చేసిన రోజు అది! పదివేల మంది దశ దిశలా..సత్యాన్ని పతాకంలా ఎగరేసిన రోజు అది!పదివేలమంది యాభై ఆరు అక్షరాలతోఒక కొత్త విప్లవాన్ని అచ్చుగుద్దిన రోజు అది!పదివేలమంది ఒక నాణేన్ని రెండో వైపు తిప్పి చూపిన రోజు అది!పదివేలమంది.. తెలుగు ఇళ్లలో..క్షేమం, ధైర్యం, ఆరోగ్యం, ఆనందం,చైతన్యంపంచిన రోజు అది!పదివేలమంది అక్షర సేద్యానికి స్వరూపంఈ ‘సాక్షి’ వృక్షం!! ఆ.. సత్యవృక్షానికి ఇవిగో.. కొన్ని ఫ్యామిలీ, కొన్ని ఫన్డే ఫలాలు. ఇదొక అందమైన మార్నింగ్! స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది. ఈ పదేళ్లలో సాక్షి ఫ్యామిలీలో వచ్చిన ఫీచర్స్ అన్నీ పాఠకుల మనసులను, బుద్ధిని ఊరించేలా చేసినవే. ఒకటి కాదు... రెండు చాలదు.. మూడు నిలవదు... అన్నట్టుగా పదులు వందల సంఖ్యలో విశేష వ్యాసాలు, శీర్షికలు ఈ పదేళ్లలో ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు అందించింది. అప్పటి వరకూ ఇతర దినపత్రికల్లో ఫీచర్ పేజీలకు విడివిడిగా పేర్లు ఉండే సంప్రదాయాన్ని కాదని సాక్షి మొత్తం ఫీచర్ పేజీలకు ‘ఫ్యామిలీ’ అనే పేరు ఇవ్వడం మొదటి ఆకర్షణగా నిలిచింది. అవును. ఫీచర్ పేజీలో కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అలరించాలనే ఉద్దేశంతో ఈ పేజీల రూపకల్పన జరిగింది. స్త్రీ సాధికారత, ఉపాధి, జీవన సంఘర్షణ, అనుబంధాల ఘర్షణ, వివాహం, పిల్లల పెంపకం... వీటన్నింటినీ సాక్షి విస్తృతంగా చర్చించింది. అంతేకాదు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న స్త్రీలను పాఠకుల దృష్టికి తెచ్చి వారికి ఆర్థిక సహాయం అందడానికి ఒక వాహికగా నిలిచింది. సాక్షి పాఠకులు అందించిన ఆర్థిక సహాయంతో ఎందరో అసామాన్య మహిళలు లబ్ధి పొందగలిగారు. కళాకారిణులు, సంఘ సేవికలు, భర్తను కోల్పోయినవారు, భర్త లేదా సంతానం అనారోగ్యంతో పోరాడుతుంటే ఇంటిని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే స్త్రీలు... వీరందరి కథనాలు సాక్షిలో వచ్చి వారికి సాయం అందడం మరువలేని, సంతృప్తినిచ్చే సంగతి. భాషా వికాసం కోసం ఇచ్చిన ఇంగ్లిష్ పాఠాలు ముఖ్యమైనవి. స్త్రీ ఆరోగ్యం కోసం ఇచ్చిన ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్ పొందిన ప్రతిస్పందనను ఎలా మర్చిపోతాం? ‘పింక్ చెడ్డీ’ ఉద్యమం నుంచి మొన్నటి ‘మీటూ’ ఉద్యమం వరకు స్త్రీల ప్రగతిశీల భావధారలో భాగం అవుతూ సాక్షి తన వంతుగా ఒక నెలరోజుల పాటు ఇటీవల స్వీకరించిన ‘నేను శక్తి’ ఉద్యమం, ఆ ఉద్యమానికి ఫ్యామిలీ పేజీలు ప్రదర్శించిన అంకితభావం పాఠకుల మన్ననలు పొందటం ఆనందకరం. అయితే స్త్రీ అంటే సౌందర్యం కూడా. ఆ సౌందర్యాభిలాషను తీర్చేలా ఫ్యామిలీలో ఇచ్చిన ‘ఫ్యాషన్’ పేజీలు, ‘బ్యూటీ’, ‘ఫిట్నెస్’, ‘యోగా’ పేజీలు పెద్ద సక్సెస్ సాధించాయి. ఆధ్యాత్మికం కోసం ‘సన్నిధి’, భ్రమణకాంక్షను తీర్చే ‘ఫ్లెమింగో’, వంటింటి రుచుల కోసం ‘వంటలు’, వ్యక్తులలోకి ‘నేను’గా అంతర్యానం... అంతర్ బాహిర్ ఆసక్తులను నెరవేర్చాయి. కుటుంబం మూఢ విశ్వాసాల బారిన పడకుండా నిర్వహించిన ‘చేతనబడి’ ఒక ముఖ్యమైన శీర్షిక. క్రైమ్ బారిన పిల్లలు పడకుండా చేతన కలిగించే ‘క్రైమ్ అండ్ పేరెంటింగ్’ మరో ముఖ్యమైన శీర్షిక.ఇక ప్రతి తెలుగు కుటుంబాలకు సాక్షి ఫ్యామిలీ పేజీలు కౌన్సెలింగ్ శీర్షికలతో చేసిన సేవ కూడా సామాన్యమైనది కాదు. డైలీ హెల్త్ కౌన్సెలింగ్‌లు ప్రముఖంగా ఇవ్వడమే కాదు లీగల్ కౌన్సెలింగ్, ట్రావెల్ కౌన్సెలింగ్, లైంగిక విషయాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ముఖ్యమైన కంట్రిబ్యూషన్.సాహిత్యాన్ని పట్టించుకున్న ఘనత కూడా తెలుగు దినపత్రికల్లో సాక్షి ఫ్యామిలీకే దక్కింది. అనువాద కథలు డైలీ పేజీలలో ప్రచురించడం సాక్షి ఫ్యామిలీయే మొదలెట్టింది. తెలుగు కథకు నూరేళ్లు నిండిన సందర్భంగా ప్రతిరోజూ ఒక కథను ‘రీటోల్డ్’ చేయడం ఒక పెద్ద ఘనత. అలాగే మెట్రో జీవనాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన ‘మెట్రో కథలు’, ప్రధాన నగరాల జీవన వైవిధ్యతకు అద్దం పట్టిన ‘గ్రేట్ సిటీస్’ పాఠకాదరణ పొందాయి. ఇటీవల రోజుకొక స్త్రీల కథలు ప్రచురించడం కూడా పాఠకులలో సాక్షి పట్ల గౌరవం పెంచింది.సినిమా పేజీలు ఎప్పుడూ సాక్షి ఫ్యామిలీ స్కోరింగే. డైలీ అప్డేట్స్, ఆన్ లొకేషన్ మాత్రమే కాదు ‘పసిడి తెర’, ‘బాలీవుడ్ క్లాసిక్స్’, ‘మల్టీప్లెక్స్’ వంటి శీర్షికలతో సినీ అభిమానులను ఆకట్టుకుంది. కొత్తగా ఆరంభమైన దినపత్రిక ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు సాక్షిలా నిలబడాలి. – డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ ఆవిర్భావ సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, సాక్షి వ్యవస్థాపక ఛైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి -
అధ్యక్షుడే లక్ష్యంగా.. ప్లాన్ ప్రకారమే చేశా..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడిన విషయం తెలిసిందే. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ లక్ష్యంగానే పదే పదే మధ్య వేలు చూపించానంటోన్న బ్రిస్క్‌మ్యాన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. కావాలనే అలా చేశాను 'గత అక్టోబర్ 28న తన కాన్వాయ్‌లో ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నేను అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తున్నాను. కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే నా ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపించాను. ఎందుకంటే.. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో నా రక్తం మరిగిపోతోంది. ముఖ్యంగా కొన్ని రోజుల ముందు హెల్త్ పాలసీ, తదితర కీలకాంశాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చిరాకు తెప్పించాయి. ఆరోజు ట్రంప్ గోల్ఫ్ కోర్టుకు వస్తారని తెలిసి ఆ దారిలో ఎదురుచూశాను. సరైన సమయంలో నా నిరసనను అలా తెలిపాను. అయితే మీడియాతో పాటు వైట్‌హౌస్ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మాన్ 'నేను వేలు చూపిస్తున్న ఫొటోను' సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నాపేరు మార్మోగిపోయింది. గోల్ఫ్ కోర్టుకు వెళ్లినప్పుడల్లా దీని గురించి అందరూ చర్చించుకోవాలి. రెండ్రోజుల తర్వాత నా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఆ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా అప్డేట్ చేశాను. ఆ తర్వాత వివాదం పెద్దదవుతుందని భావించి జాతీయ మానవహక్కుల సంస్థకు వెళ్లి ఓ ఉద్యోగిని కలిశాను. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా వేలు చూపించిన మహిళ ఎవరో తెలుసా అని అడిగాను. తెలియదని వారు చెప్పగా.. మీరు వెతుకుతున్న ఆ మహిళను నేనేనంటూ వెల్లడించాను. అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు తమకు రావన్న భయంతో అకీమా అనే కాంట్రాక్టర్ తన వద్ద ఆరునెలలుగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయాలన్నారు. చేసేదేంలేక జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. సోషల్ మీడియాలో తన చర్యను అందరూ మెచ్చుకుంటున్నారని, ట్రంప్ పాలనపై వ్యతిరేకత ఉందనడానికి ఇది నిదర్శనమని' బాధితురాలు బ్రిస్క్‌మ్యాన్ వివరించారు. -
అధ్యక్షుడికి అసభ్య సంకేతం.. జాబ్ ఊడింది!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్లో అధిక సమయం గడుపుతారని ఆయనపై విమర్శలున్నాయి. వర్జీనియాలోని తన నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గడపటం అలవాటుగా చేసుకున్న ట్రంప్.. గత నెలలో తన కాన్వాయ్‌లో గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న బ్రిస్క్‌మ్యాన్ అనే 50 ఏళ్ల మహిళ అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తోంది. ఆ కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే తన ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపింది. దీంతో అమెరికా మొత్తం ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. కాగా, బ్రిస్క్‌మ్యాన్ చేసిన చర్య వల్ల తమ సంస్థకు చెడ్డపేరొస్తుందని యాజమాన్యం భావించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతినకూదని భావించిన అకీమా అనే కాంట్రాక్టర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయగా.. మరో ఉద్యోగం కోసం బ్రిస్క్‌మ్యాన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. -
ఆ ఘటనతో నా భార్య వణికిపోతోంది..!
► నడిరోడ్డుపై కార్పొరేట్ ఉద్యోగినికి వేధింపులు ► సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి గుర్గావ్ : తన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణికిపోతోందని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. గుర్గావ్ లోని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ కు బుధవారం భార్యతో పాటుగా వెళ్లి ఆమె ఎదుర్కొన్న వేధింపుల ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇక్కడి 92 సెక్టార్ లో నివాసం ఉండే ఓ మహిళ స్థానిక కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోజులాగానే తన కారులో ఆఫీసుకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక తన కారు వెనుక మరో కారు పది నిమిషాల పాటు రావడాన్ని ఆమె గమనించారు. తొలుత వారు అడ్రస్ కోసం అడగాలని చూశారని భావించగా.. తన అంచనా తప్పని తేలిందని బాధితురాలు వాపోయారు. ఇద్దరు వ్యక్తులు 10 కిలోమీటర్ల దూరానికి పైగా తన కారును వెంబడించి అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు తమ కారు డోర్ తెరచి అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. భయాందోళనకు గురైన తాను భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పగా ఆయన సూచన మేరకు పోలీసులకు కాల్ చేసినట్లు వివరించారు. పోలీసులకు కాల్ చేసినట్లు గుర్తించిన నిందితులు అక్కడినుంచి వెంటనే వెళ్లిపోయారు. ఆఫీసుకు వెళ్లకుండా ఇంటికి వచ్చిన తన భార్య భయంతో వణికిపోతోందని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఉద్యోగిని భర్త చెప్పారు. భార్యతో పాటుగా 51 సెక్టార్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వేధింపుల ఘనపై స్టేషన్ అధికారిణి కైలాశ్ దేవికి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 డీ, 354 ఏ (వేధింపులు) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీల ఫుటేజీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. గత ఆగస్ట్ 6న సెక్టార్ 17లోని తన ఆఫీసుకు 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిని స్కూటర్ పై వెళ్తుండగా కొందరు కారులో వచ్చి ఆమెను వేధించిన విషయం తెలిసిందే. -
ఆధికార పార్టీ వేధింపులు తట్టుకోలేక..
-
వ్యక్తిగత ఫొటోలతో యువతిని బ్లాక్మెయిల్
హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ యువతిని ఆన్లైన్లో వేధిస్తున్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి కథనం ప్రకారం... బాధితురాలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సహోద్యోగి అయిన బి.దినేశ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని దినేశ్ కుమార్ చెప్పడంతో ఆమె నో చెప్పింది. అప్పటినుంచీ ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు సేకరించాడు. తనను ప్రేమించకుంటే ఆ వ్యక్తిగత ఫొటోలను తల్లిదండ్రులు, బంధువులకు పంపుతానంటూ బాధితురాలిని బెదిరించాడు. ఆమె లొంగకపోవటంతో పలు నంబర్ల నుంచి, పలు మెయిల్ ఐడీల నుంచి బాధితురాలి బంధువులకు ఫొటోలు పంపించాడు. తన ఫేస్బుక్ ఖాతా నుంచి కూడా ఆమె వ్యక్తిగత ఫొటోలను బాధితురాలి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులకు సెండ్ చేశాడు . దినేశ్ వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవటంతో రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం దినేశ్ ను హిమాయత్‌నగర్‌లో అదుపులోకి తీసుకుంది. పోలీసులు అతని వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా
- ఏసీబీకి చిక్కిన ఉద్యోగి వెల్లడి విజయవాడ సిటీ: రాష్ట్ర మంత్రి పీతల సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి, ఆమె కుటుంబ సభ్యుల ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానంటూ ఏసీబీకి పట్టుబడిన ఒక మహిళా ఉద్యోగి చెప్పడం కలకలం రేపింది. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా మహిళా, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ లంచం తన కోసం కాదని, మంత్రి పీతల ఖర్చుల కోసం వసూలుచేస్తున్నానంటూ ఏసీబీ విచారణలో చెప్పినట్లు సమాచారం. పైగా మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన ఒక డైరీని ఏసీబీ అధికారులకు చూపించారు. మంత్రి ఖర్చుల వివరాల డైరీని స్వాధీనం చేసుకుని, ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచారు. -
నోవాటెల్‌లో ఉద్యోగినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : శంషాబాద్ నోవాటెల్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. హోటల్లోని మహిళా ఉద్యోగినిపై ముంబయికి చెందిన ముఖేష్ అత్యాచారయత్నం చేశాడు. దాంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగిని తనపై అత్యాచారయత్నం జరిగిందని, హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'మనం గత జన్మ ప్రేమికులం'
హైదరాబాద్ : 'నువ్వు నాకు నచ్చావ్... నువ్వే కావాలి... నువ్వు లేక నేను లేను'...ఇవన్నీ సినిమా టైటిళ్లు అనుకుంటున్నారా...? కానే కాదు... ఇవి ఓ సాప్ట్వేర్ సంస్థ బిగ్ బాస్ తన ఉద్యోగినికి ఇస్తున్న మెసేజ్‌లు. మనం మగధీర సినిమాలోని హీరో హీరోయిన్లలాగ గత జన్మ ప్రేమికులమంటూ ఆమెను వశపర్చుకోవడానికి కూడా ఈ అంకుల్ నానా తంటాలు పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక సదరు సాప్ట్వేర్ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్‌నెం.2లోని అరోరా కాలనీలో డాట్స్ స్పైడర్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సాప్ట్వేర్ సంస్థ ఉంది. దీని ఎండీ చంద్ర సింగపూర్‌లో ఉంటుండగా ఆయన తండ్రి పరమేశ్వరరావు (56) ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. ఈ సంస్థలో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన యువతి (23) ఏడాది కాలం హెచ్ఆర్ మేనేజర్‌గా పని చేస్తోంది. మూడు నెలలుగా పరమేశ్వరరావు కన్ను ఆమెపై పడింది. ఆమెను లోబర్చుకోవాలని అసభ్యంగా మాట్లాడటంతో పాటు తన సెల్‌ఫోన్‌లోని అశ్లీల దృశ్యాలను చూపించి..ఎంజాయ్ చేయాలని వేధిస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను కారులో దింపుతానని, అందరూ చూస్తుండగానే బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకొనేందుకు యత్నిస్తున్నాడు. నానాటికీ పరమేశ్వరరావు వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు వారం క్రితం ఉద్యోగం మానేసింది. ధైర్యం తెచ్చుకుని సోమవారం పరమేశ్వరరావుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 354 (ఎ), 506, 507ల కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.