సాక్షి, మెదక్: తెలంగాణలో ఏదో ఒక చోట మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లాలో కింది స్థాయి ఉద్యోగినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. ఐసీడీఎస్‌లో (ICDS) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జయరాం నాయక్.. కింది స్థాయి మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. కాగా, బాధితురాలు ICDSలో కాంట్రాక్టు జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రతీ సంవత్సరం మార్చి నెలతో కాంట్రాక్ట్ ముగుస్తుండటంతో మళ్లీ రెన్యూవల్ చేస్తారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కూడా జాబ్ పొడగింపు కోసం లెటర్‌పైన సంతకం కావాలని సదరు మహిళ కోరింది.
ఈ సందర్భంగా జయరాం నాయక్.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తనతో ఓ రాత్రి గడిపితే సంతకం పెడతానని అనడంతో బాధితురాలు ఒక్కసారిగా షాకైంది. దీంతో ఈ విషయం గురించి పైఅధికారులకు ఫిర్యాదు చేసినా వారి పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులు బాధితురాలిపై బదిలీ వేటు వేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు మెదక్ జిల్లాలోని నాగపూర్ సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ ఉమారాణిని సీఈవో శ్రీకాంత్ వేధింపులకు గురిచేశాడు. ఆమెను ఏడుపాయలకు రమ్మని, అక్కడ తాను రూమ్ బుక్‌చేస్తానంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మరువకముందే ఇలా మరో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: సుమతిపై అనుమానం పెంచుకున్న భర్త.. ఏం చేశాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment