'మనం గత జన్మ ప్రేమికులం' | women employee harassed by Boss who sent lewd SMSes, files police complaint | Sakshi
Sakshi News home page

'మనం గత జన్మ ప్రేమికులం'

Published Tue, Feb 4 2014 8:36 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

'మనం గత జన్మ ప్రేమికులం' - Sakshi

'మనం గత జన్మ ప్రేమికులం'

హైదరాబాద్ : 'నువ్వు నాకు నచ్చావ్... నువ్వే కావాలి... నువ్వు లేక నేను లేను'...ఇవన్నీ సినిమా టైటిళ్లు అనుకుంటున్నారా...? కానే కాదు... ఇవి ఓ సాప్ట్వేర్ సంస్థ బిగ్ బాస్ తన ఉద్యోగినికి ఇస్తున్న మెసేజ్లు. మనం మగధీర సినిమాలోని హీరో హీరోయిన్లలాగ గత జన్మ ప్రేమికులమంటూ ఆమెను వశపర్చుకోవడానికి కూడా ఈ అంకుల్ నానా తంటాలు పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక సదరు సాప్ట్వేర్ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్నెం.2లోని అరోరా కాలనీలో డాట్స్ స్పైడర్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సాప్ట్వేర్ సంస్థ ఉంది. దీని ఎండీ చంద్ర సింగపూర్లో ఉంటుండగా ఆయన తండ్రి పరమేశ్వరరావు (56) ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు.

ఈ సంస్థలో కేపీహెచ్బీ కాలనీకి చెందిన యువతి (23) ఏడాది కాలం హెచ్ఆర్ మేనేజర్గా పని చేస్తోంది. మూడు నెలలుగా పరమేశ్వరరావు కన్ను ఆమెపై పడింది. ఆమెను లోబర్చుకోవాలని అసభ్యంగా మాట్లాడటంతో పాటు తన సెల్ఫోన్లోని అశ్లీల దృశ్యాలను చూపించి..ఎంజాయ్ చేయాలని వేధిస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను కారులో దింపుతానని, అందరూ చూస్తుండగానే బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకొనేందుకు యత్నిస్తున్నాడు. నానాటికీ పరమేశ్వరరావు వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు వారం క్రితం ఉద్యోగం మానేసింది. ధైర్యం తెచ్చుకుని సోమవారం పరమేశ్వరరావుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 354 (ఎ), 506, 507ల కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement