లక్ష్మణచాంద : మండలంలోని కూచన్‌పెల్లిలో మానసిక ఎదుగుదల లేని బాలిక (13)పై గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి లైంగి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 4వ తేదీన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలికతో ఓ వ్యక్తి ఆమెకు కిశోర బాలికల బియ్యం వచ్చాయని, అంగన్‌వాడీలో ఇస్తున్నారని, అందుకు ఆధార్ కార్డు తీసుకుని రావాలని చెప్పి ఆ బాలికను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు.
అనంతరం గ్రామ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తిరిగి ఇంటికి చేరుకున్న బాలికలో శారిరక మార్పుల పరిస్థితిని గమనించిన తల్లి బాలికను నిలదీయగా జరిగిన విషయం తల్లికి తెలిపింది. దీంతో ఆమె గ్రామంలోని వారిని సంప్రదించగా రహస్య ప్రదేశంలో పంచాయతీ నిర్వహించి బాలిక కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, బుధవారం గ్రామానికి ఇన్‌చార్జి ఎస్సై శాంతారంలో విచారణ చేపట్టారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఎస్సై శాంతారంను వివరణ కోరగా.. ఘటన విషయమై సమాచారం అందిందని, బాలిక కుటుంబసభ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో విచారణలో ఆలస్యమైందని తెలిపారు. ఫిర్యాదు అందలేదని వివరించారు.
బాలికపై లైంగికదాడి
Published Fri, Feb 27 2015 3:30 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement