కాంట్రాక్టు వర్కర్‌పై లైంగిక వేధింపులు
కాంట్రాక్టు వర్కర్‌పై లైంగిక వేధింపులు
Published Fri, Oct 21 2016 8:38 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
గుంటూరు (నెహ్రూనగర్): శానిటరీ ఇన్‌స్పెక్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ కాంట్రాక్టు వర్కర్ గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ నాగలక్ష్మికి పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 2వ డివిజన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి రాజేష్ గత నెల రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నన్ను వదిలేయండి పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారని ఎంత వేడుకున్నా వినకుండా లైంగికంగా వేధిస్తున్నాడని యూనియన్ నాయకులకు, తోటి వర్కర్లకు చెప్పినందుకు, తనతోపాటు తనతో మాట్లాడిన తోటి వర్కర్‌లకు సైతం గత మూడు రోజులుగా మస్టర్ వేయకుండా ఆపివేశాడని వాపోయింది. ఇన్‌స్పెక్టర్‌తో ఎందుకు గొడవ ఆయన చెప్పినట్లుగా వినొచ్చు కదా! అంటూ శానిటరీ సూపర్‌వైజర్ శీరంశెట్టి వెంకట్రావు కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ‘నా మాట నువ్వు వినలేదు కదా! వార్డులో ఎలా పనిచేస్తావో చూస్తా’ అంటూ బెదిరిస్తున్నారని వివరించింది.
కమిషనర్ నాగలక్ష్మి ఈ ఫిర్యాదును ఎంహెచ్‌వో నాగేశ్వరరావుకు బదిలీ చేశారు. దీనిపై ఎంహెచ్‌వోను వివరణ కోరగా గురువారం సాయంత్రం అంగడి రాజేష్ అనే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మహిళా కాంట్రాక్ట్ వర్క్‌ర్ చేసిన ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తప్పు రుజువైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement