
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మాక్సిన్ విలియమ్స్ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు, లాటిన్ అమెరికన్ దేశస్తులు, దివ్యాంగులు మొదలైన వారు ఉండనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 36.9 శాతంగా ఉంది. గతేడాది ఇది 36.3 శాతం. సీనియర్ లీడర్‌షిప్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగింది. సాంకేతిక విభాగానికి సంబంధించి మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 23 శాతం మేర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment