
హాయ్ సార్! ఎలా ఉన్నారు. మీకూ, నీలాంబరికీ అరటిపండు దండం సార్. నేను మా జూనియర్‌ని లవ్ చేస్తున్నాను. తనకి లవ్ చెయ్యడమన్నా, కలిసి తిరగడమన్నా చాలా చిరాకు. ఫ్రెండ్‌గా ఉండమంటోంది. ఏదో ఆశించే మనసుకి ఫ్రెండ్ అనే ముసుగు వేయడం అవసరమా అని దూరంగా ఉన్నాను. తను నాకు కావాలి సార్! ఏం చెయ్యను?? – అయ్యప్ప
ముసుగేసుకో!!‘ఎందుకు సార్ మీరు అంత నిష్ఠూరంగా మాట్లాడతారు..?? ఇష్టం లేకపోతే ఆన్సర్ ఇవ్వకండి. అంతే కానీ... ముసుగేసుకో.. నీ ముఖానికి లవ్ ఏంటి? అమ్మాయి ఫ్రెండ్ అంటుంటే.. నీకు వేరే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయిరా డర్టీ ఫెలో...? తప్పు పని చేస్తేనే కదా ముసుగులు అవసరం..! అలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు రా బ్యాడ్ బాబు..? అని ఒక లవర్‌ని కించపరచడం తప్పు కాదాసార్? మీరే చెప్పండి సార్?!!’నిజమే నీలూ..! లవ్ వద్దు ఫ్రెండ్ అయితే ఓకే అన్నప్పుడు కావాలంటే ఒక మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. ఫ్రెండ్‌లాగా అమ్మాయిని కాపాడాలి. అంతేకానీ కోరుకోకూడదు. అందుకే.... ‘ఓ... ఓహో... ఓహోహో... బ్యాడ్ ఆలోచనలకు ముసుగు వేసుకుని బీ ఎ గుడ్ ఫ్రెండ్ అంటున్నారు. సూపర్ సార్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment