హాయ్ సార్...! మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరూ త్రీ ఇయర్స్ లవ్ చేసుకున్నారు కానీ, వాళ్లిద్దరి నేపథ్యాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో విడిపోయారు. వాళ్లు్ల కలిసి పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి సార్? – పల్లవి
ఇద్దరూ మేజర్స్ అయితే వాళ్లను ఎవరూ ఆపలేరు.‘మేజర్స్ అంటే ఏంటి సార్? అది కూడా చెప్పండి. సగం చెబుతారు. సగం మింగుతారు. పల్లవి నేను చెబుతాను. అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్... అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ దాటితే... ఇద్దరూ మేజర్స్. ఏ పోలీస్ స్టేషన్‌కి పోయి వాళ్లిద్దరూ ప్రాబ్లమ్ చెప్పుకున్నా సొల్యూషన్ దొరుకుతుంది. కరెక్టా సార్?’రాంగ్!!‘ఏంటి సార్? అది కరెక్ట్ కాదా? దేశంలో ఉన్న రూల్ కంటే మీ రూల్ కరెక్టా సార్?’ నా రూల్ నాకు ఉత్తరం రాసిన వాళ్లకు వర్తిస్తుంది. ప్రాబ్లమ్ నాకు చెప్పారు కాబట్టి నేను చెప్పేదే కరెక్ట్ నీలూ!‘అయితే చెప్పండి ఏమి చెయ్యాలి?’ వయసు ఒక్కటే సరిపోదు పల్లవీ! జీవితంలో కలిసి జీవించే మెచ్యూరిటీ ఉండాలి.
పెద్దల సలహా, సంప్రదింపులు లేకుండా అంత పెద్ద నిర్ణయం చెయ్యకూడదు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఒకరికొకరు ఉంటారో లేదో తెలియదు కానీ.. కష్టం వస్తే ఏకాకులైపోతారు. ఎవరూ సాయం చెయ్యరు. ప్రపంచం అంత మంచిది కాదు. కుటుంబాలను దూరం చేసుకుని పారిపోవడం చాలా కష్టాలకు కారణం అవుతుంది. వాళ్లిద్దరినీ... మొదట పెద్దలను కన్విన్స్ చేసుకోమను. అవసరమైతే సమాజంలోని ఇతర పెద్దలను సంప్రదించి పేరెంట్స్‌తో మాట్లాడటం మంచిది.
- lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Jan 9 2019 1:04 AM | Last Updated on Wed, Jan 9 2019 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment