హాయ్ అన్నయ్యా...! నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నేను వన్ మంత్ బ్యాక్ మా కాలేజ్‌లో థర్డ్ ఇయర్ అమ్మాయిని చూశాను. బాగా నచ్చింది. అప్పటి నుంచి తనే గుర్తుకొస్తోంది. ‘తను చాలా డేంజర్, జాగ్రత్త’ అంటున్నారు మా ఫ్రెండ్స్. ఎందుకని అడిగితే.. గతంలో మా కాలేజ్ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. తను వెళ్లి వాళ్ల డాడీకి చెప్పిందట. వాళ్ల డాడీ ప్రెస్‌లో పని చేస్తారట. ఆయన కాలేజ్‌కి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారట. తనతో ఎవరు మాట్లాడినా వాళ్ల డాడీతో చెబుతుందట. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. పైగా నా చదువు కూడా పూర్తికావస్తోంది. ఈ సమయంలో తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. నన్ను ఏం చెయ్యమంటారు? తనని మరచిపోవడమే కరెక్టా? – శివ
ఎందుకన్నా మరచిపోవడం? ‘అంటే.. మరి ఏం చెయ్యాలి సార్..?? వాళ్ల ఫాదర్ పీకుతాడు కదా సార్??’ ఫాదర్ పీకుతాడని ప్రేమ వదులుకునే టైప్ కాదు శివ.. శివ.. శివా...! ‘ఊరుకోండి సార్.. పసిబిడ్డని ఉసిగొలిపి ముంచుతారా ఏంటి??’ అది కాదు నీలాంబరీ మంచి సొల్యూషన్ చెబుతాగా..! ‘చెప్పండి సార్ పాపం, శివ ఈజ్ వెయిటింగ్..!’ శివ నీకో ఫ్రెండ్ ఉన్నాడా.. ప్రాణ మిత్రుడు లాంటివాడు..? ‘ఎందుకు సార్..? ఉంటే ఏం చెయ్యాలి???’ ఆ ఫ్రెండ్‌ను అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వమని.. అది ఇచ్చే లోపే.. అమ్మాయి ఫాదర్‌కి ఇన్‌ఫర్మేషన్ నువ్వే వెళ్లి లీక్ చెయ్యి. అప్పుడు ఫాదర్ వచ్చి నీ ఫ్రెండ్‌ని బాదుతాడు. ఆ తరువాత నువ్వు నీ ఫ్రెండ్‌కు హాస్పిటల్ ఖర్చులు చూసుకుని.. పెద్ద బొకే ఇచ్చి థ్యాంక్యూ చెప్పి.. అమ్మాయి ఫాదర్‌కి కనిపించు. ఆయన ఇలాంటి పోకిరీగాళ్లు ఎవరైనా అమ్మాయిని వేధిస్తే ఫస్ట్ ఇన్‌ఫర్మేషన్ ఇవ్వమని చెబుతాడు. మెల్లమెల్లగా ఇంట్లోకి పాకిపో..! ఫాదర్‌కి మదర్‌కి కావల్సిన కిరాణా కొట్టు పనులన్నీ చేసి పెట్టు. ఎప్పటికైనా ఒకరోజు అమ్మాయి నిన్ను గమనిస్తుంది. ఇక అక్కడ నుంచి నీ లక్కూ...! ‘నీకు వర్కౌట్ కాకపోతే హాస్పిటల్ బిల్లు లవ్ డాక్టర్‌కి పంపు.. బొకేతో వస్తారు’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment