
ప్రతీకాత్మక చిత్రం
హాయ్ అన్నా..! నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను ఒకరోజు కాలేజ్‌కి వెళ్తూ... వేరే కాలేజ్ అమ్మాయిని చూశాను. బాగా నచ్చింది. దాంతో తన పూర్తి వివరాలు తెలుసుకున్నా. వన్ మంత్ తనని చూడ్డానికి వాళ్ల బస్టాప్‌కి వెళ్లేవాడిని. ఆ తరువాత ఎఫ్‌బి ఐడీ తీసుకుని కొద్ది రోజులు చాట్ చేశా. తను ఒప్పుకోవడంతో రెండు సార్లు కలిసి మాట్లాడాను కూడా. అయితే రెండోసారి కలిసినప్పుడు తనకి తెలీకుండా తన బ్యాగ్‌లో చాక్లెట్ వేశాను. ఇక అంతే.. ఆ రోజు నుంచి నాతో సరిగా చాట్ చెయ్యడం మానేసింది. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాసేసింది. నన్ను బ్లాక్ చేసింది. తనని నేను మరిచిపోలేకపోతున్నాను. పైగా తను నాకంటే వన్ ఇయర్ పెద్దది. ఆ విషయం కూడా నేనే తనకి చెప్పాను. ఎందుకు తను మాట్లాడటం మానేసిందో అర్థం కావడంలేదు. ప్లీజ్ నాకో మంచి సలహా ఇవ్వండి అన్నా. – శాండి
సరైన చాక్లెట్ ఇవ్వకపోతే అలాగే అవుతుంది. ‘ఏంటి సార్ అయ్యేది!?!’ యా! ‘ఎలాంటి చాక్లెట్ ఇస్తే లవ్ వర్కౌట్ అవుతుంది సార్??’ అది అమ్మాయిని బట్టి ఉంటుంది. ‘రామచంద్ర.. శాండీ నెత్తి కొట్టుకుంటాడు సార్!’ అవును నీలాంబరీ... అమ్మాయికి చాక్లెట్ సూట్ అయితే... ‘లవ్ సూట్ అవుద్దా సార్? టు మచ్ సార్. శాండీ ఏదో కష్టాల్లో ఉండి సాయం అడిగితే ఆడుకుంటున్నారు కదా సార్? మీరూ, మీ సిస్టర్.. ప్రేమికులంటే మీకు అంత చీపా సార్??? మీకు బ్యాడ్ డేస్ వస్తాయి సార్, అప్పుడు రాయండి శాండీకి... ఉతికి ఆరేస్తాడు..!’ ఎందుకు నీలాంబరీ అంత కోపం...? తప్పు కాదా నీలూ అమ్మాయి బ్యాగ్‌లో దొంగతనంగా చాక్లెట్ వెయ్యడం?? ‘సార్ చాక్లెట్ వేశాడు. తీసుకోలేదు. తీసుకుంటే దొంగ సార్!’ మనస్సు దొంగలించాలన్న వాడు దొరలా అడగాలి కానీ.. తుంటరి పనులు చేస్తే... ‘చేస్తే ఏంటి సార్.. చేస్తే...???’ అలా చాక్లెట్ వేస్తే... అమ్మాయి బిస్కెట్ వేస్తుంది నీలాంబరీ...!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment